For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనేక మానసిక స్థితులను ఎదుర్కొనే ఉత్తమమైన ఆహారాలు ఇవే

|

మీ బాస్ లేదా మేనేజర్ విభిన్న రకాల మానసిక కల్లోలాలను(మూడ్-స్వింగ్స్) కలిగి ఉన్నారా? మీరు తప్పనిసరి పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నారా? మీ బాస్ కానీ భర్త, భార్య, ప్రియురాలు లేదా ప్రియుడు ఎవరైనా సరే, ఇటువంటి విభిన్న మానసిక కల్లోల పరిస్థితులను ఎదో ఒక సందర్భంలో అనుభూతి చెందుతారు. ఒక్కోసారి ఈ మానసిక స్థితులు సంబంధాలను సైతం ప్రభావితం చేయవచ్చు.

మీ మానసిక స్థితి మీ సంబంధాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడం మీ భాద్యత అని మర్చిపోకండి. ఈ రోజు మానసిక కల్లోలాన్ని తగ్గించగల ఉత్తమ ఆహారాల గురించి తెలుసుకుందాం.

Here Are The Best Foods For Every Type Of Mood

ఆహారం అనేది, శరీరo సరిగా పనిచేయటానికి సహాయపడటంతో పాటు మీ మానసిక స్థితిపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీ భావోద్వేగాలను లోలోపల అణిచి పెట్టుకోవడం అనేది సాధారణంగా ఆరోగ్యానికి, సంబంధాలకు ప్రతికూల విషయంగా ఉంటుంది. అయినప్పటికీ, మీ మానసిక స్థితిని నియంత్రించే దిశగా మీ ఆహారాలు ఎంచుకోవడం మంచిది.

ఆహారంలోని మార్పులు మనిషి ఆలోచనల్లో, క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పులు తీసుకుని వస్తాయి.

మీ మానసిక స్థితి నియంత్రణకు ఆహారo ఎలా సహాయపడుతుంది?

కార్బోహైడ్రేట్లు మరియు మానసిక స్థితి అనునవి ట్రిప్టోఫాన్ ఆధీనంలో ఉంటాయి. ట్రిప్టోఫాన్ అనేది మెదడులోకి ప్రవేశించే ఎమినో ఆమ్లాల రకానికి చెందినవి. ఆహారం ద్వారా ప్రవేశిoచే ట్రిప్టోఫాన్, మెదడులోని సెరోటోనిన్ తో ఎక్కువగా సంశ్లేషణo చెందడం ద్వారా మానసిక స్థితి మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ మార్గాలను ప్రభావితం చేస్తాయి మరియు ఇది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను దూరం చేయగలదు కూడా.

మంచి సమతుల్యమైన అల్పాహారం మెరుగైన మానసిక పరిస్థితికి సహాయం చేస్తుంది.

మానసిక స్థితి మెరుగుపరచడంలో ఉపయోగపడే ఆహారాల జాబితా:

1.ఒత్తిడి కోసం చాక్లెట్

1.ఒత్తిడి కోసం చాక్లెట్

క్రోధస్వభావం, డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను దూరం చేసే లక్షణం చాక్లెట్లో ఉంది. అనేకమంది నిపుణుల పరిశోధనా సారాంశాల ప్రకారం డార్క్-చాక్లెట్, ఒత్తిడి తగ్గించడంలో ఉత్తమంగా పని చేస్తుందని తేల్చారు. వాస్తవానికి 1.4ఔన్సుల డార్క్ చాక్లెట్ తీసుకోవడం మూలంగా శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అయిన కార్టిసోల్, కేటకోలమీన్లను తగ్గిస్తుంది. తద్వారా మీ ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు నెమ్మదిగా దూరమవుతాయి.

2.నిస్తేజమైన మానసిక స్థితికి స్పినాచ్ సలాడ్

2.నిస్తేజమైన మానసిక స్థితికి స్పినాచ్ సలాడ్

ఏదైనా చేస్తున్న పని మీద శ్రద్ధ వహించలేకపోతే ఖచ్చితంగా మానసిక నిస్తేజానికి గురై ఉన్నారనే లెక్క. ఈ సమయంలో కాఫీకోసం ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తుంటారు అనేకులు. కానీ కాఫీ లేదా కెఫీన్ పదార్ధాల కన్నా, స్పినాచ్(పాలకూర) సలాడ్ ఎంతగానో సహాయం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉన్న ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలేట్ మీ శరీరoలోని హోమోసిస్టీన్ స్థాయిలను ప్రాసెస్ చేయడానికి క్రమంగా ఆందోళనలు తగ్గించడంలో సహాయపడుతుంది. హోమోసిస్టీన్ రక్తనాళాలను అధిక స్థాయిలో దెబ్బతీయడం క్రమంగా మెదడుకు రక్తం మరియు పోషకాల ప్రవాహాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పూనుకుంటుంది. ఈ బలహీనమైన రక్త ప్రసరణ నిద్రలేమి,రక్తపోటు వంటి సమస్యలకు, తద్వారా ఆందోళనా స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది.

