For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్ మీ ఆరోగ్యంపై ఏ విధంగా దుష్ప్రభావాలు చూపుతుందో తెలుసా?

|

వెయిట్ లాస్ అని మనం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేసిన మరుక్షణం వేలకొద్దీ బ్లాగులూ, ఆర్టికల్స్ అలాగే వీడియోస్ ప్రత్యక్షమైపోతాయి. మీరు కూడా గమనించారు కదా? వీటిలో ఎక్కువ శాతం బ్లాగ్స్ లేదా వీ లాగ్స్ అనేవి ఒక విషయాన్ని మాత్రం కామన్ గా కలిగి ఉంటాయి. వెయిట్ ని ఆరోగ్యకరంగా తగ్గే మార్గాలను సూచిస్తాయి. అలాగే వెయిట్ లాస్ కై పాటించవలసిన చిట్కాలను అలాగే టిప్స్ ను వివరిస్తాయి. అయినా, మనం వెయిట్ లాస్ కై పాటించవలసిన నియమాలను కొన్ని గమనించడం మిస్ అవుతాము. వాటివలన ఆరోగ్యం ప్రమాదకర స్థితిలో పడుతుంది. ఆరోగ్యకరంగా వెయిట్ లాస్ కై ప్రయత్నం సాగిస్తే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలను మనం ఈపాటికే గమనించే ఉంటాం. వెయిట్ ను తగ్గించుకోవడానికి మనం నిరంతర ప్రయత్నం చేయడం వలన మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది సాధారణంగా మారుతుంది.

మనం ఒబెస్ గా లేదా ఓవర్ వెయిట్ గా ఉన్నప్పుడు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వెయిట్ లాస్ కోసం ప్రయత్నించాలి. అదే సమయంలో ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ పద్దతులను పాటించాలి. లేదంటే వెయిట్ లాస్ ప్రక్రియ అనేది ప్రమాదకరంగా మారుతుంది.

కాబట్టి, ఇక్కడ అనారోగ్యకరమైన వెయిట్ లాస్ అనేది ఆరోగ్యానికి హానికరం ఏ విధంగా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పోషకాహార లోపం:

1. పోషకాహార లోపం:

ఇది వెయిట్ లాస్ కై పాటించే కొన్ని చిట్కాల వలన తలెత్తే ఆస్కారం ఉన్న ముఖ్యమైన ప్రమాదం. వెయిట్ లాస్ కై ఆకలితో ఇబ్బంది పడి వెయిట్ ను తగ్గించుకోవాలనుకునే వారు పోషకాహార లోపానికి గురవుతారు. బలహీనపడతారు. శరీరానికి అవసరమైన పోషకాలను పొందలేరు. తద్వారా పోషకాహార లోపానికి లోనవుతారు. ఈ కండిషన్ మరింత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తుంది. న్యూట్రిషన్ డెఫిషియెన్సీ కి కూడా దారి తీస్తుంది. ఈ కండిషన్ మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా తలెత్తవచ్చు.

2. ఎలక్ట్రోలైట్ ఇమ్ బాలన్స్:

2. ఎలక్ట్రోలైట్ ఇమ్ బాలన్స్:

కిలోల కొద్దీ బరువును త్వరగా తగ్గేందుకై క్విక్ ఫిక్స్ కోసం ప్రయత్నిస్తూ తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటె శరీరానికి మినరల్స్ తక్కువ మోతాదులో అందుతాయి. శరీరం సోడియం, గ్లూకోజ్, పొటాషియం, కేల్షియం, ఐరన్ వంటి తగినన్ని మినరల్స్ ని తగిన మోతాదులో తీసుకోకపోతే ఎలెక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తలెత్తుతుంది. తద్వారా, వామిటింగ్, ఫీవర్, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

3. గాల్ స్టోన్స్:

3. గాల్ స్టోన్స్:

వెయిట్ లాస్ సమయంలో గాల్ స్టోన్స్ తలెత్తే ఆస్కారం కూడా ఉంది. సాధారణంగా ఒబెస్ అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వ్యక్తుల్లో గాల్ స్టోన్ సమస్య కనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో, విపరీతమైన డైటింగ్, విపరీతమైన ఎక్సర్సైజ్ వంటి అనారోగ్యకరమైన వెయిట్ లాస్ మెథడ్స్ ని అనుసరించే వారిలో శరీరంలోంచి బైల్ అనేది సరిగ్గా క్లియర్ కాకపోవడం వలన వారిలో కూడా ఈ సమస్య కనిపించవచ్చు. లివర్ లోని బైల్ అనేది గట్టిగా మారి గాల్ బ్లాడర్ లో రాయి వంటి పదార్థంగా మారుతుంది. దీన్నే గాల్ స్టోన్స్ అంటారు. ఈ కండిషన్ కు సర్జరీ అవసరం కావచ్చు.

