For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కులోంచి ర‌క్తం ఆపేందుకు 10 గృహ‌వైద్య ఉపాయాలు

By Sujeeth Kumar
|

ముక్కు నుంచి ర‌క్తం కారడం భ‌యంగొలిపిస్తుంది. అయితే అదృష్ట‌వ‌శాత్తు దీని గురించి పెద్ద‌గా కంగారు ప‌డ‌న‌క్క‌ర్లేదు అంటారు నిపుణులు. ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే చూసిన‌వారెవ‌రైనా భ‌య‌ప‌డ‌టం స‌హ‌జం. కాబ‌ట్టి ఈ సారి ర‌క్తం కారితే కంగారు ప‌డ‌కుండా కొంచెం ర‌క్త‌మే అని స‌ర్దిచెప్పుకొని ప్ర‌శాంతంగా ఉండండి.

ముక్కు నుంచి ర‌క్తం కార‌డం చూస్తే చిన్న పిల్ల‌ల్ని చూసిన‌ట్టు చూస్తారు. ఇది ప‌క్క‌న పెడితే ఇలా ఎందుకు అవుతుందో కార‌ణం తెలుసుకోవ‌డ‌మూ ముఖ్య‌మే. ముక్కు నుంచి ర‌క్తం ఎందుకు కారుతుంది? దీనికి ప‌రిష్కార‌మంటూ లేదా అనే విష‌యాన్ని తెలుసుకుందాం.

how remedies to stop nose bleeding

ముక్కులోంచి ర‌క్తం రావ‌డానికి కార‌ణాలు?

ముక్కు నుంచి ర‌క్తం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిలో భాగంగా ఎక్కువ‌గా చీద‌డం, ముక్కును రుద్ద‌డం, పొడి వాతావ‌ర‌ణం, గాయాలు కావ‌డం, అల‌ర్జీలు, సైన‌సైటిస్ లాంటి శ్వాస సంబంధిత రుగ్మ‌త‌లు, మ‌లేరియా, టైఫాయిడ్ లాంటి జ‌బ్బులు కార‌ణం కావొచ్చు. ముక్కులో ఉండే చిన్న ర‌క్త నాళం దెబ్బ‌తిని అక్క‌డ వాపు ఏర్ప‌డ‌వ‌చ్చు. ముక్కు మీద గ‌ట్టిగా ఒక్కటి కొట్టినా ర‌క్తం కార‌డ‌మూ స‌హ‌జ‌మే!

ముక్కు నుంచి ర‌క్తం కార‌డానికి ప్ర‌ధానంగా రెండు ర‌క్త నాళాలు తెగ‌డ‌మే కార‌ణం. వీటికి త‌గిన చికిత్స అందిస్తే ముక్కు నుంచి ర‌క్తం కార‌డం ఆగుతుంది. ఆ ముక్కు ర‌క్త నాళాల గురించి తెలుసుకుందాం మ‌రి...

ముక్కు నాళాల ర‌కాలు....

1. పూర్వ ముక్కు నాళం-

ముక్కు ముంద‌రి భాగంలో నాళాల‌కు గాయ‌మైతే అక్క‌డ ర‌క్తం కారుతుంది. ఈ ముంద‌రి భాగాన్నే కెస‌ల్‌బాచ్స్ ప్లెక్స‌స్‌గా పిలుస్తారు.

2. ప‌రాంత ముక్కు నాళం-

గొంతుకు ద‌గ్గ‌ర‌గా ఉండే ముక్కునాళానికి దెబ్బ‌త‌గిలితే ర‌క్తం ధారాళంగా 20 నిమిషాల పాటు కారుతూనే ఉంటుంది.

పై రెండింటిలో ప‌రాంత ముక్కు నాళానికి గాయ‌మైతే స‌రైన వైద్య చికిత్స అవ‌స‌రం. ముక్కు నుంచి ర‌క్తం రావ‌డం ఎంత భ‌యాన్ని గొలిపేదైనా చాలా మ‌టుకు సంద‌ర్భాల్లో వీటికి ఇంట్లోనే చ‌క్క‌ని ప‌రిష్కారాలు ఉంటాయ‌న్న సంగ‌తిని గుర్తుంచుకోండి.

మ‌రి ఇంట్లోనే దీనికి ఎలాంటి చికిత్స మార్గాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని ఆచ‌రించే ప్ర‌యత్నం చేద్దాం. అలాగ‌ని కావాల్సుకొని ముక్కు ప‌గ‌ల‌గొట్టుకోకండేం!!!

