ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను అరికట్టే 10 అద్భుతమైన ఫుడ్స్

Subscribe to Boldsky

ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని సైంటిఫిక్ గా కాండిడా పెరుగుదలగా కూడా పేర్కొంటారు. ఈస్ట్ ని సైంటిఫిక్ టర్మ్ లో కాండిడాగా పిలుస్తారు. సహజంగా, నోటిలో, ప్రేగులలో అలాగే వెజీనా పెదవులలో కొద్దిమొత్తంలో ఈస్ట్ అనేది దాగివుంటుంది. అయితే, కొన్ని రకాల ఔషధాల వలన అలాగే ఆహారంతో పాటు వాతావరణంలో సంభవించే మార్పులవలన జరిగే రియాక్షన్స్ వలన ఇన్ఫెక్షన్స్ అనేవి సంభవిస్తాయి.

ఇలా జరిగినప్పుడు, ఈస్ట్ అనేది విస్తరింపబడుతూ రక్తప్రవాహంలో చేరుతుంది. ఆ విధంగా, ఉదరం మరియు గట్స్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

10 Foods To Get Rid Of Yeast Infection

ఈస్ట్ స్థాయిలను నియంత్రించేందుకు మనం తీసుకునే ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఈస్ట్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

#1 కొబ్బరి నూనె

#1 కొబ్బరి నూనె

ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొబ్బరినూనెలో సహజసిద్ధంగా లభిస్తాయి. అలాగే కాప్రిలిక్ యాసిడ్ అనే పదార్ధం కూడా ఇందులో లభిస్తుంది. ఈ యాసిడ్ అనేది సహజసిద్ధంగా యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ వృద్ధి చెందకుండా అడ్డుపడడంలో ఈ యాసిడ్ ప్రముఖపాత్ర పోషిస్తుంది. తద్వారా, ఈస్ట్ లను కూడా నశింపచేస్తుంది.

# వెల్లుల్లి

# వెల్లుల్లి

వెల్లుల్లిలోనున్న ఔషధ గుణాల వలన అనేకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి దరిచేరవు. జలుబు, దగ్గులతో పాటు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని కూడా దూరంగా ఉంచే సామర్థ్యం వెల్లుల్లిలో కలదు. సల్ఫర్ ప్రధానంగా కలిగిన అలిసిన్ అనే పదార్థం వెల్లుల్లిలో లభ్యమవుతుంది. ఈ కాంపౌండ్ అనేది యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగినది. అందువలన, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుముఖం పడుతుంది.

#ఆపిల్ సిడర్ వినేగార్

#ఆపిల్ సిడర్ వినేగార్

వెల్లుల్లిలాగానే ఆపిల్ సిడర్ వినేగార్ లో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలవు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనకరమైన ఆహారమిది. కాండిడా డైట్ లోకి అనుమతింపబడిన ప్రత్యేకమైన ఆహారమిదని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు. అధ్యయనాల ప్రకారం వినేగార్ లోని యాసిడిక్ స్వభావమనేది కాండిడాను విచ్ఛిన్నం చేసి ఇన్ఫెక్షన్ ను అరికడుతుందని తెలుస్తోంది.

#4 క్రూసీఫెరస్ కూరగాయలు

#4 క్రూసీఫెరస్ కూరగాయలు

కాలిఫ్లవర్ మరియు బ్రొకోలీ అనేవి క్రూసిఫెరస్ కూరగాయల రకానికి చెందినవే. ఈ కూరగాయలను తీసుకోవడం ద్వారా అనేకమైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఈ కూరగాయలలో ఐసోథియోసైనేట్స్ అనేవి లభ్యమవుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ కూరగాయలలో లభించే నైట్రోజెన్ తో పాటు సల్ఫర్ కంటెంట్ అనేవి ఇన్ఫెక్షన్లను తగ్గుముఖం పట్టించేందుకు తమదైన పాత్ర పోషిస్తాయి.

#5 అల్లం

#5 అల్లం

అనేకరకాల ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి అల్లమనేది అమితంగా ఉపయోగకరంగా ఉంటుంది. షోగాయల్స్ తో పాటు జింజెరాల్స్ అనే యాంటీ ఇంఫ్లేమేటరీ పదార్థాలు అల్లంలో లభ్యమవుతాయి. ఇవి యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తాయి. అందువలన, ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది కనుమరుగవుతుంది. కాండిడా ఎదుగుదలను తగ్గించేందుకు అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకుని శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవాలి.

#6 ఆలివ్ ఆయిల్

#6 ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ అనేది ఏ రిఫైండ్ ఆయిల్ కైనా చక్కటి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో పాటు ఫ్లాక్స్ సీడ్, అవొకాడో అలాగే ప్రైమ్ రోజ్ ఆయిల్ లు కూడా ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిలో లభించే పోలీఫెనాల్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువలన, కాండిడా అనేది వృద్ధిచెందకుండా చూస్తూ కాండిడాని నశింపచేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

#7 లవంగాలు

#7 లవంగాలు

లవంగాలు అనేవి అనేకరకాల ఇన్ఫెక్షన్స్ ను అరికట్టడానికి పనికొస్తాయి. ప్రత్యేకించి, పళ్ళకి అలాగే చిగుర్లకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని నశింపచేయడంలో లవంగాలు ప్రధానంగా ఉపయోగపడతాయి. యుజెనాల్ అనే పదార్థం లవంగాలలో లభ్యమవుతుంది. ఈ పదార్థం యాంటీ ఫంగల్ స్వభావం కలిగి ఉంటుంది. అందువలన, చేతివ్రేళ్ళకు అలాగే కాలివ్రేళ్ళపై కలిగే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించేందుకు కూడా ఈ పదార్థం అమితంగా ఉపయోగపడుతుంది.

#8 దాల్చిన చెక్క

#8 దాల్చిన చెక్క

లవంగాలలాగానే దాల్చిన చెక్క అనేది కూడా యాంటీ ఇంఫ్లేమేటరీ స్పైస్ గా పనిచేయడం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి దరిచేరవు. ఈ స్పైస్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు అధికంగా లభిస్తాయి. ఇవి కాప్రిలిక్ యాసిడ్ వలె పనిచేస్తాయి. ఈస్ట్స్ రూపొందించిన సెల్స్ ని నశింపచేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. తద్వారా, ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని అరికట్టడంలో ఇవి సహాయపడతాయి. అయితే, గర్భిణీలు దాల్చిన చెక్కలను తీసుకోకూడదు. ఆలాగే, స్టమక్ అల్సర్ కలిగిన వారు కూడా దాల్చిన చెక్కకి దూరంగా ఉండాలి.

#9 వైల్డ్ సాల్మన్

#9 వైల్డ్ సాల్మన్

కోస్తా ప్రాంతంలో మాత్రమే లభించే ఒక రకమైన చేప సాల్మన్. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఇది ముఖ్య ఆహారమని చెప్పుకోవచ్చు. ట్రౌట్స్, ట్యూనాలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇందులో కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అత్యంత అవసరం. వీటిలో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపెర్టీస్ వలన ఇన్ఫెక్షన్లనేవి తగ్గుముఖం పడతాయి.

#10 నిమ్మరసం

#10 నిమ్మరసం

విటమిన్ సి అనేది నిమ్మరసంలో అధికంగా లభిస్తుంది. ఈ విటమిన్ అనేది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి సహకరిస్తుంది. తద్వారా, ఇన్ఫెక్షన్స్ అనేవి దూరంగా ఉంటాయి. అలాగే, నిమ్మకాయలో తేలికపాటి యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు లభ్యమవుతాయి. ఇవి, ప్రభావిత ప్రాంతాలను డిటాక్సిఫై చేయడానికి సహకరిస్తాయి. తద్వారా, ఇన్ఫెక్షన్స్ ను రూపుమాపుతాయి. ఇవన్నీ, కాండిడా ఇన్ఫెక్షన్స్ ను సమర్థవంతంగా అరికట్టే కొన్ని ఆహారాలు. అయితే, కాండిడాకి సంబంధించిన చికిత్సను ఎంత వేగవంతంగా మొదలుపెడితే అంత మంచిది. లేదంటే, వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదముంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Foods To Get Rid Of Yeast Infection

    Candida is the scientific term used for yeast. Naturally, a small amount of yeast resides in our mouth, intestines, lips of vagina, etc., but when our medications, diet or environment change, the foreign substances react with these to cause infections. When this happens, the yeast multiply and enter the blood stream, where it infects the stomach and guts.
    Story first published: Wednesday, January 3, 2018, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more