For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఒక్క చిట్కాతో జ‌లుబు మ‌టుమాయం!

By Sujeeth Kumar
|

వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌చ్చిన‌ప్పుడు జ‌లుబు, ద‌గ్గు అంటుకోవ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రిలో రోగ‌నిరోధ‌క శ‌క్తి మరీ త‌క్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు త్వ‌ర‌గా జ‌బ్బు ప‌డ‌తారు. అందుకే ఇలా బ‌ల‌హీనంగా ఉండేవారు విభిన్న చికిత్సా విధానాల‌ను పాటించాలి. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల‌తో జ‌లుబు, ద‌గ్గు లాంటివి పోగొట్టుకోవ‌చ్చు.

This ONE simple remedy will help you treat cold

ఖ‌రీదూ ఎక్కువ కాదు...

అల్లం చాయ్ మ‌నంద‌రికీ తెలిసిందే. ద‌గ్గుకు, జ‌లుబుకు దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది. అల్లం... దాదాపు ప్ర‌తి భార‌తీయ వంట గ‌దిలో క‌నిపిస్తుంది. ఘాటుగా ఉంటుంది. ఖ‌రీదు కూడా పెద్ద‌గా ఉండ‌దు. ఇంట్లోనూ సుల‌భంగా పండించుకోవ‌చ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు గొంతులో గ‌ర‌గ‌ర‌ను త‌గ్గించేయ‌గ‌ల‌దు.

This ONE simple remedy will help you treat cold

చాయ్ ప‌డ‌నివాళ్లు...

ఇదంతా బాగానే ఉన్నా మీకు అస‌లు టీ అంటే ప‌డదు. ద‌గ్గుతో గొంతు నొప్పిని ఎలా నివారించుకుంటారు. దీనికి ఒక ప‌రిష్కారం ఉంది. అదేమిటో చెబుతాం...

This ONE simple remedy will help you treat cold

రోజుకు మూడు క‌ప్పులు..

అంగుళంన్న‌ర పొడువుండే తాజా అల్లం ముక్క తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్క‌లుగా కోసుకోవ‌చ్చు లేదా మెత్త‌గా రుబ్బుకున్నా ఫ‌ర్వాలేదు. దీన్ని గోరువెచ్చ‌ని నీటిలో వేసి ఐదు నిమిషాల‌పాటు ఉంచాలి. త‌ర్వాత అల్లాన్ని పిండేసి ఆ గోరువెచ్చ‌ని నీటిని తాగేసేయాలి. ఇలా రోజులో మూడు క‌ప్పులు తాగితే ఫ‌లితం అద్బుతంగా ఉంటుంది. రుచికి తేనె క‌లుపుకోవ‌చ్చు.

This ONE simple remedy will help you treat cold

పిల్ల‌ల‌కైతే...

చాయ్ ఇష్ట‌మున్నవారు అల్లం చాయ్ తాగ‌వ‌చ్చు. ఇది జ‌లుబుకు, ద‌గ్గు త‌గ్గేందుకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పైగా అల్లం చాయ్‌ను దాదాపు చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అల్లం టీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో. శ్వాస స‌మ‌స్య‌లు, ర‌క్త‌ప్ర‌సర‌ణ స‌రిగ్గా ఉండేలా చేయ‌గ‌ల‌దు. పిల్ల‌ల‌కు అల్లం చాయ్ ఇచ్చేముందు కాస్త ఘాటు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

Read more about: wellness health cold
English summary

This ONE simple remedy will help you treat cold

This ONE simple remedy will help you treat cold,Kareena Kapoor enjoyed a party with her girlfriends last night, all wearing black. Have a look.
Story first published:Monday, February 19, 2018, 12:50 [IST]
Desktop Bottom Promotion