For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సహజ పద్దతులలో ధూమపానానికి చెక్ పెట్టండిలా..!

  |

  ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మనకు ధూమపానం వలన కలిగే అనేక అనారోగ్యాల గురించిన అవగాహన ఉంది. అయినా ధూమపానం వలన ఏటా చెప్పడానికి వీలు కాని సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఒక్కసారి అలవాటు పడిన వ్యక్తి ఈ అలవాటు నుండి బయటకు రాలేక, మానసికంగా మరియు శారీరికంగా కష్టాలు అనుభవిస్తున్నాడు అన్నది సత్యం.

  నిజానికి అనేకమంది మనస్ఫూర్తిగా ఈ అలవాటుని మానివేయాలని ప్రయత్నిస్తున్నా కూడా మహమ్మారి నుండి బయట పడలేకపోతున్నారు. ఫలితంగా ఈ అలవాటుని కొనసాగిస్తున్నారు.

  ధూమపానాన్ని త్యజించడం నిస్సందేహంగా క్లిష్టమైన ప్రక్రియే, కానీ ధూమపానాన్ని విజయవంతంగా విడిచిపెట్టి జీవితాన్ని ఆరోగ్యమయంగా సుగమం చేసుకున్న వారు కూడా ఉన్నారు.

  Here Are 7 Tips To Help You Quit Smoking Naturally

  నిర్ణయంతో కూడిన ప్రయత్నం సానుకూల ఫలితాలను ఇస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాగని ఒకే రాత్రిలో వదిలేయడం అనేది అధిక శాతం విషయంలో జరగని ప్రక్రియే అవుతుంది. ఒక ప్రఘాడమైన నిర్ణయం, పట్టుదల , ఓర్పు , కుటుంబం పట్ల ప్రియమైన వ్యక్తుల పట్ల మీకున్న ప్రేమ వంటి విషయాలు ముఖ్యంగా ధూమపానాన్ని విడువడంలో ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

  ఇక్కడ అలాంటి మహమ్మారి ధూమపానాన్ని విడిచి పెట్టుటకు కొన్ని చిట్కాలు పొందుపరచడం జరిగినది.

  1. స్మోకింగ్ ట్రిగ్గర్స్

  1. స్మోకింగ్ ట్రిగ్గర్స్

  ఒకవేళ మీరు ధూమపానాన్ని విడవడానికి ఆలోచనలు చేస్తున్నట్లయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవలసినది, ధూమపానంపై మీ మనసు ఎప్పుడు వెళ్తుంది అని. స్మోకింగ్ ట్రిగ్గర్స్ అంటారు. వీటిని ముందు ఒక పేపర్లో లిస్టుగా రాసుకోండి. ఈ ప్రక్రియ అన్నిటికన్నా ముఖ్యం, ఈ లిస్ట్ ద్వారా మీ ఆలోచనల తీరులో మార్పుకు ప్రయత్నించవచ్చు.

  2. మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల అండ అవసరం

  2. మీ స్నేహితుల, కుటుంబ సభ్యుల అండ అవసరం

  మీ ఈ ఆలోచనలో భాగంగా మీ కుటుంబసభ్యులను స్నేహితులను భాగస్వాములను చేయండి. తద్వారా వారి సహకారం మరియు విడువాలన్న మీ ఆలోచనలకు ప్రోద్భలం లభిస్తాయి. తద్వారా మీ ఆలోచనలకు సానుకూల దృక్పధాలు తోడవుతాయి. కావున మీ నిర్ణయం గురించి మీ ప్రియమైన వారికి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది.

  3. ఎల్లప్పుడూ సమూహంలో ఉండేలా చూడండి.

  3. ఎల్లప్పుడూ సమూహంలో ఉండేలా చూడండి.

  ఇది చాలా గొప్ప ఆలోచన గా చెప్పవచ్చు. ఎల్లప్పుడూ మీరు ధూమపానం అలవాటులేని స్నేహితుల సమూహంలో ఉండుటకు ప్రయత్నించడం మూలంగా, ధూమపానం మీదకు ఆలోచన వెళ్లకుండా చేయవచ్చు. వారితో మీ నిర్ణయాన్ని గురించి మరియు ధూమపాన నిష్క్రమణ కై మీరు చేయుచున్న ప్రయత్నాలను పంచుకోవడం , వారి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన ప్రక్రియ.