3.కోపం తగ్గడానికి గ్రీన్-టీ

3.కోపం తగ్గడానికి గ్రీన్-టీ

గ్రీన్-టీ ఎలా కోపాన్ని తగ్గిస్తుంది? గ్రీన్-టీలో ధయానైన్ ఉంటుంది, ఇది మీ మనసును ప్రశాంతపరచడమే కాకుండా మీ దృష్టిని, ఏకాగ్రతను కూడా పెంచగలదు. గ్రీన్-టీ మాత్రమే కాకుండా, ఆస్పరాగస్ వంటి ఆహారాలు, విటమిన్-సి అధికంగా ఉండే పండ్లు మరియు జింక్ అధికంగా ఉండే ఆహారాలు తినవచ్చు, ఇవి మానసిక మరియు శారీరిక ప్రభావాలను కలిగి ఉంటాయి. తద్వారా కోపం, ఆందోళన, ఒత్తిడులను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

4. క్రాంకీ మూడ్ కోసం ఆపిల్ మరియు పీనట్ బట్టర్

4. క్రాంకీ మూడ్ కోసం ఆపిల్ మరియు పీనట్ బట్టర్

మీరు ప్రతి చిన్న విషయానికైనా చిడి ప్రవర్తనను కలిగి ఉన్నారా? అయితే మీశరీరానికి తక్షణ శక్తి అవసరమని ఒక సంకేతం కావచ్చు. ఈ చిడి వాతావరణం మిమ్ములను ఒక ఇబ్బందికరమైన మూడ్ లోనికి తీసుకుని వెళ్తుంది. ఈ మూడ్ బ్రేక్ చేయడానికి కొన్ని ఆహార పదార్ధాలు సరిగ్గా పని చేస్తాయి. అందులో యాపిల్ మరియు పీనట్ బట్టర్ ఎంతగానో సహాయం చేస్తుంది.

కొన్ని ఆహార పదార్ధాల కలయికలు కొవ్వు లేదా ప్రోటీన్లతో కూడుకుని ఉన్న పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణశక్తిని అందజేయడమే కాకుండా,. మీ ఆహారంలోని ఆరోగ్యకర కొవ్వులు మరియు ప్రోటీన్లను కలుపుకొని, నెమ్మదిగా జీర్ణక్రియ వేగం పెంచుతుంది. ఇది మీ చక్కెర మరియు శక్తి స్థాయిలు స్థిరంగా ఉంచేలా సహాయం చేస్తుంది.

5.మనసునిండా బాధతో కాకవికలంగా ఉందా, అయితే తక్కువ కొవ్వు పదార్ధాలు కలిగిన పాలు, తృణధాన్యాలు మీకు సహాయం చేస్తాయి.

5.మనసునిండా బాధతో కాకవికలంగా ఉందా, అయితే తక్కువ కొవ్వు పదార్ధాలు కలిగిన పాలు, తృణధాన్యాలు మీకు సహాయం చేస్తాయి.

మీ మనసులోని బాధను తరిమెయ్యాలని భావిస్తుంటే, తక్కువ కొవ్వు కలిగిన పాలు, తృణధాన్యాలు మీకు సహాయం చేయగలవు. మీ ఆహారంలో విటమిన్-డి లోపం తెలియని బాధ ఆవరించిన మానసిక స్థితి సంభవిస్తుంది. ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి బాధపడడం కూడా అలవాటుగా మారుతుంది. విటమిన్-డి శరీరానికి అందే మార్గాలు అనేకం ఉన్నాయి. సూర్యరశ్మి ద్వారా నేరుగా సంగ్రహించడమే కాకుండా, ఆహారం ద్వారా కూడా విటమిన్-డి అందివ్వగలగాలి. ఇవి సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. సెరోటోనిన్ హాపీ-హార్మోన్ అని కూడా పిలుస్తారు, ఇది మీ మానసికస్థితిని మెరుగుపరచడానికి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

6.ఆత్రుతను తగ్గించే చేప

6.ఆత్రుతను తగ్గించే చేప

ఆందోళన, చింతలతో మీ మెదడు నిండి ఉంటే, మీకు చేపలు బాగా సహాయం చేయగలవు. సాల్మొన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలు మీ ఆందోళనను తగ్గించడానికి సహాయపడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. అనేక పరిశోధనల ప్రకారం చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కోపం, చిరాకు తగ్గించడానికి సహాయపడుతాయని తేల్చాయి కూడా. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మానసిక స్థితిని మెరుగు పరచడానికే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను వ్యవహరించడంలో కూడా సహాయం చేస్తాయి. అంతేకాకుండా ఆస్థ్మా, నిరాశ వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టగలదు.

7. బహిష్టు సమస్యలకు(ప్రీ-మెన్స్ట్రువల్-సిండ్రోం) ఎగ్ సాండ్విచ్

7. బహిష్టు సమస్యలకు(ప్రీ-మెన్స్ట్రువల్-సిండ్రోం) ఎగ్ సాండ్విచ్

ప్రతి స్త్రీ తన బహిష్టుకు ముందు సమయాల్లో కార్బోహైడ్రేట్లు కాస్త ఎక్కువగా తీసుకోవాలన్న కుతూహలాన్ని ప్రదర్శిస్తుంటుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ వైపుకు మనసు వెళ్తుంటుంది కూడా. పిండిపదార్ధాలు శరీరంలోని సెరోటోనిన్ స్థాయిలను పెంచుకోవటానికి సహాయపడుతూ మీ మానసిక స్థితి మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అయినప్పటికీ, అధిక-కొవ్వు మరియు అధిక చక్కెరలతో కూడిన కార్బోహైడ్రేట్లు కలిగిన కేకులు, చిప్స్ మరియు డోనట్స్ వంటివి నివారించండo ఎంతో మేలు. ధాన్యపు రొట్టె, గుడ్లు, మరియు అరటిపండ్లు ఈ సమయంలో ఎక్కువ సహాయం చేస్తాయి, ఇది ట్రిప్టోఫాన్ విడుదలను మెరుగుపరుస్తుంది.

English summary

Here Are The Best Foods For Every Type Of Mood

Does your boss or manager have different types of mood swings and you have no other choice but to deal with it? Well, not only your boss but many people like your husband, wife, girlfriend, or boyfriend can experience different mood swings and this can affect the relationship.
Story first published: Wednesday, June 20, 2018, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more