For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని 6 విధాలుగా ఉప‌యోగించి సోరియాసిస్ చికిత్స

By Sujeeth Kumar
|

చాలా మందికి సోరియాసిస్ అనేది చికాకు తెప్పించే ఒక ఇబ్బందిక‌ర‌మైన స‌మ‌స్య‌. అయితే ఎన్నో ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను సోరియాసిస్ చికిత్స‌లో వినియోగిస్తున్నారు. అదెలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

సోరియాసిస్ చికిత్స‌కు ఆపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ మంచిదేనా?

ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారించేందుకు ప్రాచీన కాలం నుంచి యాపిల్ సిడైర్ వెనిగ‌ర్‌ని వాడుతున్నారు. 18 వ శ‌తాబ్ధంలోని వైద్యులు దీనిని ముఖ్యంగా చ‌ర్మ వ్యాధులను నివారించేందుకు ఉప‌యోగించేవారు. దీనికున్న యాంటిసెప్టిక్ ల‌క్ష‌ణాల కార‌ణంగా సోరియాసిస్ ద్వారా ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు.

అయితే శాస్త్రీయంగా రుజువులు లేన‌ప్ప‌టికీ, ఇది సోరియాసిస్ చికిత్స‌లో స‌మ‌ర్థవంతంగా ప‌ని చేసింద‌నే దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. సోరియాసిస్ చికిత్స‌లో దీనిని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి ప్రమాదం లేదు(అయితే గాయాలపై దీనిని పూయ‌కూడ‌దు).

సోరియాసిస్ చికిత్స కోసం యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని ఎలా వాడాలి?

1. ఐసోలేటేడ్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

1. ఐసోలేటేడ్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

కావాల్సిన వ‌స్తువులు

1. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

2. 1 గ్లాస్ నీళ్లు

త‌యారు చేయు విధానం

నీళ్ల‌లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని బాగా క‌లిపి రాత్రి భోజ‌నానికి ముందు త్రాగండి.

రోజుకి ఎన్ని సార్లు తాగాలి?

రోజుకి ఒక‌సారి మాత్ర‌మే, అది కూడా రాత్రి భోజ‌నానికి ముందు తాగాల్సి ఉంటుంది.

ఇది ఎలా ప‌ని చేస్తుంది?

మ‌నిషి శ‌రీరం యొక్క పీహెచ్ స్థాయుల‌ను క్షార‌వంతం అయ్యేలా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ తోడ్ప‌డుతుంది. ఇది మాన‌వుని జీర్ణ‌వ్య‌వ‌స్థ మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసేలా మ‌రియ వైర‌ల్ లేదా ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను పెంచే మ‌లినాల‌ను శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు పోయేలా చేస్తుంది. అలాగే ఏసీవీలో విట‌మిన్ ఏ, బి1, బీ6, సీ లతో పాటు పొటాషియం, ఐర‌న్ లాంటి ఖ‌నిజ ల‌వ‌ణాలు, ఆల్ఫా హైడ్రాక్సీ లాంటి ఆమ్లాలు క‌లిసి ఉన్నాయి. ఇది చ‌ర్మం పై పొర‌లు పెలుసులుగా మారి రాలిపోవ‌డాన్ని అడ్డుకుంటుంది.

2. బేకింగ్ సోడా, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

2. బేకింగ్ సోడా, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

కావాల్సిన వ‌స్తువులు

1. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

2. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా

3. నీళ్లు (స‌రిప‌డినంత‌)

త‌యారు చేయు విధానం

1. ఒక చిన్న గిన్నెలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని తీసుకోండి.

2. దానిలో బేకింగ్ సోడా, నీళ్ల‌ను బాగా క‌ల‌పండి.

3. ఈ మిశ్ర‌మాన్ని సోరియాసిస్ ఉన్న శ‌రీర భాగాల‌పై పూసి, అర్థ‌గంట వ‌ర‌కు ఆగండి.

4. ఆ త‌ర్వాత గోరు వెచ్చని నీళ్ల‌తో క‌డిగి, శుభ్రంగా తుడ‌వండి.

ఇలా ఎన్ని సార్లు చేయాలి

రోజుకి రెండు సార్లు లేదా ల‌క్ష‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టేవ‌ర‌కు చేయాలి.

ఇది ఎలా ప‌ని చేస్తుంది

బేకింగ్ సోడాకి చ‌ర్మానికి వ‌చ్చే మంట‌ల‌ను నివారించే గుణం క‌లిగి ఉండ‌టం వ‌ల్ల అది చ‌ర్మ వ్యాధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిరోధిస్తుంది. దీంతోపాటు ఇది చ‌ర్మం యొక్క పీహెచ్ స్థాయుల‌ను నిల‌క‌డ‌గా ఉంచుతుంది.

3. ఆలివ్ నూనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

3. ఆలివ్ నూనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

కావాల్సిన వ‌స్తువులు

1. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వ‌ర్జిన్ ఆలివ్ నూనె

2. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

3. నీళ్లు (స‌రిప‌డినంత‌)

ఇప్పుడేం చేయాలి

1. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్, ఆలివ్ నూనె, నీళ్ల‌ను బాగా క‌లిపి, సోరియాసిస్ ప్ర‌భావం ఉన్న శ‌రీర భాగాల‌పై పూయాలి.

