For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో మిమ్మల్ని వడదెబ్బకు గురికాకుండా చూసే ఆహారపదార్ధాలు

వేసవిలో మిమ్మల్ని వడదెబ్బకు గురికాకుండా చూసే ఆహారపదార్ధాలు

|

ఇది మండే వేసవి కాలం.

చల్లని శీతాకాలవేళ ముగిసినంతనే , మన ముందుకు వేనవేల కాంతిరేఖలతో వేసవి మన ముంగిట పరచుకుంటుంది. వేసవిలో నడినెత్తిన ప్రకాశించే సూర్యుని సాక్షిగా , పిల్లల పాఠశాలలకు సెలవుల సందర్భంగా, సొంత ఊర్లకు పయనమయ్యే హడావిడి కూడా మొదలవుతుంది.

వేసవి అంటేనే సాయంకాల సముద్రతీర విహారాలు, కొలనులలో ఈతపోటీలు, ప్రయాణాలు, పెళ్లి పేరంటాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. వీటితో పాటు వేసవి చాలా సమస్యలను కూడా మోసుకుని వస్తుంది. పరిపూర్ణమైన వేసవి విహారానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చే టీవీ కార్యక్రమాలలో కూడా, వేసవితో ముడిపడిఉన్న సాధకబాధకాల గురించి ఇసుమంతైనా సమాచారమివ్వరు.

Include These 9 Foods In Your Diet To Protect Yourself From Sunburn

అన్నిటికన్నా, విస్మయకరమైన విషయం ఏమిటంటే, ఆనందోత్సాహాలతో నిండి ఉండాల్సిన ఈ రుతువుని వడదెబ్బ నిరుత్సాహపరుస్తుంది. మనలో చాలా మంది ఆ సూర్యుడు నిర్దయగా అల్ప మానవులపై ప్రసరింపచేసే వాడివేడి కిరణాల ధాటి నుండి తప్పించుకోవడానికి సన్ స్క్రీన్ క్రీంలు వాడతారు.

ఈ అలవాటును కొనసాగిస్తూనే, మన శరీరాన్ని లోపలనుండి చల్లబరచడమే కాకుండా, మన చర్మం ఎండ ప్రభావం వలన కమిలిపోకుండా కాపాడే కొన్ని ఆహార పదార్ధాలను మన దైనందిన ఆహార ప్రణాళికలో చేర్చుకోవాలి. అటువంటి ఆహార పదార్ధాల గురించి విపులంగా మీ కోసం వివరించబోతున్నాం, చదవండి!

1. గ్రీన్ టీ:

1. గ్రీన్ టీ:

మనలో చాలామందికి గ్రీన్ టీ బరువును తగ్గించడంలో అద్భుతమైన పనితనాన్ని కనబరుస్తుందని తెలుసు! అంతేకాక ఇది మన చర్మాన్ని సూర్యుని అతినీలలోహిత కిరణాల బారి నుండి సంరక్షించే అతి ముఖ్యమైన ఆహారపదార్ధం. గ్రీన్ టీలో ECGలు గా పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు మరియు టానిన్లుగా పిలువబడే వృక్ష సంబంధిత ఫీనాల్స్ ఉంటాయి. దీనిలో అసంఖ్యాకమైన ఆహార ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి, సూర్యుని అతినీలలోహిత కిరణాల ప్రభావానికి లోనైన చర్మ కణాలను తీవ్రమైన నష్టానికి గురికాకుండా ఆపడం.

2. టొమాటోలు:

2. టొమాటోలు:

టొమాటోలలో అద్భుతమైన మరియు ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్, లైకోపీన్ ఉంటుంది. విటమిన్ సి తో పాటు లైకోపీన్ టొమాటోలకు ఎర్రని రంగును ఇవ్వడమే కాకుండా మన చర్మానికి మరియు శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. అంతేకాకుండా ఇది మన చర్మం లోనికి అతినీలలోహిత కిరణాలు చొచ్చుకొని పోకుండా ఉండేట్టు చేసి ,చర్మ కణజాలాన్ని సురక్షితంగా కాపాడుతుంది.

