For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ హీట్ వల్ల శరీరంలో ట్యూమర్లు మరియు ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతుంది: అధ్యయనం

బాడీ హీట్ వల్ల శరీరంలో ట్యూమర్లు మరియు ఇన్ఫెక్షన్స్ పై పోరాడుతుంది: అధ్యయనం

|

మన శరీర ఉష్ణోగ్రతకి ట్యూమర్స్, గాయాలు మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్థ్యం ఉందని ఇదే శరీరంలోని ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

PNAS జర్నల్ లో పబ్లిష్ అయిన ఈ స్టడీలో, పరిశోధకులు శరీరంలోని ఉష్ణోగ్రతలో చిన్నపాటి పెరుగుదలపై అధ్యయనం చేసారు. జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ సమయంలో ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసే సెల్యులార్ క్లాక్ వేగవంతంగా పనిచేస్తుంది.

ఈ నూతన అవగాహన అనేది మరింత ప్రభావంతమైన అలాగే వేగవంతంగా పనిచేసే మందుల తయారీకి తోడ్పాటుని అందిస్తుంది. ఈ ప్రాసెస్ లో మరింత సహాయకరంగా ఉంటుంది.

Hotter bodies fight infections, tumours better: study

క్లాక్ టికింగ్ ని స్టార్ట్ చేయడానికి ఇంఫ్లేమాటరీ సిగ్నల్స్ అనేవి న్యూక్లియర్ ఫ్యాక్టర్ కప్పా బి (NF-?B) ప్రోటీన్స్ ని యాక్టివేట్ చేస్తాయని యూకేలోని వార్విక్ మరియు మాంచెస్టర్ యూనివర్సిటీస్ కి చెందిన బయాలజిస్ట్ లు కనుగొన్నారు.

క్లాక్ లో NF-?B ప్రోటీన్స్ ముందుకు వెనుకకూ అటూ ఇటూ సెల్ న్యూక్లియస్ లో కదులుతాయి. అందువలన జీన్స్ లో మార్పు సంభవిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

ఈ ప్రాసెస్ వలన సెల్స్ అనేవి ట్యూమర్, గాయం మరియు ఇన్ఫెక్షన్లకు రెస్పాండ్ అవుతాయని వారు తెలుపుతున్నారు.

NF-?B కంట్రోల్ తప్పినప్పుడు క్రాన్స్ డిసీజ్, సోరియాసిస్ మరియు ర్యుమటాయిడ్ ఆర్త్రైటిస్ వంటి ఇంఫ్లేమేటరీ సమస్యలు తలెత్తుతాయి.

Hotter bodies fight infections, tumours better: study

34 డిగ్రీల శరీర ఉష్ణోగ్రతలో NF-?B క్లాక్ వేగం తగ్గుతుంది. సాధారణ 37 కంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద అంటే 40 డిగ్రీలప్పుడు అలాగే జ్వరం కలిగిన సమయంలో NF-?B క్లాక్ వేగవంతం అవుతుంది.

A20 అనబడే ప్రోటీన్ అనేది ఇంఫ్లేమేటరీ డిసీజ్ లను అరికట్టేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

A20 ని సెల్స్ నుంచి తొలగించి గమనిస్తే NF-kB క్లాక్ అనేది ఉష్ణోగ్రతను పెంచే సెన్సివిటీను కోల్పోయినట్లు వారు గుర్తించారు.

నార్మల్ లైఫ్ లోని 24 గంటల బాడీ క్లాక్ అనేది శరీరంలోని చిన్నపాటి ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేస్తుందని వార్విక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ర్యాండ్ వివరిస్తున్నారు.

నిద్రిస్తున్న సమయంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు జెట్ ల్యాగ్ లేదా స్లీప్ డిజార్డర్స్ కి కారణమవుతుందని ఇవి ఇంఫ్లేమేటరీ డిసీజ్ లకు ఎక్కువగా దారితీస్తాయని ర్యాండ్ చెప్తున్నారు.

సెల్స్ యొక్క మ్యాథ్మెడికల్ మోడలింగ్ అనేది ఉపయోగకరమైన నూతన బయలాజికల్ అవగాహనకు ఏ విధంగా తోడ్పడతాయో తెలిపేందుకు ఇది చక్కటి ఉదాహరణ అని అంటున్నారు వార్విక్ యూనివర్సిటీకి చెందిన డ్యాన్ వుడ్ కాక్.

Hotter bodies fight infections, tumours better: study

NF-kBకి చెందిన అనేక కంట్రోల్డ్ జీన్స్ ల కార్యకలాపాలు ఉష్ణోగ్రతపై ప్రభావం చూపకపోయినా, కొన్ని జీన్స్ గ్రూప్ లు వివిధ ఉష్ణోగ్రతల వద్ద మార్పులకు గురయ్యాయి.

ఉష్ణోగ్రతకు సెన్సిటివ్ గా ఉండే ఈ జీన్స్ లు ఇంఫ్లేమేటరీ రెగ్యూలేటర్స్ గా అలాగే సెల్ కమ్యూనికేషన్ కంట్రోలర్లు గా వ్యవహరించి సెల్ రెస్పాన్స్ లను మార్పుకు గురిచేస్తాయి.

English summary

Hotter bodies fight infections, tumours better: study

Hotter bodies fight infections, tumours better: study,The hotter our body temperature, the more our bodies speed up a key defence system that fights tumours, wounds or infections, according to a study.In the study published in the journal PNAS, the researchers demonstrated that small rises in temperature, such as dur
Story first published:Friday, May 25, 2018, 14:23 [IST]
Desktop Bottom Promotion