1. తైలాలు

1. తైలాలు

కావాల్సిన‌విః

2-3 చుక్క‌ల లావెండ‌ర్ నూనె లేదా సిప్ర‌స్ నూనె

ఒక క‌ప్పు నీళ్లు

ఒక పేప‌ర్ ట‌వ‌ల్‌

ఏం చేయాలంటే...

నూనెను నీళ్ల‌లో వేసి క‌ల‌పాలి. పేప‌ర్ ట‌వ‌ల్ తీసుకొని అందులో ముంచి కాస్త ఆరేయాలి. దీన్ని ముక్కుకు ప‌ట్టి రెండు నిమిషాలు ఉంచాలి. మీకు గ‌నుక ఈ నూనెల‌తో అల‌ర్జీ లేక‌పోతే నేరుగాను ముక్కుకు రాయ‌వ‌చ్చు. ర‌క్తం కారేచోట రాస్తే ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది.

ఇలా ఎన్ని సార్లు చేయాలి...

ముక్కు నుంచి ర‌క్తం కారినప్పుడు ప్ర‌తి రెండు నిమిషాల కోసారి ఇలా చేస్తే కాసేప‌టికి ర‌క్తం కార‌డం ఆగిపోతుంది.

ఇదెలా ప‌నిచేస్తుందంటే...

సిప్ర‌స్ ఆయిల్ సాధార‌ణంగా ముక్కు నుంచి ర‌క్తం కార‌డాన్ని త‌గ్గిస్తుంది. ఎందుకంటే దీనికి ఆస్ట్రింజెంట్ గుణాలు బాగా ఉంటాయి. అదే విధంగా లావెండ‌ర్ నూనె గాయ‌మైన ర‌క్త‌పు నాళాల‌ను త్వ‌ర‌గా కోలుకునేలా చేస్తాయి.

2. ఉల్లిపాయ‌

2. ఉల్లిపాయ‌

కావాల్సిన‌విః

పావు ముక్క ఉల్లిపాయ‌, చిన్న దూది

ఏం చేయాలంటే...

ఉల్లిపాయ‌ను స‌న్న‌గా త‌రిగి ఆ ర‌సాన్ని దూదిలో ముంచాలి. ప్ర‌తి 3 లేదా 4 నిమిషాల‌కోసారి గాయ‌మైన ప్ర‌దేశంలో రాయాలి. దీనికన్నా నేరుగా ఒక చిన్న ఉల్లిపాయ ముక్క‌ను ముక్కు ద‌గ్గ‌ర పెట్టుకొని వాస‌న చూస్తే కాస్త కోలుకుంటాం.

ఇలా ఎన్ని సార్లు చేయాలి...

ముక్కు నుంచిర‌క్తం కారిన‌ప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చికిత్స విధానాన్ని పాటించొచ్చు.

ఇదెలా ప‌నిచేస్తుందంటే...

చైనా వైద్యులు ఈ విధానాన్ని బాగా విశ్వ‌సిస్తారు. ముక్కు నుంచి ర‌క్తం కార‌డం ట‌క్కున ఆపేస్తుంద‌ని వీరి న‌మ్మ‌కం. ఉల్లి రసంలో ఉండే ఘాటు వ‌ల్ల ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ‌క‌ట్టిపోయి బ్లీడింగ్ ఆగిపోతుంది.

 3. ఐస్ ముక్క‌ల‌తో...

3. ఐస్ ముక్క‌ల‌తో...

కావాల్సిన‌విః

కొన్ని ఐస్ ముక్క‌లు, ఒక మెత్త‌టి ట‌వ‌ల్‌.

ఏం చేయాలంటే...

మెత్త‌టి బ‌ట్ట‌లో ఐస్ ముక్క‌ల‌ను చుట్టి ముక్కుపైన ఉంచాలి. ఇలా 4-5 నిమిషాల పాటు చేస్తే కోల్డ్ ప్రెస్ చేస్తే చాలు.

ఇలా ఎన్ని సార్లు చేయాలి...

ర‌క్తం కార‌డం అలాగే ఉంటే ఈ విధానాన్ని కొన్ని గంట‌ల‌కోసారి అమ‌లుప‌ర్చాలి.

ఇదెలా ప‌నిచేస్తుందంటే...

ఐస్ ముక్క‌ల వ‌ల్ల క‌లిగే చ‌ల్ల‌ద‌నం ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టే స‌మ‌యాన్ని త‌గ్గిస్తుంది. ఫ‌లితంగా ర‌క్తం కార‌డం తొంద‌ర‌గా ఆగిపోతుంది.

