For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వడదెబ్బ నివారించగలిగే 6 ఉత్తమమైన ఇంటి చిట్కాలు !

  |

  వడదెబ్బ అనేది శరీర పనితీరును తక్షణమే నిలిపివేసేదిగా ఉంటుంది. కానీ దీనిని కొన్ని ఇంటి చిట్కాల సహాయంతో చికిత్స చేయవచ్చు. అవేమిటో పూర్తిగా తెలుసుకునేందుకు పూర్తిగా ఈ వ్యాసాన్ని చదవండి.

  జాగ్రత్త పడండి! సూర్యరశ్మి వల్ల మీ చర్మం కమిలిపోవటం, నల్లగా మారటం, వడదెబ్బలు తగలడానికి ఈ ఎండాకాలమే మంచి సీజన్గా ఉంది.

  సూర్యుని నుంచి ఎక్కువైనా తాపం మిమ్మల్ని ఏ విధంగానూ వదిలిపెట్టదు. కానీ ఈ వడదెబ్బ తగలకుండా ఉన్న కొద్దిమంది వ్యక్తులను అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. వడదెబ్బ ఏమాత్రం తీవ్రమైనది కానట్లుగా ఉంటుంది కానీ మమ్మల్ని నమ్మండి, ఇది చాలా ప్రమాదకరమైనది.

  Heat Stroke: Six Best Home Remedies

  ఎండాకాలంలో మీరు ఆరుబయట సంచరిస్తున్నప్పుడు సూర్యతాపం వల్ల మీకు అధికంగా చెమట పడుతుంది, అలా మీరు అలసటకు గురవ్వచ్చు. ఇది క్రమంగా మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి మీ శరీరంలోని నీటిశాతాన్ని తగ్గిస్తుంది. అలా మీరు డీహైడ్రేషన్కి గురి కాగలరు. ఇది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడైనా సంభవించవచ్చు.

  ఒక వ్యక్తి వడదెబ్బకు గురైనప్పుడు అతనికి కలిగే లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి :

  1. తలనొప్పి

  2. హృదయ స్పందన రేటు పెరగటం

  3. అధికంగా చెమట పట్టడం

  4. మైకము

  5. వాంతులు

  6. వికారం

  7. చర్మం ఎర్రగా మారడం

  8. శ్వాస ఎక్కువగా తీసుకోవడం

  ఈ లక్షణాలను కలిగి వున్న వ్యక్తిని మీరు గుర్తించినట్లయితే, తక్షణమే ఆ వ్యక్తి పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వడదెబ్బ నుంచి బయటపడటం కోసం మాత్రలను వినియోగించే ముందు, సహజమైన ఇంటి చిట్కాలను ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

  ఈ క్రింది తెలిపిన ఇంటి చిట్కాలు, మిమ్మల్ని వడదెబ్బ బారిన పడకుండా రక్షించడంలో సహాయపడగలవు. అవేమిటో మీరే తెలుసుకోండి.

  1. ఉల్లిరసం :

  1. ఉల్లిరసం :

  ఉల్లిపాయ రసం అనేది వడదెబ్బ కోసం అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఇంటి చిట్కాలలో ఒకటి. ఇది ఆయుర్వేద అభ్యాసకులచే సూచించబడిన మొట్టమొదటి విషయం. వడదెబ్బ తగిలినప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఈ ఉల్లి రసాన్ని తీసుకుని చెవులు (లేదా) ఛాతీ మీద బాగా రాయాలి. ఇలా చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతను నెమ్మదినెమ్మదిగా తగ్గించడంలో సహాయపడుతుంది. లేదంటే పచ్చి ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలను పొందగలరు.

  2. ఎలెక్ట్రోలైట్ పానీయం :

  2. ఎలెక్ట్రోలైట్ పానీయం :

  మీకు ఎక్కువ చెమట పట్టినప్పుడు, మీ శరీరం విద్యుద్విశ్లేష్య పదార్థాలను ఎక్కువగా కోల్పోతుంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, ఎలక్ట్రోలైట్ పానీయమును ఇవ్వండి. ఈ పానీయాన్ని సిద్ధం చేయడానికి, ఒక గాజు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను కూడా అదనంగా తీసుకోవాలి. మీరు సముద్ర ఉప్పును & కొన్ని పండ్ల రసాలను కూడా జోడించవచ్చు. ఈ సమ్మేళనాలన్నింటినీ బాగా కలిపి త్రాగాలి. ప్రతి 10 నిమిషాలకు ఇలా క్రమం తప్పకుండా తీసుకోండి.

  3. కొబ్బరినీళ్లు / మజ్జిగ :

  3. కొబ్బరినీళ్లు / మజ్జిగ :

  ఈ రెండూ పానీయాలు సహజంగానే వడదెబ్బను నివారించడంలో సహాయపడతాయి. మజ్జిగలో ప్రోబయోటిక్స్ & అవసరమైన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. మీ శరీరానికి ఎక్కువ చెమట వల్ల సంభవించిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కొబ్బరినీరు కూడా ఎలెక్ట్రోలైట్ను గొప్పగా కలిగి ఉన్న పానీయము, ఇది మీ శరీరాన్ని తిరిగి రిహైడ్రేట్గా చేసి, తద్వారా వడదెబ్బ నుంచి బయటపడేలా చికిత్స చేస్తుంది.

  4. కొత్తిమీర & పుదీనా ఆకుల రసం :

  4. కొత్తిమీర & పుదీనా ఆకుల రసం :

  కొత్తిమీర & పుదీనా మీ శరీరం ఉష్ణోగ్రతను నెమ్మదించేలా చేసే చల్లని మూలికలను (కూలింగ్ హెర్బ్స్) కలిగి ఉన్నాయి. పుదీనా & కొత్తిమీర ఆకులు నుండి తీసిన రసానికి కొంత చక్కెరను జోడించండి. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి సహజసిద్ధంగా తయారు చేసిన ఈ పానీయాన్ని సేవించండి. కొత్తిమీర రసాన్ని దద్దుర్లు, దురద ఉన్న చర్మంపై కూడా అప్లై చేయవచ్చు

  5. అలోవెరా రసం :

  5. అలోవెరా రసం :

  అలోవెరా రసంలో ఉండే విటమిన్స్ & మినరల్స్ మీ శరీరానికి అడాప్జెంట్లను అందిస్తాయి. ఇది అధిక ఉష్ణోగ్రతల వంటి బాహ్య మార్పులకు అనుగుణంగా మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అడాప్జెంట్లు మీ శరీర వ్యవస్థలు స్థిరీకరించేందుకు సహాయపడతాయి. అధిక వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు అలోవెరా జెల్ను కూడా వాడవచ్చు.

  6. చింతపండు రసం :

  6. చింతపండు రసం :

  అధికంగా చెమట పట్టుట వల్ల మీ శరీరంలో ఉన్న విద్యుద్విశ్లేష్యమును కోల్పోయేలా చేసి తద్వారా మిమ్మల్ని డీహైడ్రేషన్కు గురిచేస్తుంది. త్రాగిన చింతపండు రసమును తాగటం వల్ల, మీ శరీరానికి పోషకాలను & ఎలెక్ట్రోలైట్స్ను భర్తీ చేయడం ద్వారా వడదెబ్బ వల్ల కలిగిన నష్టాన్ని పూరిస్తుంది. మీరు చెయ్యాల్సినదల్లా ఒక కప్పు నీటిలో కొంత చింతపండును, చక్కెరను, తేనెను వేసి బాగా కలిపి, రసాన్ని తయారు చెయ్యండి. వడదెబ్బ లక్షణాలను గుర్తించిన వెంటనే ఈ పానీయాన్ని తాగండి. ఇది వడదెబ్బ లక్షణాలను వదిలించడంలో సహాయం చేస్తుంది.

  English summary

  Heat Stroke: Six Best Home Remedies

  * Heat stroke can be dangerous and turn fatal as well. It can cause damage to the brain and also cause heart problem.* There are a few best home remedies that help in preventing heat stroke.* Raw mango juice, fennel seeds and coriander juice are a few of the well known home remedies for preventing heat stroke.
  Story first published: Thursday, May 3, 2018, 20:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more