For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాయ‌మైతే ర‌క్తం ఆగ‌కుండా కారుతోందా? ఈ 7 గృహ‌చిట్కాలు పాటిస్తే స‌రి...

By Sujeeth Kumar
|

ర‌క్తంలో బ్ల‌డ్‌ ప్లేట్‌లెట్స్ సంఖ్య త‌గ్గిపోవ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో థ్రాంబోసైటోపీనియా అంటారు.

జీవితకాలం చాలా త‌క్కువ‌...
ర‌క్త క‌ణాల్లో అన్నింటికంటే చిన్న‌వి బ్ల‌డ్ ప్లేట్‌లెట్స్‌. ఎర్ర‌, తెల్ల ర‌క్త‌క‌ణాల కంటే ఇవి చిన్న‌గా ఉంటాయి. మ‌న‌కు ఏదైనా గాయ‌మైన‌ప్పుడు ర‌క్తం ఎక్కువ మొత్తంలో కోల్పోకుండా ప్లేట్ లెట్స్ కాపాడ‌తాయి. శ‌రీరంలో ఎక్కువ మొత్తంలో ప్లేట్‌లెట్స్ ఉంటాయి. వీటి జీవితకాలం కేవ‌లం 5 నుంచి 9 రోజుల మ‌ధ్య‌లో ఉంటాయి.

ప్లేట్‌లెట్స్ సంఖ్య త‌గ్గిపోవ‌డం శ‌రీరానికి చాలా హానికార‌క స‌మ‌స్య‌. దీనికి రెండు కార‌ణాలు ఉండొచ్చు...అవి నాశ‌న‌మ‌వుతుండొచ్చు. అంతే సంఖ్య‌లో వాటి ఉత్ప‌త్తి జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. దీనికి విభిన్న కార‌ణాలు ఉండొచ్చు.

Home remedies to increase platelet count

కార‌ణాలివే....

త‌క్కువ సంఖ్య‌లో ప్లేట్‌లెట్స్ ఉత్ప‌త్తికి అనీమియా, వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్లు కార‌ణం కావొచ్చు. లూకీమియా, కీమోథెర‌పీ, ఎక్కువ‌గా మ‌ద్యం సేవించ‌డం, విట‌మిన్ బి 12 లోపించ‌డం లాంటివి ఇత‌ర కార‌ణాలు.

ర‌క్తంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్ష‌న్లు, మందుల‌కు రియాక్ష‌న్‌, స్వ‌యం రోగ‌నిరోధ‌క వ్యాధుల మూలాన కూడా ప్లేట్‌లెట్స్ విచ్చిన్నం అవుతాయి.

కాలేయ వ్యాధి వ‌ల్లో, క్యాన్స‌ర్ వ‌ల్లో క్లోమ గ్రంథిలో ఎక్కువ ప్లేట్‌లెట్స్ ఉండిపోతాయి.

ల‌క్ష‌ణాలివే...

క‌ళ్లు తిరిగిప‌డిపోవ‌డం, బ‌ల‌హీనంగా మారిపోవ‌డం, గాయ‌మైతే ర‌క్తం ఆగ‌క‌పోవ‌డం, చ‌ర్మంపై ర్యాషెస్‌, మూత్రం మ‌లంలో ర‌క్తం రావ‌డం లాంటివ‌న్నీ ప్లేట్‌లెట్స్ త‌గ్గుతున్నాయ‌నేదానికి ల‌క్ష‌ణాలు.

జీవ‌న‌శైలిలో కొద్దిపాటి మార్పులు, కొన్ని గృహ‌చిట్కాలు పాటించ‌డం ద్వారా బ్ల‌డ్ ప్లేట్‌లెట్స్ సంఖ్య‌ను పెంచుకోవ‌చ్చు. అలాంటి గృహ చిట్కాల‌ను మేము మీకు అందిస్తున్నాం.

