మౌత్ అల్సర్స్ నుంచి ఉపశమనాన్నందించే 7 బెస్ట్ హోమ్ రెమెడీస్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

అల్సర్స్ అనేవి విపరీతంగా ఇబ్బందిపెడతాయి. ఈ అల్సర్స్ సమస్య అనేది సాధారణమైనదే. దీని బారిన పడని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. పెదవులపై, బుగ్గలపై, అలాగే నోటి పైభాగాన కనిపించే కురుపులనే అల్సర్స్ అనంటారు. ఇవి హానికరం కాకపోయినా ఇవి మనకి అత్యంత అసౌకర్యాన్ని గురిచేస్తాయి. తినడంపై ఆసక్తిని నశింపచేస్తాయి. కాన్స్టిపేషన్, హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు, విపరీతమైన ఎసిడిటీ వలన అల్సర్స్ తలెత్తుతాయి. కొన్నిసార్లు, కొన్ని లోపాల వలన అల్సర్స్ సమస్య వేధిస్తుంది. విటమిన్ బి, విటమిన్ సి అలాగే ఐరన్ లోపాల వలన అల్సర్స్ ఏర్పడతాయి.

అదృష్టవశాత్తూ, కొన్ని ప్రభావవంతమైన అలాగే సులభమైన హోంరెమెడీస్ ను పాటించడం ద్వారా అల్సర్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అందువలన, అల్సర్స్ ని తొలగించుకోవడానికి మెడిసిన్స్ వైపు చూడకుండా కేవలం కిచెన్ వైపు చూసి అందులో లభించే అత్యద్భుతమైన పదార్థాలతో అల్సర్ నుంచి విముక్తి పొందండి.

1. హనీ:

1. హనీ:

హనీలోనున్న ఔషధగుణాలు మనం రుణపడి ఉండాలి. ఇది అల్సర్ ని తొలగించడంలో అత్యద్భుతమైన పాత్రని పోషిస్తుంది. తేమని అందించి పొడిబారకుండా రక్షిస్తుంది. మీరు కాస్తంత హనీని తీసుకుని అల్సర్ పై అప్లై చేయాలి. హనీలో టర్మరిక్ ను కూడా కలిపితే హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేయవచ్చు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే ఉపశమనం లభిస్తుంది.

2. కొబ్బరి నూనె:

2. కొబ్బరి నూనె:

అల్సర్ వలన వాపు వంటివి కలుగుతాయి. ఈ అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగించేందుకు కొబ్బరి నూనె ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో, యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి అల్సర్ ని తగ్గించేందుకు తోడ్పడతాయి. ఒక కాటన్ బాల్ ని తీసుకుని దానిని వర్జిన్ కోకోనట్ ఆయిల్ లో ముంచి అల్సర్ పై అప్లై చేయండి. ఈ పద్దతిని ప్రతి కొన్ని గంటలకి పాటించడం వలన ఉపయోగం ఉంటుంది. అలాగే, నిద్రపోయే ముందుకు కాస్తంత కొబ్బరినూనెను అల్సర్ పై అప్లై చేస్తే కూడా ప్రయోజనం ఉంటుంది.

3. ఆపిల్ సిడర్ వినేగార్:

3. ఆపిల్ సిడర్ వినేగార్:

ఇది కొంత ఘాటుగా ఉన్నప్పటికీ దీని ఎసిడిక్ నేచర్ అనేది అల్సర్ కి విరుగుడుగా పనిచేస్తుంది. ఆపిల్ సిడర్ వినేగార్ రెమెడీ కొంచెం పెయిన్ ఫుల్ గా ఉన్నా దీని వల్ల కలిగే ప్రయోజనం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక కప్పుడు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని కలిపి ఆ సొల్యూషన్ ని నోటిలోకి తీసుకుని పుక్కిలించాలి. ఈ విధంగా ప్రతి ఉదయం అలాగే ప్రతి రాత్రి చేయడం ద్వారా అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. సాల్ట్ వాటర్:

4. సాల్ట్ వాటర్:

ఈ హోమ్ రెమెడీ అనేది అత్యంత ప్రభావవంతమైనది. సాల్ట్ వాటర్ తో గార్గిల్ చేయడం ద్వారా అల్సర్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్సర్ పై సూతింగ్ ఎఫెక్ట్ ను అందించేందుకు వాటర్ తోడ్పడితే సాల్ట్ అనేది అల్సర్ ని హీల్ చేయడానికి తోడ్పడుతుంది. గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ను జోడించాలి. ఈ సొల్యూషన్ తో ప్రతి కొన్ని గంటలకు ఒకసారి గార్గ్లింగ్ చేయాలి. ఇలా చేస్తే అల్సర్ నుంచి వేగవంతమైన ఉపశమనం లభిస్తుంది.

5. టూత్ పేస్ట్:

5. టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్ లోనున్న యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలవలన అల్సర్ ద్వారా కలిగే ఇన్ఫెక్షన్ నశింపబడుతుంది. అలాగే, టూత్ పేస్ట్ లో కూలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి అల్సర్ ద్వారా కలిగే మంటని తగ్గిస్తాయి. తద్వారా, అల్సర్ ద్వారా కలిగే అసౌకర్యాల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. టూత్ పేస్ట్ అప్లై చేసిన కాసేపటికి అలోవెరా జెల్ ను అప్లై చేయడం ద్వారా కూడా మీకు అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కాస్తంత టూత్ పేస్ట్ ను తీసుకుని అల్సర్ పై అప్లై చేయండి. కాసేపలాగే ఉండనిచ్చి ఆ తరువాత నోటిని శుభ్రపరుచుకోండి. అల్సర్ తగ్గుముఖం పట్టే వరకు ఈ రెమెడీని పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.

6. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్:

6. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్:

శరీరానికి తగినంత విటమిన్ సీ ని అందిస్తే అల్సర్ సమస్యలు తలెత్తవు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అల్సర్ అనేది విటమిన్ సి లోపం వలన తలెత్తుతుంది. అందువలన, మీ శరీరానికి అవసరమైనంత విటమిన్ సీ ని మీరు తీసుకుంటే అల్సర్ సమస్య వేధించదు. రోజుకు రెండు గ్లాసుల ఆరంజ్ జ్యూస్ ను తీసుకుంటే అల్సర్ తగ్గుముఖం పడుతుంది.

7. గార్లిక్:

7. గార్లిక్:

గార్లిక్ అనేది అనేక హోంరెమెడీస్ లో ముఖ్యమైన ఇంగ్రిడియెంట్ గా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకుంది. అల్సర్ ని నివారించడానికి కూడా గార్లిక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక గార్లిక్ క్లోవ్ ని తీసుకుని అల్సర్ పై రబ్ చేయండి. ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు ఇలా చేయడం ద్వారా మీరు అల్సర్ నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు. 30 నిమిషాల తరువాత మీ నోటిని శుభ్రపరచుకోవాలి. అల్సర్ తగ్గుముఖం పట్టే వరకు ఈ పద్దతిని పాటించాలి.

English summary

Seven Best Home Remedies For Mouth Ulcers

You all must have experienced ulcers at some point of time. They are sores that appear on your lips, cheeks and the floor of your mouth. Though harmless, ulcers can be extremely painful and may even kill your desire to eat. Ulcers can take place due to constipation, hormonal fluctuations and extreme acidity. Sometimes ulcers take place due to deficiencies like iron deficiency, vitamin B and C deficiency too.
Story first published: Wednesday, February 14, 2018, 10:30 [IST]
Subscribe Newsletter