ద్రాక్ష పండ్ల వ‌ల్ల క‌లిగే ఆరు అనూహ్య‌మైన‌ దుష్ప్ర‌భావాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివి. అందులోనూ ద్రాక్ష పండ్ల‌ను మ‌నం ఎంత‌గానో ఇష్టంతో తింటుంటాం. చిన్న‌గా, గుత్తులు, గుత్తులుగా నోటికి స‌రిప‌డా ఉండే ఈ పండ్ల‌ను ఇష్ట‌ప‌డని వారు అరుదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల వారూ, ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌కు ఇవి ఎంతో ఇష్టం.

పండ్లుగానే గాక వీటిని వివిధ రకాల డెజ‌ర్ట్ల‌లో క‌లిపి వాడతారు. అలాగే ఎండ‌బెట్టి ఎండు ఫ‌లాల మాదిరిగానూ వినియోగిస్తారు. ద్రాక్ష పండ్ల‌తో మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. కానీ మ‌రోవైపు వీటిని తింటే కొన్ని దుష్ప్ర‌భావాలు కూడా త‌లెత్తుతాయి.

Unexpected Side Effects Of Grapes

ద్రాక్ష పండ్ల‌ను రోజుకు ప‌రిమితంగా తింటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు(ఒక వేళ మీకు అలెర్జీ లాంటి స‌మ‌స్య‌లు ఉంటే త‌ప్ప ), కానీ అతిగా తింటే ఇది కొన్ని స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. అలెర్జీలు రావ‌డం

1. అలెర్జీలు రావ‌డం

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అలెర్జీలు రావ‌డం చాలా అరుదు కానీ, దీని వ‌ల్ల త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌లో ఇది తీవ్ర‌మైన‌ది. ఆ పండ్ల‌ను కేవ‌లం తాక‌గానే కొంత మందిలో ద‌ద్దుర్లు, చ‌ర్మంపై ఎర్ర‌ని మ‌చ్చ‌లు రావ‌డం, తుమ్ములు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తుతాయి. కొన్ని సంద‌ర్భాల‌లో ద్రాక్ష పండ్ల‌ను తిన్న వెంట‌నే కొంత మంది ఒక ర‌క‌మైన అలెర్జీకి సంబంధించిన షాక్‌కి లోన‌వుతారు. అయితే మీకు అలెర్జీ ఉన్నంత మాత్రాన, అవి ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం ద్వారానే వ‌చ్చాయ‌నుకోకండి. ద్రాక్ష పండ్ల మీద చ‌ల్లిన పురుగుమందుల వ‌ల్ల‌నో లేదా పండ్ల మీద పేరుకున్న బూజు వ‌ల్ల‌నో అలా జ‌ర‌గ‌వ‌చ్చు. కాబ‌ట్టి అలెర్జీ ప‌రీక్ష చేయించుకుంటే మంచిది.

2. బ‌రువు పెర‌గ‌డం

2. బ‌రువు పెర‌గ‌డం

సాధార‌ణంగా ద్రాక్ష పండ్లు త‌క్క‌వ కేల‌రీల‌ను క‌లిగి ఉంటాయి. ఒక క‌ప్పు ద్రాక్ష పండ్ల‌లో 100 కేల‌రీలు ఉంటాయి. అయితే స‌మ‌స్య ఏమిటంటే ద్రాక్ష పండ్లు చిన్న‌విగా ఉండి, న‌మ‌ల‌డానికి అనుకూలంగా ఉండ‌డం వ‌ల్ల తినే స‌మ‌యంలో మ‌న‌పై మ‌న‌కు నియంత్ర‌ణ ఉండక‌పోవ‌చ్చు. దీంతో ఒక క‌ప్పుకు బ‌దులు రెండు మూడు క‌ప్పులు తిన‌డం వ‌ల్ల కేల‌రీలు రెట్టింపు లేదా మూడు రెట్ల‌వ‌డం జ‌రుగుతుంది. ఇలాగే ప్ర‌తీరోజూ తింటే అధికంగా ఉన్న కేల‌రీలు అధిక బ‌రువుకు కార‌ణ‌మ‌వుతాయి. కాబ‌ట్టి గుత్తులు, గుత్తులుగా తిన‌డం కంటే ప‌రిమితంగా తిన‌డం మంచిది.

