For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునివేళ్ళ వద్ద సమస్యాత్మక చర్మం తొలగించేందుకు 16 గృహ చిట్కాలు

|

మునివేళ్ళ మీద ఒక్కోసారి చర్మం కొంచం పక్కకు వచ్చి భాదపెడుతూ ఉంటుంది. ఇది అనేక మంది ప్రజలు ఎదుర్కొంటున్న సాధారణమైన సమస్య. కానీ, భాద మాత్రం వర్ణనాతీతం. అదృష్టవశాత్తు ఈ చర్మాన్ని తొలగించడానికి మరియు కొత్త చర్మం త్వరగా ఏర్పడుటకు కొన్ని గృహచిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వేళ్ళు లేదా గోరు చుట్టూ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుంది. కావున ఇక్కడ చర్మం తొలగించడానికి కాస్త జాగ్రత్త తీసుకొనవలసి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భాద తప్పదు. అసలు చర్మం ఇలా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

చర్మం పొడిబారడం ఎండ వేడిమి, తామర, సోరియాసిస్, చలి, వాతావరణం పొడిబారడం, ఎక్కువగా చేతులు కడగడం, రసాయనాలు వాడడం, అలర్జీలు, విటమిన్ లోపం మొదలైనవి ఈ సమస్యకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి.

గోర్ల చుట్టూ వేళ్లపై చర్మం పక్కకు రావడం, సాధారణంగా ఒక తాత్కాలిక సమస్య మరియు కొత్త చర్మం ఏర్పడినప్పుడు, కొన్నిరోజుల్లోనే నయమైపోతుంది. కానీ ఈలోపే దీని కారణంగా ఒక్కోసారి భోజనం కూడా చేయలేని పరిస్థితులకు వెళ్తుంటాం. సత్వర నివారణా చర్యలలో భాగంగా క్రింది గృహచిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి.

ఈ చర్మం ఎలా తొలగించాలి? అన్న అంశం మీద, ఈరోజు బోల్డ్స్కీ మీతో ఈ 16 గృహనివారణా చిట్కాలను పంచుకుంటుంది.

1.వెచ్చని నీటిలో నానబెట్టండి:

1.వెచ్చని నీటిలో నానబెట్టండి:

అటువంటి చర్మ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, వెచ్చని నీటిలోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉపశమనం కలిగించగలవు. ప్రతిరోజూ కనీస 10 నిముషాల పాటు వెచ్చని నీటిలో మీ చేతులను ఉంచండి. మీ చేతివేళ్ల చుట్టూ ఉన్న చర్మం మృదువుగా మారడమే కాకుండా, పొడిచర్మం తొలగిపోతుంది.

2.నట్స్ తీసుకోండి:

2.నట్స్ తీసుకోండి:

మన శరీరానికి మంచి కొవ్వులు అవసరమవుతాయి. సరైన మోతాదులో శరీరానికి మంచి కొవ్వులను అందించకపోతే, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవసరమవుతాయి. నట్స్ తీసుకోవడం మూలంగా శరీరంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల నిష్పత్తి పెరగడమే కాకుండా, ఈ చర్మ సమస్యను వేగంగా నయం చేయగలదు. పొడి చర్మం తొలగిపోవడమే కాకుండా, కొత్త చర్మం ఏర్పడడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

3.మాయిశ్చరైజర్ వినియోగించండి

3.మాయిశ్చరైజర్ వినియోగించండి

ఈ చర్మ సమస్య నివారణామార్గాలలో, మాయిశ్చరైజర్ వినియోగం కూడా సులభమైన ఉత్తమ నివారణా మార్గంగా ఉంది. ప్రతిరోజూ చేతులను శుభ్రం చేసి, పొడిబట్టతో తుడిచిన తర్వాత మాయశ్చరైజర్ వినియోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. వీలయితే, రోజులో కనీసం 2,3 సార్లు ఈ పద్దతిని పాటించడం మంచిది. సహజ పదార్థాలు లేదా పెట్రోలియం జెల్లీతో చేసిన మాయిశ్చరైజర్ చర్మంలో తేమను సంరక్షించడానికి సహాయపడుతుంది.

4.తేనె-నిమ్మరసం

4.తేనె-నిమ్మరసం

గోర్ల సమీపంలోని వేళ్లపై సమస్యాత్మక ;చర్మం చికిత్సకై సూచించబడిన ఉత్తమ సహజ మార్గాలలో ఒకటిగా ఈ పద్దతి ఉంది. వెచ్చని నీళ్ళకు కొంచం తేనె, నిమ్మరసం వేసి దానిలో మీ చేతులను ఒక 10 నిమిషాలు నానబెట్టండి. తరువాత, ఒక పొడి తువాలుతో శుభ్రంగా తుడిచి, మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా విటమిన్-ఈ నూనెను వేళ్ళకు అప్లై చేయండి. మీ చేతులమీద తేమ స్థాయిని నిర్వహించడానికి ఆలివ్ నూనెని కూడా ఉపయోగించవచ్చు.

