ఈ క్విక్ రెమెడీస్ ని పాటించడం ద్వారా కళ్ళ అలసటనూ అలాగే దురదనూ తగ్గించుకోవచ్చు

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

"సర్వేంద్రియానం నయనం ప్రధానం" అని పెద్దలు చెప్తూ ఉంటారు. కళ్లనేవి శరీరంలోని ముఖ్య పాత్రని పోషిస్తాయి. వీటిని సరైన సంరక్షణ అవసరమవుతుంది. వీటికి సరైన సంరక్షణని అందించడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అయితే, పొల్యూషన్ తో పాటు కొన్ని పర్యావరణ సంబంధిత అంశాలు, కాంటాక్ట్ లెన్సెస్ వాడకం, టెలివిజన్ ను ఎక్కువగా చూడడం, నిద్రలేమి, ఇరిటేషన్, డీహైడ్రేషన్, మెడిసిన్స్ మరియు కంప్యూటర్ ని ఎక్కువగా వాడటం అలాగే మొబైల్ ని ఎక్కువగా వాడటం వలన కళ్ళు ఎక్కువగా అలసటకు గురవుతాయి.

అలసిన కళ్ళు మీకు అసౌకర్యాన్ని కల్పిస్తూ ఆకర్షణ లేనట్టు కనిపిస్తాయి. మీ కళ్ళు అలసటకు గురై కళ్ళ దురదల సమస్య కూడా వేధిస్తున్నట్టైతే మీరు కళ్ళకి కావలసినంత విశ్రాంతిని అందించాలి.

అలసిన అలాగే దురద కలిగిన కళ్ళ సమస్యను చాలా మంది ఎదుర్కుంటారు. ఇది సర్వసాధారణమైన సమస్య. కళ్ళు బరువుగా ఉండటం, పొడిబారిన కళ్ళు, కళ్ళ నొప్పులు, నీరు కారడం, తలనొప్పి మరియు అసౌకర్యం వంటివి ఈ సమస్యకు సంబంధించిన కొన్ని లక్షణాలు.

ఈ సమస్యలను ఇంటి వద్దే సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొన్ని ఉపయోగకరమైన నేచురల్ రెమెడీస్ ని పాటిస్తే కళ్ళు తిరిగి ఆరోగ్యాన్ని పొందుతాయి.

కాబట్టి, ఈ రోజు, ఈ ఆర్టికల్ లో అలసిన కళ్ళను అలాగే కళ్ళల్లో దురదలను తగ్గించుకుని కళ్ళని తిరిగి ఆరోగ్యంగా మార్చేందుకు పాటించవలసిన కొన్ని రెమెడీస్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ..

ఈ ఆర్టికల్ ని చదివి వివరాలు తెలుసుకోండి.

దోశకాయ:

దోశకాయ:

కళ్ళను చల్లబరచి అలసటనుంచి ఉపశమనం కలిగించే సామర్థ్యం దోశకాయలో కలదు. మీ కళ్ళను ప్రశాంతబరచి కళ్ళకు కూలింగ్ ఎఫెక్ట్ ను అందించడంలో దోశకాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనురెప్పలను మూసి ఉంచి దోసకాయ స్లైసెస్ ని కళ్లపై ఉంచితే కళ్ళు ఉపశమనం పొందుతాయి.

క్యాస్టర్ ఆయిల్:

క్యాస్టర్ ఆయిల్:

అన్ని రకాల కళ్ళ సమస్యలకీ క్యాస్టర్ ఆయిల్ ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఒక చుక్క క్యాస్టర్ ఆయిల్ ను కళ్ళల్లో వేసుకోవాలి. కాసేపు అలా ఉంచిన తరువాత చల్లటి నీటితో కళ్ళను కడగాలి. ఈ పద్దతి వలన కళ్ళల్లో నున్న దురద కలిగించే ఇరిటెన్ట్స్ తొలగిపోతాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ను తొలగించేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. కళ్ళల్లో పేరుకున్న దుమ్మూ ధూళిని తొలగించేందుకు ఈ పదార్థం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. బేకింగ్ సోడాని నీటిలో కలిపి ఈ మిశ్రమంతో కళ్ళని కడగాలి. క్రమం తప్పకుండా ఈ పద్దతిని అతిస్తే కళ్ళ దురదలతో పాటు కళ్ళ అలసట తగ్గిపొతుంది.

వినేగార్:

వినేగార్:

యాంటీ సెప్టిక్ అలాగే యాంటీ బాక్టీరియా ప్రాపర్టీలు వినేగార్ లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఈ పదార్థాన్ని వాడడం ద్వారా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ను తొలగించుకోవచ్చు. వినేగార్ ని నీటిలో డైల్యూట్ చేసుకుని ఈ మిశ్రమంతో కళ్ళని రోజుకు రెండుసార్లు వాడితే కళ్ళ దురదలు తగ్గిపోతాయి.

చల్లటి పాలు:

చల్లటి పాలు:

పాలలో లభించే పోషకాల వలన కంటి దురద తగ్గిపోతుంది. చల్లటి పాలను తీసుకుని అందులో రెండు కాటన్ బాల్స్ ని ముంచి కనురెప్పలను మూసి ఈ కాటన్ బాల్ తో అప్లై చేయండి. ఈ పద్దతి ద్వారా కళ్ళలో దురద తగ్గిపోతుంది.

రా పొటాటో:

రా పొటాటో:

ఇరిటేటెడ్ కళ్ళని ప్రశాంతపరిచేందుకు రా పొటాటో రెమెడీ అద్భుతంగా తోడ్పడుతుంది. రెండు స్లైస్ ల చల్లటి పొటాటోని తీసుకుని మూసి ఉంచిన కనురెప్పలపై అమర్చండి. కాసేపటి తరువాత వీటిని తొలగించండి.

English summary

quick remedies for tired and itchy eyes

Tired eyes not only cause physical discomfort but they also look unattractive. You would feel the need to remain in one place rather than enjoy things if you have tired itchy eyes. Tired eyes and itching of the eyes are the common occurring problems that are faced by almost everyone these days. Some of the symptoms include heaviness in the eyes, dry eyes, sore eyes, watery eyes, headache and uneasiness..
Story first published: Thursday, January 25, 2018, 16:00 [IST]
Subscribe Newsletter