For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నెలసరి నొప్పులు సాధారణమో కాదో గుర్తించండిలా?

|

మీరు నెలసరి అంటేనే భయపడుతూ ఉంటారా? నెలసరి నొప్పుల వలెనే మీరు నెలసరిపై భయాన్ని పెంచుకున్నారా? మీ నెలసరి నొప్పులు మీ స్నేహితురాళ్ళ నెలసరి నొప్పుల కంటే భయానకంగా ఉంటాయా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే. మీరు ప్రతినెలా ఎదుర్కొనే నెలసరి నొప్పులు సాధారణమైనవో లేదా ఏదైనా సమస్యతో కూడినవో తెలుసుకోవడానికి ఈ పోస్ట్ ను పూర్తిగా చదవండి.

పీరియడ్స్ కి ముందు నుంచి అలాగే పీరియడ్స్ సమయంలో నెలసరి నొప్పులు రావడం సహజమే. ప్రతి మహిళ నెలసరిని ఎదుర్కొనే తీరాలి. కొందరిలో ఈ నొప్పులు చిన్నపాటిగా ఉంటే మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. ఈ నొప్పులతో పాటు మూడ్ స్వింగ్స్ అనేవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నెలసరి నొప్పులు పూర్తిగా ఇబ్బందిపెడతాయి. ఇది సహజమే.

అయితే, నెలసరి నొప్పులు సాధారణమైనవో లేదా అసాధారణమైనవో తెలుసుకోవాలి. తద్వారా, మీరు ఆ నొప్పుల నుంచి రక్షణని పొందేందుకు పరిష్కారాలను వెతుక్కోవచ్చు.

Heres How To Identify If Your Period Cramps Are Abnormal

అసాధారణ మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ కి గల కారణాలు:

ప్రతి నెల మీ నెలసరి నొప్పులు విపరీతంగా ఉన్నట్టయితే, ఈ నొప్పుల వెనక ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో మీరు తెలుసుకోవాలి. లేదంటే, తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. విపరీతమైన పీరియడ్ క్రామ్ప్స్ ని డిస్మెనోరియాగా వైద్యులు పేర్కొంటారు. అసాధారణ యుటెరైన్ క్రామ్పింగ్ కి గల కొన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Heres How To Identify If Your Period Cramps Are Abnormal

1. యుటెరైన్ ఫైబ్రాయిడ్స్:

మీ యుటెరస్ అనేది యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి వివిధ నాన్ క్యాన్సరేస్ పెరుగుదలకు నిలయం వంటిది. మధ్యవయసు మహిళల్లో ఇది సాధారణంగా ఎదురయ్యే సమస్యే. దాదాపు 75 శాతం మంది మహిళలు ఈ సమస్యను ఎదో ఒక సమయంలో ఎదురుకొంటారు.

ఎక్కువసార్లు, ఈ సమస్య బారిన పడ్డారన్న సంగతిని మహిళలు గుర్తించడంలో విఫలమవుతారు. కాబట్టి, వీటివలనే హెవీ మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ తో ఇబ్బంది పడుతున్నారన్న సంగతిని కూడా వారు తెలుసుకోలేరు. యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి విపరీతమైన క్రామ్ప్స్ కు కారణమవుతాయి. అందువలన, బ్లీడింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లీడింగ్ కూడా సాధారణం కంటే ఎక్కువ కాలం అవుతుంది.

ఫైబ్రాయిడ్స్ సమస్యను డిటెక్ట్ చేయడానికి అల్ట్రా సౌండ్ పద్దతి తోడ్పడుతుంది. హెవీ బ్లీడింగ్ గురించి మీరు కంప్లైంట్ చేసినప్పుడు వైద్యులు అల్ట్రా సౌండ్ ను సూచిస్తారు.

సీంప్టోమిక్ ఫైబ్రాయిడ్స్ అనేవి మిమ్మల్ని సాధారణ లైఫ్ స్టయిల్ ను లీడ్ చేయనివ్వవు. పీరియడ్స్ సమయంలో క్రామ్ప్స్ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీ వైద్యులు మీకు కొన్ని మెడికేషన్స్ ను ప్రిస్క్రైబ్ చేయవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో, సర్జికల్ ప్రాసెస్ ద్వారా యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ను తొలగించమని వైద్యులు సూచిస్తారు.

Heres How To Identify If Your Period Cramps Are Abnormal

2. ఎండోమెట్రియోసిస్:

యుటెరస్ లైనింగ్ యుటెరస్ పైన పెరుగుతూ ఉంటే ఈ లోపాన్ని ఎండోమెట్రియోసిస్ అనంటారు. ఎండోమెట్రికల్ టిష్యూ యుటెరస్ వెలుపల పెరిగి దట్టంగా పేరుకుపోయి బ్లీడింగ్ ను అడ్డుకునే ప్రమాదం ఉంది.

