ఈ 10 చిట్కాల ద్వారా గొంతు మంట వల్ల కలిగే విపరీతమైన నొప్పిని తగ్గించు కోవచ్చు

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొన్ని సార్లు మన గొంతులో విపరీతమైన మంట కలుగుతుంది. అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా తాగినా, మింగినా, తిన్నా, ఇలా ఏది చేసినా ఆ సమయంలో విపరీతమైన బాధని అనుభవిస్తాము. వీటికితోడు అదే సమయంలో చెవుల దగ్గర వచ్చే దురదలాంటి భావన మరింత చికాకుని, విసుగుని కలిగిస్తుంది.

గొంతులో కలిగే ఇటువంటి పుండ్లు గనుక ఉంటే, అటువంటి పరిస్థితి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి.

తేనె వల్లనా? లేక పచ్చి వెల్లుల్లి పాయనా? లేక ఒక గ్లాసు పాలా? ఏది మనల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తుంది.

నిపుణుల ప్రకారం ఈ 10 చిట్కాలను పాటించడం ద్వారా గొంతు మంటను మనం తగ్గించుకోవచ్చు.

1 గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కలించడం :

1 గోరువెచ్చటి ఉప్పు నీటితో పుక్కలించడం :

ఉప్పులో ప్రకృతి సహజంగానే ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిమికీటలను సంహరించే క్రిమిసంహారి లక్షణాలు ఉంటాయి. ఇది కణజాలంలో లోపల ఉండే ఆ క్రిమి కీటకాలను ఉపరితలానికి తెచ్చి వాటిని సులభంగా పారద్రోలడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే గోరువెచ్చటి నీటిలో ఉప్పుని వేసి పుక్కలించడం జరుగుతుందో, అటువంటి సమయంలో మీకు గనుక గొంతులో పుండ్లు ఉంటే వాటిని నయం చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. 8 గంటల పాటు ప్రతి గంటకు ఒక్కసారి పుక్కలించండి. ఇలా చేయడం వల్ల మీ పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

2. గడ్డకట్టిన ఐస్ నీటిని తాగటం :

2. గడ్డకట్టిన ఐస్ నీటిని తాగటం :

ఇది వినడానికి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే, గొంతు మంటగా ఉన్నట్లయితే చల్లటి నీటిని అస్సలు తాగకూడదు అని మనం తరచూ వింటూ ఉంటాం. కానీ, అసలు నిజం ఏమిటంటే, ఈ మార్గం ద్వారా మనకు నొప్పి నుండి త్వరగా విముక్తి లభిస్తుంది.

ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఐస్ గడ్డలు మంటను, వాపుని, నొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. నోటిలోపల మీరు ఐస్ ప్యాక్ ని పెట్టలేరు కాబట్టి ఇటువంటి సమాయంలో చల్లటి ఐస్ నీటిని తాగటం ఉత్తమమైన పని.

మొదట కొద్దిసేపు ఈ నీటిని తాగినప్పుడు నొప్పిగా ఉండవచ్చు. కానీ, సమయం గడిచేకొద్దీ పరిస్థితి చక్కబడుతుంది. ఇక అసలు నిజం ఏమిటంటే, ఆమ్లం రిఫ్లెక్స్ వల్ల కలిగే గొంతు మంటను తగ్గించడానికి ఉత్తమమైన చిట్కాలతో ఇది కూడా ఒకటి.

3. ఐస్ లాలీ పాప్ ని తినడం :

3. ఐస్ లాలీ పాప్ ని తినడం :

చల్లటి ఐస్ నీటికి బదులుగా ఈ ఐసు లాలీ పాప్ ని తీసుకోవచ్చు. కానీ, ఇలా చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, నిమ్మజాతి ఫ్లేవర్ కలిగిన ఐస్ లాలీ పాప్ ని అస్సలు తీసుకోకండి. ఇలా చేయడం వల్ల మీ గొంతులో మంట మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

4. ఆమ్లాలను పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి :

4. ఆమ్లాలను పెంచే ఆహారాలకు దూరంగా ఉండండి :

గొంతులో మంట కలగడానికి అతి సాధారణమైన కారణం ఆమ్లాల వల్ల కలిగే ప్రక్రియలే. అందుచేతనే ఆమ్లాలను పెంచే పానీయాలు, ఆహారాలకు దూరంగా ఉండండి. నిమ్మజాతి పండ్లు, కూరగాయలు, ఊరగాయలు, సోడాలు, ఇలా ఏవైతే శరీరంలో ఆమ్లాలను పెంచుతాయో అటువంటి వాటిని మీరు గొంతు మంట ఉన్న సమయంలో మీరు పూర్తిగా వాడటం నిషేధించండి. ఆలా గనుక చేయకపోతే, మీ గొంతు మంట మరింతగా పెరుగుతుంది.

5. యాంటాసిడ్, అంటే ఆమ్లహారిణి తీసుకోండి :

5. యాంటాసిడ్, అంటే ఆమ్లహారిణి తీసుకోండి :

గొంతులో మంట కలగడానికి ఆమ్లం రిఫ్లెక్టస్ యే ప్రధాన కారణం. అందుచేత నీటిలో ఒక యాంటాసిడ్ ని తీసుకున్నట్లైతే, కడుపులో ఉత్పత్తి అవుతున్న అధిక ఆమ్లం తటస్థంగా మారుతుంది.

