సిగెరెట్ల కంటే క్యాండిల్స్ ఎంత ప్రమాదకరమైనవో మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సహజం గా చాలామంది సువాసనలను వెదజల్లే క్యాండిల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పుట్టినరోజు వేడుకకు గాని లేదా ఏదైనా కుటుంబ వేడుకలు జరిగేటప్పుడు గాని లేదా క్రిస్టమస్ వేడుక సమయంలో ఇలాంటి క్యాండిల్స్ ని ఎక్కువగా వెలిగిస్తుంటారు, వాడుతుంటారు. ఇవి ఇంటిని అందంగా అలంకరించడానికి మాత్రమే పనికివస్తాయి అనుకుంటే పొరపాటు. వీటి వల్ల హాయిగొలిపే సువాసనలు కూడా మన చుట్టూ వ్యాపిస్తాయి. కానీ, ఆ సువాసనలతోపాటు ఎన్నో ప్రమాదకరమైన, హానికర రసాయన వాయువులను విడుదల చేస్తాయని, అవి మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి అని మీకు తెలుసా ? చాలా వరకు క్యాండిల్స్ సిగెరెట్ల కంటే కూడా చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి క్యాన్సర్ కారక రసాయనాలతో కూడిన పదార్ధాలను గాలిలోకి విడుదల చేస్తాయి. అవి శరీరం పై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.

క్యాండిల్స్ తయారీలో ఉపయోగించే పేరఫిన్ మైనంతో కనీసం అంటే, తక్కువలో తక్కువ 20 ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వీటిల్లో ట్రై క్లోరో ఈథేన్, అసిటోన్, జైలీన్, ఫెనాల్, క్రెసోల్, క్లోరోబెంజెన్ మొదలగు అత్యంత ప్రమాదకర పదార్ధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్ కారకాలు మాత్రమే కాదు, ఊపిరితిత్తుల్లో విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తాయి మరియు శరీర అవయవాలకు నష్టాన్ని చేకూరుస్తాయి మరియు మెదడు పనితనం పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.

Are Candles More Toxic Than Cigarettes? Harmful Effects Of Candles On Health

సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ లో రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అవి మరిన్ని అనారోగ్య సమస్యలకు గురిచేస్తాయి. వీటి నుండి వెలువడే సువాసనలను ఎప్పుడైతే మనం పీలుస్తామో, అటువంటి సమయంలో రసాయనాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి సిగెరెట్లకంటే కూడా చాలా హానికరం. కావున ఇటువంటి క్యాండిల్స్ కి దూరంగా ఉండటం ఉత్తమం. ఎప్పుడైతే ఒక క్యాండిల్ ని వెలిగిస్తారో అటువంటి సమయంలో అది మన చుట్టూ ప్రక్కల వాతావరణాన్ని విషతుల్యమైన వాయువులతో నింపేస్తుంది. అటువంటి సమయంలో ఎవరైతే ఇలాంటి హానికర రసాయనాలను పీలుస్తారో వారి పై అవి తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి. క్యాండిల్స్ ఎలా వ్యక్తుల శరీరాలకు ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు తెచ్చి పెడతాయో మనం ఇప్పుడు ఈ వ్యాసం లో తెలుసుకుందాం.

ఊపిరితిత్తుల సమస్యలు మరియు ఆస్తమా :

ఊపిరితిత్తుల సమస్యలు మరియు ఆస్తమా :

క్యాండిల్స్ తయారీలో ఉపయోగించే పేరఫిన్ మైనం వల్ల ఆస్తమా మరింతగా ఎక్కువైపోతోంది. దీని వల్ల ఉపిరి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైతే క్యాండిల్స్ ని వెలిగిస్తారో అప్పుడు మైనం కరుగుతుంది. ఆ సమయంలో ఒకరకమైన వాసన విడుదల అవుతుంది. ఈ వాసన ఊపిరి సంబంధిత సమస్యలను సృష్టిస్తాయి మరియు ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగిస్తాయి.

తల నొప్పి :

తల నొప్పి :

సువాసన వెదజల్లే క్యాండిల్స్ ని వాడటం వల్ల కలిగే మరొక ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ఇది విపరీతమైన తలనొప్పిని కలిగిస్తాయి. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ నుండి వెలువడే వాయువులను పీలుస్తారో చాలా మంది ప్రజలు తలనొప్పి వల్ల భాధపడుతారు. ఇలా జరగటానికి కారణం ఆయా క్యాండిల్స్ లో హానికరమైన బెంజిన్ మరియు టౌలేనే వంటి హానికరమైన రసాయనాలు క్యాండిల్స్ లో ఉండటమే.

మూత్రపిండాల్లో కణితులు :

మూత్రపిండాల్లో కణితులు :

క్యాండిల్స్ వెలిగించినప్పుడు, పేరఫిన్ వల్ల విడుదలయ్యే వాయువుల వల్ల మూత్రపిండాల్లో కణితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుచేతనే చాలామంది వైద్య నిపుణులు ఈ రకమైన వాయువులకు గాని లేదా ఇలాంటి క్యాండిల్స్ కు గాని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

క్యాండిల్ ఒత్తుల్లో ఉండే సీసం :

క్యాండిల్ ఒత్తుల్లో ఉండే సీసం :

సీసం ఆరోగ్యం పై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది మెదడుకి, ఊపిరితిత్తులకు, కాలేయానికి నష్టం చేకూరుస్తుంది మరియు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి క్యాండిల్ కొట్టుకి సీసం ఉంటుంది. వీటి సహాయం వల్లనే క్యాండిల్ నిటారుగా నిలబడగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ఒత్తుని వెలిగిస్తామో అటువంటి సమయంలో ఈ సీసం గాలిలోకి కలుస్తుంది. అప్పుడు ఈ గాలిని చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలందరూ పీల్చడం ప్రారంభిస్తారు.

వికటించే ప్రతిచర్యలు :

వికటించే ప్రతిచర్యలు :

క్యాండిల్స్ లో ఉపయోగించే కృత్రిమ సువాసనల రసాయనాల వల్ల ఊపిరి తీసుకొనే మార్గానికి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల ఊపిరి సంబంధమైన సమస్యలు అధికం అవుతాయి. దీంతో చాలామంది ప్రజల్లో వికటించే ప్రతి చర్యలు ప్రారంభం అవుతాయి. క్యాండిల్స్ ఉపయోగించడం వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన అంశాల్లో ఇది కూడా ఒకటి.

హానికరమైన క్యాండిల్స్ భారిన పడకుండా ఉండటానికి పాటించాల్సిన చిట్కాలు :

హానికరమైన క్యాండిల్స్ భారిన పడకుండా ఉండటానికి పాటించాల్సిన చిట్కాలు :

కుత్రిమ సువాసనలను వెదజల్లే క్యాండిల్స్ మరియు రకరకాల సువాసనలను వెదజల్లే క్యాండిల్స్ కు దూరంగా ఉండండి. పేరాఫిన్ క్యాండిల్స్ కు బదులుగా బీస్ వాక్స్ మరియు సోయ్ క్యాండిల్స్ ను ప్రత్యామ్యాయంగా వాడండి. మీరు గనుక సువాసన వెదజల్లే క్యాడిల్స్ ను వాడాలనుకున్నట్లైతే , ఆ క్యాండిల్స్ పరిసరాల్లో ఎక్కువసేపు ఉండవలసి వస్తే అటువంటి సమయంలో ఇంటిలోని కిటికీలను తీసివేయండి.

క్యాన్సర్ :

క్యాన్సర్ :

ఎప్పుడైతే క్యాండిల్ ను వెలిగిస్తామో, అప్పుడు అందులోని పేరఫిన్ కరగటం మొదలవుతుంది. ఆ సమయంలో క్యాన్సర్ కారక వాయువులు విడుదల అవుతాయి. అవి గాలిలో కలుస్తాయి. వీటిల్లో బెంజిన్ మరియు టౌలేనే రసాయనాలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ నుండి ఏ రకమైన వాసన వస్తుందో, వీటి నుండి కూడా అదే రకమైన వాసన వస్తుంది. క్యాండిల్స్ నుండి వెలువడే వాసనలను పీల్చడం వల్ల క్యాన్సర్ భారిన పడే అవకాశాలు ఎక్కువ. క్యాండిల్స్ వల్ల మన శరీరం పై పడే అత్యంత ప్రమాదకరమైన ప్రభావాల్లో ఇది చాలా హానికరమైనది.

English summary

Are Candles More Toxic Than Cigarettes? Harmful Effects Of Candles On Health

Fragrant candles are liked by everyone when used to light up a place be it at a birthday party, Christmas party or a small family gathering. They not only decorate the home, but also create a fragrant essence in our homes and keep them pleasant.
Story first published: Tuesday, February 6, 2018, 11:38 [IST]
Subscribe Newsletter