ట‌మాటాలతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి విన్నారా?

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ట‌మాట లేనిదే దాదాపు చాలా కూర‌లను పూర్తి చేయ‌లేం. ట‌మాట వేస్తేనే కూర‌, ప‌ప్పు, సాంబారు, చారులో రుచి వ‌స్తుంది. దోర ఎర్ర‌ని ట‌మాట అంటే ఇష్టం లేనివాళ్లు బ‌హుశా అరుదు అని చెప్పాలి. మ‌రి ట‌మాట తిన్నా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ‌న్న సంగ‌తిని తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం...

ట‌మాటలు ఎక్క‌డ పుట్టాయంటే...

ట‌మాట‌ల శాస్త్రీయ నామ సోలాన‌మ్ లైకోపెర్సిక‌మ్‌. ఇది సోల‌నేసియా వృక్ష కుటుంబానికి చెందిన మొక్క‌. ట‌మాట‌లు మ‌ధ్య‌, ద‌క్షిణ అమెరికాలో పుట్టింది. మెక్సికోలో దీన్ని తొలుత ఉప‌యోగించారు. క్ర‌మేణా ఇది ప్ర‌పంచ‌మంత‌టా వ్యాప్తి చెందింది.

ఇవాళ ట‌మాట‌ను ప‌చ్చిగా, ఉడ‌క‌బెట్టి తిన‌డ‌మే కాదు.. వివిధ వంట‌కాల్లో, సాసులు, డ్రింకులు, స‌లాడ్ల‌లో రూపంలో భాగం చేసుకుంటున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

ట‌మాలు ఎందుకు హానిక‌రం...?

మామూలుగా ట‌మాట తిన‌డం మంచిదే. కానీ కొంద‌రిలో ఇవి స‌మ‌స్య‌లను తెచ్చిపెట్ట‌గ‌ల‌దు. అసిడిటీ, కండ‌రాల నొప్పి, అస్థిర‌త్వం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ద‌రిచేరే అవ‌కాశం ఉంది.

ట‌మాట ఆకులు కూడా చాలా ప్ర‌మాద‌క‌రం. పెద్ద మొత్తంలో ట‌మాట తీసుకుంటే వాంతులు, విరేచ‌నాలు, త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్ర‌ధానంగా ట‌మాట‌లో ఉండే లైకోపీన్ అనే ప‌దార్థం మూలాన సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. అయితే ఆశ్చ‌ర్యంగా ఈ లైకోపీన్ వ‌ల్ల లాభాలూ ఉన్నాయి.

ట‌మాట‌లో లైకోపీన్ ఏం చేస్తుంది?

చాలా సంద‌ర్భాల్లో లైకోపీన్ చాలా సుర‌క్షిత‌మైన‌ది. కానీ గ‌ర్భ‌వ‌తులుగా ఉన్న‌వారికి లైకోపీన్ స‌ప్లిమెంట్లు అస్స‌లు ఇవ్వ‌కూడ‌దు. లైకోపీన్ వ‌ల్ల ప్రోస్ట్రేట్ క్యాన్స‌ర్ వచ్చే ప్ర‌మాద‌ముంది.

ఉద‌ర అల్స‌ర్లు లేదా ఉద‌ర స‌మ‌స్య‌లున్న‌వారికి లైకోపీన్‌తో స‌మ‌స్య జ‌టిలం కావ‌చ్చు. అందుకే వీరు ట‌మాట‌ల‌ను త‌గ్గించి తీసుకోవాలి. ఇక లైకోపీన్ బీపీ త‌గ్గిస్తుంది. లో బీపీ ఉన్న వారు ట‌మాట‌ల‌కు దూరంగా ఉండాలి. బ్లీడింగ్ డిజార్డ‌ర్లు ఉంటే దాన్ని మ‌రింత ఎక్కువ చేస్తుంది. ఇక ఇత‌ర సైడ్ ఎఫెక్ట్స్‌లో భాగంగా ఛాతీ నొప్పి, చ‌ర్మం కింద కొవ్వు పేరుకుపోవ‌డం, అజీర్తి, ఎర్ర మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టం లాంటివి ఉంటాయి. క్యాన్స‌ర్ చికిత్స తీసుకునేవారు ట‌మాట‌లకు దూరంగా ఉండ‌ట‌మే మేలు.

