ఈ ఎనిమిది నేచురల్ లివర్ క్లీన్సింగ్ ఫుడ్స్ మిమ్మల్ని అమితాశ్చర్యపరుస్తాయి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

లివర్ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఈ ఆర్గాన్ బ్లడ్ క్లాటింగ్ కి ప్రధాన పాత్ర పోషించే విటమిన్ కే ని స్టోర్ చేస్తుంది, డేంజరస్ టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది, అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అలాగే ఫ్యాట్స్ కి శరీరంలోని మెటబాలిజం సెంటర్ గా వ్యవహరిస్తుంది.

These 8 Natural Liver-Cleansing Foods Will Blow Your Mind,

అందుకే, లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఆరోగ్యంగా ఉండేందుకు అత్యవసరం. లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు లివర్ క్లీన్సింగ్ ఫుడ్స్ ని డైట్ లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు. తద్వారా, ఈ ఆర్గాన్ అనేది డిటాక్సిఫై అవుతుంది. జీవితాంతం ఈ ఆర్గాన్ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది.

1. గార్లిక్:

1. గార్లిక్:

బ్యాడ్ బ్రీత్ ను కలుగచేస్తుంది చాలా మంది గార్లిక్ ను అవాయిడ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే, గార్లిక్ లో అనేక ఔషధ విలువలు కలిగి ఉన్నాయి. అలిసిన్ అనే కాంపౌండ్ వలన గార్లిక్ లో మెడిసినల్ ప్రాపర్టీస్ అధికంగా లభిస్తాయి. లివర్ ని డిటాక్సిఫై చేసేందుకు ఈ పదార్థం అమితంగా ఉపయోగపడుతుంది.

అయితే, గార్లిక్ ని కుక్ చేయడం వలన దానిలోనున్న ఔషధ విలువలు సన్నగిల్లుతాయి. కాబట్టి, ఒకటి లేదా రెండు రెబ్బల గార్లిక్ ను నమలడం వలన లివర్ క్లీన్సింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

2. గ్రీన్ టీ:

2. గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో శరీర బరువును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. తరచూ, గ్రీన్ టీ ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, గ్రీన్ టీ లో కేట్చిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి లివర్ ను క్లీన్సింగ్ చేయడానికి అమితంగా తోడ్పడతాయి. తద్వారా, లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి.

అయితే, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ లో లివర్ పై దుష్ప్రభావం చూపే లక్షణాలు కలవు. కాబట్టి సహజసిద్ధమైన గ్రీన్ టీ పైనే ఆధారపడటం ఉత్తమం.

3. అవొకాడో:

3. అవొకాడో:

శరీరంలోని అన్ని అవయవాల పనితీరుకు అవొకాడో మేలైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా, గుండె మరియు లివర్ ఆరోగ్యాలకి అవొకాడో మంచి చేస్తుంది. అవొకాడోలో హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి. గ్లూటాతియోన్ అనే పదార్థం ఇందులో లభించడం వలన అవొకాడో అనేది లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. లివర్ డిటాక్సిఫికేషన్ ను ప్రోత్సహిస్తుంది ఈ ఫ్రూట్.

4. సిట్రస్ ఫ్రూట్స్:

4. సిట్రస్ ఫ్రూట్స్:

ఆరెంజ్, కివీ, లెమన్ లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. సీ విటమిన్ అనేది లివర్ ని డిటాక్సిఫై చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే ఇమ్మ్యూనిటీను మెరుగుపరుస్తుంది. ఈ ఫ్రూట్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

అయితే, సిట్రిక్ ఫ్రూట్స్ అనేవి పళ్ళపై ఎనామిల్ పై దుష్ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, సిట్రిక్ ఫ్రూట్స్ ని తీసుకున్న తరువాత అలాగే జ్యూస్ ని తాగిన తరువాత పళ్ళని బాగా శుభ్రపరచుకోవాలి.

5. లీఫీ గ్రీన్స్:

5. లీఫీ గ్రీన్స్:

లీఫీ గ్రీన్స్ ను డైట్ లో యాడ్ చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇవి లివర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. వీటిలో లభించే క్లోరోఫిల్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో ఉండే హెవీ మెటల్స్ మరియు టాక్సిన్స్ ను న్యూట్రలైజ్ చేసి బైల్ సీక్రేషన్ ను మెరుగుపరుస్తాయి. కాబట్టి, లీఫీ గ్రీన్స్ ను రెగ్యులర్ డైట్ లో జోడించడం ద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. లివర్ క్లీన్సింగ్ అనేది అందులోని ముఖ్యమైన బెనిఫిట్.

స్పినాచ్, బిట్టర్ గార్డ్ మరియు దండేలియన్ గ్రీన్స్ ను డైట్ లో యాడ్ చేసుకోండి.

6. బీట్ రూట్:

6. బీట్ రూట్:

బీట్ రూట్ ఒక ప్రత్యేకమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఈ పర్పుల్ వెజిటబుల్ అనేది లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తుంది. బ్లడ్ ప్రొడక్షన్ ను ప్రోమోట్ చేస్తుంది. ఇందులో లభించే బీటా కెరోటిన్ వలన ఈ వెజిటబుల్ కు ఆ ప్రత్యేకమైన టేస్ట్ లభిస్తుంది.

7. గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్

7. గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్

అధ్యయనాల ప్రకారం గ్లూటెన్ కి సెన్సిటివ్ గా కలవారిలో లివర్ టాక్సిసిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి, రెగ్యులర్ ఫుడ్ గ్రెయిన్స్ ని తీసుకుంటూ ఉంటే, మీరు తీసుకునే ఫుడ్స్ లో కొన్ని మార్పులు అవసరం. క్వినోవా, బక్ వీట్ మరియు అమర్నాథ్ వంటి గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్ ను డైట్ లో జోడించడం మంచిది.

8. పసుపు:

8. పసుపు:

పసుపు అనేది ఆయుర్వేదానికి ఇష్టమైన పదార్థం. ఇందులో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ కలవు.

ఈ స్పైస్ అనేది ఇంఫ్లేమేషన్ ను తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్స్ ను కూడా అరికడుతుంది. ఎంజైమ్స్ ని స్టిములేట్ చేసి లివర్ ని డిటాక్సిఫై చేస్తుంది.

కాబట్టి, ఆహారంలో చిటికెడు పసుపును జోడించడం మరచిపోకండి.

English summary

These 8 Natural Liver-Cleansing Foods Will Blow Your Mind

Your liver is one of the most important organs in your body. Not only is it responsible for clearing out toxic metabolites in your blood, but it is also responsible for the metabolism of proteins, carbs, and fats in your body. These foods can help you detoxify your liver and keep it functioning healthily: turmeric, garlic, avocado, and citrus fruits.
Story first published: Friday, April 6, 2018, 13:30 [IST]