5.కీరాదోసకాయను ఉపయోగించండి:

5.కీరాదోసకాయను ఉపయోగించండి:

కీరాదోసకాయ, చర్మ సమస్యను తగ్గుముఖం పట్టించే శోథ నిరోధక తత్వాలు మరియు వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. సహజ తేమను పునరుద్ధరించడం మరియు చికాకును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. తాజా దోసకాయను మందపాటి ముక్కలుగా చేసుకోవాలి. ప్రభావానికి గురైన భాగంలో ఈ ముక్కలతో నెమ్మదిగా మర్దన చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. లేదా తురిమిన కీరాదోస ముక్కల గుజ్జును ఆ భాగంలో అప్లై చేసి 30నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. రోజులో వీలైనన్ని సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

6.కొబ్బరి నూనె

6.కొబ్బరి నూనె

ఇది మీ చర్మం యొక్క తేమను పెంచడమే కాకుండా, మృదువుగా కూడా ఉంచుతుంది. కొబ్బరి నూనె అనేక చర్మ సమస్యలకు ఒక అద్భుతమైన గృహ చికిత్సగా ఉంది. ఇది చర్మంలో త్వరగా విస్తరించడానికి సహాయపడే కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది పొడి చర్మాన్ని తేమగా మార్చడమే కాకుండా, దురద మరియు సమస్యను నిరోధిస్తుంది. దీని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులకు వ్యతిరేకంగా ఉంటాయి. కొబ్బరి నూనెను మీ చేతివేళ్లకు రోజులో వీలైనన్ని సార్లు అప్లై చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలరు.

7.పాలు:

7.పాలు:

పాలు చేతి వేళ్ల మీది సమస్యాత్మక చర్మాన్ని తొలగించడానికి ఒక గొప్ప చికిత్సగా ఉంది. పాలు చర్మానికి ఒక సహజసిద్దమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ప్రభావితమైన చర్మంపై పాలను అప్లై చేయడం ద్వారా, ఉపశమనం పొందవచ్చు. పాలలో అధికంగా ఉన్న కొవ్వు పదార్ధాలు, చర్మంలోకి ఇంకి, కొత్తగా చర్మం ఏర్పడడానికి దోహదపడుతుంది. 2 టేబుల్-స్పూన్స్ పాలు మరియు తేనె ఒక టేబుల్ స్పూన్ కలిపిన మిశ్రమాన్ని, ప్రభావితమైన ప్రాంతంలో అప్లై చేసి మర్దన చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మంచి ఫలితాలకై రోజులో పలుమార్లు వినియోగించండి.

8.కలబంద:

8.కలబంద:

స్వచ్ఛమైన కలబంద గుజ్జుని మునివేళ్ళ దగ్గర ప్రభావితమైన చర్మాన్ని తొలగించుటకు, అద్భుతమైన గృహ చిట్కాగా చెప్పబడింది. కలబందలోని అనేక వైద్య లక్షణాలు, మరియు తేమ కారకాలు, అనేక చర్మసమస్యలకు విరుగుడుగా ఉన్నాయి. పూర్వీకుల కాలం నుండి ఆయుర్వేదం మరియు గృహ వైద్య చిట్కాలలో ఉత్తమమైనదిగా ఉంది కలబంద. దెబ్బతిన్న చర్మంపై రోజులో కనీసం 2,3 సార్లు కలబంద గుజ్జుని వర్తించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

9.ఎక్కువ నీరు తాగండి:

9.ఎక్కువ నీరు తాగండి:

నీళ్ళను చేతులకు రాయడం కాదు, ఎక్కువగా తాగాలి. నిర్జలీకరణం వంటి సమస్యలు కూడా చర్మం పొడిబారడానికి, మరియు మరికొన్ని చర్మ సమస్యలకు కారకాలుగా ఉన్నాయి. కావున, శరీరాన్ని వీలైనంత మేర నీటితో నింపడం మంచిదిగా సూచించబడింది. కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యుల సూచన. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, శారీరిక శ్రమ ఆధారితంగా నిర్జలీకరణ(డీహైడ్రేషన్) కు గురికాకుండా, సరైన మోతాదులో శరీరానికి నీటిని అందించడం ముఖ్యం. నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా కూడా చర్మ సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడవచ్చు. మరియు శరీరంలోని మలినాలను వీలైనంత మేర తొలగించడానికి సహాయపడుతుంది.

