Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
లైంగికంగా వ్యాప్తి చెందే రోగాలు (STDs) మరియు అంటువ్యాధులు (STIs) గురించి తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు!
లైంగికంగా వ్యాప్తి చెందే రోగాలు (STDs) మరియు అంటువ్యాధులు (STIs) గురించి తెలుసుకోవలసిన కొన్ని వాస్తవాలు!
మీరు ఎవరితో అయినా కొత్తగా డేటింగ్ మొదలుపెట్టారని ఊహించుకోండి. వారితో మీ అనుబంధాన్ని ఒకే మంచం పంచుకోవడం ద్వారా, మీ అనుబంధాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నారా?
అయితే, అటువంటి సందర్భంలో ఈ తరం వారు ముందుగా ఆలోచించేది, వారు "శుభ్రత"ను పాటిస్తారా అనే!
లైంగిక విషయాలలో "శుభ్రత" అనే పదానికి అర్ధం ఆ వ్యక్తికి ఎటువంటి లైంగికంగా వ్యాప్తి చెందే రోగాలు (STDs) కానీ లేక అంటువ్యాధులు (STIs) కానీ లేకుండా ఉండటమే!
ఈ రోజుల్లో STDs మరియు STIs ప్రబలంగా ఉన్నాయి కనుక,ఒక వ్యక్తికి శారీరకంగా దగ్గరయ్యే ముందు, చాలామందిలో తలెత్తే సాధారణమైన సందేహమే!

కొన్ని శతాబ్దాలకు పూర్వం , పెళ్లికి ముందు లేదా జీవతభాగస్వామి కాకుండా వేరొకరితో ఇష్టపూర్వకమైన సంభోగం నిషిద్ధంగా భావించేవారు. జీవితాంతం ఒకే లైంగిక భాగస్వామికి కట్టుబడి ఉండేవారు.
అయితే, మారుతున్న కాలనికి మరియు లైంగిక పోకడలకు అనుగుణంగా, చాలామంది ఒకరికంటే ఎక్కువమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం మరియు ఆపిరిచితులతో సంభోగంలో పాల్గొనడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి.
కనుక, ఇటువంటి సందర్భాలలో, మీ లైంగిక భాగస్వామికి లైంగిక వ్యాధులు ఉన్నాయో లెర్ఫా తెలిసే అవకాశం లేదు కనుక,ఒక వ్యక్తి నుండి ఇంకొకరికి STD లేదా STIలు సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
లైంగిక సంబంధాలు పెట్టుకోక ముందు, ముఖ్యంగా ఎటువంటి నిరోధకాలు వాడకుండా రతికి ఉపక్రమించినప్పుడు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొన్నిరకాల STDలు మరియు STIలు, చాలా భయంకరమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఇటువంటివి సోకినప్పుడు, ఆ లక్షణాలు చాలా కాలం బాధించవచ్చు. కొన్ని STDలకు ఎటువంటి చికిత్స లేదు మరియు అవి మరణానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు- HIV మనుషులను చిత్రహింసలకు గురిచేస్తూ ప్రాణాలను హరించివేసే ఒక భయంకరమైన వ్యాధి.
కనుక, ఎప్పటికప్పుడు STDలు మరియు STIలు లేవని నిర్ధారించుకోవడానికి లైంగిక భాగస్వాములు ఇద్దరు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవలసిన అవసరం ఉంది.
STDలు మరియు STIలు పరిజ్ఞానం కలిగి ఉండటం వలన కొంతమేరకు వాటిని నివారించవచ్చు.
కనుక, ఇక్కడ లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లకు సంబంధించి, మీరు తెలుసుకోవలసిన వాస్తవాలు మేము తెలియజేస్తున్నాం.

వాస్తవం #1
చాలావరకు, HIV మరియు HBV వంటి STDs చాలాకాలం వరకు నిర్ధారింపబడవు.ఎందుకంటే, వాటి లక్షణాలు చాలా సమయం గడిచేవరకు ప్రస్ఫుటంగా బయటపడవు.

వాస్తవం #2
హెర్పెస్, గనేరియా, మొదలైన కొన్ని చిన్న చిన్న STDs సోకినట్లైతే, HIV వంటి ప్రాణాంతక STDs సంక్రమించడం మరీంత సులభతరమవుతుంది.

వాస్తవం #3
కొంతమంది పురుషులు మరియు స్త్రీలలో, కొన్నిరకాల STDలు మరియు STIలు సోకినప్పుడు, వారిలో శాశ్వత వంధ్యత్వం లేదా లైంగిక అసమర్థత కలిగే అవకాశం ఉంది.

వాస్తవం #4
గర్భిణీ స్త్రీలకు STDలు మరియు STIలు సోకినప్పుడు, వారి కడుపులో ఎదిగే బిడ్డకు కూడా అవి సోకే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో , ఇవి పిండంలో అవకారాలు మరియు గర్భవిచ్చిత్తికి దారితీయవచ్చు.

వాస్తవం #5
STDలు మరియు STIల వ్యాప్తి విషయానికి వస్తే, కండోములు 100% సురక్షితమైనవి కావు. హెర్పెస్ వంటి కొన్ని రకాల నోరు మరియు జననాంగాలకు సంబంధించిన STDలు కండోములు వినియోగించినప్పటికీ, ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపి చెందుతాయి.

వాస్తవం #6
HPV లేదా హ్యూమన్ పాపిల్లోమావైరస్, ఒక లైంగిక సంక్రమిత వ్యాధి. ఇది ఆడవారిలో ప్రాణాంతకమైన, సెర్వైకల్ క్యాన్సర్ వంటి వ్యాధులను కలుగజేసే అవకాశం ఉంది.

వాస్తవం #7
STDలు మరియు STIలు పురుషుడు స్త్రీలో స్ఖలించనప్పటికిని, కలిగే అవకాశం ఉండు. లైంగిక అవయవాల స్పృశించడం మాత్రం చేత కూడా కొన్ని వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications