జాయింట్ ఇంఫ్లేమేషన్ సమస్యకు దారితీసే 11 ఆహారాలివే

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

జాయింట్స్ వద్ద కలిగే ఇంఫ్లేమేషన్ ని ఆర్తరైటిస్ అనంటారు. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఈ కాలంలో అతి సాధారణమైపోయింది. ఆర్తరైటిస్ వలన రోజువారీ పనులు కూడా కష్టతరంగా అనిపిస్తాయి.

జాయింట్స్ వద్ద వాపు, నొప్పి అలాగే స్టిఫ్ నెస్ తో పాటు మొబిలిటీకి కలిగే ఇబ్బంది లేదా జాయింట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలన్నీ జాయింట్ ఇంఫ్లేమేషన్ తో అనుసంధానమై ఉంటాయి.

list of foods that cause inflammation of joints

మెడికేషన్స్ ని వాడి ఈ జాయింట్స్ ఇంఫ్లేమేషన్ కి చికిత్స చేయవచ్చు. అలాగే, కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరపడవచ్చు. చాలామటుకు వ్యాయామాల ద్వారా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ, నివారణ అనేది చికిత్సకంటే మేలన్న విషయాన్ని మనం గుర్తించి అందుకు తగినవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, ఈ ఆర్టికల్ లో జాయింట్స్ ఇంఫ్లేమేషన్ ని కలిగించే ఆహారాల గురించి తెలుసుకుందాం.

తరచూ, మీ డైట్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. మనకు తెలియకుండానే జాయింట్స్ ఇంఫ్లేమేషన్ సమస్యకు దారితీసే ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోవడం జరుగుతోంది.

కాబట్టి, ఇంఫ్లేమేషన్ కి కారణమయ్యే ఆహారాల జాబితాను ఇక్కడ పొందుబరిచాము.

1. టమాటా:

1. టమాటా:

సాధారణంగా, టమాటాలను వంటలలో ఎక్కువగా వాడతాము. వీటితో వివిధ వెరైటీ వంటకాలను తయారుచేసుకోవచ్చు. ఈ కారణం చేత టమాటా మన డైట్ లో ఎక్కువ శాతం భాగమవుతుంది. సలాడ్స్ రూపంలో, సాసేస్ అలాగే కెచప్స్ లా టమాటాలని విరివిగా ఉపయోగిస్తాము. టమాటాలు సాధారణంగా ఏంటీ ఇంఫ్లేమేటరీగా పనిచేస్తాయని ఇప్పటి వరకు భావిస్తున్నాము. అయితే, ఇటీవల అధ్యయనాల ప్రకారం టమాటాలలో లభ్యమయ్యే కొన్ని పదార్థాలనేవి జాయింట్ ఇంఫ్లేమేషన్ కి దారితీస్తాయని తెలుస్తోంది.

2. సోడా:

2. సోడా:

సోడా లేదా బాటిల్డ్ బెవెరేజెస్ అనేవి ఎక్కువగా ప్రసిద్ధి చెందిన పానీయాలు. అయితే, వీటిలో ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ ని జోడిస్తారు. అందువలన, ఇవి జాయింట్ ఇంఫ్లేమేషన్ ని కలిగిస్తాయి. బెవెరేజెస్ లో లభ్యమయ్యే ప్రాక్టోస్ అనేది రక్తంలోని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని అమాంతం పెంచుతుంది. తద్వారా, జాయింట్ ఇంఫ్లేమేషన్ తలెత్తుతుంది. ఈ బెవెరేజెస్ ని ఎక్కువగా తీసుకోవడాన్ని నివారించాలి. తద్వారా, జాయింట్ ఇంఫ్లేమేషన్ ను అరికట్టవచ్చు.

3. చక్కెర:

3. చక్కెర:

ఏ రూపంలోనైనా చక్కెరను తీసుకోవడం తగ్గించడం మంచిది. ఇంఫ్లేమేషన్ ని తగ్గించుకోవాలంటే మనం చక్కెర శాతాన్నిమితంగా తీసుకోవాలి. ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్, షుగర్ క్యాండీస్ అలాగే బేకరీ ప్రాడక్ట్స్ అనేవి ఒబెసిటీకి దారితీస్తాయి. అందువలన, కీళ్లపై ఒత్తిడి ఎక్కవగా పడి కీళ్ల నొప్పుల సమస్య తలెత్తుతుంది.

4. రిఫైండ్ ఫ్లోర్:

4. రిఫైండ్ ఫ్లోర్:

జాయింట్స్ పై దుష్ప్రభావం చూపే ఆహారాలలో రిఫైండ్ ఫ్లోర్ అనేది తనదైన పాత్ర పోషిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం వలన శరీరంలోని సైటోకైన్స్ అనే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి, ఇంఫ్లేమేటరీ నేచర్ కలిగిన కెమికల్స్. కాబట్టి, రిఫైండ్ ఫ్లోర్ తో తయారుచేయబడిన బ్రెడ్స్, పాస్తా వంటి ఆహారాలను అవాయిడ్ చేయడం మంచిది.

