కాలేయ మార్పిడి ; మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

కాలేయం బాగుచేయటానికి వీల్లేనంతగా పాడయిపోతే, ఆ దశను కాలేయం ఫెయిల్యూర్ అవటం అంటారు. అప్పుడు లివర్ ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది.

మనిషి శరీరంలో 500 పైగా పనులను కాలేయం నిర్వహిస్తుంది. లివర్ ట్రాన్స్ ప్లాంట్ అనేది అందరికీ కుదరదు, అలాగే ఈ ట్రాన్స్ ప్లాంట్ కి సమయం కూడా బాగానే పడుతుంది.

మనిషి శరీరంలో జీర్ణవ్యవస్థకి కాలేయం చాలా ముఖ్యమైన అవయవం. శరీరంలో 500కి పైగా పనులను కాలేయమే చేస్తుంది. కాలేయం సాధారణంగా పనిచేయకపోతే మీ మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరులో పెద్ద మార్పులు జరిగిపోతాయి. కాలేయం సమస్యలు తక్కువ నుండి, తీవ్రంగా ఎంతైనా ఉండవచ్చు.వీటికి మందులతో చికిత్స చేయటం ఒక పద్ధతి, కానీ అవేవీ పనిచేయనప్పుడు, ఆఖరుగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ కి వెళ్ళటం మంచిది.

Liver Transplants: 7 Things You Need To Know

చాలా కేసులలో, కాలేయం పూర్తిగా పాడయిపోతే లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేస్తారు. కాలేయం బాగుచేయలేనంతగా పాడయినప్పుడు, ఆ స్థితిని లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఈ స్థితి ప్రాణాంతకం కావచ్చు, దీనికి వెంటనే వైద్యసాయం అవసరమవుతుంది. లివర్ ఫెయిల్యూర్ అన్నది రాత్రికిరాత్రే జరిగేది కాదు (మరీ తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్ అయితే తప్ప). అది మెల్లగా ఏళ్ళపాటు జరుగుతుంది.

కాలేయ మార్పిడి అంటే ఏమిటి?

కాలేయ మార్పిడి అనేది ఒక ఆపరేషన్, ఇందులో పాడయిన, జబ్బుచేసిన కాలేయాన్ని శరీరం నుంచి తీసేసి, ఆరోగ్యకరమైన కాలేయాన్ని పెడతారు. ఈ పద్ధతిని కాలేయం ఇక అస్సలు పనిచేయనప్పుడు, బాగుచేయలేనప్పుడే పాటిస్తారు. మంచి వైద్యం, సంరక్షణ అవయవ మార్పిడి అవసరాన్ని ఆలస్యం చేయగలవేమోకానీ, మొత్తం అవసరాన్ని తొలగించలేవు. ఇవన్నిటితో పాటు, ఈ మార్పిడి గురించి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

కాలేయ మార్పిడి గురించి మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు ఇవిగో. చదవండి.

1.బ్రతికున్న దాతలు

1.బ్రతికున్న దాతలు

కాలేయ మార్పిడి ఆపరేషన్ లో కావాల్సిన కాలేయం రెండు రకాల దాతల నుంచి వస్తుంది, బ్రతికున్న దాత మరియు చనిపోయిన దాత. బ్రతికున్న దాత కాలేయ మార్పిడిలో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క కాలేయంలో ఒక భాగాన్ని పేషెంట్ కు అమరుస్తారు. ఇది ప్రభావవంతమైనది ఎందుకంటే కాలేయం ఒక అద్భుతమైన అవయవం, ఇది మనిషి శరీరంలో అదంతట అదే మిగతాభాగం పెరిగిపోతుంది. మిగతా కాలేయభాగం శరీరం లోపల కొన్ని వారాలలోపల అభివృద్ధి చెందుతుంది.

