For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీటిని తరచుగా తాగడం ఇష్టం లేదా? అయితే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఈ ప్రత్యామ్నాయాలు అనుసరించండి.

|

మీ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడం మూలంగా, శరీరంలోని విషతుల్య పదార్ధాలను తొలగించడంతో పాటు, మేలిమి ఛాయతో చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మరియు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణ, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధకవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తలనొప్పిని సైతం నిరోధిస్తుంది. అయితే, నీటిని నేరుగా త్రాగడానికి, కొంతమంది విముఖతను ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకించి చిన్నపిల్లలలో ఈస్వభావాన్ని గమనిస్తుంటాం కూడా. ఈ వ్యాసంలో, మంచినీటిని తరచుగా తీసుకోవడానికి ఇష్టపడని వారికి సూచించదగిన ప్రత్యామ్నాయాల గురించిన వివరాలను అందివ్వడం జరుగుతుంది.

స్టిర్లింగ్, లౌబరౌ మరియు బాంగోర్ విశ్వవిద్యాలయాలలోని శాస్త్రవేత్తలు నీటికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగిన పానీయాలు గురించిన వివరాలను వెల్లడించారు.

మూత్రవిసర్జన మరియు ద్రవసంతులనం మీద చూపే ప్రభావాల దృష్ట్యా, సాధారణంగా వినియోగించే 13రకాల పానీయాలపై పరిశోధనా విచారణ జరిగింది. క్రమంగా నీరు కన్నా ఎక్కువ సమయం, శరీరంలో అనేక ఇతర ద్రవాలు నిల్వ ఉంచబడ్డాయని కనుగొన్నారు. ఈ ద్రవాలు వరుసగా, స్టిల్ వాటర్, ఫిజ్జీ వాటర్(బుడగలు కలిగిన సోడా వంటి), స్కిమ్డ్ మిల్క్, పాలు, కోలా, డైట్-కోలా, వేడి మరియు చల్లని టీ, నారింజ రసం, లాగర్, కాఫీ, స్పోర్ట్స్ డ్రింక్స్(ఎలెక్ట్రోలైట్ వంటి ద్రావణం) మరియు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్(ORS).

బాంగర్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ నీల్ వాల్ష్ ప్రకారం, టీ మరియు కాఫీ వంటి ద్రవాలు సాధారణ మొత్తాలలో తీసుకున్నప్పుడు తాగునీటితో పోల్చినప్పుడు అదనపు ద్రవ నష్టాన్ని ప్రేరేపించవని తేలింది.

కాబట్టి, తరచుగా వాటర్ బాటిల్ మీతో తీసుకుని వెళ్ళే అలవాటులేని ఎడల, డీహైడ్రేషన్ స్థాయిలు పెరుగకుండా, మీ ఆహార ప్రణాళికలో ఈ కొత్త ఆహారాలు మరియు ద్రవాలను చేర్చవచ్చు.

1. రకరకాల రంగుల పండ్లు మరియు కూరగాయలు :

1. రకరకాల రంగుల పండ్లు మరియు కూరగాయలు :

ప్రతి భోజనంలోనూ, మీ ప్లేట్లో సగభాగం పండ్లు మరియు కూరగాయలతో నిండి ఉండేలా చూసుకోండి. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్ ప్రకారం, అత్యధిక నీటివనరులతో ఉన్న కూరగాయలు మరియు పండ్లుగా సెలెరీ, టమోటాలు, నారింజ మరియు పుచ్చకాయ ఉన్నాయి. ఈ పండ్లు నీరు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో మీ శరీరాన్ని హైడ్రేషన్ పెంచడంలో సహాయం చేస్తాయి.

2. వోట్మీల్ :

2. వోట్మీల్ :

వోట్మీల్ అద్భుతమైన అల్పాహారంగా చెప్పబడుతుంది. మరియు నీటి వలెనే, ఓట్మీల్ కూడా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తుందని చెప్పబడింది. ఎందుకో మీకు తెలుసా ? ఓట్స్, కాచిన పాలు లేదా నీటిలో చేరినప్పుడు విస్తరించడం జరుగుతుంది. క్రమంగా క్రీమీ వోట్మీల్, ఒక హైడ్రేటింగ్ ఆహారంగా మారుతుంది. మరియు పుచ్చకాయ, నారింజ వంటి తాజా పండ్లను జోడించడం ద్వారా నీటికన్నాఅద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని చెప్పబడింది.

3. ఆరోగ్యకరమైన స్నాక్స్ :

3. ఆరోగ్యకరమైన స్నాక్స్ :

చిప్స్, ప్రేట్జెల్ మరియు క్రాకర్స్ వంటి అధిక కార్బోహైడ్రేట్ స్నాక్లను నివారించండి, అవి అత్యంత తక్కువ నీటినిల్వలను కలిగి ఉంటాయి మరియు అలవాటుగా మారడం మూలంగా, మీ శరీరాన్ని హైడ్రేట్ చేసే ఆహారాలను సైతం నెమ్మదిగా దూరం చేస్తాయి. కాబట్టి, మీ స్నాక్స్ ఎక్కువగా నీటితో నిండి ఉండేలా, ఇంట్లో తయారు చేసిన స్మూతీస్, మరియు తాజా పండ్లు, యోగర్ట్ వంటివి ఎంచుకోండి.

