తక్కువగా నిద్రించడం (కునుకు తియ్యడం) వల్ల, వచ్చే తలనొప్పిని నివారించడం ఎలా ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నిద్ర అనేది మానవ శరీరానికి చాలా ముఖ్యమైనదని, చాలా అవసరమైనదని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు నిద్రించిన తర్వాత కూడా మీరెప్పుడైనా తలనొప్పి బాధను ఎదుర్కొన్నారా ? అయితే, కోల్పోయిన నిద్ర కోసం కొందరు వ్యక్తులు చిన్నగా కునుకు తీస్తుంటారు. దీనివల్ల శరీరం విశ్రాంతిని పొంది, శరీరానికి అవసరమైన ఇంధనాన్ని మేల్కొనేలోపు సమకూర్చుకుంటుంది.

కునుకు తీయడం వల్ల కలిగే లాభాలను ఒక అధ్యయనంలో కనిపెట్టడం జరిగింది. వాటిలో కొన్ని లాభాలు - మీలో చురుకుదనాన్ని, సృజనాత్మకతను పెంచుతుంది; అలసటను తగ్గించడం, మానసిక స్థితిని మెరుగుపరచి - జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. అయినప్పటికీ, ఈ రకమైన అద్భుత ప్రయోజనాలు కునుకు తీసే ప్రతి ఒక్కరికి వర్తించవు.

కానీ కొందరు చిన్నగా కునుకు తీసిన తర్వాత, శరీర స్థితి నిర్ధారణ రాహిత్యము వల్ల బాధాకరమైన తలనొప్పిని పొందుతారు. మీరు కునుకు తీసే సమయం చాలా దీర్ఘకాలంగా ఉన్నందున ఇలా ఏర్పడటానికి కారణం కావచ్చు. అలాగే దీనికి మరొక కారణం, క్రమరాహిత్యంగా ఉన్న నిద్రావస్థల (ఎల్లప్పుడూ ఒకే నిర్ణీతమైన సమయంలో నిద్రపోకపోవడం) వల్ల కూడా సంభవించవచ్చు.

కాబట్టి, చిన్నగా కునుకు తీసిన తర్వాత వచ్చే తలనొప్పిని నివారించడానికి పాటించవలసిన విషయాల కోసం మీరు ఈ వ్యాసమును చదివి తెలుసుకోవచ్చు.

1. తగినంత నిద్రను పొందాలి :

1. తగినంత నిద్రను పొందాలి :

ఎక్కువగా నిద్రించడం వల్ల వచ్చే తలనొప్పికి గల కారణం - మీ మెదడులోని సెరోటోనిన్, న్యూరోట్రాన్స్మిటర్లలలో ఎదురయ్యే అసమతుల్యత. అతిగా నిద్రపోవడం వల్ల మీ నిద్రావ్యవస్థకు అంతరాయం కలిగి, తర్వాత మీరు నిద్ర పోవడానికి మరింత కష్టతరమవుతుంది. ఈ విధమైన తలనొప్పిని నివారించడానికి మీరు ప్రతిరోజూ రాత్రి కనీసం 8 గంటలు నిద్ర పోవాలని సిఫార్సు చేయబడింది.

2. అల్లం :

2. అల్లం :

అధిక నిద్ర వల్ల వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించటంలో అల్లం అద్భుతంగా పనిచేసే పరిహారమని చెప్పవచ్చు. ఇది మీ తలలో ఉండే రక్తనాళాలలో ఏర్పడిన వాపును తగ్గించడం సహాయపడుతుంది. కునుకు వల్ల వచ్చే తలనొప్పి నుంచి మీరు ఉపశమనాన్ని పొందటం కోసం అల్లం రసమును (లేదా) అల్లం టీ తాగవచ్చు.

3. కెఫిన్ను పరిమితంగా వాడండి - ఎక్కువసేపు నిద్రపోవడాన్ని తగ్గించండి :

3. కెఫిన్ను పరిమితంగా వాడండి - ఎక్కువసేపు నిద్రపోవడాన్ని తగ్గించండి :

మీకు తలనొప్పి రాకుండా నివారించేందుకు, కెఫిన్ను తీసుకోవడాన్ని చాలా వరకూ తగ్గించే ప్రయత్నం చేయండి. మీరు కెఫిన్ను అధికంగా తీసుకోవడం వల్ల రాత్రి నిద్రకు మిమ్మల్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా, మీరు ఎక్కువసేపు కునుకుతూ వుండటంవల్ల మీ నిద్రావ్యవస్థకు అంతరాయం కలుగవచ్చు.

4. ఎక్కువగా నీరుని తాగండి :

4. ఎక్కువగా నీరుని తాగండి :

మీ శరీరం డీహైడ్రేషన్కు గురైతే, అధిక నిద్రను చేసిన తర్వాత కూడా మీరు తలనొప్పిని పొందవచ్చు. కాఫీ, ఆల్కాహాల్, తియ్యని పానీయాలు మొదలైన వంటివి, డీహైడ్రేషన్ను కలుగజేసే కొన్ని ముఖ్యమైన కారకాలు. కాబట్టి మీరు ఇలా ఎదురయ్యే తలనొప్పిని అధిగమించడానికి రోజంతా ఎక్కువ మోతాదులో నీరు తాగాలి.

5. ఐస్-ప్యాక్ :

5. ఐస్-ప్యాక్ :

ఐస్-ప్యాక్ తలనొప్పికి కారణమవుతున్న కొన్ని కణాలలో వాపును తగ్గించే కూలింగ్ (శీతలీకరణ) ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తలనొప్పి వల్ల కలిగే బాధ నుంచి మీకు ఉపశమనాన్ని కలుగజేయడంలో ఐస్ అనేది బాగా సహాయపడుతుంది. ఒక టవల్లో, కొన్ని మంచు ముక్కలను వేసి, మీ నుదిటి మీద కాసేపు ఉంచండి.

6. యోగ :

6. యోగ :

మీరు ఎదుర్కొంటున్న తలనొప్పి నుంచి ఉపశమనమును కలిగించటంలో "యోగా" అనేది చాలా గొప్ప మార్గం. యోగ మీ శరీరానికి విశ్రాంతిని కలుగజేసి, మీ మనస్సును తేలిక చేయడంలో సహాయం చేస్తుంది. ఈసారి నుంచి, ఒక చిన్న కునుకు తర్వాత మీకు తలనొప్పి గానీ వచ్చినట్లయితే సూర్య నమస్కారాలను - ఇతర యోగ పద్దతులు ఆచరించడం వల్ల, మీ మనస్సు నుండి భావపూరితమైన ఆలోచనలను తొలగించటానికి సహాయపడతాయి.

7. పుదీనా జ్యూస్ :

7. పుదీనా జ్యూస్ :

పుదీనా అనేది ఒక అద్భుతమైన తలనొప్పి నివారిణి. మెంథాల్ అనేది సహజమైన పద్ధతిలో, త్వరగా మీ తలనొప్పిని తగ్గిస్తుంది. మీరు నిద్రలేచిన తర్వాత ఎదుర్కొనే తలనొప్పిని అధిగమించడానికి, పుదీనాతో తయారుచేసిన "పుదీనా-టీని తాగండి (లేదా) పుదీనా ఆకుల నుంచి తీసిన రసాన్ని మీ నుదిటి పై రాసి చూడండి.

8. లావెండర్ ఆయిల్ :

8. లావెండర్ ఆయిల్ :

లావెండర్ ఆయిల్ మంచి సువాసనను కలిగి, మీకు ఎదురైనా తలనొప్పి నుండి ఉపశమనమును కలిగించడంలో చాలా బాగా సహాయపడుతుంది. మీరు నిద్రపోయే ముందు మీ దిండుపై కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ను చల్లడం వల్ల, బాగా నిద్రించడానికి, విశ్రాంతిని పొందటానికి ఇది సహాయపడుతుంది. అలానే మీరు ఎక్కువగా పడుకోవడం వల్ల వచ్చిన తలనొప్పిని నివారించడం కోసం, కొన్ని లావెండర్ ఆయిల్ చుక్కలను ఒక బట్ట మీద వేసి, దాని వాసనను బాగా పీల్చండి.

9. ఆక్యుప్రెషర్ :

9. ఆక్యుప్రెషర్ :

ఆక్యుప్రెషర్ అనేది తలనొప్పి నుంచి మీకు ఉపశమనాన్ని కలుగజేసేదని ప్రత్యేకంగా చెప్పబడింది. ఎందుకంటే ఇది కణత, నుదురు, మెడ, పాదాలు, చేతులు వంటి ఇతర శరీర ప్రాంతాల పాయింట్లను ఆక్యుప్రెషర్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఆక్యుప్రెషర్ ఇతర నొప్పుల నుంచి మీకు త్వరగా ఉపశమనాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే ఒత్తిడిని కలిగి ఉండే ప్రాంతాలపై ప్రభావితంగా పనిచేస్తూ, ఆ ప్రాంతంలో ఉన్న ఒత్తిడిని పూర్తిగా నయం చేస్తుంది.

10. పవర్-నాప్ :

10. పవర్-నాప్ :

10 - 20 నిముషాల వరకూ కునుకు తీయడం వల్ల మీలో చురుకుదనమును పెంచి, మిమ్మల్ని మరింత శక్తివంతులుగా చేస్తుంది, దీనినే సాధారణంగా "పవర్-నాప్" అని పిలుస్తారు. ఒకవేళ మీరు 30 నిముషాల నెమ్మని నిద్రావస్థ నుంచి హఠాత్తుగా మేల్కొనేటప్పుడు మీకు జడత్వం (మత్తు ఆవహించడం) సంభవిస్తుంది. దాని వల్ల మీరు ఏపని చెయ్యడానికి సిద్ధంగా ఉండలేరు. కాబట్టి మేము చెప్పేదేమిటంటే మీరు "పవర్-నాప్ను" ఆచరించడం చాలా మంచిది.

English summary

How To Avoid Headache After A Nap

Sleep is important and necessary for the body and we are sure everyone is aware of that. But have you ever felt a headache after taking a nap? Some people take a nap to make up for the lost sleep. This makes their body feel relaxed and charged up when they wake up.