For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసన వేధిస్తోందా? ఈ రెమెడీస్ నోటి దుర్వాసన నుంచి విముక్తి కలిగిస్తాయి

|

నోటి దుర్వాసన సమస్య బారిన ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు గురవుతున్నారు. నోటి దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా అంటారు. దీని వలన మానసిక ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఎంబరాస్మెంట్ కి గురవుతారు. డెంటిస్ట్ ల ప్రకారం టూత్ డీకే మరియు చిగుళ్ల వ్యాధి తరువాత నోటి దుర్వాసన వలెనే చాలా మంది డెంటల్ కేర్ ను తీసుకుంటారు.

ఈ ఆర్టికల్ లో నోటి దుర్వాసనకు దారితీసే కారణాల గురించి అలాగే పాటించవలసిన రెమెడీస్ గురించి వివరించాము. లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులతో పాటు నివారణ పద్దతులను కూడా వివరించాము. అయితే, మీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నోటి దుర్వాసన సమస్య తగ్గుముఖం పట్టకపోతే మీరు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఈ సమస్య వెనకున్న కారణాన్ని తెలుసుకోవాలి.

fifteen-effective-home-remedies-for-bad-breath

బ్యాడ్ బ్రెత్ కి దారితీసే కారణాలు?

• ఓరల్ హైజీన్ ను పాటించకపోవడం

• కట్టుడు పళ్ళు

• స్మోకింగ్

• చిగుళ్ల వ్యాధి, కేవిటీస్ మరియు ఇన్ఫెక్షన్స్

• డ్రై మౌత్

• ఆరోగ్య ష్టితి

• సరైన ఆహారం తీసుకోకపోవడం

• డయాబెటిస్

నోటి దుర్వాసన సమస్యను తగ్గించేందుకు తోడ్పడే నేచురల్ రెమెడీస్

నోటి దుర్వాసన సమస్యను తగ్గించేందుకు తోడ్పడే నేచురల్ రెమెడీస్

ప్రకృతిలో మనకు లభ్యమవనివి లేనే లేవు. అనారోగ్య సమస్య వలన కాకుండా సాధారణంగా ఎదురయ్యే నోటి దుర్వాసనను తగ్గించేందుకు హోమ్ రెమెడీస్ తోడ్పడతాయి. నోటి దుర్వాసన సమస్యను ఇంటి వద్దే సులభంగా తొలగించుకునేందుకు తోడ్పడే ఈ సులభ హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

1. ఆపిల్ మరియు దాల్చిన చెక్క:

ఆపిల్ మరియు క్యారెట్స్ వంటి వాటిని పచ్చిగా తీసుకోవడం వలన నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. ఆపిల్స్ లో పెక్టిన్ అనే పదార్థం లభ్యమవుతుంది. ఇది ఆహారపదార్థాల వాసనను నియంత్రించి సలైవా ఉత్పత్తిని పెంపొందిస్తుంది. దాల్చిన అనేది యాంటీ మైక్రోబయాల్ నేచర్ కలిగినది. మరోవైపు పెరుగులో నోటి దుర్వాసనని కలిగించే బాక్టీరియాను హరించే సామర్థ్యం కలదు.

ఒక కప్పు ఆపిల్ గుజ్జును, ఒక కప్పు తురిమిన క్యారట్ మరియు మూడు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల లో ఫ్యాట్ పెరుగును తీసుకుని బాగా కలపండి. దీనిపైన దాల్చిన పొడిని చల్లండి. దీన్ని తీసుకోండి. ఈ మిశ్రమం నోటి దుర్వాసన సమస్యను తగ్గిస్తుంది.

2. వార్మ్ సాల్ట్ వాటర్ రిన్స్:

2. వార్మ్ సాల్ట్ వాటర్ రిన్స్:

సెలైన్ సొల్యూషన్ తో మౌత్ రిన్స్ అనేది నోటి దుర్వాసనను తొలగించేందుకు తోడ్పడే గొప్ప రెమెడీ. ఈ సెలైన్ సొల్యూషన్ అనేది నోటిలో అలాగే గొంతులో బాక్టీరియా బిల్డ్ అప్ ను తొలగిస్తుంది.

3. టీ ట్రీ ఆయిల్:

3. టీ ట్రీ ఆయిల్:

ఒకటి లేదా రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను గ్లాసుడు వెచ్చటి నీళ్లలో వేయండి. ఈ నీళ్లతో ఐదు నిమిషాల వరకు గార్గిల్ చేయండి. టీ ట్రీ ఆయిల్ అనేది అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా, బాక్టీరియాపై పోరాడి నోటి దుర్వాసన నుంచి విముక్తిని తీసుకొస్తుంది.

4. లవంగాలు, మెంతులు మరియు ఇలాచీని నమలండి:

4. లవంగాలు, మెంతులు మరియు ఇలాచీని నమలండి:

నేచురల్ మౌత్ ఫ్రెషనర్ కోసం మీరు అన్వేషిస్తున్నట్టయితే మెంతులు, లవంగాలు అలాగే ఇలాచీని వాడండి. ఇవి నేచురల్ మౌత్ ఫ్రెషనర్ లా పనిచేస్తాయి.

