స్త్రీలలో ఛాతీ పరిమాణం పెంచేందుకు ఉపయోగపడే సహజమైన గృహవైద్య పదార్థాలు

Subscribe to Boldsky

తీరైన వక్షసంపద తప్పక తమ గర్వకారణమని ప్రతి స్త్రీ అనుకుంటుంది. ఎటువంటి దేహతీరు ఉన్నవారికైనా గుండ్రని, బిగుతైన వక్షోజాలు ఆకర్షణను చేకూరుస్తాయి. కనుకనే చాలామంది మహిళలు తమకు నిండైన స్తనాలు కావాలని కోరుకుంటారు. ఈ వ్యాసంలో మీ వక్షోజాల పరిమాణాన్ని ఇంట్లోనే సహజ పద్ధతులలో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం!

వక్షోజాల పరిమాణం మరియు ఆకారం ఒక స్త్రీ నుండి మరో స్త్రీకి మారుతుంటాయి. బరువు, జన్యుపరమైన అంశాలు మరియు హార్మోన్లు వక్షోజాల పరిమాణం మరియు ఆకారంను నిర్దేశిస్తాయి.

స్త్రీలలో ఛాతీ పరిమాణం పెంచేందుకు ఉపయోగపడే సహజమైన గృహవైద్య పదార్థాలు

వక్షోజాలలో ముఖ్యంగా కొవ్వు కణజాలం ఉండటం వలన ఒక స్త్రీ బరువు పెరిగినా లేదా కోల్పోయినా వాటి పరిమాణంలో మార్పు వస్తుంది. వక్షోజాల పరిమాణం మరియు ఆకారం ఆ స్త్రీకి తన పెద్దల నుండి సంక్రమించిన జన్యులక్షణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.హార్మోన్ల స్థాయిలు కూడా వక్షోజ పరిమాణంలో ముఖ్య భూమిక వహిస్తాయి. స్త్రీ దేహంలో హార్మోన్ల అసమతుల్యత తలెత్తితే ఛాతీ ఎదుగుదల సరిగ్గా జరగదు.

సహజంగానే వక్షోజాలు చాలా దృఢంగా, బిగుతుగా, అందంగా కనిపించాలంటే కొన్ని గృహ చిట్కాలు పాటిస్తే తప్పక ఫలితముంటుంది. అవేంటో చూద్దామా మరి!

1. సోయా పాలు:

1. సోయా పాలు:

సోయాపాలలో ఉండే ఐసోఫ్లావోనులు, మన శరీరంలోని వక్ష పరిమాణాన్ని పెంచడానికి తోడ్పడే ఈస్ట్రోజన్ హార్మోనును పోలి ఉంటాయి. సోయా గింజలనుండి వెలికితీసే సోయాపాలు వక్షోజాలు బిగుతును సంతరించుకునేట్టు చేస్తాయి.

ఒక గ్లాసు సోయాపాలు మరిగించి ప్రతిదినం ఉదయాన్నే తీసుకోవాలి. సోయా గింజలను కూడా తినవచ్చు. వీటిని మీ కూరలు లేదా సలాడ్లతో కలిపి తీసుకోవచ్చు.

2. ఎండు ఫలాలు మరియు గింజలు:

2. ఎండు ఫలాలు మరియు గింజలు:

జీడిపప్పు, వాల్ నట్లు, వేరుశనగ గింజలు మరియు పెకాన్ నట్లు మీ వక్షోజ పరిమాణాన్ని పెంచుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు మరియు అత్యవసర విటమిన్లు ఉంటాయి. అదే సమయంలో ఇవి గుండెకు మరియు మెదడుకు చురుకుదనం అందిస్తాయి. వీటిని చిరుతిళ్ళగా లేదా సలాడ్లుగా తీసుకొని వాటి ద్వారా మేలుపొందండి.

పగటిపూట మీకు ఆకలి అనిపించినప్పుడు ఒక గుప్పెడు ఎండుఫలాలను తినండి. జీడిపప్పు మరియు వాల్ నట్లును మీ ఆహారప్రణాళికలో భాగం చేసుకోండి. వీటితో మిరియాలు కలిపి ఒక మూడు నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోండి.