Most Read:నేను బాగా వాడుకున్న గర్ల్ ఫ్రెండ్ ను ఎవరైనా కొంటారా? పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఆసక్తి ఉంటేచెప్పండిMost Read:నేను బాగా వాడుకున్న గర్ల్ ఫ్రెండ్ ను ఎవరైనా కొంటారా? పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఆసక్తి ఉంటేచెప్పండి

4. రుచికరమైన పానీయాలు :

4. రుచికరమైన పానీయాలు :

తరచుగా నీటిని తీసుకోవడం, కాస్త బోరింగ్ ఫీల్ ఇస్తుంది. ఎటువంటి రుచి ఉండదు కాబట్టి. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి మీదకు మనసు వెళ్ళదు కూడా. కావున నీటికి కొంచం అదనపు పదార్ధాలను జోడించి తీసుకోవడం ద్వారా బోరింగ్ ఫీల్ లేకుండా, సరైన మోతాదులో శరీరానికి నీటిని అందించవచ్చు. ఐస్-టీ, లెమన్-టీ, చామంతి-టీ, గ్రీన్-టీ, హెర్బల్-టీ వంటి తేనీటి రకాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా తేనె, నిమ్మరసం జోడించి నీటిని తీసుకోవడం, లేదా పండ్ల రసాలను తీసుకోవడం కూడా చేయవచ్చు. ఫ్లేవర్డ్ పానీయాలు సులభంగా ఇష్టంతో స్వీకరించేలా ఉంటాయి. క్రమంగా నీటి మోతాదులకన్నా అదనంగా తీసుకునేలా ప్రేరణను ఇవ్వగలవు. అలాగని కూల్డ్రింక్స్, రసాయనాలు, ఆల్కహాల్ కలిపిన పానీయాల జోలికి వెళ్ళకండి. అవి లాభాన్ని కలిగించకపోగా తీవ్రనష్టాన్ని చవిచూపిస్తాయి.

5. పండ్లు మరియు కూరగాయల రసాలు :

5. పండ్లు మరియు కూరగాయల రసాలు :

పండ్లు మరియు కూరగాయల రసాలలో నీటి శాతం 85 నుంచి 100 శాతం వరకు ఉంటుంది. పండ్లలోని చక్కెర పదార్థాలు శరీరంలో ఆర్ద్రీకరణను తగ్గించగలవు, తద్వారా తీపిని తగ్గించటానికి పండ్లరసాలకు కొంత నీటిని జోడించడం జరుగుతుంది. మీరు పండ్లలోని చక్కెరల విషయంలో శ్రద్ధను కలిగి ఉన్న ఎడల, నిమ్మరసం, మరియు టార్ట్ చెర్రీ రసం వంటివి సూచించబడుతాయి.

Most Read: మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి వినియోగంMost Read: మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి వినియోగం

6. ఉడకబెట్టిన బ్రోథ్ ఆధారిత సూప్స్ :

6. ఉడకబెట్టిన బ్రోథ్ ఆధారిత సూప్స్ :

ఉడకబెట్టిన బ్రోథ్ ఆధారిత సూప్లు, కేవలం కూరగాయలు, మరియు చికెన్ వంటి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఈ సూప్లు ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని డీహైడ్రేట్ గురికాకుండా చూడడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జ్వరం లేదా వాంతుల సమస్యలను కలిగి ఉన్నప్పుడు పరిస్తితులను అనుసరించి వైద్యులు అధికంగా ఉడకబెట్టిన బ్రోథ్-ఆధారిత సూప్స్ తీసుకోమని సూచిస్తుంటారు కూడా. ఉదాహరణకు బోన్ బ్రోథ్.

7. ఫ్రోజన్ డెజర్ట్స్ :

7. ఫ్రోజన్ డెజర్ట్స్ :

ఫ్రోజన్ డెసెర్ట్లను, ద్రవాలు లేదా పానీయాలను శీతలీకరించి ఘనీభవించడం ద్వారా తయారుచేయడం జరుగుతుంది. కేవలం ఫ్రోజన్ డెసెర్ట్లను మాత్రమే కాకుండా, సెమీ ఫ్రోజన్ డెసెర్ట్లను కూడా తీసుకోవచ్చు. కానీ వీటిని ఎంచుకునేటప్పుడు, మీ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. అదనపు ఫ్లేవర్లను జోడించిన నీరు, పాలు మరియు క్రీమ్, ఫ్రూట్ ప్యూరీస్, కస్టర్డ్ మొదలైనవి ఉదాహరణలుగా ఉంటాయి. ఈ డెజర్ట్స్ మీ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, మీ శరీరం డీహైడ్రేట్ గురికాకుండా కాపాడుతాయి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read:మొబైల్ రాకముందు ప్రపంచమే వేరు, సెల్ వచ్చాక సెక్స్ కూడా చేయడం లేదు, మరి ఇంత దారుణమా? Most Read:మొబైల్ రాకముందు ప్రపంచమే వేరు, సెల్ వచ్చాక సెక్స్ కూడా చేయడం లేదు, మరి ఇంత దారుణమా?

English summary

How To Stay Hydrated Without Drinking Water

Hydrating your body is very important as it flushes out toxins, improves complexion, promotes healthy weight management, increases brain power, boosts the immune system, prevents headaches and so on. If you are simply bored of drinking plain water here're other options you could try like broth-based soups, frozen desserts,
Story first published: Saturday, October 13, 2018, 16:00 [IST]