మెదడులో డిప్రెషన్ లక్షణాలకి కారణాలేమిటి?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వైద్యపరంగా, మెదడులో చోటుచేసుకునే కొన్ని కెమికల్స్ అసమతుల్యతల వలన డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. అయితే, డిప్రెషన్ కి గురయిన వారి ఇబ్బందులను తెలియచేయడానికి ఈ సాధారణ స్టేట్మెంట్ సరిపోదు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, మెదడులోని కేవలం రసాయనాల అసమతుల్యత వలన లేదా రసాయనాల లేమి వలన డిప్రెషన్ అనేది సంభవించడం జరగదు.

జన్యు సమస్యలు, ఫాల్టీ మూడ్ రెగ్యులేషన్స్, బాధాకరమైన రొటీన్ జీవితం, మందులను తప్పుగా వాడటంతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలనేవి డిప్రెషన్ కి దారితీస్తాయి.

డిప్రెషన్ కి గురయిన వ్యక్తి యొక్క మానసిక స్థితిలో కేవలం బాధకి సంబంధించిన భావాలే నిండి ఉంటాయి. వారిలో సంతోషం ఏ మాత్రమూ కనిపించదు. అందువలన, డిప్రెషన్ ని ప్రాణాంతక సమస్యగానే పరిగణించాలి. ఆలోచించే తీరుని, చర్యలని అలాగే అనుభూతి చెందే విధాలని డిప్రెషన్ అనేది ప్రతికూలంగా ప్రభావితపరుస్తుంది.

డిప్రెషన్ వలన విచారమనేది పెరుగుతుంది. డిప్రెషన్ ని గురయిన వ్యక్తి ప్రతి విషయంపై నిరాసక్తతను ప్రకటిస్తాడు. ఉదాహరణకు, అంతకు ముందు ఇష్టపడిన యాక్టివిటీస్ ని ఇప్పుడు ఇష్టపడకపోవడం, మానసిక సామర్థ్యం తగ్గిపోవడం వంటివి ఇందుకు సంబంధించిన కొన్ని లక్షణాలు.

డిప్రెషన్ యొక్క సాధారణ లక్షణాలు

డిప్రెషన్ యొక్క సాధారణ లక్షణాలు

ఎల్లప్పుడూ బాధగా ఉండటం, అణగారిన మానసిక స్థితి

నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం

అలసట లేదా శక్తి లేకపోవడం

అపరాధ భావం లేదా విలువ లేనట్లుగా భావించడం లేదా ఓడిపోయినవారికింద పరిగణించుకోవడం

అపారంగా బరువు పెరుగుట లేదా అపారంగా బరువు తగ్గుట

ఆలోచించడానికి లేదా ఏకాగ్రత కుదుర్చుకోవడానికి కష్టపడటం

ఆత్మహత్య ఆలోచనలు చేయడం

కెమికల్ అసమత్యుల్యతల వలన డిప్రెషన్ కి గురవుతారా?

కెమికల్ అసమత్యుల్యతల వలన డిప్రెషన్ కి గురవుతారా?

డిప్రెషన్ కి గురవడానికి మెదడులోని కెమికల్స్ లో ఏర్పడిన అసమతుల్యం ప్రధాన పాత్ర పోషిస్తుందనేది నిజమే. అయితే, ఏవైనా కెమికల్స్ లో హెచ్చు తగ్గులు ఏర్పడినంత మాత్రాన డిప్రెషన్ బారిన పడతారన్నది మాత్రం వంద శాతం నిజం కాదు.

నిజానికి, మెదడు వెలుపల అలాగే బయట అనేకమైన కెమికల్ రియాక్షన్స్ అనేవి చోటుచేసుకుంటాయి. ఇవి, ఆయా సందర్భాలు అలాగే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ కెమికల్ రీయాక్షన్స్ అనేవి ఒక వ్వక్తి డిప్రెషన్ కి గురవడానికి కారణమవుతాయి.

