For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరిటాకు భోజనం గురించి తెలిస్తే ప్లేట్లలో అస్సలు తినరు.. అన్నంలో విషం కలిపితే ఈజీగా తెలుసుకోవొచ్చు

పూర్వం అరిటాకుల్లోనే భోజనాలు చేసేవారు. ఇప్పుడంటే రకరకాల మార్పులవల్ల చాలాచోట్ల తగ్గిపోయినా, ఇప్పటికీ కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు. అరటి ఆకులు, అరటి ప్రయోజనాలు, అరటి ఆకులతో ప్రయోజనాలు.అరటి.

|

పూర్వం అరిటాకుల్లోనే భోజనాలు చేసేవారు. ఇప్పుడంటే రకరకాల మార్పులవల్ల చాలాచోట్ల తగ్గిపోయినా, ఇప్పటికీ కొందరు శుభకార్యాలకు అరిటాకే వాడుతున్నారు. కొన్ని హోటల్స్‌లో ఇప్పటికీ అరిటాకు భోజనమే. వండిన పదార్థాలకు రుచి తీసుకువచ్చే అరిటాకులో భోజనం చేయడంవల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

భారతీయ సంప్రదాయంలో ముఖ్యంగా దక్షిణాదిలో అరిటాకు భోజనం సహజం. అరిటాకు భోజనం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. దీన్నొక సంప్రదాయంగా పాటిస్తారు. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి తదితర వంటకాలు వ డ్డించుకుని భుజిస్తే ఆ రుచి వర్ణనాతీతం.

చాలా పాత్రలు ఉపయోగిస్తారు

చాలా పాత్రలు ఉపయోగిస్తారు

భోజనానికి ఉగయోగించే పాత్రలు అనేకం. బంగారం, వెండి, కంచు, స్టీలు, అల్యూమినియం, గాజు, పింగాణిలతో తయారుచేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అలాగే కొందరు అరటి, మోదుగ, మఱ్ఱి , బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేస్తారు.

రాజులు అలా తినేవారు

రాజులు అలా తినేవారు

పూర్వం రాజులు, జమిందార్లు బంగారు పళ్ళాలను ఉపయోగించేవారు. కొంతమంది వెండికంచాల్లో తినేవారు. మిగిలినవారు భోజనానికి ప్రతిరోజూ అరిటాకు లేక మోదుగ విస్తర్లను ఉపయోగించేవారు. శుభకార్యాలు, వివాహం , ఉపనయనం తదితర సంధర్భాలలో అరిటాకులో భోజనం పెట్టేవారు. కారక్రమేణా స్టీలు, గాజు, పింగాణి పళ్ళాలు వాడుకలోకి వచ్చయి.

అరిటాకులో భోజనం చేయడం శ్రేష్టం

అరిటాకులో భోజనం చేయడం శ్రేష్టం

ఎన్ని రకాల పళ్ళాలు వచ్చినా అన్నిట్లోకి అరిటాకులో భోజనం చేయడం మిక్కిలి శ్రేష్టం. పచ్చటి అరిటాకులో వేడివేడి పదార్థాలను వేసుకొని తినడంవల్ల శరీరానికి కాంతి వస్తుంది. ఆకలి పుడుతుంది. మోదుగ, మఱ్ఱి, రావి ఆకులను ఎండబెట్టి విస్తర్లను తయారుచేస్తారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు.

తొందరగా జీర్ణమవుతుంది

తొందరగా జీర్ణమవుతుంది

పచ్చి అరటి ఆకులో పెట్టు కొని ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తిన్నడం శ్రేయస్కరం. పూర్వం భోజనానికి విస్తర్లు, నీళ్ళు తాగడానికి ఆకు దోనెలను ఉపయోగిస్తారు. అలాగే మోదుగ ఆకులతో‌కుట్టిన విస్తరిలో‌అన్నంతింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటున్నారు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మర్రిచెట్టు విష్ణువు స్వరూపం. మర్రి ఆకులో అన్నంతింటే క్రిమిరోగ నివారణి, కళ్ళకు సంబంధించిన దోషాలు తొలిగిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది.

పేగులలోని క్రిములు నాశనం

పేగులలోని క్రిములు నాశనం

ముఖ్యంగా అరటి, మోదుగ, మర్రి ఆకు విస్తర్లలో భోజనం చేస్తే పేగులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదంలో చెప్పారు. కాలక్రమేణా ఈ అలవాట్లు మారిపోయాయి. చాలామందికి విస్తరిలో భోజనం చేయడం అపురూపమైంది. కాంక్రీట్ జంగిల్ గా పేరొందిన నగరాలలో కూడా పండుగలు, పర్వదినాలలో మార్కెట్లో అరటిఆకులు అమ్ముతున్నారు.

ఇప్పటికీ..

ఇప్పటికీ..

వాటిని కొనుక్కుని ఆ రోజు వాటిలో భోజనం చేసేవారు ఉన్నారు. ఇప్పటికీ కొన్నిప్రాంతల్లోని హోటళ్ళలో ఆకులోనే భోజనం పెడుతున్నారు. దీన్నిబట్టి ఆకుల్లో భోజనం చేయడానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

అన్నంలో విషం కలిపితే..

అన్నంలో విషం కలిపితే..

శత్రువైనా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం వుంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే ఒకవేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం వుందని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.

ఒకప్పుడు అంతా అరటి ఆకుల్లోనే

ఒకప్పుడు అంతా అరటి ఆకుల్లోనే

వివాహాది శుభకార్యాల్లో భోజనాలు అరటి ఆకుల్లో పెట్టే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇప్పుడంటే వంట చేసే ఓపిక, వడ్డించే తీరిక లేదని చెప్పేసి అంతా క్యాటరింగ్ భోజనాలపై ఆధారపడుతున్నారు కానీ ఒకప్పుడు అంతా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఇప్పుడు కూడా ఈ సంప్రదాయాన్ని ఆచరించేవారు లేకపోలేదు.

అరటి ఆకుని పళ్లెంలాగ బోర్లిస్తే

అరటి ఆకుని పళ్లెంలాగ బోర్లిస్తే

ఉప్పు ఎక్కువైన పదార్ధం ఏదైనా కూడా దాన్ని తినలేక బైట పడేయకండి. ఉప్పుఎక్కువైన పాత్రమీద మూత తీసేసి మూత స్థానంలో అరటి ఆకుని పళ్లెంలాగ బోర్లించి కొంచెం సేపు పొయ్యిమీద పెట్టి వేడి చేయండి. అందువలన ఆ పదార్ధంలోని ఉప్పు తగ్గి రుచిగా తయారవుతుంది.

అలాగే అరటి చెట్టునుంచి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.

పొటాషియం

పొటాషియం

అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడినవాళ్లు దీన్ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అరటిపండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. రేచీకటికి చెక్‌పెట్టవచ్చు. అరటి ఆరోగ్యప్రదాయిని. అరటి మొక్క అన్ని భాగాలను అనేక రూపాలుగా ఉపయోగిస్తారు.

ఇన్ని రకాల ప్రయోజనాలు

ఇన్ని రకాల ప్రయోజనాలు

కాండాన్ని, పువ్వును వంటల్లో ఉపయోగిస్తారు. మొక్క నుంచిపొందిన ఫైబరును తాళ్లు చాపలు, ముతక కాగితం, కాగితం గుజ్జు తయారుచేయడంలో ఉపయోగిస్తారు. ఇన్ని రకాలైన ప్రయోజనాలు వుండడంవలన అరటి ఆకు భోజనం అనేది ఘనమైన భోజనం ప్రతిబింబిస్తుంది అంటారు.

మంచి రుచి

మంచి రుచి

అరిటాకులో వేడి వేడి ఆహారపదార్థాలు వడ్డించడంవల్ల ఆకుపైన ఉండే పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల భోజనానికి మంచి రుచి వస్తుంది. దీంతో భోజనంలో చక్కని రుచిని ఆస్వాదించవచ్చు. అరిటాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వేడి పదార్థాలు ఆ ఆకుపైన పెట్టుకుని తిన్నప్పుడు ఆకులోని విటమిన్లు అన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.

ఆరోగ్యం చక్కపడుతుంది

ఆరోగ్యం చక్కపడుతుంది

వేడి వేడి పదార్థాలు అరిటాకులో తినడం వల్ల కఫ, వాతాలు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది, ఆరోగ్యం చక్కబడుతుంది. శరీరం కాంతిమంతమవుతుంది. ఆకలిపుడుతుంది. ఎన్నో రకాల జబ్బులను నిరోధించే శక్తి అరిటాకులో ఉంది.

గ్యాస్ పోతుంది

గ్యాస్ పోతుంది

అరిటాకుల్లో తినడం వల్ల గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు. అరిటాకులో భోజనం చేయడం వల్ల అందులోని పోషకాలు శరీరంలోకి చేరి తద్వారా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. వెంట్రుకలు నల్లబడతాయి. తెల్లని జుట్టు ఉన్నవారు అరిటాకులో భోజనం చేస్తుంటే వారి జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

పోషకాలు అందుతాయి

పోషకాలు అందుతాయి

అరిటాకుల్లో పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ను కలిగి ఉంటాయి. వీటిపై వేడివేడి పదార్థాలు వడ్డిస్తే ఇవి కూడా భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

English summary

this is why you must eat on a banana leaf

this is why you must eat on a banana leaf
Desktop Bottom Promotion