For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ కారణం లేకుండా ఎందుకు ఏడుస్తున్నాను?

|

మీరు మీ రోజువారీ పనులు చేస్తుంటారు, మామూలు జీవనం సాగిస్తుంటారు. ఏదో సినిమా చూస్తుండవచ్చు లేదా స్నేహితులతో మాట్లాడుతుండవచ్చు. సడెన్ గా, కారణం లేకుండా ఏడవడం మొదలుపెడతారు. ఏడుపాపాక, కన్నీళ్ళు తుడుచుకుని నేనెందుకు ఏడుస్తున్నానని సందేహంగా అనుకోవచ్చు కూడా.

తిల్బర్గ్ యూనివర్శిటీకి చెందిన వింగర్హొయెట్’స్ అనే క్లినికల్ సైకాలజిస్టు జరిపిన పరిశోధనలో స్త్రీలు మగవారికన్నా తరచుగా ఏడుస్తుంటారని తెలిసింది. ఈ పరిశోధనలో స్త్రీలు ఏడాదికి 30 నుంచి 64 సార్లు ఏడిస్తే, మగవారు 6 నుంచి 7 సార్లు ఏడుస్తారని తెలిసింది. స్త్రీలు ఆరు నిమిషాలపాటు ఏడవగలిగితే, మగవారు 2 నిమిషాలే ఏడుస్తారు.

ఎందుకు ఏడుస్తున్నామో తెలీకుండా ఏడవటం మానసిక ఆరోగ్య సమస్య. అందరి జీవితాలలో ఏడుపు సాధారణమే కానీ, కొన్నిసార్లు కొందరు ఏ కారణం లేకుండా ఏడుస్తుంటారు. నిజానికి మీరు పూర్తిగా సంతోషంగా ఉండి వెంటనే ఏడుపు మొదలుపెట్టచ్చు. కొంతమంది సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఆశ్చర్యపోయినప్పుడు ఏడుస్తారు, కొందరు కోపంలో, ఆందోళనలో ఏడుస్తారు. ఇలా జరగటానికి అసలు కారణం ఏదైనా అనారోగ్య స్థితి కావచ్చు, అలసట,మానసిక వత్తిడి, ఆందోళన,డిప్రెషన్ కూడా కావచ్చు.

Why Am I Crying For No Reason

శారీరక సమస్య కావచ్చు

కొన్ని అనారోగ్య స్థితులలో కూడా మీ భావోద్వేగాలు సరిగ్గా లేక, మనస్సు బాధగా అన్పించి శరీరంలో హార్మోన్ల స్థాయిపై ప్రభావం పడుతుంది. అలాంటివి ఏంటంటే ;

థైరాయిడ్

విటమిన్ల లోపం

హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయి పడిపోవటం)

గుండెపోటు

ఎఎల్ ఎస్

ఎంఎస్

పార్కిన్సన్స్ వ్యాధి

సూడోబుల్బులార్ ప్రభావం (పిబిఎ)

మీకు వీటిల్లో ఏది ఉందనిపించినా డాక్టరును త్వరగా కలవండి.

మానసిక ఒత్తిడి

ఎక్కువగా ఒత్తిడి చెందటం వివిధ సమస్యలకి దారితీస్తుంది,శారీరకంగా, భావోద్వేగపరంగా కూడా. శారీరక లక్షణాలు తలనొప్పులు, టెన్షన్, వికారం, కారణం లేకుండా ఏడవటం. ప్రతి ఒక్కరికీ తమ జీవితాల్లో ఎప్పుడోఅప్పుడు మానసిక వత్తిడి తప్పదు. కానీ దాని ప్రభావాలు ఒక్కోరిపై ఒక్కోలా ఉంటుంది. మీ శరీరం ఆ ఒత్తిడిని ఏదో ఒక మార్గంలో తట్టుకోగలగాలి. అలా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా ఏడవటం ద్వారా కావచ్చు. దీనితో వ్యవహరించటానికి మేటి మార్గం ఒత్తిడికి కారణం కనుక్కొని, దాన్ని తొలగించుకోవటం. మానసిక వత్తిడి తగ్గించుకోవటం మీ వల్ల కాకపోతే ఉదాహరణకి ఆఫీసులో వత్తిడి ఎక్కువగా ఉంటే దీన్ని వదిలించుకోటానికి మంచి మార్గాలైన వ్యాయామం, యోగా లేదా థెరపీని ఆశ్రయించవచ్చు.