3. కార్బోహైడ్రేట్ల ప‌రిమాణం పెర‌గ‌డం

3. కార్బోహైడ్రేట్ల ప‌రిమాణం పెర‌గ‌డం

కార్బోహైడ్రేట్లు మ‌న శ‌రీంలో గ్లూకోజ్‌గా మారుతాయి. మ‌నం తీసుకునే ఆహారంలో ఇవి ఎంతో అవ‌స‌రం. అయితే రోజువారీ ఆహారంలో 45 నుంచి 60 శాతం వ‌రకు కార్బోహైడ్రేట్లు తీసుకుంటే స‌రిపోతుంది. ద్రాక్ష పండ్లు అధికంగా తింటే అది కార్బోహైడ్రేట్ల ప‌రిమాణం పెర‌డ‌గానికి కార‌ణ‌మ‌వుతుంది. కాబ‌ట్టి ఇది శ‌రీరంలో కార్బోహైడ్రేట్ల ఓవ‌ర్‌లోడ్‌కి కార‌ణ‌మ‌వుతుంది.

4. అజీర్తి స‌మ‌స్య‌లు

4. అజీర్తి స‌మ‌స్య‌లు

ఎక్కువ సంఖ్య‌లో ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కొంత మందిలో ఇది అతిసారానికి దారి తీయ‌వ‌చ్చు. శ‌రీరానికి ఫ్రక్జోజ్(చ‌క్కెర‌లో ఒక ర‌కం) ప‌డ‌నివారిలో ఇది క‌డుపులో నొప్పితో పాటు అజీర్తి స‌మ‌స్య‌ల‌కూ కార‌ణ‌య‌వుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఇది వారికి కిడ్నీ, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను సైతం తీసుకొస్తుంది.

5. అపాన వాయువులు (గ్యాస్‌)

5. అపాన వాయువులు (గ్యాస్‌)

మ‌న ద్రాక్ష పండ్ల‌ను తిన్న‌ప్పుడు, ఎక్కువ ప‌రిమాణంలో ఫ్ర‌క్టోజ్ విడుద‌ల‌వుతుంది. అయితే మ‌న శ‌రీరంలోని జీర్ణ వ్య‌వ‌స్థ దానిని విచ్ఛిన్నం చేసిన‌ప్ప‌టికీ, కొంత భాగం జీర్ణం కాకుండా పేగుల‌లో అలాగే మిగిలి ఉంటుంది. అయితే విస‌ర్జ‌క వ్య‌వ‌స్థ‌లోని బ్యాక్టీరియా ఈ జీర్ణం కానీ ఫ్ర‌క్జోజ్‌తో చర్య జ‌రిపి గ్యాస్‌ను విడుద‌ల చేస్తుంటుంది. ఇది క‌డుపు ఉబ్బ‌రానికి దారి తీసి అపాన వాయువులు విడుద‌లవుతాయి.

6. వాంతులు

6. వాంతులు

మీ రోజువారీ ఆహారంలో పీచు ప‌దార్థాల‌ను తీసుకోన‌ప్ప‌డు, ద్రాక్ష పండ్ల‌ను తిన్న సంద‌ర్భాల్లో వికారం వ‌చ్చిన‌ట్లుంది. ఎందుకంటే మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ద్రాక్ష పండ్ల‌లోని పీజు ప‌దార్థాల‌ను జీర్ణం చేయ‌డం కొంచెం క‌ష్ట‌మ‌వుతుంది. ఇది కడుపు అసౌక‌ర్యంగా ఉండ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది. దీంతో కడుపులో వికారానికి తోడు, వాంతుల‌కు దారి తీస్తుంది. పండ్ల‌ను నిల్వ ఉంచేందుకు వాడిన ప‌దార్ధాల వ‌ల్ల కూడా ఈ త‌ర‌హా ల‌క్ష‌ణాలు క‌నిపించే అవ‌కాశం ఉంది.

ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఉన్న‌ప్ప‌టికీ, ప‌రిమితంగా తింటే ఇవి ఆరోగ్యానికి మంచివే. అయితే తాజా పండ్ల‌ను తిన‌డం మంచిది. పండ్ల‌ను మామూలుగా తిన్నా లేదా రుచి కోసం పెరుగు వంటివాటితో క‌లుపుకున్న ఏ స‌మ‌స్యా లేదు. అయితే అతి స‌ర్వత్రా వ‌ర్జ‌యేత్ అన్న నానుడి తెలిసిందే క‌దా. కాబ‌ట్టి అతి ఎప్పుడూ మంచిది కాదు.

ద్రాక్ష పండ్ల వ‌ల్ల తలెత్తే దుష్ప్ర‌భావాల గురించి ఈ క‌థ‌నంలో తెలుసుకున్నారు. మీ అభిప్ర‌యాల‌ను మాతో ఈ కింది కామెంట్ బాక్స్‌లో మాతో పంచుకోండి.

English summary

Unexpected Side Effects Of Grapes

Grapes are fruit berries that belong to the deciduous woody vines of botanical genus Vitis. They are available in many variants (around 8000) like red grapes, green grapes, black grapes, white grapes etc. but the most common variants of grapes are red, green, black and blue.
Story first published: Tuesday, April 17, 2018, 19:30 [IST]