  4. మిమ్మల్ని మీరు బిజీ గా ఉంచుకోండి

  4. మిమ్మల్ని మీరు బిజీ గా ఉంచుకోండి

  ఇష్టమైన పనులను చేయడం, క్రీడలు , వ్యాయామాలకు సమయాలని కేటాయించడం, ఆఫీస్ మరియు ఇంటిపనుల్లో నిమగ్నమవడం, గార్డెనింగ్, సంగీతం, వండడం, పుస్తకాలు చదవడం, స్నేహితులతో ప్రియమైన వారితో కాలక్షేపాలు వంటివి చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ధూమపానం వైపుకి మనసు వెళ్లకుండా నియంత్రించుకోగలుగుతారు.

  5. విశ్రాంతి మరియు ద్యానం

  5. విశ్రాంతి మరియు ద్యానం

  నిజానికి ఎక్కువ అలసట ఉన్న సమయంలో ధూమపానం మీదకి మనసు వెళ్తుంటుంది. కావున ముఖ్యంగా అలాంటి సందర్భాలలో ధూమపానానికి వ్యతిరేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యమైనది ద్యానం, విశ్రాంతి. అధిక ఒత్తిడిని తొలగించడానికి , మీ ఆలోచనలను నియంత్రించడానికి ద్యానం సహాయం చేస్తుంది .

  6. ఎక్కువ నీరు తాగండి

  6. ఎక్కువ నీరు తాగండి

  నిజం, మీకు ధూమపానం ఆలోచనలు వచ్చినప్పుడల్లా నీరు తాగే అలవాటు చేసుకోండి. ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం తో పాటు ధూమపాన ఆలోచనలను కూడా నెమ్మదిగా తగ్గిస్తుంది.

  7. మీకు మీరే ఒక బహుమతి

  7. మీకు మీరే ఒక బహుమతి

  రోజు వారీ మీ విజయాన్ని గుర్తించడమే మీకు మీరిచ్చే బహుమతి , ఈ పద్దతి మీకు అనేక సానుకూల ఫలితాలను ఇస్తుంది. తద్వారా మీరు మారుతున్నారు అన్న స్వయం సంతృప్తిని మరియు ఆత్మ స్థైర్యాన్ని మీకు కలిగిస్తుంది.

  ధూమపానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వలన మీ ఒక్కరే కాదు, మిమ్మల్ని ప్రేమించే వారి దగ్గర గౌరవం రెట్టింపు అవుతుంది. ధూమపానం గురించి అనేక ప్రకటనలు వస్తున్నా, వాటిని చిన్నచూపు చూడడం అనేకమందికి ఉన్న అలవాటు. కానీ ప్రకటనలలోని రోగుల పరిస్థితి అనుభవించిన వారికే తెలుస్తుంది. అలాంటి శిక్షని మన శరీరానికి ఇవ్వాలా అన్న ఆలోచన చేస్తే చాలు, సగం ధూమపానానికి చెక్ పెట్టాలన్న ఆలోచన ప్రారంభమవుతుంది. ధూమపానం వలన శరీరంలో ప్రభావితం కాని భాగం లేదు అంటే నమ్మగలరా.

  దీని వల్ల ఒక్క చెప్పుకోదగ్గ లాభం అయినా ఉందా.... లేదు. సమర్దించుకోడానికి చెప్పే లాభాలు తప్ప.

  ఒక్క సారి పీల్చి వదిలిన పొగ నోటి నుండి గొంతు ద్వారా ఊపిరితిత్తుల నుండి తిరిగి ముక్కు ద్వారా బయటకు వస్తుంది . దీని వల్ల పెదవి కాన్సర్, గొంతు కాన్సర్, కిడ్నీ కాన్సర్, జీర్ణాశయం కాన్సర్, ఎముక మజ్జ కాన్సర్, అన్నవాహిక కాన్సర్, బ్లడ్ కాన్సర్, లుకేమియా, ఊపిరితిత్తుల కాన్సర్ గొంతు వెనక ఉండే హైపో ఫెరెంజియల్ కాన్సర్, నేసో ఫెరెంజియాల్ కాన్సర్, స్వరపేటిక కాన్సర్ లాంటి అనేక రకాల కాన్సర్ లు వస్తాయని వందల అధ్యయనాల ద్వారా తేలింది.

  డబ్బులు పెట్టి రోగాలను కొనుక్కోవడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. ఒకవేళ మీరు ధూమపాన ప్రియులై ఉండి , ఈ వ్యాసం చదువుతున్నట్లయితే, మీలో తెలీకుండానే మానాలన్న ఆలోచన ప్రారంభం అయిందని నిర్ధారించుకోండి.

  English summary

  Here Are 7 Tips To Help You Quit Smoking Naturally

  Smoking kills! While everybody knows what smoking can lead to, they are caught up with this life-threatening habit. While many are battling with this - trying to quit to take up a healthy way of life, not everyone finds success. But don't fret, it is possible to break this habit, all you need is a strong determination along with persistent efforts.
  Story first published: Tuesday, March 27, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more