4. విట‌మిన్ ఇ

4. విట‌మిన్ ఇ

కావాల్సిన‌విః

విట‌మిన్ ఇ క్యాప్సుల్స్‌

ఏం చేయాలంటే...

ఈ క్యాప్సుల్స్ ను విర‌గొట్టి ఇందులోని నూనెను ఒక గిన్నెలో పోసుకోవాలి. దీన్ని ముక్కులోప‌లి భాగంలో రాయాలి. అలా రాత్రంతా వ‌దిలేయాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలి...

ముక్కు పొడిబారిన‌ట్టు అనిపించిన ప్ర‌తిసారీ ఈ విధానం పాటించొచ్చు.

ఇదెలా పనిచేస్తుందంటే...

శీతాకాలంలో పొడి వాతావ‌ర‌ణం ఉంటుంది. త‌ర‌చూ విట‌మిన్ ఇ ఆయిల్‌తో మ‌ర్ద‌న చేసుకోవ‌డం వ‌ల్ల ముక్కుకు త గిన తేమ అందుబాటులో ఉంటుంది. ఇది ముక్కు నుంచి ర‌క్తం కార‌కుండా చ‌క్క‌ని ప‌రిష్కారం.

5. ఉప్పు నీరు

5. ఉప్పు నీరు

కావాల్సిన‌వి--

అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక‌టిన్నర క‌ప్పు నీరు, సిరంజి.

ఏం చేయాలంటే...

ఉప్పును, బేకింగ్ సోడాను నీళ్ల‌లో వేసి బాగా క‌ల‌పాలి. సిరంజి సాయంతో ముక్కులో ఈ నీళ్ల‌ను స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసేట‌ప్పుడు మ‌రో ముక్కును మూసేయాలి. త‌ల వంచి నీళ్లు బ‌య‌ట‌కు వెళ్లేలా జాగ్ర‌త్త ప‌డాలి. ఇలా రెండు మూడు సార్లు చేయ‌డం మంచిది.

ఇలా ఎన్ని సార్లు చేయాలి...

ముక్కు అల‌ర్జీలు, ర‌క్తం కార‌డం, బ్లాక్ అయిన ప్ర‌తి సారీ ఈ విధానాన్ని పాటించ‌డం మేలు.

ఇదెలా పనిచేస్తుందంటే...

ఉప్పునీరు ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్తించి ముక్కులో అధికంగా కారే స్ర‌వాల‌ను అదుపులో ఉంచుతుంది. లోప‌లి నుంచి ముక్కు పొడిగా ఉంటే ఉప్పు నీరు స్ప్రే చేయ‌డం వ‌ల్ల లోప‌ల మెత్త‌గా అయిపోయి తేమగా మారిపోతుంది. దీని వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి ఆస్కారం ఉంటుంది.

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌

కావాల్సిన‌వి-

1 టీస్పూన్ యాపిల్ సిడార్ వెనిగ‌ర్ లేదా వైట్ వెనిగ‌ర్‌

ఒక దూది పింజ‌

ఏం చేయాలంటే--

దూదిని వెనిగ‌ర్ లో ముంచి గాయ‌మైన ముక్కు వ‌ద్ద 8-10 నిమిషాల‌పాటు ఉంచాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలంటే--

ఒక్క‌సారి ఇలా చేస్తే గాయం మాని రక్తం కార‌డం ఆగిపోతుంది. కాబ‌ట్టి త‌ర‌చూ చేయాల్సిన ప‌నిలేదు.

ఇదెలా ప‌నిచేస్తుందంటే---

వెనిగ‌ర్‌లో ఉండే యాసిడ్ ర‌క్త నాళాల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి బ్లీడింగ్ ఆగేలా చేస్తుంది.

7. మిరియాలు

7. మిరియాలు

కావాల్సిన‌వి

పావు నుంచి 1 టీ స్పూన్ మిరియాలు, ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని నీరు

ఏంచేయాలంటే--

నీటికి మిరియాల పొడి క‌లుపుకొని తాగాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలంటే---

ముక్కు నుంచి రక్తం కార‌డం మొద‌లైన వెంట‌నే ఈ మిశ్ర‌మాన్ని తాగ‌డం మొద‌లుపెట్ట‌వ‌చ్చు.

ఇదెలా ప‌నిచేస్తుందంటే---

మిరియాలు ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి స‌హ‌క‌రిస్తుంది. త‌ద్వారా ర‌క్తం కార‌డం ఆగిపోతుంది.

