శరీరం నుండి వచ్చే ఈ 6 రకాల దుర్వాసనలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు !

Subscribe to Boldsky

ప్రతి ఒక్కరికీ, వారి శరీరతత్వాన్ని బట్టి వచ్చే శరీర వాసనలు వేరువేరుగా ఉంటాయి. మీరు తరచుగా కఠినమైన వ్యాయామమును సాధన చేసిన తర్వాత (లేదా) భారీ ఊబకాయంతో ఉన్నప్పుడు మీ శరీరం నుంచి ఈ చెడు వాసనలు వెదజల్లబడతాయి. ఈ ఆర్టికల్లో, మీరస్సలు నిర్లక్ష్యం చేయకూడని శరీర దుర్వాసనల గురించి వ్రాయడం జరిగింది.

దుర్వాసనను వెదజల్లే శరీర భాగాల గురించి మాట్లాడటమనేది అందమైన విషయం కాదు. కాబట్టి, మీలో చాలామందికి వారి ఆరోగ్యము పట్ల, ఏది ఒప్పో, ఏది తప్పు అని తెలుసుకోవటం లేదు.

ప్రతి వ్యక్తి ఒక భిన్నమైన, ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాడు. శరీరం నుంచి బయటకు వచ్చే వాసనలు కొన్ని సహజమైన శరీర సువాసనలుగా ఉంటాయి.

These Are The 8 Signs Of Body Odours You Shouldnt Ignore

కానీ, మీ శరీరం నుండి వెలువడే దుర్గంధపు చెడు వాసనలు మీ ఆరోగ్య పరిస్థితిని సూచించేవిగా ఉంటాయి. స్వీడిష్ అధ్యయనం ప్రకారం, కొన్ని శరీర వ్యాధులు భిన్నమైన, ప్రత్యేకమైన వాసనలను శరీరం నుంచి ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. కాబట్టి, మీరు అలాంటి చెడువాసనలను గుర్తించినట్లయితే వాటిని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

 ఫ్రూటీ స్మెల్ (డయాబెటిస్ లక్షణాలు) :

ఫ్రూటీ స్మెల్ (డయాబెటిస్ లక్షణాలు) :

మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల, మీ రక్తంలో ఎదురైనా చక్కెర స్థాయిల అసమానతలను బట్టి డయాబెటిక్ కీటోయాసిడోసిస్ (DKA) ఏర్పడుతుంది. శరీర వ్యవస్థ సరైన రీతిలో పనిచేయడానికి తగిన శక్తిని మన శరీరం సృష్టించలేకపోయినప్పుడు, ఆ శక్తి కోసం మన శరీరంలో ఉన్న కొవ్వు ఆమ్లాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మీ రక్తంలో "కీటోన్లని" పిలిచే ఆమ్ల రసాయనాలను ఏర్పరుస్తుంది. "అసిటోన్లని" పిలిచే ఆమ్లాలోకటి మీ శ్వాస లోపల ఒక పండ్ల వాసనను విడుదల చేయగలదు. DKA ప్రభావాలు చాలా ప్రతికూలమైనవిగా ఉంటాయి.

 స్టికీ ఫీట్ (ఫంగస్ లక్షణాలు) :

స్టికీ ఫీట్ (ఫంగస్ లక్షణాలు) :

మీరెప్పుడైనా మీ కాలి చుట్టూ పొరలుగా ఊడుతున్న పొడి చర్మమును (లేదా) ఎర్రదనాన్ని మరియు బొబ్బల సంకేతాలను గమనించినట్లయితే, మీరు ఫంగస్ని కలిగి ఉండవచ్చు. ఇది బ్యాక్టీరియా & ఫంగస్ల కలయిక వల్ల మీ చర్మము (లేదా) బొటనవేలు చుట్టూ కోసుకుపోయినట్లుగా పాకినందువల్ల, మీ పాదాల నుంచి వచ్చే ఫౌల్ (మలినమైన) వాసనకు కారణం కావచ్చు. మీరు ఈ ఫంగస్ను ఎక్కువగా తాకడం వల్ల గజ్జలు, చంకలు వంటి మీ శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఈ ఫంగస్ వ్యాప్తి చెందుతుంది.

