For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉంటే, మీ ఆరోగ్యం పై దాడి చేసే సిట్టింగ్ డీసీజ్...

ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉంటే, మీ ఆరోగ్యం పై దాడి చేసే సిట్టింగ్ డీసీజ్...

|

ఈ రోజుల్లోని ఉద్యోగాలలో, చాలావరకు గంటల తరబడి డస్కులకు అతుక్కుని చేసేవే ఉంటున్నాయి. మీరు ఈ వ్యాసం చదువుతున్నప్పుడు కూడా, మీ కార్యాలయంలో లేదా ఇంటి వద్ద మీ కంప్యూటర్ ముందు మీరు కూర్చొని ఉండి ఉంటారు. దీనికి అదనంగా, కారు నడిపేటప్పుడు, కూర్చుని టీవీ చూసేటప్పుడు భోజనం చేసేటప్పుడు, కూడా కూర్చునే ఉంటాము. సిట్టింగ్ వ్యాధిగా ముద్దుపేరు పెట్టి పిలుచుకునే ఈ పరిస్థితి, స్తబ్దుగా ఉండే జీవనశైలి మూలంగా తలెత్తుతుంది. ఇది ఆరోగ్యాన్ని ప్రమాదంలోనికి నెడుతుంది.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారి అధ్యయనం ప్రకారం, రోజుకు ఆరు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండేవారికి, మూడు గంటల కంటే తక్కువ సమయం పాటు కూర్చునే వారితో పోలిస్తే, 19 శాతం ఎక్కువగా మరణించే ప్రమాదం ఉంది. ఈ అధ్యయన బృంద సభ్యులు, అధ్యయనం కొరకు, ఎటువంటి ప్రధాన దీర్ఘకాలిక వ్యాధుల లేని 128,000 మంది మహిళలు మరియు పురుషులు ఈ సమాచారాన్ని సేకరించారు. కానీ 21 సంవత్సరాల పాటు వారిని గమనిస్తూ ఉండగానే, దాదాపు 49,000 మంది మరణించారు.

Sitting Disease: Risks, Symptoms And Ways To Fight

ఎక్కువ సమయం పాటు కూర్చుంటే కలిగే ప్రమాదాలు ఏమిటి?

అదేపనిగా కూర్చొని ఉండటం ప్రమాదకరమా? అవును, ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉంటే, గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి, కాలేయ వ్యాధి, నాడీ సంబంధిత రుగ్మతలు మరియు కండరాల కణజాల వ్యాధులకు దారితీస్తుంది. ఊబకాయం, రక్తపోటు పెరుగుదల, అధిక రక్త చక్కెర, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఎందుకంటే మీరు కూర్చుని ఉన్నప్పుడు ఖర్చయ్యే శక్తి , నిలబడటానికి లేదా కదలడానికి ఖర్చయ్యే శక్తితో పోలిస్తే నామమాత్రమే! ఇలా చేయటం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అంతేకాక, దీర్ఘకాలం పాటు కూర్చొని ఉంటే క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.

సిట్టింగ్ డిసీజ్ తో పోరాడటానికి మార్గాలు:

సిట్టింగ్ డిసీజ్ తో పోరాడటానికి మార్గాలు:

1. సాగదీయండి, తిప్పండి మరియు వంచండి:

ప్రతిరోజు మీ దేహాన్ని మీరు సాగదీయడం, వంపు తిప్పడం మరియు వచ్చేట్టు చేయడం చేసే వ్యాయామాలు 10 నిమిషాల పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోండి. మీ శరీరాన్ని వీలైనప్పుడల్లా కదిలించడం వలన శరీరం సాగి, కండరాలు పట్టేయకుండా ఉంటాయి. రోజుకు ఐదు లేదా ఆరు సార్లు ఇలా చేస్తే, సిట్టింగ్ డిసీజ్ ను నివారించవచ్చు.

2. మధ్యాహ్న భోజన సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయండి.

2. మధ్యాహ్న భోజన సమయంలో తేలికపాటి వ్యాయామాలు చేయండి.