2. రాత్రంగా దానిని అలాగే ఉంచండి. మీ బెడ్ షీట్లు, క‌వ‌ర్‌లు పాడ‌వ‌కుండా, ప్లాస్టిక్ షీట్ మీద నిద్ర‌పోవ‌డం మంచిది.

3. ఉద‌యం లేవ‌గానే గోరువెచ్చ‌ని నీళ్లతో క‌డ‌గండి.

ఇది ఎలా ప‌ని చేస్తుంది.

ఆలివ్ నూనెకి చ‌ర్మం పొడిబార‌కుండా మ‌రియు మృదువుగా ఉంచే గుణం ఉంది. దీని యాంటీయాక్సిడెంట్ ల‌క్ష‌ణాల వ‌ల్ల చ‌ర్మం యొక్క ఆరోగ్యక‌ర క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి.

4. గ్లిజ‌రిన్‌, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

4. గ్లిజ‌రిన్‌, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

1. 1 టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌

2. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

త‌యారు చేయు విధానం

1. గ్లిజ‌రిన్‌, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను బాగా క‌లిపి సోరియాసిస్ ఉన్న శ‌రీర భాగాల‌పై పూయండి.

2. 30 నిమిషాలు గ‌డిచిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని లేదా చ‌ల్ల‌ని నీళ్ల‌తో క‌డ‌గండి.

రోజుకి ఎన్ని సార్లు వాడాలి.

రోజుకి రెండుసార్ల చొప్పున‌, ప్ర‌తీ రోజూ వాడండి.

ఇది ఎలా ప‌ని చేస్తుంది.

గ్లిజ‌రిన్ చ‌ర్మాన్ని తేమ‌గా ఉండేలా చేసి, చికాకుప‌ర‌చ‌కుండా చేస్తుంది.

5. తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

5. తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

కావాల్సిన వ‌స్తువులు

1. 1 టేబుల్ స్పూన్ తేనె

2. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

3. చిటికెడు దాల్చిన చెక్క పొడి

ఏం చేయాలి

1. పై వ‌స్తువుల‌న్నీ క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసి మింగండి.

2. త‌ర్వాత ఒక గ్లాసుడు నీళ్లు త్రాగండి.

రోజుకి ఎన్నిసార్లు ఇలా చేయాలి.

రోజుకి ఒకసారి ఇలా చేయాల్సి ఉంటుంది.

ఇది ఎలా ప‌ని చేస్తుంది.

తేనెకి ఇన్ఫెక్ష‌న్ల‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ ల‌క్ష‌ణాలున్నాయి. అలాగే చ‌ర్మ మంట‌ల‌ను నిరోధించే గుణం దాల్చిన చెక్క‌కు ఉంది.

6. నిమ్మ ర‌సం, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

6. నిమ్మ ర‌సం, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తో సోరియాసిస్ చికిత్స‌

కావాల్సిన వ‌స్తువులు

1. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌

2. స‌గం నిమ్మ‌కాయ‌తో ర‌సం త‌యారు చేసుకోవాలి.

3. 1/4 టీస్పూన్ కారం పొడి తీసుకోవాలి.

4. 1/2 టీ స్పూన్ తేనె

5. ఒక గ్లాసుడు గోరు వెచ్చ‌ని నీళ్లు

ఇప్పుడేం చేయాలంటే

1. పై వ‌స్తువులన్నీ క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి.

2. ఆ మిశ్ర‌మాన్ని నోటి ద్వారా తీసుకోండి.

రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి.

రోజుకి రెండు సార్లు తీసుకోవాలి.

ఇది ఎలా ప‌ని చేస్తుందంటే

నిమ్మ‌కాయ‌లోని సిట్రిక్ ఆమ్లం మంట‌ల‌ను నిరోధించి, సోరియాసిస్ న‌యం అయ్యేలా తోడ్ప‌డుతుంది. కార‌పు పొడి ఇన్ఫెక్ష‌న్లు రాకుండా నిరోధిస్తుంది.

హెచ్చ‌రిక‌

ఈ మిశ్ర‌మంలో నిమ్మ ర‌సం, కార‌ప్పొడి ఉన్నందునా దీనిని సోరియాసిస్ ప్ర‌భావం ఉన్న శ‌రీర భాగాల‌పై పూయ‌కూడ‌దు.

ముగింపు

సోరియాసిస్ ఇక ఎంత‌మాత్ర‌మూ ఇబ్బందిక‌ర‌మైన స‌మ‌స్య కానే కాదు. ఎందుకంటే ఇది సోరియాసిస్ ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్మూలిస్తుంద‌ని ఎన్నోసార్లు నిరూపిత‌మైంది కాబ‌ట్టి. కాక‌పోతే మండ‌కుండా ఉండేందుకు దీన్ని వాడే స‌మ‌యంలో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ని కొంచెం ప‌లుచ‌గా త‌యారు చేసుకుంటే మంచిది.

పోస్టు మీకు న‌చ్చిన‌ట్ల‌యితే ఈ క్రింద బాక్స్‌లో కామెంట్ చేయండి.

English summary

ways to use apple cider vinegar for treating psoriasis

ways to use apple cider vinegar for treating psoriasis,
Desktop Bottom Promotion