ట‌మాట‌ల‌తో వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వివ‌రంగా తెలుసుకుందాం...

1. యాసిడిటీ లేదా వేడి

1. యాసిడిటీ లేదా వేడి

ట‌మాట‌లు అధిక యాసిడిటీని క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల వేడి క‌ల‌గ‌వ‌చ్చు. ట‌మాట‌ల్లో మాలిక్‌, సిట్రిక్ యాసిడ్లు ఉండ‌టం వ‌ల్ల అధిక మొత్తంలో గ్యాస్ట్రిక్ ఆమ్లం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇది ఎక్కువ అయితే క‌డుపులో మంట‌లా అనిపిస్తుంటుంది. ప‌చ్చి ట‌మాట‌లు తిన్న‌వారికి ఇలా అవ్వ‌డం చూడ‌వ‌చ్చు. ఇక ట‌మాట‌ల‌ను ఉడ‌క‌బెట్టినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. ట‌మాట‌లు ఉద‌ర సంబంధ వ్యాధుల‌ను ప్రేరేపించ‌గ‌ల‌వు అని రుజువైంది. మేరీల్యాండ్ మెడిక‌ల్ సెంట‌ర్ అనే విశ్వ‌విద్యాల‌యం వారు ట‌మాట‌ల‌పై చేసిన ప‌రిశోధ‌న‌లో భాగంగా ఈ విష‌యం రుజువైంది.

2. అలర్జీలు, ఇన్ఫెక్ష‌న్లు

2. అలర్జీలు, ఇన్ఫెక్ష‌న్లు

ట‌మాట‌లతో అల‌ర్జీ ఉన్న వ్య‌క్తుల‌కు ఆ ప్ర‌భావం వెంట‌నే క‌నిపిస్తుంది. వాటిలో స్కిన్ ర్యాషెస్‌, ఎక్‌జీమా, ద‌గ్గు, ముక్కు దిబ్బ‌డ‌, గొంతులో గ‌ర‌గ‌ర‌, మొహం ఉబ్బ‌డం, నాలుక‌, నోరు వాచిన‌ట్టు అవ్వ‌డం లాంటి సాధార‌ణం. ట‌మాట‌ల్లో హిస్ట‌మైన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇదే అల‌ర్జీల‌కు దారితీస్తుంద‌ని పోలాండ్‌లో జ‌రిగిన ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. ట‌మాట‌లు చ‌ర్మ సంబంధ అల‌ర్జీల‌ను కూడా క‌లిగిస్తుంది. పెదాలు కూడా త‌డారిపోయిన‌ట్టుగా అనిపిస్తుంది. కొంద‌రికి క‌ళ్ల చుట్టు ఎర్ర‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌వ‌చ్చు.

3. కిడ్నీ స‌మ‌స్య‌లు

3. కిడ్నీ స‌మ‌స్య‌లు

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమ‌న్ స‌ర్వీసెస్ వాళ్లు ప్ర‌చురించిన నివేదిక ఆధారంగా ట‌మాట‌లు తిన్న‌వారికి కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని తేల్చారు. ట‌మాట‌ల్లో అధిక మోతాదులో పొటాషియం ఉంటుంది. తీవ్ర‌మైన కిడ్నీ స‌మ‌స్య‌లున్న‌వారు ట‌మాట‌ల‌ను త‌గ్గించి తీసుకోవ‌డం మేలు. ట‌మాట‌లను సాస్ రూపంలోనూ తీసుకోవ‌డం త‌గ్గించాల‌ని చెబుతారు. ట‌మాట సాస్ ల‌లో అధిక మొత్తంలో ఆక్స‌లేట్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను మ‌రింత జ‌టిలం చేయ‌వ‌చ్చు.