10.తేనె:

10.తేనె:

సహజసిద్దంగా గోళ్ళ చుట్టూ మునివేళ్ళ వద్ద ప్రభావితమైన చర్మాన్ని తొలగించుటకు అనేక సూచించబడ్డ అనేక మార్గాలలో తేనె కూడా ఒకటి. తేనెలోని శోధనివారణా శక్తి, యాంటీ బాక్టీరియల్ మరియు తేమను పెంచే తత్వాలు ఈ చర్మ సమస్యను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయని చెప్పబడింది. మరియు గాయాల నివారణలో కూడా తేనెను వినియోగిస్తారని మనం ఇదివరకు వ్యాసాలలో తెలుసుకున్నాం. పైన చెప్పుకున్న ప్రకారం తేనెను, పాలలో లేదా నిమ్మరసాన్ని జతచేర్చిన వేడి నీటిలో చేతి వేళ్ళను ఉంచడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ప్రభావితమైన చర్మంపై స్వచ్ఛమైన తేనెను చిన్న మొత్తంలో రాసి మర్దన చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. దీనిలోని సహజసిద్దమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సంక్రమణను కూడా నిరోధించగలవు. 10, 20 నిమిషాలు అలాగే ఉంచిన పిదప, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయవచ్చు.

11.చందనం మరియు రోజ్-వాటర్ :

11.చందనం మరియు రోజ్-వాటర్ :

రెండు టేబుల్-స్పూన్ల గంధపు పొడిని, మూడు టీస్పూన్ల రోజ్-వాటర్ మరియు అర టీస్పూన్ తేనెతో కలిపి, ప్రభావిత ప్రాంతం మీద సున్నితంగా మర్దన చేయవచ్చు. 20నిముషాల తర్వాత, వెచ్చని నీటితో మరియు తేలికపాటి సబ్బుతో శుభ్రం చేయండి.

12.పుదీనా రసం:

12.పుదీనా రసం:

ఇది ఒక గొప్ప సహజసిద్ద మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పుదీనా రసం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మరియు వేలిచుట్టూ ప్రభావితమైన చర్మ సమస్యను తగ్గించుటలో కూడా వినియోగిస్తారు. పొడిబారిన చర్మానికి తేమని అందివ్వడంలోనే కాకుండా, మంటను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది.

కొన్ని తాజా పుదీనా ఆకుల నుంచి రసం తీయండి. నిద్రకు ఉపక్రమించే ముందు, ప్రభావితమైన చర్మంపై ఈ పుదీనా రసం అప్లై చేసి సున్నితంగా మర్దన చేయండి. మరుసటి రోజు ఉదయం, వెచ్చని నీటితో శుభ్రపరచండి.

13.అరటిపండు:

13.అరటిపండు:

చక్కర పొడి, ఆలివ్ నూనెను కలిపిన అరటి పండు గుజ్జుని వేళ్ళకు రాసి, కనీసం 30 నిమిషాలు ఉంచి శుభ్రం చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

14.ఆలివ్ నూన్:

14.ఆలివ్ నూన్:

ఆలివ్ నూనెలోని రోగనిరోధక తత్వాలు, మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమస్యను తగ్గించడం కాకుండా, చర్మంలో తేమను కొవ్వు శాతాన్ని పెంచి చర్మం పునరుద్దరణలో సహాయపడుతుంది.

15.ఓట్స్:

15.ఓట్స్:

వేడి నీళ్ళలో చారెడు ఓట్స్ పొడిని కలిపి, 10, 15 నిమిషాల పాటు వేళ్ళను అందులో ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. వెచ్చని నీటితో శుభ్ర పరచిన తర్వాత, మాయిశ్చరైజర్ రాయడం మంచిది. ఇది మృతకణాలను తొలగించుటలో కీలకపాత్రను పోషిస్తుంది.

16.ప్రోటీన్ కలిగిన ఆహారం:

16.ప్రోటీన్ కలిగిన ఆహారం:

ప్రోటీన్ లోపం కారణంగా కూడా ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. కావున ప్రోటీన్ కలిగిన గుడ్లు, మాంసం, చేపలు, దుంపకూరలు వంటి పదార్ధాలను ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం మంచిది.

English summary

Home Remedies For Peeling Skin Around Fingernails| How To Treat Peeling Skin On Fingers| Peeling Skin On Fingers Near Nails

Peeling skin on fingers near nails is usually a temporary problem and will heal in a few days when new skin is generated. However, if peeling fingertips is causing a problem for you, there are some natural treatments that you can try at home to speed up the healing process.
Story first published: Thursday, July 12, 2018, 13:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more