3. పాలు:

3. పాలు:

డైరీ ఉత్పత్తులు వక్షోజ పరిమాణాన్ని పెంచదానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో మానవ శరీరంలో ఉండే ప్రత్యుత్పత్తి హార్మోన్లను పోలిన హార్మోన్లుంటాయి. అదెలా అంటే, ఆవుపాలలో ఈస్ట్రోజన్, ప్రోలాక్టిన్ మరియు ప్రొజెస్టిరాన్ వంటి క్షీరదాలలో చనుబాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లు ఉంటాయి.

ప్రతిదినం కొద్దిగా మరిగించిన పాలను ఒక గ్లాసుడు ఉదయాన్నే మరియు ఒక గ్లాసుడు సాయంత్రం తీసుకోవాలి.

4. బొప్పాయి:

4. బొప్పాయి:

వక్షోజ పరిమాణ పెరుగుదలను ప్రోత్సహించే ఇంకొక పదార్ధం బొప్పాయి. ప్పాలు కారుతున్న బొప్పాయి అయితే మరీంత లాభదాయకం. పచ్చి బొప్పాయి లో ఉండే ఎంజైములు బబుల్ గంలు మరియు ఇతర ఆహార సంబంధిత పదార్ధాలు తయారీలో వినియోగిస్తారు. దీనిలో మెండుగా యాంటీఆక్సిడెంట్లు అయిన కేరోటీన్లు, ఫ్లావనాయిడ్లు, విటమిన్ సి మరియు విటమిన్ బి (ఫోలేట్, పాంటోథెనిక్ ఆమ్లం) ఉంటాయి. బొప్పాయిలో అధిక మోతాదులో పీచుపదార్థాలు మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

సగం పండిన పచ్చి బొప్పాయిని ఆహారం తీసుకున్నాక తినాలి.

5. సముద్ర ఆహారం:

5. సముద్ర ఆహారం:

ఇందులో పీతలు, రొయ్యలు, చేపలు, అయిస్టర్లు, సముద్రపు నాచువంటి సమృద్ధిగా మాంగనీస్ తో నిండి ఉన్న పదార్థాలు అనేకం ఉన్నాయి. ఇవి సెక్స్ హార్మోన్ల స్థాయిని పెంచి వక్షోజ కణజాలంను విస్తరించేట్టు చేస్తాయి. ప్రతిరోజూ వీటిని తింటే ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందవచ్చు. చేపలను కొద్దిగా నూనెతో మిరియాలు ఉపయోగించి కాల్చి లేదా బాగా వేపుకుని వారానికి కనీసం మూడు సార్లు తినాలి. వక్షోజ సంపదను గృహవైద్యం ద్వారా కాపాడుకునేందుకు ఉపయోగపడే కొన్ని ఇతర సహజసిధ్ధమైన పదార్ధాలు:

1. మెంతి నూనె/ క్యాప్సిల్:

1. మెంతి నూనె/ క్యాప్సిల్:

మెంతి నూనె మీ వక్షోజ పరిమాణ పెరుగుదలకు ఎలా తోడ్పడుతుందో తెలుసా? మెంతులతో ఉండే వృక్ష సంబంధిత ఈస్ట్రోజన్, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల స్థాయిని పెంచుతుంది. తద్వారా వక్షోజ పరిమాణం పెరుగుతుంది. సాధారణంగా మెంతులను వక్షోజ పరిమాణ పెరుగుదలకు క్యాప్సిల్ లేదా స్తనాలను మసాజ్ చేయడానికి అవసరమైన నూనె రూపంలో వాడతారు.

2. నిమ్మగడ్డి నూనె:

2. నిమ్మగడ్డి నూనె:

నిమ్మగడ్డలో నీరాల్ అనే మోనోటర్పైన్ నూనె ఉంటుంది. ఇది మన శరీరంలో ఈస్ట్రోజన్ క్రియకలాపాన్నిను అధిక స్థాయికి తీసుకునివెళ్తుంది. అప్పుడు నిండైన స్తనాలు ఏర్పడతాయి.

10-12చుక్కల నిమ్మగడ్డి నూనెను 30 మి. లీ. కొబ్బరినూనె లేదా ఆలీవ్ ఆయిల్ లో కలిపి 5-10 నిమిషాల పాటు వక్షోజాలను మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా ప్రతి ఉదయం, సాయంత్రం చేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Increase Breast Size Naturally At Home

    The breasts are considered to be one of the greatest assets of women. Supple and firm breasts can make all body shapes a lot more attractive. That is one of the main reasons why a majority of women want to attain fuller breasts. In this article, you will get to know how to increase breast size naturally at home.
    Story first published: Saturday, April 21, 2018, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more