జీన్స్ మరియు డిప్రెషన్

జీన్స్ మరియు డిప్రెషన్

డిప్రెషన్ యొక్క తీవ్రత వ్యక్తులను బట్టీ మారుతూ ఉంటుంది. డిప్రెషన్ కి సంబంధించిన ఒకే విధమైన లక్షణాలను ఇద్దరు వ్యక్తులలో మనం గమనించినా వారి అంతర్గత బలమనేది పరిస్థితి యొక్క సంక్లిష్టతను అలాగే చికిత్సా పద్దతులను నిర్ణయిస్తుంది.

కొంతమంది సాధారణ విషయాలకు కూడా కలత చెంది త్వరగా డిప్రెషన్ కి గురవుతారు, మరికొంతమంది ఎటువంటి సంక్లిష్టమైన అలాగే బాధాకరమైన పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని డిప్రెషన్ కి గురవకుండా ఉండగలుగుతారు. ఆయా వ్యక్తులలో స్పందించే విధానమనేది వారి జీన్స్ నుండి వారికి లభిస్తుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారానే వారికి సరిపడా మెడికేషన్స్ ను వైద్యులు నిర్ధారిస్తారు.

డిప్రెషన్ పై మెదడు యొక్క ప్రభావం

డిప్రెషన్ పై మెదడు యొక్క ప్రభావం

ఇప్పటికీ, భావోద్వేగాలనేవి హృదయానికి సంబంధించినవేనని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. కానీ, మన మెదడు వలనే వివిధ రకాల భావోద్వేగాలకు మనం గురవుతాయని సైంటిఫిక్ గా రుజువైన విషయాన్ని గుర్తించాలి. ఒక మనిషి యొక్క మానసిక స్థితిని నియంత్రించే శక్తి కేవలం మెదడుకే కలదు. బ్రెయిన్ కెమికల్స్ తో పాటు, నాడీ కణ పెరుగుదల, నరాల సర్క్యూట్లు, నరాల సెల్ కనెక్షన్లు అలాగే ఇవన్నీ కలిసి పనిచేసే విధానాలనేవి డిప్రెషన్ పై అమిత ప్రభావం చూపిస్తాయి. మెడికల్ సైన్స్ అనేది మూడ్ స్వింగ్స్ కి కారణమైన అంశాలను ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేయలేకపోయింది.

డిప్రెషన్ అనేది వ్యాధా?

డిప్రెషన్ అనేది వ్యాధా?

డిప్రెషన్ ని లోపంగా పరిగణించకపోవడానికి కారణం ఇది బయలాజికల్ డిసార్డర్ కాకపోవడం. అందువలన, డిప్రెషన్ వలన భౌతిక లక్షణాలు కనిపించవు. అయితే, కేవలం 10 శాతం మందిలో డిప్రెషన్ వలన భౌతిక లక్షణాలు కనిపిస్తాయని క్లినికల్ స్టడీస్ వెల్లడిస్తున్నాయి.

డిప్రెషన్ పై హార్మోన్ల అసమతుల్యతల ప్రభావం

డిప్రెషన్ పై హార్మోన్ల అసమతుల్యతల ప్రభావం

అనేక కారణాల వలన, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అధికంగా ఉత్పత్తి అవుతాయి. వీటివలన డిప్రెషన్ అనేది చోటుచేసుకుంటుంది. ఒక ఒత్తిడిపూర్వకమైన పరిస్థితికి ఒక వ్యక్తి స్పందించే తీరు బట్టి హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. అయితే, దీనినే డిప్రెషన్ కి ప్రధాన కారణంగా చెప్పుకోగలమా?

అధ్యయనాల ప్రకారం, డిప్రెషన్ కి గురైన వ్యక్తుల రక్తంలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అధికంగా ఉంటాయి. అందువలన, వారు ఎక్కువగా అలసటకు గురవుతారు.

