For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజ్ - టీ రోజూవారీ వినియోగం, బరువు తగ్గడంలో చూపే 5 ఉత్తమ ప్రయోజనాలు

రోజ్ - టీ రోజూవారీ వినియోగం, బరువు తగ్గడంలో చూపే 5 ఉత్తమ ప్రయోజనాలు

|

గులాబీ పూవు తరచుగా సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా వినియోగించబడుతుంది. కానీ, బరువు తగ్గడానికి దారితీసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం కలిగి ఉంటుందని కూడా చెప్పబడింది. టీని స్ట్రెస్-బస్టర్(ఒత్తిడి నిరోధకం) మరియు ఒక మూడ్-స్వింగర్ అని కూడా పిలుస్తారు.

రోజా పూవు సౌందర్యం పరంగానే కాకుండా, వంటలో కూడా విస్తృతమైన ఉపయోగాలు కలిగిన పువ్వుగా ఉంటుంది. ఎండిన రేకుల నుండి గుల్కాండు మరియు రోజ్ షెర్బెత్ తీసుకుని, స్వీట్స్ లో వినియోగించడం పరిపాటి. భారతీయులు అనాదిగా ఆహారాలు మరియు పానీయాలలో గులాబీ పూవులను ఉపయోగిస్తున్నారు. రోజా పూవు కూడా సౌందర్య, సేంద్రీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే కాకుండా మందులలో, ప్రధానంగా ఆయింట్మెంట్స్ తయారీలో విరివిగా ఉపయోగించడం జరుగుతుంటుంది. అన్నిరకాలా ఆరోగ్య ప్రయోజనాల గనిగా ఈ రోజా పూవు ఉంటుంది. అంతేకాకుండా, తేజోమయమైన చర్మాన్ని, అందాన్ని అందివ్వడంలో కూడా తగిన పాత్రను కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ మరియు రోజ్ సీడ్ ఆయిల్ వంటివి తరచుగా సౌందర్య సాధనాలలో కూడా వినియోగించబడుతున్నాయి, క్రమంగా రోజ్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ కలిగి ఉన్నాయి. కానీ గులాబీ పువ్వులు బరువు కోల్పోవడంలో కూడా మీ శారీరిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడగలవని మీకు తెలుసా?

Rose Tea: 5 Weight Loss Benefits And Easy Ways To Make It At Home!

మీరు బరువు కోల్పోవాలని భావిస్తున్నవారైతే, మీ రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా జోడించగలిగే ఉత్తమ హెర్బల్ – టీ వలె రోజ్-టీ ఉంటుంది. అయితే, ఇది మాత్రమే రోజ్-టీ ప్రయోజనం కాదు. దీనిలోని అనామ్లజనకాల కారణంగా చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది, అదేవిధంగా జీర్ణక్రియకు కూడా మంచిదిగా చెప్పబడింది. గులాబీ వాసన మనస్సులలో ఆహ్లాదకర వాతావరణం పెంచుతుంది, క్రమంగా ఒత్తిడి నిరోధకంగా మరియు మూడ్-స్వింగర్ వలె పిలవబడుతుంది కూడా. ఈ రోజ్-టీ ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరియు మీకు రోజ్ – టీ బయట స్టోర్స్ లో తీసుకోవడం నచ్చని ఎడల, తాజా గులాబీ రేకులతో ఇంట్లోనే తయారు చేయవచ్చు.

గులాబీ-టీ బరువు తగ్గడంలో చూపే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం ముఖ్యం:

వాపు (ఇన్ఫ్లమేషన్) సమస్యలతో పోరాడుతుంది :

వాపు (ఇన్ఫ్లమేషన్) సమస్యలతో పోరాడుతుంది :

గులాబీ పూలలో అనామ్లజనకాలు ఉండటం మూలాన, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. పరిశోధనల ప్రకారం, వాపు(ఇన్ఫ్లమేషన్) మరియు బరువు పెరుగడం మధ్యగల సంబంధాన్ని చూపారు, క్రమంగా బరువు తగ్గడంలో రోజ్-టీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పగలుగుతున్నారు.

ఆకలి కోరికలను తగ్గించుట :

ఆకలి కోరికలను తగ్గించుట :

ఆకలి కోరికలను అరికట్టడానికి, బరువు తగ్గడానికి, కెఫీన్ లేని, టీ లేదా కాఫీకి సూచించదగిన ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా రోజ్ –టీ తీసుకోవచ్చు.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచుతుంది :

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచుతుంది :

రోజ్-టీ, శరీరం యొక్క జీర్ణశక్తులను పెంచడానికి దోహదం చేస్తుంది, మరియు ఒక ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించడం ద్వారా సమర్థవంతంగా బరువుని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. రోజ్-టీ మీ జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియా పెరిగేందుకు సహాయపడుతుంది మరియు మలబద్ధకం, అతిసారం వంటి తీవ్ర సమస్యలకు మూలికా చికిత్సగా వాడబడుతుంది.