4. బొవెల్ సిండ్రోమ్‌

4. బొవెల్ సిండ్రోమ్‌

ట‌మాట‌ల‌పైన ఉండే చ‌ర్మం, వాటి విత్త‌నాలంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇవే చిరాకు తెప్పించే బొవెల్ సిండ్రోమ్‌కు కార‌ణం కావ‌చ్చు. పెద్ద పేగు, చిన్న‌పేగు స‌మ‌స్య‌ల‌కు కూడా ట‌మాట‌లు కార‌ణం కావ‌చ్చు.

5. డ‌యేరియా

5. డ‌యేరియా

ట‌మాట‌లంటే ప‌డ‌ని వ్య‌క్తుల్లో డ‌యారియా స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. లాంగ్‌వుడ్ విశ్వ‌విద్యాల‌యం వారు ప్ర‌చురించిన నివేదిక‌లో ట‌మాట‌లు జిగుటుగా, ఆమ్లాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తేల్చారు. డ‌యేరియాతో బాధ‌ప‌డేవారు వీటిని తిన‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అంటారు. ఇక యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటావారు ట‌మాట‌ల్లో సాల్మొనెల్లా అనే సూక్ష‌క్రిములు పెరిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌ని ఇదే డ‌యేరియాకు దారితీయ‌వ‌చ్చ‌ని తేల్చారు.

6. అధిక సోడియం

6. అధిక సోడియం

త‌క్కువ మోతాదులో ఉన్న ట‌మాట సాస్‌ల‌ను ఎంచుకోమ‌ని నిపుణులు సూచిస్తారు. సాధార‌ణంగా ట‌మాట సాస్‌ల‌లో ఎక్కువ మొత్తంలో సోడియం క‌లుపుతారు. ఒక క‌ప్పు ట‌మాట సాస్‌లో 700 నుంచి 1260 మి.గ్రా. సోడియం ఉంటుంది. ఇక క్యాన్డ్ ట‌మాట‌ల్లో 220 మి.గ్రా. సోడియం ఉంటుంది.

7. లైకోపీనో డెర్మియా

7. లైకోపీనో డెర్మియా

అన్ని ర‌కాల ట‌మాట‌ల్లో లైకోపీన్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అధిక మొత్తంలో లైకోపీన్ తీసుకుంటే లైకోపీనో డెర్మియా స‌మ‌స్య ఏర్ప‌డ‌వ‌చ్చు. దీని వ‌ల్ల చ‌ర్మం డీప్ ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఇది పెద్ద ఆరోగ్య స‌మ‌స్య కాదుగానీ చూసేందుకు మాత్రం బాగుండ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి సులువుగానే కోలుకోవ‌చ్చు. ట‌మాట‌ల‌ను తిన‌డం త‌గ్గించాలంతే.

8. మూత్ర స‌మ‌స్య‌లు

8. మూత్ర స‌మ‌స్య‌లు

ఆమ్లాలు అధికంగా ఉండే ట‌మాట‌లు తిన‌డం వ‌ల్ల మూత్ర‌నాళాల్లో చిరాకు క‌లిగి మూత్ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. కొన్ని సార్లు సిస్టైటిస్ అనే స‌మ‌స్య ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇది మూత్ర‌నాళంలో మంట పుట్టిస్తుంది.

9. ఒళ్లు నొప్పులు

9. ఒళ్లు నొప్పులు

శ‌రీరంలోని రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ ట‌మాట‌ల్లోని ప్రోటీన్ల‌తో రియాక్ట‌యితే హిస్ట‌మైన్ అనే కంపౌండ్ విడుద‌ల‌వుతుంది. ఇది బాడీలో స్వెల్లింగ్‌, జాయింట్ పెయిన్స్ తీసుకురాగ‌ల‌దు.