6. పసుపు పాలను తాగండి :

6. పసుపు పాలను తాగండి :

గొంతులో మంటకు సంబందించిన ఇంటి చిట్కాలన్నింటిలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే చిట్కా ఇది. పసుపుపాలను తాగడానికి చాలామంది ఇష్టపడరు, చాలామంది అసహ్యం ప్రదర్శిస్తారు. అటువంటి సమయంలో ముక్కు మూసుకొని తాగటం ఉత్తమం.

7. ఇబుప్రోఫెన్ అనే గుళికను తీసుకోండి :

7. ఇబుప్రోఫెన్ అనే గుళికను తీసుకోండి :

మీకు నొప్పి, మంట, విపరీతమైన బాధ ఉన్నట్లయితే ఇబుప్రోఫెన్ అనే గుళికను తీసుకోండి. ఇది మీకు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.

గమనించవలసిన విషయం " కింద చెప్పబడినటువంటి పరిస్థితులు గాని లేదా లోపాలు గాని మీలో ఉన్నట్లయితే లేదా వాటివల్ల బాధపడుతున్నట్లైతే, ఈ ఇబుప్రోఫెన్ టాబ్లెట్ ని అస్సలు తీసుకోకండి.

ఇబుప్రోఫెన్, ఆస్ప్రిన్ లేదా ఇటువంటి గుళికలు తీసుకొంటే ఏవైనా అలర్జీలు తలెత్తే అవకాశం ఉంటే, వాటికి దూరంగా ఉండండి.

ఆస్త్మ

పొట్టకు సంబంధించిన పుండ్లు లేదా జీర్ణశయాంతర భాగంలో రక్తస్రావం అవుతుంటే

గర్భం దాల్చి మూడవ త్రైమాసికంలో ఉంటే

మూత్రపిండాలు, కాలేయం లేదా గుండెకు సంబంధించిన అసాధారణతలు లేదా లోపాలు ఏవైనా ఉన్నట్లు అయితే

పైన చెప్పబడిన విధంగా మీలో పరిస్థితులు గనుక ఉంటే, ఈ గుళికలు అస్సలు వేసుకోకండి.

8. విశ్రాంతి తీసుకోండి :

8. విశ్రాంతి తీసుకోండి :

మీ శరీరానికి నయం అవడానికి రోగం పై రోగనిరోధక శక్తి పోరాడటం కోసం కొంత విశ్రాంతి అవసరం. గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల మీకు గనుక గొంతులో మంట వస్తున్నట్లైతే, ఒకటి లేదా రెండురోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది.

9. మౌనంగా ఉండటం :

9. మౌనంగా ఉండటం :

ఎవరైతే ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారో, అటువంటివారికి ఈ చిట్కా పాటించడం చాలా బాధతో కూడుకున్న వ్యవహారం. కానీ, గొంతు మంటగా ఉన్నప్పుడు పాటించాల్సిన ఉత్తమైన చిట్కాల్లో ఇది కూడా ఒకటి. గట్టిగా మాట్లాడిన లేదా విపరీతంగా మాట్లాడినా మీ గొంతు, స్వర నాళాలు మరింతగా ఒత్తిడికి లోనై, నొప్పిని, మంటను విపరీతంగా పెంచే అవకాశం ఉంది.

10. గాలిలో తేమను పెంచండి :

10. గాలిలో తేమను పెంచండి :

గొంతు మంటగా ఉన్నప్పుడు పొడిగాలి మరింత బాధ కలిగిస్తుంది. ఒకవేళ వాతావరణం గనుక పొడిగా ఉన్నట్లయితే, వేడి నీళ్లతో ఆవిరి స్నానాన్ని చేయడం వల్ల మీ గొంతుకి కొద్దిసేపు ఎంతో హాయిగా ఉంటుంది లేదా ఏదైనా తేమను పెంచే హ్యూమిడిఫైర్ వంటి తేమను అందించే పరికరాన్ని ఉపయోగించి దాని నుండి వెలువడే తేమను పీలచడానికి ప్రయత్నించండి.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే :

మీరు గనుక హ్యూమిడిఫైర్ ని వాడుతున్నట్లైతే, దానిని వాడే ముందు బాగా శుభ్రం చేయండి. ఎందుకంటే, వాడకుండా పక్కన పెట్టిన హ్యూమిడిఫైర్ లో సూక్ష్మ జీవులు, క్రిమికీటకాలు అధికంగా వేగంగా వచ్చి చేరతాయి. దీనివల్ల జలుబు లేదా మీ గొంతులో ఉండే మంట మరింతగా పెరిగే అవకాశం ఉంది.

పైన చెప్పబడిన చిట్కాల్లో ఏది చేసినా, 48 గంటలోపు మీ గొంతు మంటలో ఎటువంటి మార్పు లేకపోతే, మీ దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించి అందుకు తగ్గ చికిత్స తీసుకోండి.

English summary

10 Sore Throat Remedies That Will Save You A Ton Of Pain!

Your throat feels like someone took a steel wool and rubbed the insides of it raw. Drinking, heck, swallowing anything feel like you are trying to shove a hammer down a straw. And the weird itching sensation at the base of your ears isn't helping either. Help! What do you do to get rid of this soreness in your throat?
Story first published: Sunday, March 25, 2018, 15:00 [IST]