అలసట

మీ శరీరం అలసిపోతే, శరీరం 100 శాతం సరిగ్గా పనిచేయట్లేదన్నమాట. మానసిక వత్తిడిలాగానే, అలసట కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో అప్పుడు భాగమే. మనందరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తగినంత నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే మన శరీరం విచిత్రమైన పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. మీరు ప్రతీ రాత్రి కనీసం ఐదు గంటలే పడుకోవటం వల్ల అనుకోకుండా ఏడుపు, నెగటివ్ గా మూడ్లు మారిపోవటం వంటివి జరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. అదే పనిగా ఏడవడం, బాధపడటం దీర్ఘకాలం కొనసాగకుండా ఉండాలంటే మీరు కనీసం రోజుకి ఏడు గంటలు పడుకోవాలి. మీకు నిద్రపోవటంలో సమస్యగా ఉంటే,మీ డాక్టరుతో మాట్లాడండి. ఎందుకంటే ఏదన్నా ఆరోగ్య సమస్య శారీరకంగా, లేదా మానసికంగా ఒంట్లో బాలేకపోతే కూడా ఇది వాటికి లక్షణం కావచ్చు.

ఆందోళన

మానసిక వత్తిడి లాగానే, ఆందోళన కూడా శరీరంపై వివిధ ప్రభావాలు చూపిస్తుంది,ఏడుపు అందులో ఒకటి. మానసిక ఆందోళనకి ఇతర కారణాలు ;

గుండె వేగం పెరగటం

వేగంగా శ్వాస తీసుకోవటం

వణికిపోవటం

బలహీనత లేదా అలసట

తలనొప్పి

వికారం

ఏకాగ్రత కుదరకపోవటం

మానసిక ఆందోళన

డిప్రెషన్

ఏడవటానికి సాధారణమైన కారణాలలో ఒకటి డిప్రెషన్. ఇది తాత్కాలికంగా కొన్నిరోజులే ఉండే సంఘటనాత్మక డిప్రెషన్ కావచ్చు. అంటే ఏదన్నా సంఘటన జరగటం వల్ల మీరు బాధపడితే కొన్నిరోజులు బాధగానే ఉండటం. లేదా తీవ్రమైన డిప్రెషన్ అంటే క్లినికల్ డిప్రెషన్ లేదా మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ కూడా కావచ్చు. ఏడవటంతో పాటు డిప్రెషన్ ఇతర లక్షణాలు ఇవిగో ;

రెండు వారాల కన్నా ఎక్కువగా బాధగా ఉండటం

తీవ్రమైన అలసట

ఆకలిలో మార్పులు (తక్కువగా లేదా ఎక్కువగా తినటం)

నిద్రలో మార్పులు ( నిద్రలేమి లేదా అతిగా నిద్ర)

ఏకాగ్రత లేకపోవటం

ఇష్టమైన పనులంటూ లేకపోవటం

నిరాశ, తనెందుకూ పనికిరాననే భావాలు

నిర్ణయాలు తీసుకోలేకపోవటం

బరువు పెరగటం లేదా తగ్గటం

ఆత్మహత్య ఆలోచనలు

మీకు మీరు డిప్రెషన్ తో ఉన్నారని అన్పిస్తే, మీ డాక్టరు కానీ, సైకాలజిస్టును కానీ సంప్రదించండి. మీరొక్కరే కృంగిపోవక్కర్లేదు. మీకు సైకాలజిస్టు ఎవరూ తెలీకపోతే, బెటర్ హెల్ప్ లో ఆన్ లైన్ థెరపిస్టులు ఉంటారు, వారు మీతో ఆన్ లైన్ ఛాట్ లేదా ఫోన్ ద్వారా మీకెలా డిప్రెస్డ్ గా అన్పిస్తుందో మాట్లాడతారు. లేదా మీకు దగ్గరలో ఉన్న థెరపిస్టు దగ్గరకి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా సంప్రదించవచ్చు.

English summary

Why Am I Crying For No Reason

You're doing your daily routine, living your regular life. Maybe you're watching a movie or having a conversation with a friend. Then out of nowhere, you find yourself crying for no apparent reason. After wiping away the tears, all you can do is sit confused asking yourself, why am I crying for no reason?
Story first published: Thursday, August 23, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more