క్లినికల్ స్టడీస్ ప్రకారం ఒక వ్యక్తి స్పందించే తీరు వారి మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే ఎక్కువగా కలలు కంటారు. అందుకే, నిద్రనుంచి లేచినా కూడా వారు అలసటగా ఉంటారు.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ అనేది డిప్రెషన్ కి గురిచేస్తుంది. ఈ విషయాన్ని మెడికల్ ఎక్స్పర్ట్స్ వెల్లడించారు. అయితే, ఈ విషయంపై సాధారణ జనాలలో ఇంకా అవగాహన లేదు. డిప్రెషన్ వలన స్మోకింగ్ కి బానిసవుతారా లేదా స్మోకింగ్ వలన డిప్రెషన్ కి గురవుతారా అనే సందేహంలో ఎక్కువగా మంది తలమునకలవుతున్నారు.

అయితే, కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం బ్రెయిన్ లోపలున్న న్యూరోట్రాన్స్మిషన్ ని ప్రభావిత పరిచే సామర్థ్యం నికోటైన్ కి కలదు. అందువలన, డోపామైన్ మరియు సెరోటోనిన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువలన, స్మోకింగ్ అలవాటు కలిగిన వారు త్వరగా డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

డిప్రెషన్ పై కుటుంబ చరిత్ర ప్రభావం

డిప్రెషన్ పై కుటుంబ చరిత్ర ప్రభావం

డిప్రెషన్ అనేది జన్యుపరంగా సంక్రమించే రుగ్మతని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుందని అధ్యయనాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, మీ దగ్గరి బంధువులకు లేదా తల్లిదండ్రులకు డిప్రెషన్ ఉన్నంత మాత్రాన మీరు కూడా డిప్రెషన్ కి గురవుతారని చెప్పలేము. కొన్ని వ్యక్తిగత అంశాలు అలాగే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులనేవి డిప్రెషన్ కి గురిచేసేలా పాత్ర పోషిస్తాయి.

వ్యక్తిత్వ ప్రభావం

వ్యక్తిత్వ ప్రభావం

ఆత్మవిశ్వాస లోపం కలిగిన వ్యక్తి లేదా అన్నింట్లో పెర్ఫెక్ట్ గా ఉండాలంటూ భావించే వ్యక్తి డిప్రెషన్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువ. చిన్న చిన్న బాధలకు కూడా వీరు విపరీతంగా స్పందించడం వలన డిప్రెషన్ లక్షణాలు వీరిలో అధికంగా కనిపిస్తాయి.

డ్రగ్స్ లేదా మద్యపానానికి బానిసవడం

డ్రగ్స్ లేదా మద్యపానానికి బానిసవడం

జీవితంపై విరక్తి చెందినవారు డ్రగ్స్ కి లేదా మద్యానికి బానిసవుతారు. అయితే, ఆల్కహాల్ ని లేదా డ్రగ్స్ ని అధికంగా తీసుకోవడం ద్వారా డిప్రెషన్ యొక్క లక్షణాలు తీవ్రమవుతాయి.

జీవితంలోని సంఘటనలు

జీవితంలోని సంఘటనలు

ఎంతో కాలం నుంచి బాధలను ఎదుర్కొంటూ జీవితాన్ని ఎదురీదుతూ గడుపుతున్న వ్యక్తులలో డిప్రెషన్ కి సంబంధించిన లక్షణాలు త్వరగా తలెత్తే ప్రమాదం ఉంది. దీర్ఘకాల నిరుద్యోగం, సంబంధబాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం, పని ఒత్తిడి వంటివి డిప్రెషన్ లక్షణాలను పెంచుతాయి.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ ని మీకు నచ్చినట్టయితే, మీ స్నేహితులకు ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.

English summary

What Causes Depression In The Brain?

What Causes Depression In The Brain? ,Depression causes sadness and the person suffering from depression loses interest in everything. For example, lack of interest in activities he/she loved before, decrease in mental ability, etc.