For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విరేచనాలతో బాధపడే వారు ఎట్టి పరిస్థితిలో తినకూడని ఆహారాలు

ఈ కాలంలో మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల్లో నీళ్ల విరేచ‌నాలు కూడా ఒక‌టి. ఫుడ్ పాయిజ‌నింగ్‌, అప‌రిశుభ్ర‌త, క‌డుపులో పురుగులు ప‌డ‌డం... ఇలా కార‌ణాలు ఏమున్నా నీళ్ల విరేచ‌నాలు క‌లిగితే ఇక ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ క

By Mallikarjuna
|

ఈ కాలంలో మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల్లో నీళ్ల విరేచ‌నాలు కూడా ఒక‌టి. ఫుడ్ పాయిజ‌నింగ్‌, అప‌రిశుభ్ర‌త, క‌డుపులో పురుగులు ప‌డ‌డం... ఇలా కార‌ణాలు ఏమున్నా నీళ్ల విరేచ‌నాలు క‌లిగితే ఇక ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురై శరీరం ఇంకా నీర‌స‌ప‌డిపోతుంది.

ఈ సమస్య నుండి బయటపడటం ఎలా, ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే. డయోరియాతో బాధపడే వారకి డైట్ సహాయపడుతుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? అని ఆహారాల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి.

foods to avoid when you have diarrhea

అనారోగ్యకరమైన ఆహారం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ఎక్కువ ఒత్తిడి కలగడం వల్ల విరేచనాలకు దారితీస్తుంది.

విరేచనాలతో బాధపడే సమయంలో ఎట్టి పరిస్థితిలో ఈ క్రింది సూచించిన ఆహారాలు తీసుకోకూడదు.

#1 పాలు

#1 పాలు

పాలలో ఉండే ల్యాక్టోజ్ కంటెంట్ మరియు ఇతర పాల పదార్థాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ లేదా చీజ్ మొదలగు వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఎక్స్ ట్రా క్యాలరీలను జోడిస్తుంది. బలహీనమైన ప్రేగులు సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. మీరు కనుక ల్యాక్టోజ్ ఇన్ టాలరెన్స్ తో ఉన్నట్లైతే వీటిని పాల ఉత్పత్తులను తిన్నప్పుడు విరోచనాలకు దారితీస్తుంది

#2 హాట్ పెప్పర్స్

#2 హాట్ పెప్పర్స్

కారం, పచ్చిమిర్చి, మిరియాలలో క్యాప్ససిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తినడం వల్ల పొట్టలోని చిన్న ప్రేగుల లైనింగ్ దెబ్బతింటుంది. దాంతో కడుపుబ్బరం, విరేచనాలకు కారణం అవుతుంది. జీర్ణక్రియ బలహీనపడుతుంది.

#3 కాఫీ

#3 కాఫీ

కాఫీలో కెఫిన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది విరేచనాలకు దారితీస్తుంది. కాఫీలో ఉండే డ్యూరియాటిక్ గుణాలు విరేచనాలను మరింత ఎక్కువ చేస్తుంది, కాఫీ బదులుగా హెర్బల్ టీ తీసుకోవడం మంచిది. కెఫిన్ కలిగిన సోడా, కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది.

#4 ఆల్కహాల్

#4 ఆల్కహాల్

విరేచనాల అయ్యే సమయంలో ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్ విరేచనాలను మరింత ఎక్కువ చేస్తుంది. మెటబాలిజం మారుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల జీర్ణ శక్తి పెరగుతుంది. పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. శరీరం మరింత ఎక్కువ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.

#5 లెగ్యుమ్స్

#5 లెగ్యుమ్స్

విరేచనాలు అయ్యే సమయంలో లెగ్యుమ్స్ తినకపోవడమే మంచిది. విరేచనాల సమయంలో సోయా, గ్రీన్ పీస్ వంటివి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. లెగ్యుమ్స్ లో లెక్టిమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గౌట్ ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. దాంతో విరేచనాలు మరింత ఎక్కువ అవుతాయి.

#6 పంచదార

#6 పంచదార

డయోరియాతో బాధపడుతుంటే ఆర్టిఫిసియల్ స్వీట్స్ తీసుకోకూడదు, మోనిటాల్, క్సైలిటాల్ కెమికల్స్ పరిస్థితిని మరింత ఎక్కువ చేస్తాయి. కడుపుబ్బరానికి గురిచేసి విరేచనాలకు కారణం అవుతాయి.

#7 నట్స్

#7 నట్స్

నట్స్ గురించి మనందరికీ తెలిసిందే, విరేచనాలు జరిగే సమయంలో ఫైబర్ కంటెంట్ ఉన్న నట్స్ తినడం వల్ల పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, విరేచనాలతో బాధపడే వారు నట్స్ తినకపోవడమే మంచిది. నట్స్ కడుపుబ్బరానికి కూడా కారణం అవుతుంది.

#8 మాంసాహారం (రెడ్ మీట్)

#8 మాంసాహారం (రెడ్ మీట్)

రెడ్ మీట్ చాలా రిచ్ ఫుడ్. ఇది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతే కాదు ఎర్ర మాంసంలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువ కాబట్టి, డయోరియాతో బాధపడే వారు రెడ్ మీట్ తినకపోవడమే మంచిది. లేదంటే జీర్ణవాహిక మరింత వరెస్ట్ గా మారుతుంది.

#9 సిట్రస్ ఫ్రూట్స్

#9 సిట్రస్ ఫ్రూట్స్

డయోరియోతో బాధపడే వారు బెర్రీస్, పైనాపిల్, చెర్రీస్, మరియు ద్రాక్ష తినకపోవడం మంచిది . ఎందుకంటే వీటిలో ఫ్రక్టోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి ప్రేగుల్లో ఆహారాన్ని సరిగా గ్రహించక, విరోచనాలకు కారణం అవుతుంది. విరేచనాలు తగ్గాలంటే అరటిపండు తినడం మంచిది

#10 క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ (ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్ )

#10 క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ (ఫైబర్ అధికంగా ఉన్న వెజిటేబుల్స్ )

విరేచనాలు అయ్యే సమయంలో హై ఫైబర్ వెజిటేబుల్స్ తినడం అంత మంచిది కాదు, బ్రొకోలి, క్యాబేజ్, కాలీఫ్లవర్ పరిస్థితిని మరింత వరెస్ట్ గా మార్చుతాయి. వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంత సులభంగా జీర్ణం కావు, కాబట్టి, విరేచనాలు మరింత ఎక్కువ అవుతాయి. ఇన్ సోలబుల్ ఫైబర్ గ్యాస్ట్రిక్ పరిస్థితిని ఎక్కువ చేస్తుంది.

English summary

10 Foods To Avoid When You Have Diarrhoea

Diarrhea is a condition wherein you have at least three loose stools each day. It is characterized by uncomfortable bowel movement that is very inconvenient for people. It typically lasts for about a few days and can cause dehydration due to the loss of excessive fluids.Here are 10 foods to stay away from when you have diarrhea.
Desktop Bottom Promotion