For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శాస్త్రవేత్తల ప్రకారం మర్చిపోయే అలవాటు కూడా వ్యక్తి మేధస్సుకు చిహ్నం : ఖచ్చితంగా అందరూ తెలుసుకోవలసిన విషయం

|

మానవశరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో మొదటిస్థానంలో ఉండేది మానవ మెదడు మాత్రమే. ఇది సరిగ్గా పనిచేస్తేనే, మిగిలిన అవయవాల గురించిన ఆలోచన చేస్తాడు మనిషి. అత్యంత క్లిష్టమైన శరీర అవయవాలలో ఒకటిగా ఉన్న మెదడు పనితీరుకు సంబంధించిన వివరాలకోసం శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మెదడు నిర్వహిస్తున్న అత్యంత ముఖ్యమైన ప్రక్రియల్లో ఒకటి సమాచారాన్ని గుర్తుంచుకోవడం. కానీ శాస్త్రవేత్తల ప్రకారం మరచిపోవడం కూడా ముఖ్యమైన పనే.

మతిస్థిమితం అనేది వృద్ధాప్య చిహ్నంగా గుర్తించబడుతుంది తరచుగా. మనం యుక్త వయస్సులో ఉన్నప్పుడు, మనకు ఏదైనా విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో లోపాలు కనిపించినా, పెద్దగా పట్టించుకోము. కానీ వయసు పెరిగేకొద్దీ, ఈ పరిస్థితి ఒక అనారోగ్య సమస్యగా కూడా భావిస్తుంటాం. ఒక వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మెదడులోని కొన్ని మార్పులను జరగకుండా చేయడం అసాధ్యం. కానీ జ్ఞాపకశక్తి సమస్యలు అలా కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

విషయాలు మర్చిపోవడం అనేది ఆలోచించాల్సినంత ప్రధానమైన సమస్య కాదని, మరియు ఈ కారణంచేత తీవ్రంగా మదనపడడం అనవసరమని సూచిస్తున్నారు; శాస్త్రవేత్తలు జరిపిన అనేక అధ్యయనాల ప్రకారం, మరచిపోవడం అనేది వాస్తవానికి “స్మార్ట్” లేదా మేధస్సుకు చిహ్నంగా ధృవీకరిస్తున్నారు.

మరచిపోవడం మేధస్సుకు సంకేతమా? అదెలా? అసలు శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో చూద్దాం.

1. మతిమరుపు మరియు మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితి

1. మతిమరుపు మరియు మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితి

మతిమరుపు మరియు మతిస్థిమితంలేని సాధారణ ప్రజలను అనేకమందిని తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ సమస్య వ్యక్తి యొక్క స్థితిగతులకు సంబంధాన్ని కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. మరియు ఆ వ్యక్తి విషయాలను మరచిపోయినందుకుగాను, తరచుగా ఎగతాళికి గురి చేయబడుతుంటాడు కూడా. భాదాకరమైన విషయం. నిజానికి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, తక్కువస్థాయిలో ఏకాగ్రతని మరియు పునరావృత ఆలోచనా స్థితుల ఆటంకాలతో బాధపడుతుంటారు. దీనిని ఒక మానసిక పరిస్థితిగా సమాజంతో పాటు వైద్యులు కూడా పరిగణిస్తారు. ఈ మతిస్థిమితం కోల్పోవడం అనేది, తరచుగా వారి రోజువారీ జీవితాలను తీవ్రంగా దెబ్బతీసేలా నిరాశపరుస్తుంటాయి.

2. మరుపు యొక్క చిహ్నాలు

2. మరుపు యొక్క చిహ్నాలు

ఈ సమస్యను గుర్తించే విషయానికి వస్తే మతిమరుపుకు అనేక సంకేతాలు, ముందస్తు లక్షణాలుగా ఉన్నాయి. అయినప్పటికీ, మతిభ్రమణ సంకేతాలు వ్యక్తివ్యక్తికీ తరచుగా మారుతూ ఉండడం కారణాన, ఇది చిత్తవైకల్యం మరియు/లేదా అల్జీమర్స్ వ్యాధికి సంకేతాలుగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేకపోవడం వంటివి కూడా మతిమరుపు సంకేతంగా ఉంది. నిద్రలేకపోవడం కూడా మానసిక మార్పులు, ఆందోళన, మరియు కోపం పెరుగుదలకు కారణమవుతుంది. గతించిన విషయాలు మరచిపోతున్న వ్యక్తులు నిరంతరం మళ్ళీ అదే విషయం గురించి తరచుగా అడగడం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా సులభమైన మరియు సుపరిచితమైన పనులు పూర్తి చేయడానికి కూడా అధిక సమయం తీసుకోవడం జరుగుతుంటుంది.