8. గోల్డెన్ సీల్ ఆకులు

8. గోల్డెన్ సీల్ ఆకులు

కావాల్సిన‌వి--

కొన్ని గోల్డెన్‌సీల్ ఆకులు, క‌ప్పు వేడినీరు

ఏం చేయాలంటే--

వేడి నీరు, ఆకుల‌తో మంచి హెర్బ‌ల్ టీ త‌యారుచేసుకోండి. దీని ఆవిరితో 4-5 నిమిషాల‌పాటు ముక్కును ఉంచాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలంటే---

ముక్కు నుంచి ర‌క్తం కారిన‌ప్పుడు ఈ విధానాన్ని పాటించ‌వ‌చ్చు.

ఇదెలా ప‌నిచేస్తుందంటే---

ముక్కు నుంచి రక్తం కార‌డం, లాంటి స‌మ‌స్య‌ల‌కు ఈ హెర్బ‌ల్ మొక్క లేదా ఆకులు చ‌క్క‌ని ప‌రిష్కార‌మిస్తాయి. ఇది యాంటీ మైక్రోబియ‌ల్‌గా, ఆస్ట్రింజెంట్‌గా, ప‌నిచేసి ముక్కు నుంచి ర‌క్తం కార‌డాన్ని త్వ‌ర‌గా త‌గ్గిస్తుంది.

గ‌మ‌నికః

త‌ల్లి కాబోయేవారు, బాలింత‌రాలు ఈ విధానాన్ని పాటించ‌క‌పోవ‌డం మేలు.

9. విచ్ హేజెల్‌

9. విచ్ హేజెల్‌

కావాల్సిన‌వి--

విచ్ హేజెల్ ర‌సం, దూది

ఏం చేయాలంటే--

విచ్ హేజెల్ ఆకుల ర‌సంలో దూదిని ముంచి ముక్కు ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. రెండు నిమిషాల త‌ర్వాత దూదిని తీసేయాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలి--

కావాల్సిన‌ప్పుడు, కావాల్సిన సంద‌ర్భంలో ఈ చికిత్సా విధానాన్ని పాటించ‌వ‌చ్చు.

ఇదెలా ప‌నిచేస్తుందంటే--

విచ్ హేజెల్ ఆకుల్లో ఉండే ఆస్ట్రింజెంట్ గుణాలు ర‌క్తం కార‌డాన్ని త‌గ్గించేస్తుంది.

10. నెట్టిల్ ఆకులు

10. నెట్టిల్ ఆకులు

కావాల్సిన‌వి--

1 టీస్పూన్ నెట్టిల్ ఆకులు

1 క‌ప్పు వేడి నీరు

దూది పింజ‌

ఏం చేయాలంటే--

ఆకుల‌ను వేడి నీటిలో వేసి మంచి టీ త‌యారుచేసుకోవాలి. అది చ‌ల్లార‌క‌, దూదిలో ముంచి ముక్కు ద‌గ్గ‌ర ఉంచుకోవాలి.

ఇలా ఎన్ని సార్లు చేయాలంటే---

ముక్కు పైన దూదిని 5-10 నిమిషాల పాటు ఉంచి తీయాలి. ర‌క్తం కార‌డం త‌గ్గిపోతుంది. ఇలా అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా చేయ‌వ‌చ్చు.

ఇలా పనిచేస్తుందంటే--

ఈ హెర్బ‌ల్ టీ ముక్కు నుంచి ర‌క్తం కార‌డాన్ని త్వ‌ర‌గా త‌గ్గిస్తుంది. ఈ ఆకు స‌హ‌జ ఆస్ట్రింజెంట్‌లా ప‌నిచేస్తుంది. అల‌ర్జీ నుంచి కూడా ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది. ఈ నెట్టిల్ లీఫ్ టీ తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలే ఉంటాయి.

ముక్కు నుంచి ర‌క్తం కార‌డం ఆపేందుకు ఇలాంటి చిన్న‌చిన్న చిట్కాలు ప‌నికొస్తాయి. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన విధానాలు చాలా సుర‌క్షిత‌మైన‌వి, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌వు. ఇవి కాకుండా కొన్ని ముఖ్య‌మైన ప‌నులుచేయ‌డం వ‌ల్ల కూడా ముక్కు నుంచి ర‌క్తం కార‌డాన్ని నిలువ‌రించ‌వ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాం..