౩. చాక్లెట్లు:

౩. చాక్లెట్లు:

మన నాలుకపై రుచిమోగ్గలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆహారం చాక్లెట్లు. ఒక పరిశోధన ప్రకారం, కోకో బీన్స్ లో మెండుగా ఉండే ఫ్లావానాయిడ్లు మన చర్మాన్ని కఠినమైన సూర్య కిరణాల ధాటి నుండి కాపాడతాయి. అయితే ఈ ఫ్లావానాయిడ్లు కేవలం డార్క్ చాక్లెట్లలో మాత్రమే ఉంటాయి. ఒక చాక్లెట్ యొక్క నాణ్యత దానిలో ఉండే కోకో పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. కోకో అధికంగా ఉంటె, సహజంగానే దానిలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి అధికంగా ఉంటుంది.

4. పచ్చని ఆకుకూరలు:

4. పచ్చని ఆకుకూరలు:

ఈ ఆకుకూరలలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపించే సూర్యుని కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడతాయి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలు, ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగు కలిగి ఉన్నవి మన చర్మాన్ని ఎండా బారి నుండి సంరక్షిస్తాయి.

5. ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్:

5. ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్:

ఒమేగా ౩ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండే చేప నూనె, లెట్యూస్ మరియు చియా సీడ్స్ ,చర్మ ఆరోగ్యానికి మెరుగుపరచి, మొటిమలతో పోరాడి, చర్మాన్ని బిగుతుగా మార్చి మెరుపునందిస్తుంది.

ఈ లక్షణాలతో పాటు వీటికి చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడి, చర్మ కాన్సర్ రానీయకుండా, ఎండలకు కమలకుండా మరియు ఫ్రీ రాడికల్స్ వలన చర్మానికి నష్టం కలుగకుండా కాపాడే గుణం ఉంది.

6. దోసకాయలు:

6. దోసకాయలు:

దోసకాయలు మన శరీరానికి అవసరమైన నీటిని అందజేయడమే కాకుండా చర్మాన్ని చల్లబరచి, మండుటెండలలో కూడా దేహ తాపం పెరగకుండా చూస్తాయి. అంతేకాకుండా, దోసకాయలలో ఉండే టానిన్లు, విటమిన్ సి, ఫ్లావనాయిడ్లు మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సూర్యుని విధ్వంసకర కిరణాల నుండి చర్మాన్ని సంరక్షిస్తాయి.

7. పుచ్చకాయలు:

7. పుచ్చకాయలు:

అధిక నీటి శాతం కలిగి మన శరీరానికి అవసరమైన నీటిని అందజేసే ఫలాలలో పుచ్చకాయ ముఖ్యమైనది. నీరుని నిలవచేసుకోవడమే కాక, తీయగా రసాలతో నిండి ఉంటుంది కనుక, వేసవిలో దీనిని తినడం తప్పనిసరి. అంతేకాక దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండటం వలన మన శరీరాన్ని అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది.

8. క్యారట్లు:

8. క్యారట్లు:

క్యారట్లు విటమిన్ ఏ నిచ్చే అద్భుతమైన ఆహారపదార్ధం. ఇవి కళ్ళకు మేలు చేస్తాయి. వీటిలోని బీటా కేరొటీన్ మన శరీరంలో ప్రవేశించినంతనే, విటమిన్ ఏ గా పరివర్తన చెందుతుంది. ఈ విషయం పై చేసిన పరిశోధనలలో ఎండవలన చర్మం కందిపోవడం, బీటా కేరొటీన్ సేవించడం వలన తగ్గుతుందని తెలియవస్తుంది.

English summary

Include These 9 Foods In Your Diet To Protect Yourself From Sunburn

Sunburn tags along with the summer season. Though people apply sunscreen to protect their skin from sunburn, including these 9 foods in your diet can help you protect your skin naturally: green tea, tomatoes, strawberries, chocolates, green leafy veggies, cucumber, watermelon, carrots and foods rich in omega-3 like fish oil, chia seeds and lettuce.
Story first published:Wednesday, May 9, 2018, 12:23 [IST]
Desktop Bottom Promotion