2.చనిపోయిన దాత

2.చనిపోయిన దాత

మరోవైపు, చనిపోయిన దాత అంటే ఏదైనా సంఘటన వలన మెదడు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తి, వారిని బ్రెయిన్ డెడ్ గా గుర్తిస్తారు. వారి కాలేయాలను మార్పిడి కోసం రక్త గ్రూపు,సరైన పరిమాణం పరీక్షిస్తారు. మార్పిడికి కాలేయాన్ని ఎంచుకునేటప్పుడు ఏమన్నా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో లోతుగా పరీక్షిస్తారు.

3.కాలేయ మార్పిడి అందరికీ సాధ్యపడదు

3.కాలేయ మార్పిడి అందరికీ సాధ్యపడదు

కాలేయమార్పిడి ఆపరేషన్ అందరికీ సరిపడదు. కొన్ని కేసులలో, కొన్ని అనారోగ్యస్థితులలో ఉన్నవారు ఈ ఆపరేషన్ కి పనికిరారు. అవేం అనారోగ్య స్థితులంటే ;

ఏదన్నా అవయవానికి క్యాన్సర్, తీవ్రమైన గుండె,ఊపిరితిత్తులు లేదా నాడీ జబ్బులు, ఆల్కహాల్ మరియు డ్రగ్స్ సమస్య,తీవ్రమైన ఇన్ఫెక్షన్,డాక్టర్ సూచనలు పాటించలేకపోవటం.

ఇంకా చదవండి; కొవ్వు ఉన్న లివర్ జబ్బు ; 7 మేటి సహజ చికిత్సలు

4.బ్రతికున్న దాత నుంచి కాలేయ మార్పిడి

4.బ్రతికున్న దాత నుంచి కాలేయ మార్పిడి

బ్రతికున్న దాత నుంచి కాలేయం తీసుకుంటున్నట్లయితే, రెండు పద్ధతులు ఒకసారే చేస్తారు. కాలేయ భాగాన్ని దాతనుంచి తీసుకుని పూర్తిగా ఎదిగేదాకా సంరక్షించి, తర్వాత పేషెంట్ శరీరంలో అమరుస్తారు.

5. చనిపోయిన దాత నుంచి కాలేయ మార్పిడి

5. చనిపోయిన దాత నుంచి కాలేయ మార్పిడి

బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి కాలేయాన్ని తీసుకునేటప్పుడు అదే పద్ధతిని పాటిస్తారు, రక్తం గ్రూపు, ఇన్ఫెక్షన్లను పరీక్షిస్తారు. అది అన్నిరకాలుగా సరిపోతే, పేషెంట్ కు అమరుస్తారు.

6.ఈ పద్ధతికి సరిపోయే సమయం

6.ఈ పద్ధతికి సరిపోయే సమయం

లివర్ ట్రాన్స్ ప్లాంట్ చాలా సమయం తీసుకునే ఆపరేషన్. దానికి 6 నుంచి 14 గంటలు పట్టవచ్చు. ఒక డాక్టర్ పాడయిన కాలేయాన్ని తీయటం చేస్తే, మరొకరు కొత్తదాన్ని మార్పిడికి తయారుచేస్తారు. డాక్టర్ మళ్ళీ రక్తనాళాలు, బైల్ నాళాన్ని సరిగ్గా కలుపుతారు, దానివలన రక్తం కాలేయంలోకి తిరిగి మళ్ళీ ప్రవహిస్తుంది.

7. రికవరీ

7. రికవరీ

ఆపరేషన్ పూర్తయ్యాక, పేషెంట్ కొత్త కాలేయం అభివృద్ధి చెంది సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టేవరకు హాస్పిటల్లోనే 2 నుంచి 3 వారాలు ఉంటారు. కాలేయానికి శరీరం తిరస్కరించే రిస్కులు, ఇన్ఫెక్షన్లను నివారించటానికి మందులు ఇస్తారు. కాలేయం కొత్త మందులకి అలవాటు పడ్డాక,ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటే పేషెంటును హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తారు.

English summary

Liver Transplants: 7 Things You Need To Know

It is very important for each one of us to know of certain important facts about our vital organs. Did you know that there are certain surprising facts on the liver that most of us wouldn't be aware of?When we have enough knowledge about our body, internal organs, diseases, etc., it may become easier for us to prevent certain ailments, before it is too late.