3. విషయాలు మర్చిపోవడం సర్వసాధారణం

3. విషయాలు మర్చిపోవడం సర్వసాధారణం

శాస్త్రవేత్తల ప్రకారం, గడిచిపోయిన విషయాలను మరచిపోవడం అత్యంత సాధారణమైన అంశంగా కనుగొన్నారు. నిజజీవితంలో నిర్ణయం తీసుకోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ జ్ఞాపకశక్తి, గతంలోని విషయాలను గుర్తుకు చేసేందుకు సహాయపడడమే కాకుండా, ఆ విషయాల ఆధారితంగా, భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడగల అత్యంత ముఖ్యమైన సమాచారం ఇవ్వడంలో కూడా సహాయం చేస్తుందని శాస్త్రవేత్తల నివేదిక.

4. మెదడు ఎలా జ్ఞాపకాలను సృష్టిస్తుంది?

4. మెదడు ఎలా జ్ఞాపకాలను సృష్టిస్తుంది?

మానవ మెదడు అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది, అదేవిధంగా అతి ముఖ్యమైన అవయముగా కూడా ఉంటుంది. మెదడు జ్ఞాపకాలను ప్రాసెస్ చేసే విధానం నిజంగా ఒక అద్భుతమైన విషయమనే చెప్పాలి. మెదడు నిరంతరం జ్ఞాపకాలను ప్రోత్సహిస్తుంది మరియు పాత వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పరుస్తూ ఉంటుంది. అతి ముఖ్యమైన జ్ఞాపకాలను దీర్ఘకాలం ఉండేలా జాగ్రత్త వహిస్తుంది. మరియు స్వల్పకాలానికి సంబంధించిన జ్ఞాపకాలు, అందులోనూ ముఖ్యంకాని విషయాలు తొలగించబడాలని నిర్ణయిస్తుంది కూడా. ఉదాహరణకు రోజులో 24గంటలలో మీకు ఎన్ని జ్ఞాపకాలు నిద్రపోయే ముందు గుర్తుకు తెచ్చుకోగలరు, అదే విధంగా గడిచిపోయిన కాలాలలో ఎన్ని రోజులు మీమనసులో మెదులుతున్నాయి, అందులో జ్ఞాపకాలు ఎన్ని? ఒక్కసారి ఆలోచిస్తే, మెదడు గొప్పదనం ఇట్టే అర్ధమైపోతుంది.

5. అసలు అద్యయనం ఏం చెప్తుంది :

5. అసలు అద్యయనం ఏం చెప్తుంది :

ఒక కొత్త అధ్యయనం చెప్పిన వివరాల ప్రకారం, వాస్తవానికి విషయాలను మరచిపోవడం కూడా, మేధస్సును పెంచడంలో మరియు చురుకైన వ్యక్తులుగా మార్చడంలో సహాయపడుతుంది. కొత్త అధ్యయనం ప్రకారం, మెదడు భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవటానికి కీలకపాత్ర పోషిస్తుంది కాబట్టి, ఆ జ్ఞాపకాలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మెదడు జ్ఞాపకాలతో పూర్తిస్థాయిలో నిండిపోయి ఉన్నప్పుడు, నిల్వచేయబడిన జ్ఞాపకాలన్నీ, అసమ్మతికిలోనై, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావాన్ని చూపుతుంది. న్యూరాన్ జర్నల్ రికార్డ్స్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మరచిపోవడం అనేది మానవ మెదడులో జరుగుతున్న ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే, కానీ అది మరికొంత చురుకుగా ఆలోచించేలా మెదడును ప్రోత్సహిస్తుంది.

