యువతులారా! గైనకాలజిస్టుల సలహా ప్రకారం ఈ 8 అలవాట్లను వదిలించుకోండి

Subscribe to Boldsky

చిన్న దెబ్బ తగిలినా, కొంచెం తలనొప్పి, అజీర్తి చేసినా మనలో చాలామంది డాక్టరు దగ్గరకి పరిగెత్తడం సాధారణంగా చూస్తూనే ఉంటాం.

కానీ ఈకాలంలో కూడా, కొంతమంది ఆడవారు తమ లైంగిక అవయవాలకి వచ్చే సమస్యలకి, చిన్నవైనా, పెద్దవైనా డాక్టరుకి చూపించుకోటానికి సిగ్గుపడతారు,, భయపడతారు!

అవును, మనం చాలామటుకు ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు అందరూ చాలా అవగాహనతో ఓపెన్ గా ఉంటున్నారు అనుకుంటాం.

కానీ నిజానికి, కొంతమంది ఇప్పటికీ తమ లైంగిక అవయవాల గురించి చర్చించటం, పైకి తమ సమస్య చెప్పుకోవటం, డాక్టరు సాయం తీసుకోవటం, పరిస్థితి మరీ తీవ్రమయ్యేదాకా తప్పుగా భావిస్తారు.

Ladies! You Should Avoid These 9 Habits, Gynaecologists Advise

అందుకని, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ తమ లైంగిక భాగాలు లేదా ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా శరీరంలో ఇతర భాగాలలాంటివే అని గుర్తించాలి. అలాగే సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సాయం తీసుకోడానికి సిగ్గుపడకూడదు.

ఆడవారి ప్రత్యుత్పత్తి భాగాల ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా తెలిసిన డాక్టర్ ను గైనకాలజిస్ట్ అంటారు. వీళ్ళు మీ లైంగిక భాగాల సమస్యలకి పరిష్కారం సూచిస్తారు.

గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం లైంగిక భాగాలపై ప్రభావం చూపే కొన్ని చెడ్డ అలవాట్లను చాలామంది ఆడవాళ్ళు పాటిస్తారు.

అవేంటో ఇక్కడ తెలుసుకుని వాటికి దూరంగా ఉండండి.

1.సెక్స్ మొదలుపెట్టేవరకూ ఆగటం

చాలామంది యువతులు గైనకాలజిస్టు దగ్గరకి, కేవలం సెక్స్ సమస్యలు లేదా గర్భానికి సంబంధించిన సమస్యలు వస్తేనే వెళ్ళాలనుకుంటారు. అందుకని ఇతర లైంగిక భాగాల సమస్యలకి డాక్టరు దగ్గరకి వెళ్ళరు. కానీ ఇదొక అపోహ. ఏ స్త్రీ అయినా గైనకాలజిస్టు దగ్గరకి ఏ లైంగిక భాగాల సమస్య వచ్చినా వెళ్ళవచ్చు.

2.వివరాలు చెప్పకపోవటం

Ladies! You Should Avoid These 9 Habits, Gynaecologists Advise

ఇది కూడా, సిగ్గుపడాల్సి వస్తుందనే కారణంతో, చాలామంది ఆడవారు గైనకాలజిస్టులకి తమకి ఏమైందో వివరంగా చెప్పరు. ఇలా చేయటం వలన డాక్టరు సరిగ్గా సమస్య ఏంటో దానికి చికిత్స కేవలం టెస్టులు చేసే ఇవ్వలేరు. అందుకని, మీ గైనకాలజిస్టుతో సమస్య గురించి ఓపెన్ గా పూర్తిగా చెప్పటం ముఖ్యం.

3.డూషింగ్ కి దూరంగా ఉండండి

డూషింగ్ అంటే కొంతమంది ఆడవాళ్ళు స్ప్రేలు, కొన్ని ద్రవపదార్థాల వంటి ఫెమినైన్ హైజీన్ ఉత్పత్తులు వెజైనాను శుభ్రపర్చుకోటానికి వాడతారు. ఈ ఉత్పత్తులలో ఉండే రసాయన పదార్థాలు యోని దగ్గర వుండే సహజ పిహెచ్ బ్యాలెన్స్ ను పాడుచేసి, అక్కడి సున్నితమైన చర్మానికి మంట కలిగేలా చేస్తుంది. అందుకని డూషింగ్ కి ప్రతి అమ్మాయి దూరంగా ఉండాలి!