4. గుండె వ్యాధులు:

4. గుండె వ్యాధులు:

ఆకలితో ఉంటూ వెయిట్ లాస్ కై ప్రయత్నించే వారు తమ శరీరానికి తగినన్ని పోషకాలు అందకుండా చేసుకుంటారు. వెయిట్ లాస్ కై పాటించే ఈ మెథడ్ అనేది అనారోగ్యకరం. దాని వలన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు వివిధ భాగాలకు రక్తసరఫరాను చేసేందుకు గుండె అనేది ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు. దీని వలన అనేక గుండె వ్యాధులు తలెత్తుతాయి. హార్ట్ ఫెయిల్యూర్ కూడా సంభవించవచ్చు.

5. నెలసరిలో ఇబ్బందులు:

5. నెలసరిలో ఇబ్బందులు:

వెయిట్ ను త్వరగా తగ్గిపోవడానికి తక్కువ ఆహారాన్ని తీసుకునేవారు లేదా కేవలం ఫ్రూట్ డైట్ లేదా వెజిటబుల్స్ నే ఆహారంగా తీసుకునే వారిలో వారి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది దెబ్బతింటుందని. ఫెర్టిలిటీపై దుష్ప్రభావం పడుతుంది. శరీరం తగినన్ని పోషకాలను గ్రహించనప్పుడు పోషకాలు సరిగ్గా అందవు. తద్వారా, హార్మోన్లలో అసమతుల్యతలు తలెత్తుతాయి. దీని వలన మెన్స్ట్రువల్ సైకిల్ లో ఇర్రెగ్యులారిటీ కలుగుతుంది.

6. మలబద్ధకం:

6. మలబద్ధకం:

గత కొన్నేళ్లుగా నిర్వహించబడిన అనేక సర్వేలు అలాగే పరిశోధన అధ్యయనాల ప్రకారం వేగంగా బరువును తగ్గేందుకు ఫ్యాడ్ డైట్ ను తీసుకోవడం వలన అజీర్ణం మరియు మలబద్దకం సమస్యలతో సతమతమయ్యే ఆస్కారం ఉందని తేలింది. శరీరానికి తగినంత ఫైబర్ అందకపోవడం వలన ఇంటస్టైన్ లో స్టూల్ అనేది గట్టిపడుతుంది. మలబద్దకం సమస్య తలెత్తుతుంది.

7. డిప్రెషన్:

7. డిప్రెషన్:

డిప్రెషన్ అనేది మానసిక సమస్య అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో అనేక ఫ్యాక్టర్స్ వలన ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అనారోగ్యకరమైన వెయిట్ లాస్ మెథడ్స్ అనేవి డిప్రెషన్ కి దారితీస్తాయన్న విషయం చాలా మంది గ్రహించి ఉండకపోవచ్చు. అనారోగ్యకరమైన డైటింగ్ అలవాట్లను పాటించడం వలన మెదడుకు తగినన్ని పోషకాలు అందవు. దీని వలన బ్రెయిన్ కెమికల్స్ లో ఇంబ్యాలెన్స్ తలెత్తుతుంది. డిప్రెషన్ మరియు యాంక్సయిటీ సమస్యలు ఎదురవుతాయి.

8. క్యాన్సర్:

8. క్యాన్సర్:

అనేక పరిశోధనల అధ్యయనాల ప్రకారం, వేగంగా వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారిలో కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలు తలెత్తే ఆస్కారం ఉంది. బ్రెస్ట్, కిడ్నీ, కొలోన్ క్యాన్సర్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన వెయిట్ లాస్ మెథడ్స్ వలన శరీరంలో సంభవించే కెమికల్ చేంజెస్ వలన ఇలా జరగవచ్చు.

English summary

Surprising Reasons How Weight Loss Can Seriously Affect Your Health

Following unhealthy weight loss methods in order to lose weight quickly can cause a number of serious health problems. You might be at a risk of suffering from sarcopenia, malnutrition, heart diseases, electrolyte imbalance, constipation, depression, etc.The minute we type in the phrase "weight loss" on any of the Internet search engines,
Story first published: Saturday, August 25, 2018, 19:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more