For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ‌తిమ‌రుపుకు కార‌ణ‌మ‌య్యే ఆహార ప‌దార్థాలు ఏవంటే

By Krishnadivya P
|

మంచి ఆరోగ్యం కోసం సంతులిత ఆహారం ఎంత ముఖ్య‌మో మంచి జ్ఞాప‌క‌శ‌క్తికీ అంతే కీల‌కం. ప్ర‌స్తుతం మారుతున్న జీవిన శైలులు, పౌష్టికాహార లోపం కార‌ణంగా చాలా మందిలో మ‌తిమ‌రుపు వ‌స్తోంది. సాట్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మంద‌బుద్ధి పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.

మ‌తిమ‌రుపు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. అది అల్జీమ‌ర్స్‌కు ప్ర‌ధాన ల‌క్ష‌ణం. అమ్నీసియా (మ‌తిమ‌రుపు)తో బాధ‌ప‌డేవారు గ‌తంలో ఏం జ‌రిగిందో గుర్తు చేసుకునేందుకు చాలా బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా వీరు కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డం సైతం క‌ష్ట‌మే.

దీర్ఘ కాలం మ‌ద్య‌పానం సేవించ‌డం, మెద‌డులో గాయాలు, బ్రెయిన్ స్ర్టోక్‌, మెద‌డులో మంట‌ల‌, క‌ణ‌తుల వ‌ల్ల అమ్నీసియా వ‌స్తుంది. మ‌నం తీసుకునే ఆహారమే మెద‌డు ప‌నీతీరుపై ప్ర‌భావం చూపిస్తుందిన కాబ‌ట్టి ఏం తింటున్నామ‌న్న‌దానిపై కాస్తంత శ్ర‌ద్ధ తీసుకోవ‌డం అవ‌స‌రం.

ఫాస్ప‌ర‌స్ అధికంగా ఉండే ద్రాక్ష‌, నారింజ‌, క‌ర్జూర పండ్లు తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. మ‌రోవైపు పిండిప‌దార్థాలు అధికంగా ఉండే ఆహార ప‌దార్థాలు శ‌రీరంలో టాక్సిన్స్‌ను చైత‌న్యం చేసి మెద‌డు ప‌నితీరును మొద్దుబారుస్తుంది. మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని త‌గ్గించి మ‌తిమ‌రుపుకు కార‌ణ‌మ‌య్యే ఆహారాలేమిలో ఈ క‌థ‌నం ప‌రిశీలిద్దాం.

 ప్రాసెస్ చేసిన చీజ్‌

ప్రాసెస్ చేసిన చీజ్‌

చీజ్‌లో ప్రోటీన్లు, కాల్సియం అధికంగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన అమెరికా చీజ్‌, మొజ‌రెల్లాలో అధికంగా సాట్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ప్రోటీన్ల‌ను అందించినా జ్ఞాప‌క‌శ‌క్తిని త‌గ్గిస్తాయి.

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం

ఇందులో నైట్రోస‌మైన్లు అధికంగా ఉంటాయి. ఇది కాలేయం ఎక్కువ‌గా కొవ్వులు ఉత్ప‌త్తి చేసేందుకు కార‌ణం అవుతుంది. దీంతో మెద‌డుకు న‌ష్టం జ‌రుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలోఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ మ‌తిమ‌రుపు పెంచుతాయి.

టోఫు

టోఫు

అధిక ప్రోటీన్లు ఉండే టోఫు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌మే అయినా రోజూ తీసుకుంటే ఇది కూడా కొన్ని ఇబ్బందులు తెస్తుంది. ఒక ప‌రిశోధ‌న ప్ర‌కారం టోఫులాంటి సోయా ఉత్ప‌త్తుల‌ను అధికంగా త‌సీఉకుంటే వృద్ధాప్యంలో మ‌తిమ‌రుపు వ‌చ్చే ప్ర‌మాదాలు ఉన్నాయి.

కృత్రిమ తీపి ప‌దార్థాలు

కృత్రిమ తీపి ప‌దార్థాలు

మ‌నం రోజూ తినే ఆహారంలో కృత్రిమ తీపి ప‌దార్థాలు సేవించ‌డం వ్య‌తిరేక ఫ‌లితాల‌ను ఇస్తుంది. వీటివ‌ల్ల త‌ల‌నొప్పి, కుంగుబాటు, బ‌రువు త‌గ్గ‌డం, డిమ్ముగా ఉండ‌టం, మ‌తిమ‌రుపు వంటివి వ‌స్తాయి.

వైట్ ఫుడ్స్‌

వైట్ ఫుడ్స్‌

వైట్ బ్రెడ్‌, చ‌క్కెర‌, పాస్టాలో పిండిప‌దార్థాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయుల‌ను పెంచుతాయి. అధిక చ‌క్కెర స్థాయులు అల్జీమ‌ర్స్‌కు దారితీస్తుంది. మీ ర‌క్తంలో చ‌క్కెర స్థాయుల‌ను నియంత్ర‌ణంలో ఉంచాలంటే ఈ ఆహారాల‌పై క‌న్నేయ‌క త‌ప్ప‌దుమ‌రి.

బీర్‌

బీర్‌

రోజుకు రెండు పింట్ల బీరు తాగే వారికి అల్జీమ‌ర్స్ వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంది. 20 ఏళ్ల పాటు ఆల్కాహాల్ సేవించిన వారు వృద్ధాప్యంలో మ‌తిమ‌రుపుకు గుర‌వుతార‌ని ఓ అధ్య‌య‌నం తెలిపింది. అధికంగా మ‌ద్య‌పాన సేవ‌నం వ‌ల్ల నాడీ వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గించి మెద‌డుపై ప్ర‌భావం చూపిస్తుంది.

English summary

Foods That Hamper Memory And Cognitive Functioning

In this article, we will be listing out some of the foods that hamper memory and cognitive functioning. Read on to know more about it.
Desktop Bottom Promotion