1. బొప్పాయి

1. బొప్పాయి

బొప్పాయి పండుతో పాటు దాని ఆకులు బ్ల‌డ్ ప్లేట్‌లెట్స్ సంఖ్య‌ను పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని ఏషియ‌న్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, మ‌లేషియా వారు 2009లో చేసిన ఓ ప‌రిశోధ‌న‌లో తేల్చారు. బొప్పాయి పండును అలాగే తిన‌వ‌చ్చు లేదా దాని ఆకుల‌ను న‌మ‌లొచ్చు. ఇలా చేస్తే ప్లేట్‌లెట్స్ సంఖ్య క్ర‌మంగా పెరుగుతాయట‌. బొప్పాయి జ్యూస్ చేసుకొని దాంట్లో నిమ్మ‌ర‌సం క‌లుపుకున్నా ఫ‌లితం ఉంటుంద‌ట‌.

2. గుమ్మ‌డి

2. గుమ్మ‌డి

గుమ్మ‌డిలో ఉండే ప్రొటీన్లు ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయ‌ట‌. గుమ్మ‌డిలో విట‌మిన్ ఏ ఉంటుంది. ఇవి ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుద‌ల‌కు దోహ‌దం చేస్తాయి. అందుకే క్ర‌మంగా గుమ్మ‌డి పండు, దాని విత్త‌నాల‌ను సేవించ‌డం మేలంటారు డాక్ట‌ర్లు.

3. నిమ్మ‌

3. నిమ్మ‌

నిమ్మ‌లో పుష్క‌లంగా విట‌మిన్ సి ఉంటుంది. ఇవి ప్లేట్‌లెట్స్ సంఖ్య‌ను పెంచుతాయ‌ట‌. అంతే కాదు రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని విట‌మిన్ సి పెంచుతుంది.

4. ఆమ్లా

4. ఆమ్లా

ఆమ్లాలోనూ విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఆమ్లాలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇత‌ర ఆరోగ్య సమ‌స్య‌ల‌నూ త‌గ్గిస్తాయి.

5. బీట్‌రూట్‌

5. బీట్‌రూట్‌

బీట్‌రూట్ రసం తాగ‌డం వ‌ల్ల కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.

6. గోదుమ గ‌డ్డి

6. గోదుమ గ‌డ్డి

ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్నల్ ఆఫ్ యూనివ‌ర్స‌ల్ ఫార్మ‌సీ అండ్ లైఫ్ సైన్సెస్ వారు చేసిన ప‌రిశోధ‌న‌లో బ్ల‌డ్ ప్లేట్‌లెట్స్ సంఖ్య‌ను పెంచ‌డంలో గోదుమ గ‌డ్డి స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని తేల్చారు. గోదుమ గ‌డ్డిలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది ర‌క్తంలో హిమోగ్లోబిన్ మాదిరిగా ఉంటుంది. అందుకే రోజుకు క‌నీసం అర క‌ప్పు గోదుమ గ‌డ్డి ర‌సం తాగితే మంచిద‌ని అంటారు. దీంట్లో కాస్త నిమ్మ‌ర‌సం పిండుకుంటే మ‌రీ మంచిది. విట‌మిన్ సి ఐర‌న్‌ను బాగా పీల్చుకునేలా చేస్తాయి. ఐర‌న్ త‌గుపాళ్ల‌లో ఉంటే ర‌క్తం ప్లేట్‌లెట్స్ సంఖ్య త‌గ్గ‌కుండా ఉంటుంది.

7. క‌ల‌బంద‌

7. క‌ల‌బంద‌

ర‌క్త శుద్ధిలో క‌ల‌బంద‌ కీల‌క పాత్ర పోషిస్తుంది. ర‌క్త ఇన్ఫెక్ష‌న్లు రాకుండానూ అలోవెరా స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇవ‌న్నీ బ్ల‌డ్ ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగేందుకు దోహ‌దం చేస్తాయి.

English summary

Home remedies to increase platelet count

Home remedies to increase platelet count,Known as thrombocytopenia in medical terms, low platelet count is a health disorder in which your blood platelets are lower than normal.Platelets are the tiniest among the blood cells, much smaller than red and white blood cells. They aid in blood clotting and help in preventi
Desktop Bottom Promotion