For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్టెరీస్ ను క్లీన్ చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారాలు

|

గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టేనన్న ప్రాచీన చైనీజ్ సూక్తిలో ఎంతో అర్థం ఇమిడి ఉంది. గుండెకున్న ప్రాముఖ్యతను ఈ సూక్తి పునరుద్ఘాటిస్తోంది. గుండె అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ప్రముఖ స్థానాన్ని పొందినది. దీని ఆరోగ్య ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై నేరుగా పడుతుంది.

గుండె ఆరోగ్యానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు శరీరంలోని మిగతా భాగాలపై పడటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను అనుభవించాల్సి వస్తుంది.

రక్తం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను వడగట్టి ఆరోగ్యకరమైన ఆక్సీజెనేటెడ్ రక్తాన్ని ఆర్టెరీస్ ద్వారా శరీరంలోకి ఇతర అవయవాలకు సరఫరా చేస్తుంది గుండె. అందువలన, గుండె పనితీరు శరీర ఆరోగ్యస్థితిపై ప్రభావం చూపిస్తుంది.

కాబట్టి, గుండె తన పనిని సవ్యంగా చేయకపోతే ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటుంది. తద్వారా, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆర్టెరీస్ సప్లై చేసే ఆక్సీజనేటెడ్ రక్తమనేది ఫ్యాట్ డిపాజిట్స్, కొలెస్ట్రాల్, ఇంప్యూరిటీస్ వలన క్లాగ్ అయినప్పుడు శరీరానికి ఆరోగ్యకరమైన రక్తం సరఫరా కాదు.

కాబట్టి, ఆర్టెరీస్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని క్లీన్ చేసుకోవడం ముఖ్యం. ఆర్టెరీస్ ఆరోగ్యంగా ఉంటే గుండె నుంచి ఆర్టెరీస్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సీజనేటెడ్ రక్తం సరఫరా అవుతుంది.

ఆర్టెరీస్ ను సహజంగా క్లీన్స్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచే సహజసిద్ధమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవొకాడో:

1. అవొకాడో:

అవొకాడోని తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఈ విషయం, ఈ పాటికే మీకు తెలిసి ఉండవచ్చు. ఇండియాలో బటర్ ఫ్రూట్ గా అవొడకో పేరొందింది. సూపర్ ఫుడ్ పేరును కూడా సొంతం చేసుకుంది. అవొకాడోలో నిక్షిప్తమై ఉన్న పోషకవిలువల వలెనే అవొకాడోకు ఈ ప్రత్యేకమైన గుర్తింపు కలిగింది. ఆర్టెరీస్ లో పేరుకుపోయిన ఇంప్యూరిటీస్ ను అలాగే కొలెస్ట్రాల్ డెబ్రీస్ ను ఫ్లష్ చేసే సామర్థ్యం ఈ ఫ్రూట్ కు కలదు. ఈ ఫ్రూట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇవి, ఆర్టెరీస్ ను క్లీన్ చేసేందుకు తోడ్పడి తద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

2. బ్రొకోలీ:

2. బ్రొకోలీ:

బ్రొకోలీని సాధారణంగా చాలా మంది ఇష్టపడరు. ప్రత్యేకించి పిల్లలకు బ్రొకోలీ అంటే బోర్. టేస్ట్ బడ్స్ ని సంతృప్తి పరచలేకపోవటం వలన చాలా మంది బ్రొకోలీని అవాయిడ్ చేస్తారు. అయితే, బ్రొకోలీని రోజువారీ డైట్ లో భాగంగా చేసుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఇందులో లభించే విటమిన్ కే ఆర్టెరీస్ ను శుభ్రపరచి గుండె వాల్స్ ను బలపరిచి గుండెను సురక్షితంగా ఉంచుతుంది.

3. ట్యూనా ఫిష్:

3. ట్యూనా ఫిష్:

ఫిష్ లో అనేక పోషకవిలువలు లభిస్తాయి. ఫిష్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా, ట్యూనా ఫిష్ లో గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే అనేక పోషకవిలువలు లభిస్తాయి. ఇందులో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ట్రైగ్లైసెరైడ్ లెవెల్ ను తగ్గిస్తుంది. ఆ విధంగా కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ఆర్టెరీస్ లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ను తొలగిస్తుంది. కాబట్టి, ట్యూనాను రెగ్యులర్ గా తీసుకుంటే గుండెకు శ్రేష్టం. ఫిష్ అనేది ఆరోగ్యకరమైనదే. ఇందులో పోషకవిలువలు లభిస్తాయి. అయితే, ప్రత్యేకించి ట్యూనా ఫిష్ లో లభించే పోషకవిలువలు వలన గుండెకు మేలు జరుగుతుంది. ఆర్టెరీస్ క్లీన్ అవుతాయి. కాబట్టి, ఇక మీదట నుంచైనా, మీ డైట్ లో ట్యూనాను భాగంగా చేసుకోవడం మరవొద్దు. గుండె ఆరోగ్యానికి శ్రద్ధ చూపించడం మంచిదే కదా.

