పెద్ద పురుషాంగంతో ఎక్కువ సెక్స్ చేస్తే యోని షేప్ మారుతుందా? యోనికి వెంట్రుకలుంటే? యోని వాస్తవాలివే!

Subscribe to Boldsky

సాధారణంగా స్త్రీ యోని గురించి, దాని లోతు గురించి పెద్దగా ఎవరికీ అహగాహన ఉండదు. అలాంటి యోనిలో సంతృప్తికరమైన సెక్స్‌ను చేయాలంటే పురుషాంగం... కనీసం ఆరు లేదా ఏడు అంగుళాల పొడవు ఉండాలని సెక్స్ పుస్తకాల్లో ఎక్కడో ఓ చోట చదివి అలాంటి భావనతోనే ఉంటారు. వాస్తవానికి యోని లోతు ఎంత ఉంటుంది.. అందులో జొప్పించేందుకు పురుషాంగం ఎంత పొడవు ఉండాలన్న అంశం గురించి ఎవరికీ వారు ఏవేవో ఊహించుకుంటారు.

ఇంకొందరు ఎక్కువ సార్లు సెక్స్ చేసినా లేదంటే బాగా పెద్ద అంగాన్ని యోనిలోకి జొప్పించి సెక్స్ చేసినా కూడా యోని బాగా లూజ్ అయిపోతుందని, యోని షేప్ మారిపోతుందని అనుకుంటారు. కానీ యోనికి సంబంధించి వాస్తవాలు తెలియక మగవారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు నచ్చినట్లుగా ఊహించుకుంటుంటారు.

నెలసరి వస్తే యోని కరాబు అయిపోతుంది?

నెలసరి వస్తే యోని కరాబు అయిపోతుంది?

రజస్వల అయ్యింది మొదలు రజస్సు క్షీ ణించే ‘మోనోపాజ్‌' దాటే వరకు ప్రతి స్త్రీకి నెలసరి వస్తుంది. రుతుక్రమం మంచిది కాదు దాని వల్ల ఏదో చెడు వాసన వస్తుంది. యోని మొత్తం కరాబు అయిపోతుందని బాధపడకూడదు. వాస్తవానికి ప్రతి అమ్మాయికి ఆ సమయంలో యోని నుంచి డిశ్చార్జి వస్తేనే మేలు. ప్రతి నెలా రుతుస్రావం రూపంలో మూడు నుంచి ఏడు రోజుల పాటు పోయే రక్తం, రక్తనాళాల నుంచే ప్రవ హించినా ఇది మలిన రక్తమే తప్ప జీవరక్తం కాదు.

యోని అపరిశుభ్రంగా మారిపోతుందనుకోవడం పొరపాటు

యోని అపరిశుభ్రంగా మారిపోతుందనుకోవడం పొరపాటు

ఈ మలినరక్తం సూక్ష్మక్రిములకు నెలవయ్యే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఈ స్థితిలో శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో యోని అపరిశుభ్రంగా మారిపోతుందనుకోవడం పొరపాటు. రక్తస్రావ పరిమాణాన్ని బట్టి రోజుకు రెండు- మూడు సార్లు నేప్కిన్స్‌ మార్చుకోవాలి. జననాంగాన్ని శుభ్రపరుచుకోవడమే కాకుండా రోజూ రెండు పూటలా స్నానం చే యడం మరీ మంచిది.

యోని డౌషింగ్ చాలా బెస్ట్?

యోని డౌషింగ్ చాలా బెస్ట్?

యోని డౌషింగ్ అంటే యోని లోపల భాగాలను శుభ్రం చేసుకోవడం. ఆడవారు స్నానం చేస్తున్నప్పుడు యోని బాహ్య భాగాలను శుభ్రం చేసుకుంటారు. కానీ యోని డౌచింగ్ ద్వారా మాత్రం గొట్టం లేదా నాజల్ వంటి నీటిని స్ప్రే చేసే ఏదైనా సాధనాన్ని ఉపయోగించి యోని ప్రారంభం నుంచి లోపలికి నీటిని స్ప్రే చేస్తారు కొందరు అమ్మాయిలు. తర్వాత స్ప్రే చేసిన నీరు యోని లోపల నుంచి బయటకు పోతుంది.

