For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నిలబడి నీళ్ళు తాగడం మంచిదేనా?

  |

  మానవులు ఈ భూమిపై ఉన్నంత కాలం, మనుగడ కోసం నీరు ఒక అంతర్గతoగా అవసరమైన వనరుగా ఉంది. ఇది దాదాపు ఎటువంటి పరిస్థితుల్లోనూ హానిచేయదని అందరికీ తెలిసిన విషయమే. మన శరీరం 75% నీటితో తయారు చేయబడింది. వాస్తవానికి, నిపుణులు రోజుకు కనీసం 8గ్లాసుల నీటిని తాగవలసినదిగా సిఫార్సు చేస్తారు. నీరు మన శరీరం యొక్క విధులను చక్కగా నిర్వహించుటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  ఎంత గొప్ప పానీయాలు మార్కెట్లో దొరుకుతున్నా, నీళ్ళను మించిన పానీయం మరొకటి లేదు అవునా? ఒకవేళ తప్పుడు పద్దతిలో నీళ్ళను సేవిస్తే ఏమవుతుంది? ముఖ్యంగా నిలబడి నీళ్ళు తాగడం వలన ఏమన్నా సమస్యలు వస్తాయా? అనేక అధ్యయనాల ప్రకారం సమస్యలు నిజమనే తేలింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  Is It OK To Drink Water While Standing?

  పరిగెత్తి పాలు తాగడం కన్నా, నిలబడి నీళ్ళు తాగడం మేలు అని సామెత. కానీ ఆ సామెత చెప్పిన పెద్దలే నిలబడి నీళ్ళు తాగడం శరీరానికి అంత మంచిది కాదు అని కూడా చెప్తుంటారు. కానీ సహజంగానే మనం తేలిగ్గా తీసుకుంటాము, అదేమీ అంత పెద్ద విషయం కానట్లు. మామూలు నీళ్ళకు కూడా సమస్యలు వస్తాయా? అన్న తేలికభావం అనేకులది.

  అయితే సైన్స్ పరంగా, మన తాత ముత్తాతలు ఆ సమయాల్లోనే చెప్పిన వివరాల ప్రకారం, నిలబడి నీళ్ళు తాగడం మూలాన, ఆయిసోఫగస్(అన్నవాహిక) అనే కడుపుతో కలిపే ఒక కండరానికి జత చేయబడి ఉన్న స్పింక్టర్ గాయానికి గురవుతూ ఉంటుంది. అది సడలించుకునేలోపు మరలా గాయానికి గురవడం మూలంగా, గాస్ట్రో ఎసోఫగీల్ రిఫ్లక్స్ డిసీజ్(జి.ఈ.ఆర్.డి) అనే సమస్య ఉత్పన్నమవుతుంటుంది. ఈ పరిస్థితికి కారణం కూడా వైద్యుని సమీక్షించిన తర్వాతనే అవగాహన వస్తుంటుంది, తద్వారా అనేకులకు ఈ సమస్యకు కారణం తెలీక కష్టాలు అనుభవించవలసిన స్థితి. అదొక్కటే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అవేమిటో క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం.

  1.అజీర్ణం:

  1.అజీర్ణం:

  నిలబడి నీళ్ళు తాగడం కన్నా, ఎక్కడైనా స్థిమితంగా కూర్చుని నీరు త్రాగితే, వారి కండరాలు మరియు నాడీ వ్యవస్థ ఎక్కువ విశ్రాంతికి లోనవుతాయి. ఇది మన నాడీ వ్యవస్థ త్వరితగతిన శరీరానికి నీటితో సహా ఆహారాన్ని జీర్ణం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తుంది. తద్వారా అజీర్ణ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

  ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, స్థిమితంగా కూర్చుని నీళ్ళు తాగమని చెప్తుంటారు. ఎంతోకాలంగా ఇది మనమూ పాటిస్తున్నప్పటికీ, మన పెద్దలు నిర్దేశించిన కారణం ఇదే. నేలకు కాళ్ళు ఆనకుండా కూర్చున్నప్పుడు, ఒత్తిడిలేని కారణంగా శరీరం నీటిని ఎక్కువ ఆస్వాదిoచగలుగుతుంది. తద్వారా నాడీ వ్యవస్థ, శరీర కండరాలు విశ్రాంతికి లోనవుతాయి.

  2.మూత్రపిండాల సమస్యలు:

  2.మూత్రపిండాల సమస్యలు:

  నిలబడి నీరు త్రాగడం వలన, నీళ్ళు మూత్రపిండాల ద్వారా సరిగా వడకట్టబడవు. తద్వారా వ్యర్థపదార్ధాలు నేరుగా మన మూత్రపిండాలలోకి వెళ్లి రక్తంతో కలిసి, మూత్రపిండాల నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వ్యవస్థ కొనసాగే కొలదీ, చివరకు మూత్రపిండ వైఫల్యం క్రమంగా మరణం కూడా సంభవించవచ్చు.

