For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 ఏళ్ళ వయస్సు పైబడిన మహిళలకు సూచించే ఆరోగ్యపరమైన హెచ్చరికలు !

|

మహిళల వయస్సు 30 ఏళ్ళ వయస్సుకి వచ్చినప్పుడు, వారు తరచూ వయసు సంబంధమైన వ్యాధుల ప్రారంభ దశతో సంబంధమును కలిగి ఉంటారు. ఇది కొంత మేరకు నిజం కావచ్చు, ముప్పైల లోకి అడుగుపెట్టిన మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు వారు కొన్ని రకాల వ్యాధులు / రుగ్మతల భారిన పడి అనారోగ్యామును పొందారని గుర్తించబడింది. 30 ఏళ్ళలోకి ప్రవేశించిన స్త్రీలు వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ, 30 ఏళ్ళ తరువాత సాధారణంగా సంభవించే అనారోగ్య లక్షణాల కోసం మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి.

మహిళలు ముఖ్యంగా వారి కుటుంబం, కెరీర్, పిల్లలు, ప్రెగ్నెన్సీ, వివాహాలు మొదలైన వాటిపై ప్రధానంగా దృష్టిని పెడతారు. ఇన్ని బాధ్యతల మధ్య, తమ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలంటే 30 ఏళ్ళ వయస్సు దాటిన మహిళలకు పెద్ద విషయమేమీ కాదు. కానీ అనేకమంది మహిళలు చేసే ఒక పెద్ద తప్పు అది. మహిళలకు భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన వ్యాధుల ప్రభావాల బారిన పడకుండా ఉండటం కోసం ఈ 30 ఏళ్ళ వయస్సు నుంచే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.

Top Health Warnings For Women In Their 30s

30 ఏళ్ల వయస్సు దాటిన మహిళల్లో కనపడే అనారోగ్య సమస్యల సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వాటి నివారణకు చేసే చికిత్స చాలా కష్టమవుతుంది. అనారోగ్య లక్షణాలను సూచించేలా మీ శరీరం రూపొందించబడింది. ఈ సంకేతాలను అర్ధం చేసుకునే బాధ్యత మీదే, అలాగే మీ శరీరానికి తగిన వైద్యం ప్రక్రియను అందించడం వల్ల మీరు త్వరగా కోలుకుంటారు.

• రొమ్ములలో గడ్డలు ఏర్పడటం (లేదా) రొమ్ము ప్రాంతం వదులుగా అవ్వడం :-

• రొమ్ములలో గడ్డలు ఏర్పడటం (లేదా) రొమ్ము ప్రాంతం వదులుగా అవ్వడం :-

మధ్య వయస్కులైన స్త్రీలలో రొమ్ముక్యాన్సర్ సంభవించడమనేది చాలా సాధారణం. మీరు వయస్సు పెరిగే కొద్దీ ఈ రొమ్ము క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. రొమ్ములలో ఏవైనా తేడాలు గానీ ఏర్పడితే వాటిని వెంటనే గమనించండి. మీ చనుమొనలలో వచ్చే మార్పులతో పాటు రొమ్ములలో గడ్డలు ఏర్పడటం (లేదా) రొమ్ము ప్రాంతం వదులుగా అవ్వడం వంటివి "రొమ్ము క్యాన్సర్ను" సూచించే లక్షణాలని గుర్తించండి. మీరు ఈ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మీకు అందించే చికిత్స పద్ధతులు మీకు సరైన ఫలితాలను అందించగలదు.

• గర్భధారణ అవకాశాలు తగ్గుముఖం :-

• గర్భధారణ అవకాశాలు తగ్గుముఖం :-

30 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలలో గర్భధారణ అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని రీసెర్చ్ తెలిపింది. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం అనగా అండోత్సర్గం నాణ్యత తగ్గడం, గర్భాశయంలో ఉండే ఉమ్మ నీరు నాణ్యత క్షీణించడం, అండాల నాణ్యత క్షీణించడం & దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సంబంధమును కలిగి ఉండటం వంటివి కారణం కావచ్చు. అయితే, కొన్నిసార్లు మీరు ఈ పై సమస్యల కారణంగానే కాకుండా 30 ఏళ్ల వయస్సు దాటిన కారణంగా మీరు వంధ్యత్వానికి గురికావచ్చు. హార్మోన్లలో ఏర్పడే అసమతుల్యత, కణితులు ఏర్పడటం వంటి కారణాల వల్ల మీరు గర్భధారణ పొందడంలో కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు.

• జుట్టు ఊడిపోవడం :-

• జుట్టు ఊడిపోవడం :-

30 ఏళ్ళు దాటిన మహిళల్లో అకస్మాత్తుగా జుట్టు ఊడిపోవటమనేది సర్వసాధారణం. రోజూవారీగా మీరు 50-100 వరకూ వెంట్రుకలను కోల్పోవడమనేది సాధారణం చర్యగా భావించాలి. అంతకుమించి అధిక మొత్తంలో మీరు జుట్టును కోల్పోతే గనుక అది తీవ్రమైన అనారోగ్య సమస్యను సూచించేదిగా మీరు గుర్తించాలి. ఒత్తిడి & శిశుజననం వల్ల మీరు అధికంగా జుట్టును కోల్పోయేందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రతి 4 మహిళలలో ఒకరి జుట్టు పలుచబడటంతో పాటు జుట్టును కూడా నష్టపోతారు, అలాంటి వారిలో 95 శాతం మంది ఆండ్రోజెనిటిక్ అరోపికా అనే కేసులోకి వస్తారు.