6 జ్ఞాపకాల ప్రధాన ఉద్దేశం

6 జ్ఞాపకాల ప్రధాన ఉద్దేశం

ఈ అధ్యయనంలో వివరాలను విస్మరించడం మరియు మరచిపోడం అనేది ఎన్నటికీ తప్పుకాదు అని పేర్కొంది. అభ్యాసం ప్రకారం, మంచి జ్ఞాపకాలతో ఉన్న వ్యక్తులు (లేదా) అనేక వివరాలను తిరిగి గుర్తుతెచ్చుకునే సామర్ధ్యం కలిగిన వారిని సాధారణంగా తెలివైన వ్యక్తులుగా భావించబడతారు. అయితే, ఈ అధ్యయనం నిర్ధారించిన వివరాల ప్రకారం, ప్రజలు గంతించిపోయిన విషయాలను ఎలాగైతే మర్చిపోతారో, ముఖ్యమైన వివరాలను కూడా అంతే స్థాయిలో గుర్తుంచుకుంటారు. మనిషి యొక్క “సుప్తచేతన లేదా ఉపచేతనా వ్యవస్థ”(సబ్-కాన్షియస్)లో ఆ వివరాలు భద్రపరచబడి ఉంటాయి. సందర్భాలను బట్టి ఆ వివరాలు గుర్తుకు వస్తుంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యమైన వివరాలను గుర్తుకు తెచ్చుకోవడానికి కారణం ఇదే. వివరాలను పూర్తిస్థాయిలో మరచిపోయినా కూడా, ఆ జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి.

7. ఒక ఉదాహరణతో వివరిస్తూ:

7. ఒక ఉదాహరణతో వివరిస్తూ:

ఏ సమాచారం తుడిచివేయబడింది, అనేది సంబంధిత పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు గతించిన విషయాలు గుర్తుంచుకోవడానికి ఎంచుకునే మార్గం, కొన్ని విషయాలమద్య నలుగుతూ ఉంటుంది. అవి 1. ఎప్పుడు వివరాలను గుర్తుకు తెచ్చుకోవాలి., 2. ఎక్కడ ఈ వివరాలు మనకు అవసరం లేదు., 3. ఆ వివరాలు ఇక్కడ ఎంతమేర అవసరం., 4. వాటిని గుర్తుతెచ్చుకోవడం వలన కలిగే లాభాలేమిటి.

 8. మరిచిపోతే ప్రయోజనకరం ఎలా అవుతుంది?

8. మరిచిపోతే ప్రయోజనకరం ఎలా అవుతుంది?

మెదడులోని హిప్పోకాంపస్ (జ్ఞాపకాలు సురక్షితంగా ఉంచుకోవడానికి మెదడుకు సహాయపడే ప్రాంతం) నిర్ణయం తీసుకోవడంలో ప్రాథమిక ప్రాతిపదికన ఉన్న అత్యంత ముఖ్యమైన వివరాలను తొలగిస్తుంది. అధ్యయనం ప్రకారం, ఆ విషయాలు మరచిపోవడం కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఉత్తమంగా పనిచేయగలవు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకునేటప్పుడు, అతడు/ఆమె వారి ఎంపికల ప్రకారం ఏ సమయంలోనైనా, గతించిపోయిన కొన్ని ముఖ్యమైన వివరాలు గుర్తుచేసుకుంటాడు. ఈ ప్రక్రియలో మెదడులోని అనవసరమైన వివరాలు తొలగించబడి, ముఖ్యమైన వాటిని మాత్రమే నిల్వ చేసేలా ప్రయత్నిస్తుంది. క్రమంగా కొన్ని ప్రాపంచిక వివరాలను సైతం మరచిపోయే పరిస్థితులు వస్తుంటాయి.