మధ్యాహ్న భోజన సమయంలో వ్యాయామమా? అని మీరు ఆశ్చర్యపోతుండవచ్చు! కానీ, భోజనం చేసిన తర్వాత విరామ సమయంలో పిచ్చాపాటి మాటలకు సమయం వెచ్చించకుండా, నడకకు ఆ కొద్ది సమయం కేటాయించవచ్చు. మధ్యలో విరామం తీసుకుని, ఎలివేటర్ ను ఉపయోగించకుండా, మెట్ల ద్వారా పైకి క్రిందికి నడవవచ్చు.

3. నిలుచునే వ్యాయామం

3. నిలుచునే వ్యాయామం

కొన్ని నిమిషాలు పాటు నిలబడటం వలన, మీ కండరాలు తెలికపడతాయి. పైగా కూర్చోవడం కంటే ఎక్కువ కాలరీలను ఖర్చవుతాయి. పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో, నిలుచుని మీ చేతులు మరియు వేళ్లను సాగదీయండి. ఇలా చేస్తే గుండె జబ్బులు, దీర్ఘకాలిక నొప్పులు మరియు ఇతర జీవక్రియ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

4. పని చేసే చోట ఎప్పుడు మెట్ల ద్వారానే పైకి క్రిందికి తిరగండి.

4. పని చేసే చోట ఎప్పుడు మెట్ల ద్వారానే పైకి క్రిందికి తిరగండి.

ప్రతిరోజు, రోజుకు రెండు సార్లు మెట్లు ఎక్కి, దిగడం వలన, ఒక సంవత్సరంలో ఆరు పౌండ్లను కరిగించడానికి సరిపడా కేలరీలు కారుగుతాయని మీకు తెలుసా? ఆఫీస్ లోనికి ప్రవేశించేటపుడు మరియు విడిచిపెట్టేటప్పుడు, వారానికి ఐదు రోజులు, మెట్ల ద్వారానే పైకి ఎక్కడం, క్రిందికి దిగడం చేస్తే, 36 నిమిషాల పాటు నడిస్తే కాలినన్ని కెలరీలు కాలిపోతాయి. కనుక, ఊబకాయం నివారించడానికి ఇప్పటి నుండి మెట్ల మార్గం ద్వారా ఆఫీస్ చేరుకోండి.

5. భుజాలను టోనింగ్ చేసే వ్యాయామాలు

5. భుజాలను టోనింగ్ చేసే వ్యాయామాలు

మీరు మీ డెస్క్ వద్దనే త్వరగా చేయగలిగే భుజాలను టోనింగ్ చేసే వ్యాయామం చేయవచ్చు. మీ కుర్చీకి ఆనుకుని నిటారుగా మరియు పాదాలను నెలకు ఆనించి కూర్చోండి. మీ అరచేతులను చాచి, మోచేతులు ఒకదానికి ఒకటి అభిముఖంగా ఉండేట్టు చేతులను తల మీదుగా పైకి ఎత్తండి. గాలి పీల్చుకుంటూ, చేతులను పైకి ఎత్తి 30 సెకన్ల వరకు అలా ఉంచండి. గాలి వదులుతూ, తిరిగి నెమ్మదిగా చేతులను క్రిందికి తీసుకురండి. ఇప్పుడు సాధారణంగా ఊపిరి పీల్చుకోండి. ఈ వ్యాయామం మీ భుజంలోని కండరాలను బలోపేతం చేస్తుంది.

6. సమావేశాలను నడుస్తూ కానివ్వండి.

6. సమావేశాలను నడుస్తూ కానివ్వండి.

మీరు ఒక వ్యక్తితో సమావేశం ఉన్నట్లయితే, సమావేశ మందిరాన్ని దాటి, బయట నడుస్తూ సమావేశాన్ని నడిపిస్తే ఎలా ఉంటుందో, ఒకసారి ఆలోచించండి! సమావేశానికి సంబంధించిన ముఖ్య అంశాలను నమోదు చేయడానికి ఒక చిన్న ప్యాడ్ లేదా వాయిస్ రికార్డర్ వాడండి. వినడానికి ఆసక్తికరంగా ఉండికదూ?

English summary

Sitting Disease: Risks, Symptoms And Ways To Fight

While working in front of a desk, from nine to five, day in and day out, you've added some 50 pounds on your frame and myriad other health disorders, even before you've realized it. How to combat the adverse effects of the daily office routine? Exercise. Climb the stairs rather than taking the lift or keep a kettlebell under your desk to lift it now and then.
Story first published:Friday, August 10, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion