For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీర్ణ సమస్యల నివారణకు గృహవైద్య చిట్కాలలో లవంగాలను ఎలా ఉపయోగించుకోవాలి?

|

మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ఏమి చేస్తారు? ఒక చూయింగ్ గమ్ నమలుతారు లేదా నోటిలో ఒక లవంగం వేసుకుంటారు, కదా! లవంగాలు మీ నోటి దుర్వాసనను తొలగించడమే కాక, మీ జీర్ణ మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాక, పంటి నొప్పి నుండి కూడా ఉపశమనం ఇస్తుందని మీకు తెలుసా? ఈ వ్యాసం ద్వారా, లవంగాలు మన జీర్ణప్రక్రియకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తాయో తెలియజేస్తున్నాము.

సాధారణంగా, లవంగాలను మసాలా ఆహారాలలో తేలికపాటి రుచిని చేర్చటానికి ఉపయోగిస్తారు, కానీ వీటికి అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయని తెలుసా!

లవంగాలలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటిస్పోస్మోడిక్ మరియు ఎనస్థేటిక్ లక్షణాలు, జీర్ణవ్యవస్థలో కలిగే నొప్పులు నుండి ఉపశమనం కలుగజేస్తాయి. లవంగాలు జీర్ణాశయ వ్యవస్థలో తలెత్తే సమస్యలు పరిష్కరించడానికి సహజమైన గృహ నివారణగా పనిచేస్తాయి. ఎందుకంటే అవి జీర్ణవ్యవస్థలో తలెత్తే నొప్పిని, వాపును తగ్గించడం, మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడడం వంటి ప్రయోజనాలు కలిగిస్తాయి.

లవంగ నూనె, లవంగ టీ లేదా కషాయాలను ఉపయోగించడం వలన వాంతులు, అపానవాయువు మరియు ఉదర అనారోగ్యం వలన కలిగే వికారం వంటివి నివారణ చేయబడతాయి. ఇవన్నీ లవంగాలలో ఉండే యూజనాల్ అనే సమ్మేళనం కారణంగా జరుగుతాయి .

యూజనాల్ యొక్క లక్షణాలు:

లవంగాలలోని సుగంధ పరిమళంకు యూజనాల్ దోహదపడుతుంది. ఇది అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ గా పనిచేసి కణాలలో వృద్ధాప్యం సంకేతాలను మరియు గుండెల్లో మంటను తగ్గిస్తుంది. యూజనాల్ ఒక గాఢమైన పసుపు రంగు ద్రవం. ఇది బాసిల్, బిర్యానీ ఆకులు, పసుపు, మరియు దాల్చిన చెక్క వంటి ఇతర సుగంధ ద్రవ్యాలలో కూడా ఉంటుంది.

యూజనాల్ యొక్క ముఖ్య లక్షణాలు: అనస్థీషియా, యాంటాసిడ్, యాంటీ ఎండెమిక్, యాంటీఆక్సిడెంట్, యాంటివైరల్, యాంటిసెప్టిక్ మరియు గాస్ట్రోప్రొటెక్టివ్ మరియు గ్యాస్ట్రో-రీజెనరేటివ్ లక్షణాలని యూజనాల్ కలిగి ఉంటుంది.

మీ జీర్ణాశయాన్ని మెరుగుపర్చుకోడానికి గృహవైద్య చిట్కాలలో లవంగాలను ఎలా ఉపయోగించుకోవాలి.

జీర్ణక్రియను మెరుగుపరిచుకోవడానికి లవంగాలను అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ, దానిని ఎలా వినియోగించుకోవాలనేది, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత రుచి మరియు వారి సుగంధ సహన స్థాయిపై ఆధారపడి ఉంటుంది.

మీ జీర్ణక్రియకు ఉపకరించే లవంగాలతో తయారు చేసిన సహజ నివారణల సమాచారం మీ కోసం.