9. మీరు గతించిన వివరాలను మరచిపోయినట్లయితే చింతించవలసిన అవసరం లేదు

9. మీరు గతించిన వివరాలను మరచిపోయినట్లయితే చింతించవలసిన అవసరం లేదు

విషయాలు మరచిపోతున్నామన్న అవగాహనకు వచ్చినప్పుడు భయపడాల్సిన మరియు చింతించాల్సిన అవసరం లేదు. ఇది మీ మెదడులోని సమాచారాన్ని ఫిల్టరింగ్ చేసే ఒక ప్రక్రియ మాత్రమే. మెదడు ఏ వయస్సులోనైనా తాజా కణాలను ఉత్పత్తి చేయడంలో పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఉంటుంది, కావున జ్ఞాపకశక్తి కోల్పోవడం, వృద్ధాప్య లక్షణాల యొక్క ఊహించిన ఫలితం ఎన్నటికీ కాజాలదు. కానీ మీ కండరాల శక్తి వలె, మీరు ఆలోచించే విధానం మీద మీ ఆలోచనాశక్తి ఆధారపడి ఉంటుంది.

10 మర్చిపోవడమే వాస్తవానికి అధిక మేధాసంపత్తికి సంకేతం

10 మర్చిపోవడమే వాస్తవానికి అధిక మేధాసంపత్తికి సంకేతం

"మెదడు అసందర్భమైన వివరాలను మరచిపోతుంది, బదులుగా నిజజీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే అంశాలపై దృష్టి పెడుతుంది,"ఆ వయసులో జీవక్రియలు సవ్యంగా సాగడానికి, గతించిన జ్ఞాపకాలను మరచిపోవడమే మంచిదని టొరంటో యూనివర్సిటీ జర్నల్ రచయితైన, ప్రొఫెసర్ బ్లేక్ రిచర్డ్స్ చెబుతున్నాడు.

ఈ పరిశోధకుని అభిప్రాయం ప్రకారం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం ద్వారా గతించిన వివరాలు తుడిచిపెట్టుకునిపోయి, నూతన విషయాల గురించిన నిర్ణయాలు తీసుకోవడంలో మెదడుకు సహాయపడగలదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(కృత్రిమ మేధస్సు)లో రెగ్యులరైజేషన్(క్రమబద్దీకరణ) సిస్టం వలె.

పరిశోధన ప్రకారం, జ్ఞాపకాలు కలిగి ఉండడమంటే పనికిరాని వివరాలను గుర్తుంచుకోమని కాదు. అయినప్పటికీ, పరిస్థితిని అనుసరించి, త్వరితగతిన సమయానుసారం అతను/ఆమె నిర్ణయం తీసుకోవడంలో తెలివైనవారిగా చేస్తుంది.

ఆల్బర్ట్ ఐన్స్టీన్ :

ఆల్బర్ట్ ఐన్స్టీన్ :

విజయవంతమైన మరియు ఇప్పటికీ అత్యధిక తెలివితేటలు గలిగిన వారిలో ఉదాహరణగా జర్మన్లో జన్మించిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరునే చెప్తారు. 1921లో సాపేక్ష సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకుగాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఐన్స్టీన్ తన తొమ్మిదవ పుట్టినరోజు వరకు స్పష్టంగా మాట్లాడలేదు కూడా. అతను కోల్పోయిన వాటిలో అధికంగా ఉన్నవి గొడుగులు. అతనికి అంత మెమరీ లాస్ ఉండేది. అతను ముఖ్యమైన తేదీలను, అపాయింట్మెంట్లను కూడా మరచిపోయేవాడు. అంతేకాకుండా తరచుగా ఫోన్ నంబర్లు మరియు పుట్టినరోజులు సైతం మరచిపోయేవాడు. అతను తన సొంత పుట్టినరోజును కూడా జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉండేవాడు.

అయితే, ఐన్స్టీన్ తెలివితక్కువవానిగా మాత్రం ఎవరూ చెప్పరు. అతని పేరు, మేధావికి పర్యాయ పదంగా ఉంది మరియు అతను విజ్ఞానశాస్త్రంలో చేసిన రచనలు అపారమైనవి. క్రమంగా ఇతని రచనలు, విధానాలు ఈ అంతర్దృష్టి శాస్త్రవేత్తను సైన్స్ చరిత్రలోనే ఒక చెరిగిపోని అద్భుతంగా చేశాయి.

English summary

Scientists Say That Forgetfulness Is a Sign of Intelligence

Forgetting things is a not a major problem and it is not just a thing that is being said; now scientists have confirmed that forgetting things is actually a sign of being smart.Read further to understand how you should not fret over losing things and consider yourself smart.