దీని వలన ఇరిటేటెడ్ టిష్యూ సమస్య తలెత్తి అది రాను రాను స్కార్ టిష్యూగా లేదా అథెసిన్స్ గా మారుస్తుంది. దీని వలన పెల్విక్ రీజన్ లో హెవీ పెయిన్ తలెత్తుతుంది. అంతేకాక, ఇంఫెర్టిలిటీ సమస్యకు ఈ టిష్యూ దారితీసే ప్రమాదం కూడా ఉంది.

ఈ లోపం వలన, ఎగ్ కి చెందిన మార్గం నిరోధింపబడుతుంది. దానివలన, మహిళ గర్భం దాల్చేందుకు ఇబ్బందులు పడుతుంది. ఎండోమెట్రియోసిస్ సమస్యను కేవలం వైద్యులు మాత్రమే నిర్ధారించగలుగుతారు. ఒక సారి ఈ సమస్య గురించి తేలిన తరువాత ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు మెడికల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరి అవుతుంది.

నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవచ్చు. డాక్టర్స్ ఈ సమస్యకు ట్రీట్మెంట్ గా హార్మోనల్ థెరపీను కూడా సూచించే అవకాశం ఉంది. ఒకవేళ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు సర్జికల్ ప్రొసీజర్స్ ను కూడా సజెస్ట్ చేస్తారు వైద్యులు. ఎండోమెట్రియోసిస్ సమస్యను ట్రీట్ చేసే హిస్టెరెక్టోమీ వంటి సర్జరీల వలన మెనోపాజ్ వేగంగా రావచ్చు.

ఈ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య మళ్ళీ వేధించే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చికిత్సనందించినా మళ్ళీ మళ్ళీ వేధించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం మీరు వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదించడం తప్పనిసరి.

Heres How To Identify If Your Period Cramps Are Abnormal

3. పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ (పిఐడి):

రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవడం ఈ వ్యాధి లక్షణం. కాంట్రాసెప్షన్ కోసం వాడే ఇంట్రా యుటెరైన్ డివైస్ ను స్టెరిలైజ్ చేయకుండా ఇన్సర్ట్ చేసేటప్పుడు బాక్టీరియా ప్రవేశిస్తే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది.

అయితే, పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ అనేది గనేరియా లేదా క్లామైడియ వంటి లైంగిక వ్యాధుల ద్వారా సోకె ప్రమాదం ఉందని తెలుస్తోంది. చాలా సార్లు ఈ సమస్య ఉందన్న విషయం వ్యాధిగ్రస్తులకు తెలియదు. అయితే, పెల్విక్ పెయిన్ తీవ్రంగా ఉన్నప్పుడు మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

పెయిన్ ఫుల్ ఇంటర్ కోర్స్, డిశ్చార్జ్ లో దుర్వాసన లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటివి పెల్విక్ ఇంఫ్లేమేటరీ డిసీస్ సంబంధించిన కొన్ని లక్షణాలు. ఈ సమస్యను ట్రీట్ చేయకపోతే స్కార్ టిష్యూ సమస్య ఎదురవవచ్చు. మరింత తీవ్రమైన పరిస్థితిలో, రీప్రొడక్టివ్ స్పేస్ అనేది ఇంఫెక్టెడ్ ఫ్లూయిడ్ తో నిండిపోయే ప్రమాదం కలదు.

దీని వలన పెయిన్ తీవ్రంగా ఉంటుంది. ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్న మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ ఎదురవుతుంది. ఈ సమస్యలో ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ లో ఇంప్లాంట్ అవుతుంది. అయితే, యాంటీ బయోటిక్స్ ద్వారా కూడా ఈ సమస్య పరిష్కారమవుతుంది.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి, నెలసరి సమయంలో వచ్చే నొప్పులు అసాధారణంగా అనిపించినా, హెవీ బ్లీడింగ్ సమస్యతో ఇబ్బందిపడుతున్నా, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వేధిస్తున్నా మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ను తక్షణమే సంప్రదించాలి.

English summary

Here's How To Identify If Your Period Cramps Are Abnormal

If your period cramps are way too painful, it can be a serious cause of concern. The abnormal menstrual cramps can be an outcome of health conditions like uterine fibroids, endometriosis or pelvic inflammatory disease (PID). These conditions result in severe menstrual pain and heavy bleeding and they can be cured with the help of hormonal treatment, antibiotics,
Story first published:Tuesday, April 17, 2018, 18:48 [IST]
Desktop Bottom Promotion