Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ న్యాచురల్ ట్రీట్ మెంటుతో కీళ్లనొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందండి..
కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది మరో మంచి చిట్కా. నొప్పి, మంటను తగ్గించగలిగే ఆహారాన్ని గుర్తించి వాటిని తీసుకోవాలి.
జీవన విధానంలో మార్పులు కావొచ్చు. వాతావరణ, జీవన ప్రక్రియల్లో మార్పులు కావొచ్చు... కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవడం కష్టమైపోతుంది. ఇలాంటివి అంగవైకల్యానికీ దారితీస్తున్నాయి. అలాంటి వాటిలో కీళ్ల నొప్పులు ఒకటి. చిన్న వయసువారు ఈ వ్యాధికి గురవుతున్నారు. కీళ్లలో వాపుతో మొదలై తీవ్రమైన నొప్పి కలిగిస్తాయి.
కండరాల దృఢత్వాన్ని కోల్పోతారు. కీళ్ల నొప్పులకు చికిత్సా విధానాలున్నా వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి అవి కీళ్లకే ప్రమాదంగా పరిణమిస్తాయి. తాత్కాలికంగా నొప్పి నివారణ ఉన్నా శాశ్వత పరిష్కారం మాత్రం దొరకకపోవచ్చు.
అయితే భయపడకండి. మీరు గానీ, లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే గనుక ఈ చిన్న చిన్న సూత్రాలను పాటించండి. ఇవి సహజ విధానాలు, కీళ్ల నొప్పులను నిదానంగా తగ్గించగలవు. అయితే కేవలం మా సలహాల మీద ఆధారపడకుండా డాక్టర్‌ను సంప్రదించడమూ మంచిది.

1. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవాలి
ఆరోగ్య నిపుణులు చెప్పేదేమిటంటే నొప్పి, వాపు, మంట లాంటివి జీర్ణకోశంలో ప్రారంభమవుతాయి. ఆరోగ్యకర ఆహార నియమాలను పాటించాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) తగ్గించే ఆహార పదార్థాలను తగ్గించాలి. దీంట్లో భాగంగా చక్కెర, గుడ్లు, సోయా, గ్లూటెన్ ఉన్న పదార్థాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం మానేశాక కాస్త ఉపశమనంగా అనిపిస్తే ఇవి మీకు పడదని అర్థం చేసుకోవచ్చు. మూడువారాల తర్వాత వీటిలో ఒక్కొక్క దాన్ని తిరిగి తీసుకోవాలి. దీంట్లో ఏ ఆహారం మీకు పడటం లేదో తెలిసిపోతుంది.
2. నొప్పితో పోరాడేవాటిని తీసుకోండి
కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది మరో మంచి చిట్కా. నొప్పి, మంటను తగ్గించగలిగే ఆహారాన్ని గుర్తించి వాటిని తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం దీనికి ఉదాహరణ. తాజా కూరగాయలు, పండ్లు వీలైతే ఆర్గానిక్ వి తీసుకోవడం ఉత్తమం. శుద్ధి చేసిన చక్కెర, ధాన్యాలు, నూనె, కొవ్వు పదార్థాలు తీసుకోవడాన్ని తగ్గించేయాలి. తినే వాటిలో ఉప్పు తగ్గించుకోవాలి. కృత్రిమ రంగులుండే వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు.

3. ప్రశాంతంగా ఉండండి..
ఒత్తిడి అనేక రోగాలకు ముఖ్య కారణం అని చెప్పొచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఒత్తిడి ఉంటే అది మరింత తీవ్రతరంగా కనిపిస్తుంది. ధ్యానం, యోగా లాంటివి పాటించడం వల్ల మనసు, శరీరాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు.
4. ఆహారంలో పసుపు
పసుపుకు నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. మంటను తగ్గించడంతో పాటు దేహంలో ఎక్కడైనా నొప్పి లాంటివి ఉంటే పసుపు వాడితే ఫలితం ఉంటుంది.

5. మసాజ్
కీళ్ల దగ్గర మసాజ్ చేయించుకోండి. ఇది నొప్పిని, మంటను కొంత వరకు తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నిపుణులైన మసాజ్ థెరపిస్టులను ఇందుకు సంప్రదించాలి. వాళ్లు కీళ్ల నొప్పులు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని మసాజ్ బాగా చేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications