For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీర బరువును తగ్గించి, మలినాలను బయటకు నెట్టే కివీ-పుచ్చకాయ జ్యూస్

శరీర బరువును తగ్గించి, మలినాలను బయటకు నెట్టే కివీ-పుచ్చకాయ జ్యూస్

|

ఈ వేసవిలో మీ దాహార్తిని తీర్చి, మీలో ఉత్తేజాన్ని నింపడానికి పుచ్చకాయ-కివి జ్యూస్ కి మించినది లేదు. ఇది బరువు తగ్గించడానికే కాక, శరీరంలో మలినాలను బయటకు నెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. వేసవిలో విరివిగా దొరికే ఈ పుచ్చకాయ, నూతనోత్తేజాన్ని అందిస్తుంది. దీనిలో ఉండే వివిధ పోషకాలు శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. ఇంకోవైపు, కివీ కూడా బరువును కోల్పోవడానికి సహకరిస్తుంది. ఈ వ్యాసంలో పుచ్చకాయ-కివి జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.


పుచ్చకాయలో డయూరిటిక్ లక్షణాలు ఉన్నందున, మూత్రపిండాలను మరియు మూత్రాశయమును శుద్ధి చేస్తుంది. దీనివలన శరీరంలో పేరుకున్న విషతుల్య పదార్థాలను బయటకు నెట్టి, ద్రవ నిలుపుదలను తగ్గిస్తుంది.

Kiwi Watermelon Juice For Detox And Weight Loss

పుచ్చకాయ లో 92 శాతం నీరు ఉండటం వలన అద్భుతమైన డయూరిటిక్ గా పనిచేసి మూత్రపిండాలలో రుగ్మతలను, మూత్రాశయ రుగ్మతలను, మలబద్దకం మరియు ద్రవ నిలుపుదలను నిరోధిస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

కివీలో నారింజలతో పోలిస్తే విటమిన్ సి మెండుగా ఉంటుంది. అంతేకాక దీనిలో మెగ్నీషియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు, పీచుపదార్థం, విటమిన్ ఎ, సి మరియు ఈ పుష్కలంగా ఉంటాయి. కివీ శరీరానికి శక్తిని అందిస్తుంది.

కివీ కొవ్వులు జరిగించడానికి ఉపయోగపడదని మీకు తెలుసా? పీచుపదార్థాలు అధికంగా ఉన్నందున కివీని తింటే, బరువు సులువుగా కోల్పోవచ్చు.

కివీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

కివీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

ఒక కివీ పండులో 42 కెలోరీలు ఉంటాయి కనుక తక్కువ కొవ్వులు కలిగిన ఆహారప్రణాళికలో వీటిని భాగంగా చేసుకోవచ్చు. ఒక్క కివీలో 0.4 గ్రాముల కొవ్వు మరియు2.1 గ్రాముల పీచుపదార్ధం ఉంటాయి. ప్రతిదినం కివీని మీ ఆహారంగా తీసుకోవడం వలన, కడుపు నిండిన భావన కలిగి తక్కువ కెలోరీలు తీసుకునేందుకు దోహదపడుతుంది.

తక్కువ శక్తి సాంద్రత కలిగిన కివీ వంటి పండ్లు తక్కువ కెలోరీలు ఉన్నందున బరువు తగ్గటానికి ఉపయోగపడతాయి. ఒక గ్రాము కివీలో 0.6 కెలోరీలు ఉంటాయి.

ప్రతిదినం కివీలను తినడం వలన హృద్రోగ సమస్యలు నివారింపబడటమే కాక, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయి? ఇవి మన శరీరాన్ని ప్రక్షాళన చేయటం వలన చర్మం ప్రకాశవంతం అవుతుంది.

కివీలలోని విటమిన్ సి, క్రానిక్ దగ్గు, ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యలు కలిగినవారికి మేలు చేస్తుంది. ఇవి శ్వాస మార్గాన్ని శాంతపరచి, పిల్లికూతలు, ముక్కు దిబ్బడ వంటి చికాకులను నియంత్రిస్తాయి.