Most Read: ప్రతిరోజూ దాల్చినచెక్క నీళ్ళు తీసుకోవాలనడానికి గల 6 ప్రధాన కారణాలు !Most Read: ప్రతిరోజూ దాల్చినచెక్క నీళ్ళు తీసుకోవాలనడానికి గల 6 ప్రధాన కారణాలు !

విషాన్ని తొలగించుటలో సహాయపడుతుంది:

విషాన్ని తొలగించుటలో సహాయపడుతుంది:

రోజ్-టీ, శరీరాన్ని నిర్విషీకరణగావించడంలో మరియు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పబడింది.

రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది:

రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది:

ఆరోగ్యకర రీతిలో బరువును కోల్పోవటానికి, మీరు మొదటగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చూసుకోవడం అవసరం. ఈ విషయంలో గులాబీ - టీ, ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు మీకు సహాయపడగలదు. గులాబీ పువ్వులో విటమిన్-సి అధికంగా ఉండడమే ఈ లక్షణానికి కారణం.

రోజ్ –టీ తయారు చేయు విధానం :

రోజ్ –టీ తయారు చేయు విధానం :

రోజ్- టీ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, మీరు ఎలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎండిన గులాబీ రేకులను కొనుగోలు చేసి, మీకు నచ్చిన టీ-పొడిని జోడించి తయారుచేసుకోవచ్చు. తాజా గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో మరగబెట్టి, గులాబీ - టీ తయారు చేయవచ్చు. ఇందుకు పెస్టిసైడ్స్ రహిత గులాబీ రేకులు కనీసం ఒక కప్పు అవసరం. పారుతున్న నీటి కింద గులాబీ రేకులను ఉంచి శుభ్రపరచి, ఒక సాస్ పాన్ (లోతుగా ఉండేలా ఎంచుకోవాలి) తీసుకుని, అందులో మూడు కప్పులు నీటిని జోడించండి. ఐదు నిమిషాల పాటు గులాబీ రేకులతో సహా మరగబెట్టి, కప్పులలో నీటిని వడకట్టి వేరుచేయండి. ఈ ద్రావణానికి మీ ఎంపిక ప్రకారం, స్వీటెనర్లను జోడించండి. అంతేకాకుండా మీ ఇష్టానుసారం ఒక నిర్దిష్టమైన మోతాదులో సుగంధ ద్రవ్యాలను సైతం జోడించుకోవచ్చు. ఉదాహరణకు, దాల్చిన చెక్క, తాజా అల్లం, యాలకులు, లవంగాలు వంటి వాటిని గులాబీ టీలో చేర్చవచ్చు. ఈ సుగంధ ద్రవ్యాలలోని అనామ్లజనకాలు, యాంటీ బాడీస్ , యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు, రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. క్రమంగా శరీరంలో హార్మోనుల క్రమబద్దీకరణకు సహాయం చేస్తూ, జీవక్రియలను మెరుగుపరచి ఊబకాయం తగ్గించడంలో సహాయం చేస్తాయి. అదేవిధంగా తేనె వంటి సహజ సిద్దమైన స్వీటెనర్లలోని యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు, వాపు సమస్యలను తగ్గించడంతోపాటు జీర్ణక్రియలు సవ్యంగా కొనసాగేలా చర్యలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గులాబీ - టీ బరువు కోల్పోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కావున, రోజులో కనీసం ఒకటి లేదా రెండు సార్లు తీసుకునేలా ప్రణాళికలు చేసుకోవాలి. అయినప్పటికీ, మీరు ఫుడ్ అలెర్జీలకు గురవుతున్నట్లయితే, మీ ఆహార ప్రణాళికలో ఈ హెర్బల్ టీ జోడించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో భాదపడేవాళ్ళు ఆహార ప్రణాళికలలో నిర్ణయాలను తీసుకునే ముందు, సంబంధిత వైద్యుని సంప్రదించడం తప్పనిసరి అని మరువకండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read:బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం #mystory317 Most Read:బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం #mystory317

English summary

Rose Tea: 5 Weight Loss Benefits And Easy Ways To Make It At Home!

Rose is a flower that has wide-ranging uses in cooking as well. From using it to decorate sweets to making gulkand and rose sherbet out of the dried petals, Indians have been using rose flowers in foods and drinks since ages. Rose also finds a lot of use in cosmetics and organic creams and ointments. It has a host of health benefits that are great, both for our overall health as well as for enhancing beauty of the skin and face.
Desktop Bottom Promotion