యోని బాగా క్లీన్ అయిపోతుందనేది భ్రమ

యోని బాగా క్లీన్ అయిపోతుందనేది భ్రమ

ఇందుకు కొన్ని రకాల మందులను కూడా వినియోగిస్తారు. వెనీగర్, అయోడిన్, బేకింగ్ సోడా వంటి వాటి ద్వారా యోనిలోపల భాగాలను శుభ్రం చేసుకంటారు. యోనిని డౌచింగ్ ద్వారా శుభ్రం చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుందనేది భ్రమ మాత్రమే. బహిష్టు అనంతరం రక్తాన్ని శుభ్రం చేసుకోవడానికి, సెక్స్ లో పాల్గొన్నాక వీర్యాన్ని శుభ్రం చేసుకునేందుకు ఇలా యోనిని క్లీన్ చేసుకంటూ ఉంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

లాక్టోబాసిలీ అనే ఒక బ్యాక్టీరియా

లాక్టోబాసిలీ అనే ఒక బ్యాక్టీరియా

సాధారణంగా, యోనిలో ప్రధానంగా లాక్టోబాసిలీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది హానికారక బ్యాక్టీరియాను నాశనం చేయడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒకవేళ యోని డౌచింగ్ చేస్తే సహజ బ్యాక్టీరియాలు నశిస్తాయి. అందువల్ల యోనీ మరీ శుభ్రంగా ఉంచుకుందామని లేనిపోని ప్రయోగాలు చేయడం మంచిది కాదు.

యోనిని సబ్బుతో క్లీన్ చేసుకుంటే మంచి వాసన వస్తుందనుకుంటారు

యోనిని సబ్బుతో క్లీన్ చేసుకుంటే మంచి వాసన వస్తుందనుకుంటారు

ఇక జననాంగాలు అపరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి, వాటిని ముట్టకూడదు. శుభ్రం చేస్కోవడానికి రసాయన డౌచింగ్ చేస్కోవాలి. దానికి డెటాల్, సబ్బులు వాడాలని అనుకుంటారు. ఇదంతా అపోహ. వాస్తవం ఏమిటంటే.. నిజానికి జననాంగాలను శుభ్రం చేస్కొనే స్రావాలు నిరంతరం అక్కడ స్రవిస్తూ, హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్‌లను నాశనం చేస్తుంటాయి. ఆ వ్యవస్థ శరీరానికి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి.

సబ్బుతో శుభ్రపరచడం చాలా ప్రమాదం

సబ్బుతో శుభ్రపరచడం చాలా ప్రమాదం

ఇక యోనిని సబ్బులు, డెటాల్స్‌తో శుభ్రపరచడం చాలా ప్రమాదం. దీటివల్ల ఆ ప్రదేశంలోని సున్నితమైన పొరలు దెబ్బ తిని, పొక్కినైట్లె, ఎర్రగా కందిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా వేగంగా అక్కడి హానికర బ్యాక్టీరియా, ఫంగస్ దాడి చేయడం వల్ల తీవ్రమైన ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తుంది. చాలామంది సబ్బు వాడి ఈ అనర్థాన్ని కొని తెచ్చుకొని నిరంతరం వైట్ డిశ్చార్జి, మంట, నొప్పి దురద, కలయికలో నొప్పితో సంవత్సరాల తరబడి బాధపడ్తుంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఎందుకంటే, జననాంగాల శుభ్రతకి సబ్బు వాడుతూనే ఉంటారు కాబట్టి. అలా చేయకూడదు. నోటిలో సున్నం, సోపు పెడితే ఎలా పొక్కుతుందో జననాంగాల్లోని సున్నిత పొరలకు సబ్బు వాడితే అదే జరుగుతుంది. కాబట్టి, పరిశుద్ధమైన నీళ్ళతో మాత్రమే జననాంగాలను శుభ్రపర్చుకోవాలి.

ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే షేప్ మారిపోతుంది

ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే షేప్ మారిపోతుంది

ఇక ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొన్నా, లేదంటే పొడవాటి పురుషాంగాన్ని యోనిలో జొప్పించినా యోని షేప్ మారిపోతుందని చాలా మంది అనుకుంటారు. సాధారణంగా స్త్రీ యోని లోతు (పొడవు) మూడున్నర అంగుళాలు మాత్రమే ఉంటుందని, ఇందులో జొప్పించేందుకు పురుషాంగం పొడవు నాలుగు అంగుళాల ఉంటే సరిపోతుంది. పెద్ద పురుషాంగం అయినా చిన్ని పురుషాంగం అయినా యోనిలోతు ఉన్న వరకే పోగలదు. అంటే మూడున్నర అంగుళాలే లోనికి పోతుంది. అందువల్ల యోని లూజ్ అయిపోతుందని ఆందోలన చెందాల్సిన అవసరం లేదు.

యోని లోతు ఉన్నంత వరకే పురుషాంగం పోతుంది

యోని లోతు ఉన్నంత వరకే పురుషాంగం పోతుంది

సాధారణంగా పురుషాంగం 9.16 సెంమీ (3.61 అంగుళాలు) పొడవుంటే అది బాగా స్తంభిస్తే నిటారుగా మారి 13.12 సెం.మీ. (5.16 అంగుళాలు) పొడవు వరకు చేరుకుంటుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అయితే, స్త్రీ యోని పొడవు, వెడల్పులు స్త్రీ పురుషుల కలయిక సమయంలో సాగే గుణం కలిగివుంటుందని, అందువల్ల పురుషాంగం నాలుగు అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్నా వచ్చి ప్రమాదమేమీ లేదు. యోని షేప్ ఏమి మారిపోదు.

కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లు పాటించాలా? వద్దా

కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లు పాటించాలా? వద్దా

యోనిని బిగుతుగా చేసుకునేందుకు కొందరు కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లను పాటిస్తారు. యోని మార్గాన్ని, కటి కండరాలను కెగెల్‌ ఎక్సర్‌సైజ్‌లు బిగుతుగా చేస్తాయి. ఈ వ్యాయామాలు చేయటం ఎంతో తేలిక! ఇందుకోసం మూత్ర విసర్జన చేయటానికి ఉపయోగించే కండరాలను బిగిపడుతూ వదిలే వ్యాయామం చేయాలి. ఈ కండరాలను నెమ్మదిగా లోపలికి 3 సెకండ్ల పాటు బిగపట్టి వదిలేయాలి. ఇలా పదిసార్లు చేయాలి. రోజుకి రెండుసార్లు చొప్పున రెండు వారాలపాటు ఈ వ్యాయామం చేస్తే నెల రోజుల్లో తేడా కనిపిస్తుంది. ఈ వ్యాయామాల వల్ల యోని కండరాలు బలంగా, బిగుతుగా తయారవటంతో పాటు దంపతులిద్దరికీ సెక్స్‌లో దీర్ఘమైన భావప్రాప్తి కూడా కలుగుతుంది.

ప్రసవం తరువాత యోని కండరాలు వదులుగా అయిన వారికి ఈ వ్యాయామాలు సూచిస్తారు.

యోని దగ్గర వెంట్రుకలు

యోని దగ్గర వెంట్రుకలు

యోని దగ్గర వెంట్రుకలు ఉండాలా వద్దా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే యోని దగ్గర వెంట్రుకలు ఉంటే నే చాలా మంచిది. ఎందుకంటే ఆ వెంట్రుకలు యోనిలోకి బ్యాక్టిరియా వెళ్లకుండా కాపాడుతాయి. అయితే యోని దగ్గర ఉండే వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. కొందరు అమ్మాయిలు యోని దగ్గర ఒక్క వెంట్రుక కూడా ఉండకుండా నీట్ గా క్లీన్ చేసుకుంటారు. అలా తరుచూ చేసుకోవడం పెద్ద తప్పు.

యోని దగ్గర వెంట్రుకలు ఉండవని అనుకుంటారు

యోని దగ్గర వెంట్రుకలు ఉండవని అనుకుంటారు

కొందరు అబ్బాయిలు యోని దగ్గర అమ్మాయిలకు వెంట్రుకలు వస్తాయా అని డౌట్ పడతారు. గతంలో ఒక అబ్బాయి పోర్న్ వెబ్ సైట్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విధంగా చెప్పాడట. తాను పోర్న్ మూవీలు బాగా చూస్తానని అయితే ఎప్పుడు కూడా యోని దగ్గర వెంట్రకలు చూడలేదని, కానీ తన గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొన్నపుడు యోని దగ్గర వెంట్రుకలు చూసి షాక్ అయ్యానని చెప్పాడు. ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు మరి. చాలా మంది అమ్మాయిల యోని వద్ద వెంట్రుకలు ఉండవని భావిస్తుంటారు. వాస్తవానికి యోని దగ్గర వెంట్రుకలుంటాయి.

యోనిలో ద్రవాలు

యోనిలో ద్రవాలు

అమ్మాయిలకు శృంగార భావనలు కలిగినప్పుడు యోనిలో ద్రవాలు వాటంతటవే ఊరుతాయి. చాలా మంది సెక్స్ లో పాల్గొనేటప్పుడు యోనిలో జెల్ పూసుకోవాలని అనుకుంటారు. అలా చేస్తేనే సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటారు. కానీ యోనిలో సహజంగానే ద్రవాలు ఊరుతాయి.

యోనిలో ద్రవాలు ఊరవు

యోనిలో ద్రవాలు ఊరవు

కొంతమందిలో ఏదైనా హార్మోన్‌లో అసమతుల్యత ఉన్నా... మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఇతరత్రా కారణాలు ఉన్నా కూడా యోనిలో ద్రవాలు ఊరవు. దాంతో యోని పొడిగా ఉండి, కలయిక సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. యోనిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలా యోని పొడిబారవచ్చు. కొన్ని రోజుల పాటు కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటి లూబ్రికేటింగ్ క్రీముల్ని కలయిక సమయంలో యోనిలో రాసుకోండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    the biggest lies about vagina you need stop believe

    the biggest lies about vagina you need stop believe
    Story first published: Thursday, June 28, 2018, 16:36 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more