4.సొంత వైద్యం పనికిరాదు

గణాంకాల ప్రకారం, చాలామంది ఆడవాళ్ళు ఇంటర్నెట్ లో చదివేస్తూ, తమ లైంగిక భాగాలకి వచ్చిన ఏ సమస్యకైనా లక్షణాలను బట్టి, పరిస్థితి, చికిత్స నిర్ణయించేసుకుంటుంటారు. కానీ మీరు ఒకవేళ మెడికల్ రంగానికి చెందినవారు కాకపోతే, మీకు లక్షణాల గురించి పూర్తి అవగాహన ఉండదు. అందుకని గైనకాలజిస్టు దగ్గరకి వెళ్ళి చెకప్ చేయించుకోవటం పెద్ద జబ్బులకి దారితీయకుండా ఉండటానికి చాలా ముఖ్యం. చాలాసార్లు చిన్న మూత్రనాళ ఇన్ఫెక్షన్ కూడా మూత్రాశయ క్యాన్సర్ గా బయటపడవచ్చు, రెండింటికీ లక్షణాలు ఒకేలా ఉంటాయి!

5.ఇదివరకు వచ్చిన ఆరోగ్యసమస్యల గురించి బయటపెట్టకపోవడం

మీ లైంగిక భాగాలు లేదా ప్రత్యుత్పత్తి ఆరోగ్యం కోసం గైనకాలజిస్టు దగ్గరకి చికిత్సకి వెళ్ళినపుడు, డాక్టరుకి ఇదివరకు వచ్చిన అన్ని ఆరోగ్యసమస్యల గురించి చెప్పటం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పటి పరిస్థితికి ఇదివరకు వచ్చిన వేరే ఆరోగ్య సమస్య కారణం కావచ్చు. ఉదాహరణకి, అధిక రక్తపోటు లేదా డయాబెటిస్ యోని పొడిబారటానికి, లైంగికంగా సరిగా పనిచేయలేకపోవటానికి దారితీస్తాయి.

Ladies! You Should Avoid These 9 Habits, Gynaecologists Advise

6.గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోకపోవడం

ప్రపంచం మొత్తంగా ప్రతి ఏడాదీ వేలాదిమంది స్త్రీలకు వచ్చే సాధారణ రకాల క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ఒకటి. సాధారణంగా ఎక్కువ డిశ్చార్జి, యోనిలో మంట తప్ప సర్వికల్ క్యాన్సర్ ప్రాథమికంగా ఇంకే లక్షణాలు చూపించదు. అందుకని ఆడవాళ్ళు దాన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. అందుకే మీ గైనకాలజిస్టు దగ్గరకి వెళ్ళి క్రమం తప్పకుండా సర్వికల్ క్యాన్సర్ టెస్టులు చేయించుకోవటం ముఖ్యం, ఈ జబ్బు ఏ స్త్రీకైనా రావచ్చు!

7.తీవ్రంగా భాధించే పిఎంఎస్ లక్షణాలను పట్టించుకోకపోవటం

సాధారణంగా పీరియడ్స్ వచ్చే ముందు, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోం (పిఎంఎస్) దశలో చాలామంది ఆడవాళ్ళకి స్తనాలు సున్నితంగా మారిపోవటం, పొత్తికడుపు నొప్పి, మూడ్ లో మార్పులు వంటివి వస్తుంటాయి. కానీ ఈ లక్షణాలు మరీ తీవ్రంగా, భరించలేకుండా ఉంటే, అవి లైంగిక భాగాలకి వచ్చిన ఏదో జబ్బు వలన అయివుంటుంది. అందుకని మీరు గైనకాలజిస్టును కలిసి దీని గురించి చెప్పాలి. నిర్లక్ష్యంగా ఉండకండి.

8.సురక్షిత సెక్స్ పాటించకపోవడం

ప్రతి గైనకాలజిస్టు సెక్స్ చేసే ఆడవారికి సురక్షితంగా సెక్స్ చేయమని తప్పక సూచిస్తారు, అది కూడా ప్రత్యేకంగా అవాంఛిత గర్భం, సుఖవ్యాధులు(ఎస్ టిడి) రాకుండా ఉండాలనుకుంటే తప్పక సురక్షితంగా ఉండాలి. నోటిలో వేసుకునే మందులు, కండోమ్స్, ఎస్ టిడిల గురించి క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవటం, మీ భాగస్వామికి ఏ సుఖవ్యాధులు లేవని నిర్థారించుకోవటం వంటివి గైనకాలజిస్టులు పేషెంట్లని సురక్షిత సెక్స్ పాటించడానికి ప్రోత్సహించటానికి ఇచ్చే ప్రాథమిక చిట్కాలు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Ladies! You Should Avoid These 9 Habits, Gynaecologists Advise

    Certain habits followed by many women can affect their reproductive health adversely. Gynaecologists ask women to avoid certain habits, if they want to remain healthy. Consulting the doctor regularly instead of self-diagnosing, practising safe sex, revealing all the details about the medical history and problems that women are facing without hiding anything, etc.,
    Story first published: Sunday, April 1, 2018, 16:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more