పుచ్చకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

పుచ్చకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

పుచ్చకాయ బరువు తగ్గడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా?

పుచ్చకాయ తినడానికి రుచి తీయగా ఉన్నప్పటికీ, దానిలో కెలోరీలు ఎక్కువగా ఉండవు. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటంతో ఎటువంటి కొలెస్ట్రాల్, కొవ్వు లేకపోయినా అది మన కడుపు నింపుతుంది

అయితే పుచ్చకాయను తినడం బరువు కోల్పోడానికి దోహదం చేస్తుందా? రెండు కప్పుల పుచ్చకాయలో కొవ్వు లేకుండా 80 కెలోరీలు ఉంటాయి. దీనిలో ఒక గ్రాము పీచుపదార్ధం ఉండటం వలన ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి నిలిచి ఉంటుంది.

పుచ్చకాయలు కండరాల బాధలను శాంతపరుస్తాయని మీకు తెలుసా? దేహ దారుఢ్యం కొరకు వ్యాయామం చేయడం వలన కెలోరీలు కరిగినప్పటికి, కండరాల నొప్పి కలగడం మాత్రం తధ్యం. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ కెమిస్ట్రీ వారి అధ్యయనం ప్రకారం, పుచ్చకాయను తినడం వలన కండరాల నొప్పి మందగిస్తుంది.

పుచ్చకాయకు కండరాల నొప్పి తగ్గించే సామర్ధ్యం, దానిలో ఉండే L- సిట్రులిన్ అనే మూలకం వలన వస్తుంది. మన శరీరం, L- సిట్రులిన్ ని L-ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లంగా మారుస్తుంది. L-ఆర్జినైన్ మన శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తనాళాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.

కివీ-పుచ్చకాయ జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

కివీ-పుచ్చకాయ జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :

కివీ-పుచ్చకాయ జ్యూస్ వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పుచ్చకాయ రసానికి కివీని కూడా కలిపినపుడు, ఆరోగ్య ప్రయోజనాలు అధికమవుతాయి. ఎందుకంటే, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, పీచుపదార్థం, విటమిన్ ఎ, సి మరియు ఈ కూడా ఆ జ్యూస్ ద్వారా మీ శరీరంలోకి చేరతాయి.

పుచ్చకాయ లోని విటమిన్ B6 మన రోగ నిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. పుచ్చకాయ లో ఉండే లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ కేన్సర్ రిస్కును, హృద్రోగ సమస్యలను మరియు కండర క్షయాన్ని తగ్గిస్తుంది.

కివీ-పుచ్చకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి?

కివీ-పుచ్చకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి?

కావలసిన పదార్థాలు:

మధ్యస్థ పరిమాణం కలిగిన పుచ్చకాయలో పావు బాగా

రెండు కివీలు

తయారీ విధానం:

తయారీ విధానం:

పుచ్చకాయను ముక్కలుగా తరిగి జ్యూసర్ లో వేయండి. రెండు కివీలను తీసుకుని, చిన్న ముక్కలుగా తరగండి. దీనికి అర కప్పు నీరు కలిపి గ్రైండ్ చేయండి. దీనిని వడకట్టి, గ్లాసులో పోసుకుని తాగండి.

ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తాగి, మీ అభిప్రాయాలను మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.


English summary

Kiwi Watermelon Juice For Detox And Weight Loss

Kiwi watermelon juice will provide numerous health benefits when you combine the kiwi fruit to the juice. You will receive additional amounts of vitamin A, vitamin C, vitamin E, potassium, magnesium and copper. Consuming kiwis on a daily basis can prevent cardiovascular diseases and can also help prevent blood clots. Watermelons can reduce cancer risk.
Story first published:Monday, May 28, 2018, 9:21 [IST]
Desktop Bottom Promotion