మూత్రంలో దుర్వాసన (UTI లక్షణం)

మూత్రంలో దుర్వాసన (UTI లక్షణం)

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) గాఢమైన దుర్వాసనతో కూడిన మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణంగా E.కోలి అనబడే బాక్టీరియా, మీ మూత్రనాళం (లేదా) మూత్రంలోకి ప్రవేశించినప్పుడు సంభవిస్తుంది. అప్పుడు బ్యాక్టీరియా మీ మూత్రాశయం వైపు కదులుతూ, ఇన్ఫెక్షన్స్కు కారణమవుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ అనేది మహిళల్లో చాలా సాధారణంగా ఉంటుంది, ఎందుకంటే వారి మూత్రాశయం చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కాబట్టి, మీరు మూత్రంలో దుర్వాసనను గుర్తించిన వెంటనే, డాక్టర్ను సంప్రదించండి.

శ్వాసలో దుర్వాసన (స్లీప్ అప్నియా లక్షణం) :

శ్వాసలో దుర్వాసన (స్లీప్ అప్నియా లక్షణం) :

స్లీప్ అప్నియా, మీరు నిద్రిస్తున్నప్పుడు మీ శ్వాసను అకస్మాత్తుగా ఆపి, తిరిగి శ్వాసను తీసుకునేలా ప్రారంభిస్తుంది. మీరు రాత్రిపూట మీ నోటి ద్వారా ఊపిరి పీల్చుకునే పరిస్థితికి దారి తీయడం వల్ల ఇది అధికమైన గురకకి దారితీస్తుంది. దాని వల్ల మీ నోరు చాలా పొడిగా తయారవుతుంది, ఇది చెడు శ్వాసను కలుగచేసే ఒక సాధారణమైన కారణం, అలాగే ఇది బ్యాక్టీరియాను మరింత సులభంగా వృద్ధి చెందేలా అనుమతిస్తుంది. బ్యాక్టీరియా రెట్టింపు అవ్వడం మొదలుపెట్టినపుడు, సల్ఫరస్ వంటి దుర్వాసనను ఉత్పత్తి చేస్తాయి.

యోని నుంచి చేపల సువాసన :

యోని నుంచి చేపల సువాసన :

ప్రతి మహిళ, వేర్వేరు యోని వాసనలను కలిగివుంటారు. నెలలో వేర్వేరు పరిస్థితులకనుగుణంగా ఈ వాసన మారుతూ ఉంటుంది. అయితే, మీరు నిరంతరమూ చేపల వంటి వాసనను గమనించినట్లయితే, మీరు చికిత్స కోసం తప్పక డాక్టర్ను సంప్రదించాలి. యోని నుంచి వచ్చే చేపల వాసనకు "బ్యాక్టీరియాల్ వాగినిసిస్" అని పిలవబడే పరిస్థితిని సూచిస్తుంది, ఇది యోనిలో సహజంగా ఉండే బ్యాక్టీరియా పెరుగుదలను సూచిస్తుంది.

 చేపల దుర్వాసన వంటి చెమట :

చేపల దుర్వాసన వంటి చెమట :

మీ చెమట, మూత్రాము(లేదా) ఇతర శరీర భాగాలలో ఉత్పన్నమయ్యే ద్రవాలు - చేపల వాసనగా ఉన్నటైతే, మీరు ట్రైమెథలైమ్యురియా అని పిలవబడే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉంటారు. ఇది చాలా అరుదైన జన్యు పరిస్థితి, దీనిలో ట్రిమెథైలమైన్ విచ్ఛిన్నం కాలేకపోవడం వల్ల, ట్రిమెథైలమైన్ "ఎన్-ఆక్సైడ్గా" మార్చబడుతుంది. ట్రిమెథైలమైన్ అనే సమ్మేళనం చేపల వాసనను కలుగజేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    These Are The 8 Signs Of Body Odours You Shouldn't Ignore

    Some of the odours emitted out from body are just a part of your natural body scent. But, there are some stinky bad odours that can actually speak volumes about your health. Fruity breath is a symptom of diabetes, stinky feet a symptom of athlete's foot, smelly poop a symptom of lactose intolerance, smelly urine a symptom of UTI, etc.
    Story first published: Monday, April 9, 2018, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more