మీరు 30 ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన తర్వాత మీ శరీరానికి సరైన పోషకాలు గానీ అందకపోతే మీకు హైయిర్ లాస్ అధికంగా ఉంటుంది. మీలో ఐరన్ లోపం కారణంగా హైయిర్ లాస్కి గురవచ్చు. మీరు 30 లోకి అడుగుపెట్టిన తర్వాత మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను గుర్తించడానికి, రక్తహీనతను తెలియజేసే పరీక్షలను డాక్టర్ వద్ద చేయించుకోవడం మంచిది. జుట్టు అధికంగా కోల్పోవడానికి విటమిన్-డి లోపము & శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు.

• బరువు పెరుగుట :-

• బరువు పెరుగుట :-

హఠాత్తుగా అసాధారణ బరువు పెరగటం అనేది అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. మీరు సరైన డైట్ ను పాటిస్తూ, శారీరక వ్యాయామాలను చేస్తున్నప్పటికీ కూడా మీ బరువు తగ్గకపోతే అందుకు థైరాయిడ్, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా పిసిఒఎస్ వంటి రోగాలు కారణం కావచ్చు. మీరు 30 ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన తర్వాత, కొలెస్ట్రాల్ & మధుమేహ పరీక్షలతో పాటు సాధారణ థైరాయిడ్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

పిసిఒఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) తో బాధపడుతున్న మహిళలు బరువు కోల్పోవడం చాలా కష్టం. ఇది హార్మోన్ డిజార్డర్గా ఉంటూ, పిసిఒఎస్ ఉన్న మహిళల్లో ఇది అధిక స్థాయిలో వుంటాయి & ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటాయి. ఇలాంటి మహిళలు మధుమేహం & ఇతర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.

• అధిక రక్తపోటు :-

• అధిక రక్తపోటు :-

అధిక బరువును కలిగి ఉండటం, గర్భ నిరోధక మాత్రలను ఉపయోగించడం (లేదా) హార్మోన్ థెరపీ తీసుకొనే మహిళలు అధిక రక్తపోటును కలిగి ఉంటారు. డైట్ కోసం ఉపయోగించే కొన్ని మాత్రలు & యాంటిడిప్రెసెంట్స్ కూడా అధిక రక్తపోటు సమస్యలకు దారితీయవచ్చు. అధిక రక్తపోటును కలిగిన మహిళలు గర్భధారణ సమయంలో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వాళ్ళను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవడం చాలా ముఖ్యం. 30 సంవత్సరాలు పైబడిన మహిళలు ఎక్కువ ఉప్పును వినియోగించడం వల్ల కూడా రక్తపోటును కలిగి ఉంటారు.

శారీరక కార్యకలాపాలు లేకపోవటంతో కలిగే ఒత్తిడి కూడా అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు మూత్రపిండ వ్యాధులకు / మూత్రపిండ వైఫల్యమునకు దారితీస్తుంది. ఈ రక్తపోటుకు సరైన చికిత్స చేయని సమయంలో, కిడ్నీలో ఉండే రక్త నాళాలను ఫిల్టర్లను నాశనం చేస్తాయి. ఇది శరీరం నుండి వ్యర్థాలను గ్రహించి, బయటకు నెట్టవేసే చర్యను చాలా కష్టతరం చేస్తుంది.

• అలసట :-

• అలసట :-

30 సంవత్సరాలు పైబడిన మహిళలు త్వరగా అలసిపోయే స్థితిని కలిగి ఉంటారు. దాని పర్యసానంగా అలసటతో కూడిన ఇతర ఆరోగ్య సమస్యలకు గురికావచ్చు. ఈ వయస్సులోనే మహిళలు ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు వెంటాడవచ్చు. ఈ కారణం వల్ల కూడా మహిళలు ఎక్కువ అలసటను పొందవచ్చు. కాబట్టి మీరు సరైన థైరాయిడ్ మందులను ఉపయోగించి మీరు ఈ రుగ్మతకు చికిత్స చేయవచ్చు. కోర్నిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన అలసట లక్షణాలతో ఏర్పడిన క్లిష్టమైన పరిస్థితి.

మహిళల వయస్సు 30 సంవత్సరాలు దాటిన తర్వాత సాధారణంగా సంభవించే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పటివరకు మనము చర్చించుకున్నాము. కాబట్టి మీ శరీరం సూచించే సంకేతాలను మీరు దృష్టిలో పెట్టుకుని డాక్టర్ని సంప్రదించి సరైన వైద్య చికిత్సలను చేయించుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరచుకోగలరు.

English summary

Top Health Warnings For Women In Their 30s

Most women who are aged 30+ do not give importance to their health which is a big mistake. Post 30 years your body starts sending you signals, such as difficulty in conceiving, signs of breast cancer, severe hair loss which is due to stress and childbirth, etc. One in every four women suffers from hair thinning and hair loss.
Story first published: Monday, August 27, 2018, 13:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more