ముక్కు నుంచి ర‌క్తం కార‌డం త‌గ్గించ‌డానికి టిప్స్‌

ముక్కు నుంచి ర‌క్తం కార‌డం త‌గ్గించ‌డానికి టిప్స్‌

1. నిటారుగా కూర్చోండి

ముక్కు నుంచి ర‌క్తం కారేట‌ప్పుడు మ‌న శ‌రీర భంగిమ కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. మొద‌ట నిటారుగా కూర్చోవాలి. వెన‌క్కి వంగితే ర‌క్తం ముక్కునుంచి గొంతులోకి వెళ్లే ప్ర‌మాదం ఉంది. అంత‌వ‌ర‌కు కాస్త ముందుకు ఒంగి నోటి ద్వారా శ్వాస పీల్చుకోవ‌డం చేస్తుండాలి. ఈ సింపుల్ టిప్ పాటించ‌డం వ‌ల్ల చిన్న చిన్న గాయాల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఐతే ప్ర‌శాంత‌త‌ను పాటించ‌డం మ‌రువ‌కండి.

2. ఒత్తిడి క‌లిగించండి

2. ఒత్తిడి క‌లిగించండి

వేళ్ల‌తో సుతారంగా ముక్కు మెత్త‌ని భాగాన్ని 10 నిమిషాల‌పాటు స్థిరంగా ప‌ట్టుకొని ఉండండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్తం కార‌డం త‌గ్గిపోతుంది. ఎక్కువగా ఒత్తిడి క‌లిగించ‌కండి. ఆ త‌ర్వాత 10 నిమిషాలకు మెల్ల‌గా వేళ్ల‌ను వ‌దిలేయండి. ముక్కును తాక‌డం లేదా వాయించ‌డం చేయ‌కండి. ఇంకా ర‌క్తం కార‌డం ఆగ‌క‌పోతే మ‌రో 10 నిమిషాల‌పాటు అలాగే వేళ్ల‌తో ప‌ట్టి ఉంచండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ర‌క్త నాళాలు బిగుతై ర‌క్తం కార‌డం త‌గ్గిపోతుంది.

3. నీళ్లు బాగా తాగండి--

3. నీళ్లు బాగా తాగండి--

శ‌రీరంలో త‌గుపాళ్లు నీళ్లు లేక‌పోయినా స‌రే ముక్కు నుంచి ర‌క్తం కార‌డం స‌హ‌జం . అందుకే ఎల్ల‌వేళ‌లా శ‌రీరాన్ని నీటితో నింపాలి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ పనిచేయ‌డం అవ‌స‌రం. చ‌లికాలంలోనూ పొడిగా ముక్కు అయిపోతుంది. అందుకే ఎంత లేద‌న్నా రోజుకు క‌నీసం 8 గ్లాసుల మంచినీరు తాగ‌డం ముఖ్యం.

4. పెట్రోలియం జెల్లీ

4. పెట్రోలియం జెల్లీ

ముక్కు పొడిగా ఉండే ఇరిటేష‌న్ క‌లుగుతుంది. దీని వ‌ల్ల ముక్కు నుంచి ర‌క్తం కారే అవ‌కాశం ఉంది. అందుకే త‌ర‌చూ ముక్కుకు పెట్రోలియం జెల్లీ రాస్తుండాలి. లోప‌ల కూడా ముక్కు నాళాలు తేమ‌గా మారి చ‌క్క‌గా ప్ర‌స‌రిస్తాయి. సైన‌టిస్ ఉన్న‌వారు కూడా పెట్రోలియం జెల్లీ రాసుకుంటూ ఉండాలి.

5. విట‌మిన్ సి- కె

5. విట‌మిన్ సి- కె

విట‌మిన్ సి కొల్లెజ‌న్ త‌యారుకావ‌డానికి స‌హ‌క‌రిస్తుంది. కొలాజెన్ ముక్కు చుట్టు తేమ ఉండేలా చేస్తుంది. ఇక దీర్ఘ‌కాలంలో ఇది దొర‌కాలంటే బాగా ఆరెంజులు, నిమ్మ‌కాయ‌లు, గూస్బెరీలు తినాలి. అలాగే ప‌చ్చ‌ని ఆకుకూర‌లు తిన‌డం మంచిది. విట‌మిన్ కె ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టేందుకు తోడ్ప‌డుతుంది. అందుకే దీనిని స‌మృద్ధిగాతీసుకోవాలి.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ముక్కు నుంచి ర‌క్తం కార‌డాన్ని త్వ‌ర‌గానే పూర్తిగా న‌యంచేసుకోవ‌చ్చు.

English summary

how remedies to stop nose bleeding

A bleeding nose can be scary. Fortunately, more often than not, nosebleeds are nothing to panic about. The sight of blood dripping down the nose can send people into a frenzy. So, when you see blood gushing out of your nose, just calm down for a second and say, ”It’s just a little blood. No biggie!”
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more