ట‌మాటల్లో సోల‌నైన్ అనే ప‌దార్థం ఉంటుంది. ఇది క్యాల్షియంను పెంచి అవ‌యవాల్లో ఇన్‌ఫ్ల‌మేష‌న్ క‌లిగిస్తుంది. ట‌మాట‌ల‌ను తింటే యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెరుగుతాయి. కొంద‌రిలో ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చిపెట్ట‌గ‌ల‌దు.

10. శ్వాస స‌మ‌స్య‌లు

10. శ్వాస స‌మ‌స్య‌లు

ట‌మాట‌లంటే ప‌డ‌నివారు అవి తీసుకుంటే శ్వాస స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన‌వ‌చ్చు. అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ వారు ట‌మాట‌లను తిన్న కొంద‌రికి అల‌ర్జీలు, శ్వాస స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్టు గుర్తించారు.

11. మైగ్రేన్‌

11. మైగ్రేన్‌

ట‌మాట‌లు మైగ్రేన్ త‌ల‌నొప్పిని తీసుకురాగ‌వు అని తేల్చారు. నిపుణుల ప్ర‌కారం డైట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు 40శాతం మేర మైగ్రేన్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చంటారు. ఇరాన్‌లో జ‌రిగిన ప‌రిశోధ‌న ప్ర‌కారం ట‌మాట‌లు మైగ్రేన్ త‌ల‌నొప్పి మ‌రింత పెంచే అవ‌కాశం ఉంద‌ని తేల్చారు.

12. తీవ్ర‌మైన ఉద‌ర స‌మ‌స్య‌లు

12. తీవ్ర‌మైన ఉద‌ర స‌మ‌స్య‌లు

ట‌మాట‌ల్లో అధిక మొత్తంలో ఆమ్లాలు ఉన్న కార‌ణంగా అవి తింటే క‌డుపు అప్‌సెట్ అవొచ్చు. వేడి క‌ల‌గ‌వ‌చ్చు. దీని వ‌ల్ల తీవ్ర‌మైన ఉద‌ర స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు.

పైన పేర్కొన్న వివిధ అంశాల ద్వారా ట‌మాట‌ల‌ను అధిక మోతాదులో తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డాలి. అంతేకాదు ట‌మాట‌లంటే అల‌ర్జీ ఉన్న‌వారు మిగ‌తావారి కంటే మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

గ‌ర్భ‌వ‌తులు, పాలిచ్చే త‌ల్లులు జాగ్ర‌త్త‌...

గ‌ర్భ‌వ‌తులు, పాలిచ్చే త‌ల్లులు జాగ్ర‌త్త‌...

మూమూలుగా అయితే ట‌మాట‌లు గ‌ర్భ‌వ‌తుల‌కు, పాలిచ్చే త‌ల్లుల‌కు మంచిదే. అయితే ఎక్కువ మోతాదులో తింటే క‌ష్ట‌మే అంటారు డాక్ట‌ర్లు. లైకోపీన్‌ను స‌ప్లిమెంట్ల రూపంలో తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఇక ట‌మాట సాస్‌ను వీలైనంత మేర‌కు దూరంగా పెట్ట‌డ‌మే మంచిది. ముఖ్యంగా పాలిచ్చే త‌ల్లులు సాస్ అధికంగా సేవిస్తే బిడ్డ‌ల‌కు అసౌక‌ర్యంగా ఉంటుంది.

English summary

Serious Side Effects Of Tomatoes

Serious Side Effects Of Tomatoes, The Indian kitchen is incomplete without tomatoes! No wonder a rise in the price of tomatoes sends us into a tizzy! An integral part of the Indian cuisine, tomatoes offer color, flavor, and a
Story first published: Wednesday, April 25, 2018, 12:00 [IST]