కాళ్ళల్లో దురద ఫీలింగ్ దేనివలన వస్తుంది?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీరు జాగింగ్ కి వెళ్ళినప్పుడు మీ కాళ్లలో ఏదో దురద ఫీలింగ్ కలగటం గమనించారా? ఇది మీరు జాగింగ్లో ఉన్న సమయంలోకానీ, తర్వాతకానీ వస్తుంది. దాని అర్థం ఏదో శరీరంలో సరిగా లేకపోవటం కూడా అయివుండవచ్చు.

కానీ కొన్నిసార్లు, ఈ కారణాలు చాలా చిన్నవిగా ఉంటే, మరికొన్నిసార్లు తీవ్రంగా ఉండి వైద్య సాయం అవసరమవుతుంది.

చిన్నకారణమైతే ఆ దురద రెండురోజుల్లో అదే పోతుంది. కానీ రక్తప్రసరణకి చెందిన లోపాల వంటి తీవ్ర విషయాలైతే, మీరు వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది.

వ్యాయామం చేసేటప్పుడు సరిగ్గా వార్మింగ్ అప్ చేసుకోవటం వంటివి చేయటం వలన శరీరంలో వేడి నెమ్మదిగా పెరిగి, దీర్ఘశ్వాస తీసుకోవడం వలన రక్తప్రసరణ సరిగ్గా ఉంటుంది. గాలాడే బట్టలు ధరించండి, వైద్యున్ని కూడా తొందరగా కలవటం మర్చిపోవద్దు.

కారణం #1

కారణం #1

మీరు వ్యాయామం చేయటానికి కొత్త అయితే, రక్తనాళాలు వెడల్పయి దురదగా అన్పించటం సహజం. ఇంకా, వ్యాయామం చేయటం వలన నరాలు ప్రేరేపితమై ఏదో గుచ్చుకుంటున్నట్లుగా అన్పిస్తుంది. మీ శరీరానికి కొత్త పనులు అలవాటయ్యాక ఈ దురద ఫీలింగ్ పోతుంది.

కారణం #2

కారణం #2

మీకు సున్నిత చర్మం ఉన్నట్లయితే, మీరు వాడే సబ్బునుంచి, వేసుకున్న బట్టల వరకు ఏమైనా రన్నింగ్ చేసేటప్పుడు దురద భావాన్ని కలిగించవచ్చు.

కారణం #3

కారణం #3

ఇది చర్మ ఉపరితలానికి దగ్గరగా ఉన్న రక్తనాళాల వ్యాధి వలన కూడా కావచ్చు. డాక్టర్ ను సంప్రదించండి. రన్నింగ్ చేసేటప్పుడు కాళ్ళలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే, కితకితలు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

కారణం#4

కారణం#4

సరైన తేమలేకపోవటం వలన కూడా దురద ఫీలింగ్ కలగవచ్చు. పొడి వాతావరణం కూడా కారణం కావచ్చు. మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవటానికి మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి.

కారణం#5

కారణం#5

మీరు పరుగుకి వెళ్ళినప్పుడు, బయట చల్లని వాతావరణం మీకు దురద ఫీలింగ్ ను కలిగించవచ్చు ఎందుకంటే రక్తం సడెన్ గా మీ చర్మంలోకి ప్రవహిస్తుంది.

కారణం#6

కారణం#6

మీ చర్మం మరియు వేసుకున్న బట్టలకి మధ్య ఘర్షణ వలన కూడా దురద ఫీలింగ్ కలగవచ్చు. దాని వల్ల రాష్ కూడా వస్తుంది.

కారణం#7

కారణం#7

మీకు ఇతర లక్షణాలు అనగా ఛాతీలో పట్టేయడం, శ్వాస అందకపోవడం, వికారం మరియు కాళ్ళలో దురదలాంటి ఫీలింగ్ ఇవన్నీ కన్పిస్తే, వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లండి, అది సీరియస్ విషయం కావచ్చు కూడా.

English summary

Itchy Sensation In The Legs | Itchy Sensation In Legs After Running | What Causes Itchy Sensation In Legs

Itchy Sensation In The Legs | Itchy Sensation In Legs After Running | What Causes Itchy Sensation In Legs,What causes itchy sensation in legs? Well, it could be a circulatory issue. Read on to know about the reason for itchy sensation in the legs.
Story first published: Saturday, February 3, 2018, 17:30 [IST]