ఈ కింద 9 ఆహారపదార్థాలు రక్తపోటును పెంచుతాయని మీకు తెలుసా?

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఎక్కువ బిపి ఉండటం ఎందుకు అపాయం అంటారో కొన్ని కారణాలు ఉన్నాయి.

అది మీ రక్తనాళాల గోడలను పాడుచేస్తాయి ,ముఖ్యంగా చిన్న నాళాలు ఎక్కువ పాడయి, అవయవం పనిచేయకపోవటం నుంచి గుండె పనితీరులో మార్పుల వరకూ అన్నీ జరగవచ్చు.

అందుకని, మీకు ఎక్కువ బిపి ఉన్నా లేదా వచ్చే స్థాయిలోనే ఉన్నా, ఈ బిపిని పెంచే కింది 9 ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే మీకే లాభం అవుతుంది.

#1 టిన్నుల్లో,ప్యాక్ చేసి అమ్మే ఆహారపదార్థాలు

#1 టిన్నుల్లో,ప్యాక్ చేసి అమ్మే ఆహారపదార్థాలు

ప్యాక్ చేసిన చిక్కుళ్ళ నుంచి, ట్యూనా వరకు అన్నిటిలో పాడవకుండా, షాపుల్లో ఎక్కువకాలం నిల్వ ఉండేలా ఉప్పును వాడతారు. మీ రక్తంలో ఎక్కువ సోడియం చేరితే అది రక్త పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది కాబట్టి మీకు బిపి ఉంటే వీటిని తప్పక మీ ఆహారంలోంచి తొలగించేయండి.

#2 కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు

#2 కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు

కొవ్వు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచి రక్తనాళాలు గట్టిపడేలా చేస్తాయి. దీనివలన రక్తపోటు పెరుగుతుంది కాబట్టి మీ ఆహారం నుంచి అలాంటి పదార్థాలు తొలగించటమే మంచిది. దాని బదులు పండ్లు, కూరలు వంటివి ఎక్కువ తింటే వాటిల్లో ఎక్కువ పీచు, పాలీఅన్ సాచ్యురేటడ్ కొవ్వు మీ రక్తపోటును బ్యాలెన్స్ చేస్తుంది.

#3 ఆల్కహాల్

#3 ఆల్కహాల్

ఒక గ్లాసు వైన్ లేదా బీర్ మీ రక్తపోటును డేంజర్ జోన్ లోకి తీసుకెళ్ళదు. కానీ మీరు క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటూపోతే, బిపి విషయంలో సమస్యలని కొనితెచ్చుకున్నట్లే.

#4 కాఫీ

#4 కాఫీ

ఎప్పుడైనా నీటి గొట్టం మొదట్లో చేత్తో నొక్కేసి, వెంటనే నీరును బయటకి వదిలేలా చేసారా? మీరు కాఫీ తాగినప్పుడు శరీరంలో కూడా అదే జరుగుతుంది.

కాఫీలోని కెఫీన్ మీ రక్తనాళాలను ముడుచుకునేలా చేస్తుంది,ఇదే రక్తపోటును పెంచుతుంది. ఇదివరకే బిపి ఉన్నవారికి ఇది హానికరం.

#5 సంపూర్ణమైన పాలు

#5 సంపూర్ణమైన పాలు

సంపూర్ణమైన పాలల్లో ముఖ్యంగా గేదె, మేక పాలల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అందుకని వీటికి దూరంగా ఉంటే మంచిది.

#6 ఛీజ్

#6 ఛీజ్

ప్రాసెస్ చేసిన ఛీజ్ లో రుచికోసం ఉప్పును కలుపుతారు. కొన్ని రకాల ఛీజ్ అయిన మోజరెల్లా, ఎమ్మెన్టాల్ లలో ఛెడ్డార్, ఫెటా, ఎడామ్ రకాలలో ఉన్నంత ఉప్పు ఉండదు.

#7 చక్కెర కలిసిన పదార్థాలు

#7 చక్కెర కలిసిన పదార్థాలు

మీ ఆహారంలో ఎక్కువ చక్కెర ఉండే పదార్థాలు తినటం వలన డయాబెటిస్, స్థూలకాయం సమస్యలు వస్తాయని మీకు తెలుసు. మీకు తెలీనిది ఏంటంటే చక్కెర అతిగా తినటం వలన రక్తపోటును సమయంతో పాటు కొవ్వు పేరుకునే సమస్యగా మార్చేసి రక్తనాళాలు గట్టిపడేలా చేస్తుంది.

#8 ప్రాసెస్ అయిన మాంసం

#8 ప్రాసెస్ అయిన మాంసం

మీకు ఎక్కువ బిపి ఉంటే ప్రాసెస్ అయిన మాంసం ఎందుకు మంచిదికాదో రెండు కారణాలు ఉన్నాయి.

ఒకటి అది ప్రిజర్వేటివ్లతో సాచ్యురేటడ్ అయి ఉంటుంది, ముఖ్యంగా ఉప్పును వాడతారు. అది బిపిని తీవ్రంగా పెంచేస్తుంది.

రెండవది, ప్రాసెస్ చేసిన మాంసంలో చెడ్డ కొవ్వుల గాఢత పెరుగుతుంది, అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి సమయంతోపాటు రక్తనాళాల గోడలు గట్టిపడి మూసుకునేలా చేస్తుంది.

#9 పచ్చళ్ళు

#9 పచ్చళ్ళు

ఊరగాయలు పెట్టేటప్పుడు అందులో వాడే పండ్లు,కూరలు,మాంసం కుళ్ళిపోకుండా చాలా ఉప్పును వాడతారు. అందుకే ఏ రకపు పచ్చడిలోనైనా ఉప్పు ఎక్కువగా ఉండి, రక్తపోటు ఉన్నవారికి చాలా హానికరం అవుతుంది.

English summary

Do You Know These 9 Foods That Increase Blood Pressure?

High blood pressure is dangerous because it can damage the walls of your arteries over time, leading to organ failure, disabilities, and heart abnormalities. So, if you are suffering from hypertension, you should religiously avoid these foods: pickles, canned products, processed meats, sugary and fatty foods, alcohol, milk, and cheese.
Story first published: Monday, April 9, 2018, 16:00 [IST]