5. మింట్, బేసిల్ మరియు సీలాంట్రోను ప్రయత్నించండి:

5. మింట్, బేసిల్ మరియు సీలాంట్రోను ప్రయత్నించండి:

నేచురల్ రెమెడీస్ తో చిగుళ్లను అలాగే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మీరు భావిస్తున్నట్టయితే సీలాంట్రో , మింట్ మరియు తులసాకులను నమలడం ప్రారంభించండి. వీటిలో ఉండే క్లోరోఫిల్ అనేది శరీరాన్ని లోలోపల నుంచి డియాడరైజ్ చేస్తుంది. తద్వారా, నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది.

6. గ్రీన్ టీ:

6. గ్రీన్ టీ:

గ్రీన్ టీ అనేది తాత్కాలికంగా నోటిదుర్వాసన సమస్యను తగ్గిస్తుంది. ఇందులో డియోడరెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ ఇందుకు తోడ్పడతాయి. గ్రీన్ టీ లో లభ్యమయ్యే పోలీ ఫెనాల్స్ అనేవి నోటి దుర్వాసనను అరికడతాయి. రోజుకు మూడు కప్పుల గ్రీన్ టీ ను తీసుకోవడం ద్వారా హలిటోసిస్ నుంచి ఉపశమనం పొందండి.

7. అలో వెరా:

7. అలో వెరా:

అలోవెరా అనేది యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది ప్లేక్ ని నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మౌత్ వాష్ లా పనిచేస్తుంది.

8. ఆపిల్ సైడర్ వినేగార్:

8. ఆపిల్ సైడర్ వినేగార్:

2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వినేగార్ ని ఒక గ్లాసుడు నీళ్ళల్లోకి తీసుకుని దీన్ని మౌత్ వాష్ లా ఐదు నిమిషాల పాటు వాడండి. ఆ తరువాత ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయండి. వినేగార్ లో లభ్యమయ్యే యాంటీ బాక్టీరియల ప్రాపర్టీస్ అనేవి నోటి దుర్వాసనను అరికడతాయి.

9. కొబ్బరి నూనె:

9. కొబ్బరి నూనె:

ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను తీసుకుని ఐదు నిమిషాల పాటు పుక్కిలించండి. ఈ ప్రాసెస్ తరువాత గోరువెచ్చటి నీటితో మౌత్ వాష్ చేసుకోండి. ఈ పద్దతిని ప్రతి రోజూ పాటిస్తే నోటి దుర్వాసన సమస్య తొలగిపోతుంది. కొబ్బరి నూనె నోటి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడుతుంది. నోట్లోని బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

10. అల్లం రసం:

10. అల్లం రసం:

ఒక టీస్పూన్ అల్లం రసాన్ని గ్లాసుడు వేడి నీటిలో జోడించి ఈ సొల్యూషన్ తో నోటిని రిన్స్ చేయండి. ఈ ప్రాసెస్ ను ప్రతి రోజూ మీల్స్ తరువాత పాటించండి. నోటి దుర్వాసన తొలగిపోతుంది. అల్లంలో యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇన్ఫెక్షన్ ను తొలగించి నోటి దుర్వాసనకు పోగొడుతుంది.

11. ఇలాచీ:

11. ఇలాచీ:

మీరు తీసుకునే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా నోటి దుర్వాసన సమస్య ఎదురవవచ్చు. భోజనం తరువాత ఇలాచీను నమలండి. ఇలాచీను మొత్తంగా నమలవచ్చు. లేదా, ఇలాచీ లోని గింజలను తీసుకుని నమలవచ్చు. ఇలాచీ అనేది మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

12. నిమ్మ, దాల్చిన మరియు తేనె:

12. నిమ్మ, దాల్చిన మరియు తేనె:

రెండు తాజా నిమ్మకాయల నుంచి సేకరించిన నిమ్మరసాన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లోకి తీసుకోండి. అందులోకి అర టేబుల్ స్పూన్ దాల్చిన పొడిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల తేనెను జోడించండి. ఒక కప్పుడు వేడి నీటిని పోసి కంటైనర్ ను షేక్ చేయండి. రెండు టేబుల్ స్పూన్ల ఈ మిశ్రమాన్ని మౌత్ వాష్ గా బ్రష్ చేసిన తరువాత వాడండి. ప్లెయిన్ వాటర్ తో రిన్స్ చేయండి. మిగిలిన సొల్యూషన్ ను ఫ్యూచర్ యూజ్ కోసం భద్రపరచుకోండి. దాల్చిన మరియు తేనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇన్ఫెక్షన్ పై పోరాడి నోటిని శుభ్రపరుస్తాయి.

English summary

12 effective home remedies for bad breath

Bad breath is also the most common reason for people to seek dental care, after tooth decay and gum disease. Certain home remedies can eventaully reduce bad breath. Apple helps to fight bad odour as they contain pectin that helps control food odour and promote saliva production. Warm salt water rinse, tea tree oil, green tea etc can be the best remedy for bad breath.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more