For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జలుబు, గొంతు సమస్యలతో భాదపడుతున్నారా? అయితే వీటికి దూరంగా ఉండండి...

జలుబు మరియు గొంతు సమస్యలతో భాదపడుతున్నారా? అయితే ఈ ఆహార పానీయాలను దూరం ఉంచండి.

|

చిరునాలిక పడడం, గొంతు నొప్పి, మంట వంటి గొంతు సమస్యలకు ఉపశమనం కోసం కొన్ని సాధారణ ఇంటి నివారణా చిట్కాలను అవలంభిస్తుంటాము. కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా శీతల పరచిన డైరీ ఉత్పత్తులు, పుల్లటి సుగంధ ద్రవ్యాలు, మరియు జంక్ ఫుడ్స్ వంటివి మందుల పనితీరు మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. క్రమంగా నివారణ ఆలస్యం అవుతుంటుంది. కావున, ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులైన పడిశం, దగ్గు మొదలైన సమస్యలకు గురైనప్పుడు తీసుకునే ఆహారపదార్ధాల విషయంలో కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది, ఇది అంటువ్యాధులు, పడిశం, దగ్గు మరియు గొంతు సమస్యలు పెరిగేందుకు దారితీసే వాతావరణాన్ని సృష్టిస్తుంది. క్రమంగా మనం ఏదో ఒకసమయంలో గొంతు, శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఆహార పానీయాలు తీసుకోవడం దగ్గర నుండి, మాట్లాడేవరకు ప్రతిఒక్క విషయంలోనూ దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తూ, అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటుంది. గొంతు మంట, లేదా నొప్పి అనేది కేవలం రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. దీనికి సాధారణ ఇంటి చిట్కాలు మరియు మందులు నివారణా మార్గాలుగా ఉంటాయి. మీరు గొంతు నొప్పికి గురైన పక్షంలో ఉపశమనానికి వినియోగించే పదార్ధాలు సహజసిద్దంగా వంటింట్లో లభించే పదార్దాలుగానే ఉంటాయి. మన తల్లులు, నానమ్మలు, అమ్మమ్మలు మనకు ఈ విషయాల గురించి చెబుతూనే ఉంటారు కూడా. కానీ మనలో ఎంతమందికి ఇటువంటి సందర్భాలలో తీసుకోకూడని ఆహారపదార్ధాలు, మసాలా దినుసులు మరియు పానీయాల గురించిన అవగాహన ఉంది?

Suffering From Cold And Sore Throat? Avoid These Spices, Foods And Drinks!

గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు పానీయాలు సైతం మీ పరిస్థితిని మరింత అధ్వాన్నం చేస్తాయి. క్రమంగా మీరు తీసుకునే మందుల ప్రభావాలను తగ్గించడం, మరియు ఇతర ఉపశమన చికిత్సల ఫలితాలను ఆలస్యం చేయడం లేదా సమస్యను మరింత జఠిలం చేయడం జరుగుతుంది. కావున గొంతు నొప్పి సమయంలో తీసుకునే ఆహార పానీయాలలో జాగ్రత్త తప్పనిసరి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, మీరు దూరంగా ఉంచాల్సిన సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలేమిటో చూద్దాం.

1. అంచూర్ :

1. అంచూర్ :

ఎండబెట్టిన మామిడిపొడిని అంచూర్ అని వ్యవహరిస్తారు. దీనిని అనేకరకాల వంటలలో రుచి కోసం జోడించడం పరిపాటిగా ఉంటుంది. మీరు గొంతు నొప్పితో బాధపడుతున్న సమయంలో దీని వాడుకను నివారించవలసి ఉంటుంది. కొంచం పుల్లగా మరియు ఉప్పగా ఉన్న ఈ స్పైస్ మీ గొంతు నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది. మిగిలిన అనేక పుల్లటి ఆహార పదార్ధాలలో కూడా ఇటువంటి గుణాలు సాధారణంగా ఉంటాయి. కావున వీలైనంత వరకు పుల్లటి పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది.

2. అనార్దన పౌడర్ :

2. అనార్దన పౌడర్ :

ఎండిన దానిమ్మపండు విత్తనాల నుంచి తయారైన పొడిని అనార్ధన పొడిగా వ్యవహరిస్తారు. ఇది కూడా కొద్దిగా పులుపు మరియు ఉప్పు జోడించినట్లుగా ఉంటుంది మరియు అనేకరకాల భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిని క్యాండీలు లేదా గోలీల రూపంలో కూడా నేరుగా తీసుకునే అలవాటును కలిగి ఉంటారు కొందరు. ఇది చలికాలంలో మీ గొంతు యొక్క పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

3. చాట్ మసాలా :

3. చాట్ మసాలా :

ఈ మసాలా మిశ్రమాన్ని సాధారణంగా ఫ్రూట్ సలాడ్స్ లేదా చాట్స్ తయారీలో ఉపయోగిస్తారు. మరియు దేశవ్యాప్తంగా అనేక వంటకాలలో జోడించబడుతుంది కూడా. ఇందులో అంచూర్ ఉంటుంది. ఇది గొంతునొప్పి తీవ్రతను పెంచుతుంది.

Most Read:ఈ మూడు అలవాట్లు మీ తల్లిని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండేలా చేయగలవుMost Read:ఈ మూడు అలవాట్లు మీ తల్లిని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండేలా చేయగలవు

4. చింతాకు పొడి :

4. చింతాకు పొడి :

మీరు తీవ్రమైన గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు, వీలైనంతమేర చింతపండు ఆధారిత వంటకాలను దూరంగా ఉంచవలసి ఉంటుంది. ఎండబెట్టిన చింతాకు పొడి, చింతపండు రసం రెండింటిని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండూ మీ గొంతులో చికాకును సృష్టించవచ్చు.