  3.ఆర్థరైటిస్ :

  3.ఆర్థరైటిస్ :

  తప్పుడు పద్దతిలో నీళ్ళు తాగడం వలన కలిగే, బాగా తెలిసిన నష్టాలలో ఒకటి ఆర్థరైటిస్. నిలబడి నీళ్ళు త్రాగడం వలన, సాధారణంగా శరీరంలోని ఇతర ద్రవాల యొక్క సమతుల్యతకు అంతరాయం కలుగుతుంది. తద్వారా కీళ్ళలో అవసరమైన ద్రవపదార్ధాల లోపం ఏర్పడుతుంది. కీళ్ళలో అసాధారణ ద్రవాల కూర్పు మరియు వాపు కారణంగా ఆర్థరైటిస్(కీళ్ళవాతానికి) కారణమవుతుంది. ప్రభావం తక్షణమే కలగకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం గారెంటీ.

  4.నరములు ప్రశాంతతను పొందలేవు :

  4.నరములు ప్రశాంతతను పొందలేవు :

  కూర్చుని నీళ్ళు తాగడం మూలంగా పారాసింపాతెటిక్ సిస్టం చర్యలో ప్రశాంతత నెలకొంటుంది. ఇది మన భావాలను ప్రశాంతoగా ఉండునట్లు చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థ యొక్క పనితీరును సులభతరం చేస్తుంది. నిలబడి నీరు తాగడం కన్నా, సావధానంగా కూర్చుని నీరు తీసుకోవడం మూలంగా, నీరు కడుపులోని ఆహారంతో సమ్మిళతమై జీర్ణక్రియ వేగంగా జరగడమే కాకుండా, శరీర జీవక్రియలు సవ్యంగా కొనసాగేలా చర్యలు తీసుకోగలదు. తద్వారా శరీరాన్ని కాసేపు ఫ్లైట్ మోడ్ లో ఉంచి, మన నాడీమండల వ్యవస్థను సర్దుకునేలా, ఒత్తిడి లేకుండా చూడగలదు.

  5.ఆమ్లాల అసాధారణ హెచ్చుతగ్గులు :

  5.ఆమ్లాల అసాధారణ హెచ్చుతగ్గులు :

  నీటికి ఆమ్ల క్షారత గుణాల లక్షణాలు లేవు. తద్వారా శరీరంలోని ఆమ్లాల హెచ్చుతగ్గులను సక్రమంగా పర్యవేక్షించగలదు. ఒక్కోసారి అధికమైన ఆమ్లాల ఘాడతను తగ్గించుటలో నీరు ప్రభావశీలిగా కూడా ఉంటుంది. కావున సావధానంగా కూర్చుని కొంచెం కొంచెంగా, పరిమిత మోతాదులో నీటిని తీస్కోవడం ద్వారా, శరీరంలోని ఆమ్లాల ఘాడత తగ్గుముఖం పట్టి, శరీరానికి ఉపశమనం అందిస్తుంది. ఇక్కడ భంగిమే ప్రధాన కారకం. నిలబడి నీళ్ళు తాగడం మూలాన, ఆమ్లాల ఘాడతలో అసాధారణ హెచ్చుతగ్గులను చవిచూడవలసి ఉంటుంది. నీరు ప్రమాదం కాదని అందరికీ తెలుసు, కానీ ఏది కూడా మితంగా తీసుకోవడమే అన్నిటికన్నా ముఖ్యం. నీటిని అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు, అపరిమితంగా నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాలపై ప్రభావాన్ని చూపుతుంది. కావున శరీరానికి అవసరమైన నీటిని మాత్రమే తీసుకునేలా ప్రణాళిక చేసుకోవడం ముఖ్యం. అదికూడా సరైన భంగిమలోనే.

  కావున నిలబడి నీళ్ళు తీసుకోవడం ఖచ్చితంగా శరీరానికి ప్రమాదమే అవుతుంది. ఊహకు అందని పరిణామాలకు దారితీస్తుంది.

  చివరిగా: నీటిని సావధానంగా స్థిమితంగా కూర్చుని, కొంచెం కొంచెంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

  ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆరోగ్య సంబంధిత విషయాల గురించి తెలుసుకొనుటకు, మా పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.

  English summary

  Is It OK To Drink Water While Standing?

  Drinking water is crucial but did you know standing up and drinking water is not good for you? Doing so can lead to Indigestion, damage to your kidneys, arthritis, nervous tension in the body, leave the acid levels undiluted in the body. It also damages our sphincter muscle causing a medical condition called GERD.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more