4. నట్స్:

4. నట్స్:

స్నాక్స్ అంటే ఇష్టపడే వారు అనారోగ్యకరమైన స్నాక్స్ ప్లేస్ లో నట్స్ ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆల్మండ్స్, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తాచియోస్ వంటి నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే విటమిన్ ఈ లోడై ఉంటాయి. ఈ పోషకవిలువలకి ఆర్టెరీస్ నుంచి కొలెస్ట్రాల్ డెబ్రీస్ ను అలాగే ఇంప్యూరిటీ డిపాజిట్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. తద్వారా, ఆక్సీజనేటెడ్ బ్లడ్ అనేది గుండె నుంచి ఆర్టెరీస్ ద్వారా ఇతర భాగాలకు సప్లై అవుతుంది.

5. ఆలివ్ ఆయిల్:

5. ఆలివ్ ఆయిల్:

పసుపు తనలోనున్న అద్భుతమైన ఔషధ గుణాలవలన ఏ విధంగా పవిత్రమైన పదార్థంగా భారతీయ పురాణాలలో స్థానం సంపాదించిందో అదే విధంగా ఆలివ్ ఆయిల్ అనేది తనలో దాగిన అనేక ఔషధ గుణాలవలన కొన్ని యూరోపియన్ కంట్రీలలో పవిత్రమైనదిగా పేరొందింది. డైట్ లో ఆలివ్ ఆయిల్ ను జోడిస్తే ఆర్టెరీస్ ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా, గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

6. వాటర్ మెలన్:

6. వాటర్ మెలన్:

వాటర్ మెలన్ సీజనల్ ఫ్రూట్ అయి ఉండవచ్చు. ఇది ఇండియా వంటి కొన్ని ట్రాపికల్ కంట్రీలో పుష్కలంగా లభ్యమవుతుంది.వాటర్ మెలన్ తీపి అలాగే చల్లదనం మనల్ని ఆకర్షిస్తుంది. డీహైడ్రేషన్ ను తగ్గించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడంతో పాటు ఆర్టెరీస్ ను క్లీన్ చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇందులో లభ్యమయ్యే నైట్రిక్ యాసిడ్ అనేది ఆర్టెరీస్ ను సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది. తద్వారా, గుండె ఆరోగ్యానికి భరోసానిస్తుంది.

7. పసుపు:

7. పసుపు:

ఇంతకు ముందే, పసుపుని భారతీయ పురాణాలలో పవిత్రమైన పదార్థంగా ప్రస్తావించారని గుర్తుచేసుకోవడం జరిగింది. పసుపులోనున్న వివిధ ఔషధ గుణాలను గుర్తించడం వలనే పసుపు అంతటి ముఖ్య స్థానాన్ని పొందింది. బర్న్స్, ఇన్ఫెక్షన్స్, ఇంఫ్లేమేషన్, ఇండైజేషన్ వంటి సమస్యలను తొలగించడంతో పాటు ఆర్టెరీస్ లో ని కొలెస్ట్రాల్ బిల్డ్ అప్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఇందులో లభించే విటమిన్ B6 వలన ఈ ప్రయోజనాలను పొందగలుగుతాము.

8. స్పినాచ్:

8. స్పినాచ్:

స్పినాచ్ అనేది ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ప్రోటీన్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజూ స్పినాచ్ ని తీసుకుంటే రక్తంలోని హోమోసిస్టైన్ స్థాయి తగ్గుతుంది. ఇవి ఆర్టెరీస్ లో కొలెస్ట్రాల్ బిల్డ్ అప్ ను తగ్గిస్తాయి. తద్వారా, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

9. కొబ్బరి నూనె:

9. కొబ్బరి నూనె:

కొబ్బరినూనె నుంచి అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరినూనెను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే మెటబాలిక్ రేట్ తో పాటు ఇమ్యూనిటీ అనేది మెరుగవుతుంది. ఇది ఆర్టెరీస్ ను క్లీన్స్ చేస్తూ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కొబ్బరి నూనెలో లభ్యమయ్యే విటమిన్ ఈ వలన సాధ్యమవుతుంది.

English summary

Foods That Clean Your Arteries And Heart

Foods That Clean Your Arteries And Heart,An ancient Chinese proverb goes like this, "When the heart is at ease, the body is healthy". The above proverb is very true because the heart is one of the vital organs of the body whose health reflects on all the other organs, directly!
Desktop Bottom Promotion