గొంతునొప్పి సమయంలో నివారించదగిన మరికొన్ని ఆహారపానీయాలు :

1. యోగర్ట్:

1. యోగర్ట్:

మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ప్రోబయోటిక్స్ అందివ్వడం ముఖ్యం, అవునా? దానికి యోగర్ట్ మంచి సహాయం చేస్తుంది. కానీ, ఫ్లూ లేదా పడిశం వంటి సమస్యలకు గురైన నేపధ్యంలో పెరుగు లేదా యోగర్ట్ తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ ఛాతీలో నెమ్మును పెంచడం ద్వారా దగ్గును మరింత పెంచగలదు.

2. పాలు మరియు చీజ్:

2. పాలు మరియు చీజ్:

ఈ రెండు పదార్ధాలు కాల్షియంలో అధికంగా ఉంటాయి. మరియు ఇతర అత్యవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో లోడ్ అయిఉన్నప్పటికీ, కోల్డ్ మరియు గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వీటిని తీసుకోవడాన్ని నివారించవలసి ఉంటుంది. ఇవి తాత్కాలికంగా శ్లేష్మము మరియు వాపును పెంచవచ్చు.

Most Read:శోభనం రోజు నా వక్షోజాలను చూసి నా భర్త ఆశ్చర్యపోయాడు, స్త్రీల స్తనాల రకాల గురించి మగాళ్లకేం తెలుసుMost Read:శోభనం రోజు నా వక్షోజాలను చూసి నా భర్త ఆశ్చర్యపోయాడు, స్త్రీల స్తనాల రకాల గురించి మగాళ్లకేం తెలుసు

2. పాలు మరియు చీజ్:

2. పాలు మరియు చీజ్:

ఈ రెండు పదార్ధాలు కాల్షియంలో అధికంగా ఉంటాయి. మరియు ఇతర అత్యవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో లోడ్ అయిఉన్నప్పటికీ, కోల్డ్ మరియు గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వీటిని తీసుకోవడాన్ని నివారించవలసి ఉంటుంది. ఇవి తాత్కాలికంగా శ్లేష్మము మరియు వాపును పెంచవచ్చు.

3. సిట్రస్ ఫలాలు:

3. సిట్రస్ ఫలాలు:

ఆరెంజ్స్, లెమన్స్, కిన్నోస్ మరియు ఇతర సిట్రస్ ఆధారిత పండ్లు, కోల్డ్ మరియు గొంతు నొప్పి సమయంలో సమస్యలను మరింత పెంచగలవు. ఇవి మీ గొంతును మరింత చికాకుకు గురిచేస్తాయి.

4. వేయించిన ఆహార పదార్ధాలు:

4. వేయించిన ఆహార పదార్ధాలు:

ఫ్రెంచ్ ఫ్రైస్, వేడి వేడి పూరీలు లేదా ఇతర వేయించిన లేదా డీప్ ఫ్రైడ్ ఆహారపదార్ధాలు మీ గొంతును చికాకుకు గురిచేయవచ్చు. అంతేకాకుండా, ఈ ఆహార పదార్ధాలు జీర్ణసంబంధ సమస్యలను పెంచుతాయి కూడా. మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని తగ్గించి, శరీరం బాక్టీరియాతో పోరాడే అవకాశాలను తగ్గిస్తుంది.

Most Read:గుండెపోటు మరియు స్ట్రోక్ మధ్యగల వ్యత్యాసాలను తెలుసుకోండి.Most Read:గుండెపోటు మరియు స్ట్రోక్ మధ్యగల వ్యత్యాసాలను తెలుసుకోండి.

5. అధిక చక్కెరలతో కూడిన సోడాలు మరియు నిల్వ ఉంచిన పండ్ల రసాలు:

5. అధిక చక్కెరలతో కూడిన సోడాలు మరియు నిల్వ ఉంచిన పండ్ల రసాలు:

ఇటువంటి పడిశం, మరియు గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలతో ఉన్నప్పుడు ఇటువంటి చల్లని పానీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని అందరికీ తెలుసు. కానీ అధిక చక్కరలతో కూడిన సోడాలు మరియు నిల్వ ఉంచిన పండ్ల రసాలు గొంతు సమస్యను మరింత జఠిలం చేస్తాయి. వీటిలోని ఫిజ్జీ లక్షణాలు లేదా కార్బోనేషన్ గొంతులో మరియు కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ సమస్యకు ప్రధాన కారణమవుతుంది.

ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా ! పడిశం/ఫ్లూ మరియు గొంతునొప్పి సమయాలలో పైన చెప్పిన ఆహరపానీయాలను దూరం ఉంచుతూ, వేడి వేడిగా అల్లంతో కూడిన సూప్స్, తేనె మరియు అల్లం కలిపిన పానీయాలు, మరియు హెర్బల్-టీ మొదలైనవి తరచుగా తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందగలరు.

English summary

Suffering From Cold And Sore Throat? Avoid These Spices, Foods And Drinks!

Sore throat is a condition that lasts for just two or three days and is treatable with simple home remedies and medication. There are numerous home remedies for a sore and aching throat that you can bring to your rescue, and these usually involve common kitchen ingredients, which are easily available at our homes. Almost all of us are aware of these remedies that our mothers or grandmothers have passed down to us, but how many of us are aware of the foods, spices and drinks that can potentially make a sore throat even worse?
Desktop Bottom Promotion