5. వేపుడు ఆహారాలు:

5. వేపుడు ఆహారాలు:

వేపుడు ఆహారాలలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి జాయింట్ ఇంఫ్లేమేషన్ ని కలిగిస్తాయి. వేపుడు ఆహారాలని తీసుకోవడం ద్వారా క్రానిక్ ఇంఫ్లేమేషన్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

6. డైరీ ప్రాడక్ట్స్:

6. డైరీ ప్రాడక్ట్స్:

వే కంటెంట్ తో పాటు డైరీ ప్రాడక్ట్స్ లో ఉండే ప్రోటీన్ అనేది జాయింట్స్ ఇంఫ్లేమేషన్ సమస్యకు దారితీస్తుంది. ఇంఫ్లేమేషన్ సమస్య అనేది ఎక్కువగా డైరీ ప్రాడక్ట్స్ వలన కలుగుతుంది. కాబట్టి, డైరీ ప్రాడక్ట్స్ ని అవాయిడ్ చేయడం ద్వారా ఇంఫ్లేమేషన్ ని అరికట్టవచ్చు. వీటి బదులు ప్లాంట్ ఫుడ్స్ ద్వారా లభించే ప్రోటీన్ పై ఆధారపడటం ఉత్తమం.

7. ప్రొసెస్డ్ మీట్స్:

7. ప్రొసెస్డ్ మీట్స్:

ప్రొసెస్డ్ మీట్స్ వలన జాయింట్స్ ఇంఫ్లేమేషన్ ఎదురవుతుంది. మీట్ లో లభించే ఫ్యాట్ మరియు కేలరీలనేవి జాయింట్ ఇంఫ్లేమేషన్ సమస్యను కలిగిస్తాయి. అందువలన, నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి వెజిటేరియన్ ఫుడ్ వైపు మారిపోవడం మంచిది. తద్వారా, జాయింట్ ఇంఫ్లేమేషన్ సమస్యను కొంతవరకు అరికట్టవచ్చు.

8. ఆల్కహాల్:

8. ఆల్కహాల్:

ఆల్కహాల్ వలన అనేక వ్యాధులు తలెత్తుతాయి. జాయింట్ ఇంఫ్లేమేషన్ అనేది ఆల్కహాల్ వలన కలిగే ఒక ఆరోగ్య సమస్య. దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ ని సేవించడం వలన తీవ్రస్థాయిలో ఇంఫ్లేమేషన్ సమస్య ఎదురవుతుంది. ఇది ప్రాణాంతక సమస్యగా కూడా మారుతుంది.

9. కార్న్ ఆయిల్:

9. కార్న్ ఆయిల్:

కార్న్ ఆయిల్ తో పాటు కార్న్ ప్రోడక్ట్స్ వలన జాయింట్ ఇంఫ్లేమేషన్ తలెత్తుతుంది. కార్న్ ఆయిల్ లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కలవు. వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇంఫ్లేమేషన్ సమస్య తీవ్రతరమవుతుంది.

10. ఎం ఎస్ జీ:

10. ఎం ఎస్ జీ:

ఫుడ్స్ కి ఫ్లేవర్ ని జోడించే పదార్థాలు ఇంఫ్లేమేషన్ కి కారణమవుతాయి. సూప్స్, స్పైసెస్, సెరెల్స్, అలాగే కాండిమెంట్స్ కి వీటిని ఎక్కువగా వాడతారు. జాయింట్ ఇంఫ్లేమేషన్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. లేదంటే, సమస్య తీవ్రతరమవుతుంది. జాయింట్ ఇంఫ్లేమేషన్ సమస్య తలెత్తకుండా వీటికి దూరంగా ఉండటం కూడా ఉత్తమమే.

11. కాఫీ:

11. కాఫీ:

ఒక కప్పుడు వేడి వేడి కాఫీని ఎంజాయ్ చేయని వారెవరుంటారు? అయితే, ఎక్కువగా కాఫీని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీని తీసుకోకూడదు. అందువలన, కాఫీ బదులు గ్రీన్ టీని లేదా బ్లాక్ టీని తీసుకోవడం మంచిది.

English summary

List Of 11 Foods That Cause Inflammation Of The Joints

Inflammation of the joints is associated with joint swelling, joint pain, joint stiffness, difficulty in mobility or loss of joint function. The treatment of inflammation of the joints can include medications, exercises and even surgery. Preventing certain foods could reduce the risk of inflammation in the joints.
Story first published: Monday, February 12, 2018, 16:30 [IST]