1. లవంగ టీ

1. లవంగ టీ

క్లోవ్ టీ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది మరియు జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేయడానికి తగిన జారే గుణాన్ని ఇస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది మరియు నోటిదుర్వాసనతో (హాలిటోసిస్) పోరాడుతుంది.

నోటిదుర్వాసనకు అత్యంత సాధారణమైన కారణం జీర్ణ వ్యవస్థలోని సమస్యలే! లవంగ టీ నేరుగా మన జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాపై దాడి చేసి సమర్ధవంతంగా జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా, మీ లవంగ టీ యొక్క సుగంధం, మీ నోటిలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడి, మీ నోటిదుర్వాసనను పోగొడుతుంది.

లవంగ టీ తయారు చేయడం ఎలా?: ముందుగా, లవంగాలను కొద్దిగా దంచి, ఒక కప్పు బాగా మరిగిన వేడి నీటీలో కలపండి. ప్రతిరోజూ ఉదయం మరియు రాత్రి ఈ టీని త్రాగాలి.

2. లవంగ తైలం:

2. లవంగ తైలం:

ఒక సీసాలో ఆలివ్ నూనె తీసుకుని, దానికి లవంగాలు కలపి, కొన్ని వారాల పాటు కదపకుండా ఉంచడం ద్వారా, లవంగ తైలం తయారు చేసుకోవచ్చు. మీరు వికారం మరియు వాంతులతో బాధపడుతున్నట్లయితే, మీరు ఒక గ్లాసుడు నీటిలో 3 చుక్కల లవంగ తైలం కలిపి తాగవచ్చు.

3. లవంగాలు

3. లవంగాలు

లవంగాలను నమలడం వలన, జీర్ణక్రియ కోసం అవసరమైన ద్రవాలు మరియు లాలాజల ఉత్పత్తి పెరుగుతాయి. మీరు కనుక వాటి రుచిని ఇష్టపడకపోతే, మీ భోజనం లేదా మీ మిఠాయిలలో కలిపి వాడండి.

4. లవంగ కషాయం:

4. లవంగ కషాయం:

లవంగ కషాయం జీర్ణప్రక్రియను ప్రేరేపిస్తుంది మరియు మలబద్దకంతో పోరాడుతుంది. దీనిని కూడా లవంగ టీ వలె తయారు చేస్తారు కానీ దంచకుండా లవంగాలను యధాతథంగా నీటిలో వేసి మరిగిస్తారు.

లవంగాలను అధిక మోతాదులో వినియోగించినప్పుడు కలిగే దుష్ప్రభావాలు:

లవంగాలను అధిక మోతాదులో వినియోగించినప్పుడు కలిగే దుష్ప్రభావాలు:

నోటి ద్వారా తీసుకున్న లవంగాలు సాధారణంగా సురక్షితమే! చర్మానికి రాసుకోవడానికి కూడా లవంగ నూనె కూడా సురక్షితమే! కాని తరచుగా లవంగ నూనెను, చిగుళ్ళలో లేదా నోటిలో ఉపయోగించకూడదు. ఇది చిగుళ్ళు, చర్మం, పంటికి మరియు శ్లేష్మ పొరలకు హాని కలిగించవచ్చు.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వారి ప్రకారం, అధిక మోతాదులో లవంగాలు తీసుకున్నట్లయితే, తీవ్ర అలెర్జీ ప్రతిచర్యలు మరియు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. మూత్రపిండాల లేదా కాలేయ రుగ్మతలతో బాధపడుతున్నవారు లేదా మూర్ఛ కలిగి ఉన్నవారు లవంగాలు తినడాన్ని నివారించాలి

English summary

How To Use Cloves For Digestion & Stomach-related Problems

Natural home remedies that include cloves are good for the digestive system because they alleviate pain, swelling and fight infection, among other things. The aroma of cloves comes from the compound called eugenol which is considered good for treating digestive problems, toothaches and respiratory infections.