For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్ వేసుకుని సేదతీరడం లేదా నిద్రించడం ఆరోగ్యానికి మంచిది కాదా?

|

వేడి తీవ్రత అధికంగా ఉండే ఉష్ణమండలాలలో నివసిస్తున్న మనకు రాత్రివేళల్లో నిద్రకోసం ఫ్యాన్ తప్పనిసరి, ముఖ్యంగా వేసవి కాలంలో. కానీ ఫ్యాన్ వేసుకొని నిద్రించడం ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేయగలదని తెలుసా?

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, మనుగడే కష్టమవుతున్న నేపధ్యంలో సేదతీరడానికి ఫ్యాన్ తప్పనిసరి అవుతున్న కాలాల్లో ఉన్నాము. చెట్టుగాలి అనేదే కనుమరుగవుతున్న ఈకాలంలో ఫ్యాన్ గాలులు కొంతలో కొంత ఊరటనిస్తున్నాయి, ఫ్యాన్ గాలి లేకపోయినా, తిరుగుతున్న సౌండ్ ఉంటే మాకు నిద్రొచ్చేస్తుంది అనేవాళ్ళు కూడా మనలో అనేకం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ తయారీ సంస్థలు, రోజుకోరకం మోడళ్లతో ఆఫర్లతో జనాలను ఆకర్షించే పథకాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ వీటికి అలవాటుపడడం కొత్తకొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫాన్స్ అనేవి బెడ్రూమ్ చల్లగా ఉంచుకునేందుకు సహాయపడడమే కాకుండా, తక్కువ ధరలో సౌకర్యవంతమైన పరిష్కారంగా ఉంటాయి.

కానీ వేల్స్-ఆన్లైన్ నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం, ఆరోగ్యసమస్యలతో భాదపడుతున్న వ్యక్తులు మరిన్ని సమస్యలకు లోనయ్యే విధంగా ఫాన్స్ కారకాలుగా మారుతున్నాయని, తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ అనేక ప్రతికూల ప్రభావాలకు ప్రధానకారకంగా ఫాన్స్ ఉంటున్నాయని తేల్చింది.

ఇక్కడ, రాత్రివేళల్లో మీగదిలో ఫ్యాన్ ఉండడం వలన కలిగే సానుకూల ప్రతికూల ప్రభావాలను పొందుపరచడం జరిగినది.

అలెర్జీ సమస్యలు:

అలెర్జీ సమస్యలు:

ఆస్థమా బాధితులకు ఇన్హేలర్ దగ్గరగా ఉండాలి:

మీరు ఉబ్బసం మరియు జలుబు ఆధారిత జ్వరం వంటి అలెర్జీలకు గురైనట్లయితే, ఫ్యాన్ గాలి, మీశ్వాస మీద ప్రభావం చూపి, మీనిద్రకు మరింత ఆటంకంగా పరిణమించవచ్చు.

వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం, "ఫ్యాన్ గాలి, మీగదిలో ఉండే పుప్పొడి, లేదా దుమ్ము వంటి వాటిని మీ శ్వాసనాళాలలోకి చేర్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా అలర్జీ సమస్యలు ఉన్నవారు అధికంగా ప్రభావానికి గురవడం, లేదా సమస్యలు జఠిలం అవడం వంటివి సర్వసాధారణం.

కావాలంటే ఒక్కసారి, మీ ఫ్యాన్ వైపు తీక్షణంగా పరిశీలించండి, కొన్ని ఫ్యాన్స్ పరీక్షించనవసరం లేదు కూడా, వాటి సాధారణ రంగును కోల్పోయి, దుమ్ముతో కూడిన కొత్తరంగుతో దర్శనమిస్తుంటాయి. మీరు ఫ్యాన్ వేసిన ప్రతిసారి, ఆ దుమ్ము సంబంధిత అంశాలు ఏదో ఒకరూపంలో శ్వాసనాళాలలోకి చేరడం, లేదా మూతలు లేని ఆహారపదార్ధాలపై దుమ్ము చేరడం వంటి వాటికి కారకులుగా మారుతాయి.

పొడిగాలి కారణంగా చర్మసమస్యలు:

పొడిగాలి కారణంగా చర్మసమస్యలు:

గంటల తరబడి ఫ్యాన్ గాలికి అంకితమైపోయిన వారి చర్మంమీద కూడా ప్రభావాలను చూపగలదు. మొహం మీద తేమ ఆవిరైపోవడం, పొడిచర్మానికి లోనవడం వంటి సమస్యల కారణంగా మృతకణాలు, బ్లాక్-హెడ్స్, మొటిమల వంటి సమస్యలు, స్కిన్ బ్రేక్ సమస్యలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.

"లోషన్లు మరియు మాయిశ్చరైజర్స్ ఈ సమస్యను నిరోధించడానికి కొంతమేర సహాయం చేయగలవు, కానీ మీ చర్మం తీవ్రంగా ప్రభావితం అయితే, జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వీలైనంత వరకు, పొడిగాలికి ఎక్కువగా చర్మం ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవలసినదిగా వెబ్సైట్ సూచిస్తుంది.

కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉన్న కొద్దిమందికి ఇది మరింత ప్రమాదకరం కావచ్చు కూడా.

"ఒక స్థిరమైన వేగంతో వీచే గాలికి మీ కళ్ళు అధికంగా పొడిబారే అవకాశాలు ఉన్నాయి. ఇది చికాకుకు దారితీయవచ్చు. నిద్రపోతున్నసమయంలో కాంటాక్ట్ లెన్సులను ధరించే వారికి ఇది మరింత సమస్యాత్మకంగా ఉంటుంది.

గురక, శ్వాససంబంధిత సమస్యలు, అలర్జీల కారణంగా నోరుతెరుచుకుని నిద్రపోయే వారు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాన్ గాలి, గొంతును పొడిబారించడం కారణంగా, మరియు గొంతులో దుమ్ము కారకాలు చేరడం ద్వారా చిరునాలిక పడడం వంటి సమస్యలకు లోనవడం మనం తరచూ చూస్తుంటాం కూడా. వీరు నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీరు పక్కన ఉంచుకోవడం మంచిదిగా సూచించడమైనది. పొడి నోరు ఎంతటి తీవ్రమైన అసౌకర్యానికి దారితీస్తుందో, అనుభవించేవారికే తెలుస్తుంది.

సైనస్ ఇరిటేషన్:

సైనస్ ఇరిటేషన్:

స్థిరమైన గాలికి ఎక్కువగా ప్రభావితం అవడం కారణంగా శ్వాసనాళాలు మూసుకుని పోవడం, క్రమంగా తలనొప్పితో కూడిన సైనస్ సమస్యకు కూడా దారితీస్తుంటుంది.

నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం "శరీరంలో పొడిబారిన సమస్యలు తీవ్రంగా ఉంటే, మీ సమస్యను భర్తీచేయడానికి అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉంటుంది, క్రమంగా ఈ అధిక శ్లేష్మం శ్వాసనాళాలకు అడ్డుపడటం, సందిగ్ధత మరియు సైనస్ తలనొప్పికి కారణంకావచ్చు."

గొంతు కండరాల సమస్య:

గొంతు కండరాల సమస్య:

స్థిరంగా వీచే పొడిగాలి, గొంతు కండరాలను కూడా దెబ్బతీయగలదు. సాంద్రీకృత లేదా స్థిరమైన చల్లని గాలులు కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించడమే కాకుండా, నిస్తేజమైన అనుభూతికి లోనుచేయగలదు.

మీకు ఎక్కువవేగంతో ఫాన్ గాలిని ఆస్వాదించే అలవాట్లు ఉన్న ఎడల, ఆ అలవాటును మానుకోవలసినదిగా సూచించడమైనది.

అలాగని ఫ్యాన్ గాలిని పూర్తిగా దూరం చేయమని చెప్పడం లేదు, ప్రతి విషయంలోనూ ప్రతికూల అంశాలు ఎలా ఉంటాయో సానుకూల అంశాలు కూడా అలాగే ఉంటాయి. దేనికి కూడా పరిమితి అనేది ముఖ్యం.

తక్కువ శబ్దకాలుష్యం:

తక్కువ శబ్దకాలుష్యం:

ఫ్యాన్ వాడకం, ఇతరములైన శబ్దతీవ్రతలను తగ్గిస్తుంది. అనగా ఉపరితల శబ్దాలైన వాహనాల హారన్ సౌండ్స్, అలారం, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, రణగొణ ధ్వనుల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొన్నిరకాల పక్షులు నిద్రాభంగం చేయగలిగిన తీవ్రమైన చెడుస్వరాలను కలిగి ఉంటాయి. ఫ్యాన్ వాడకం ఆశబ్దాలను హరించి వేస్తుంది.

ఫ్యాన్ అనేది, లో-బడ్జెట్ నాయిస్ రిడక్షన్ యంత్రంగా వెబ్సైట్ పేర్కొంది. అనగా తక్కువ ఖర్చుతో నాయిస్ తగ్గించే అవకాశo కల్పించే యంత్రం అని అర్ధం.

చెడు వాసనలు తగ్గిస్తుంది:

చెడు వాసనలు తగ్గిస్తుంది:

ఒక్కోసారి కుళ్ళిపోయిన ఆహారపదార్ధాలు, లేదా ఇతరములైన అజాగ్రత్తలు లేదా అలవాట్ల కారణంగా, గది దుర్వాసనల బారినపడడం సర్వసాధారణంగా ఉంటుంది. ఫ్యాన్ వాడకం, దుర్వాసనల తీవ్రతను తగ్గిస్తుంది.

English summary

Why Sleeping With A Fan On Could Be Bad For Your Health

Fans are a near perfect low-cost solution to keeping your bedroom cool and allowing you to rest comfortably.But Wales Online reports that some sleep experts claim they could be doing more harm than good, particularly if you suffer from certain health conditions.
Story first published: Tuesday, August 7, 2018, 18:30 [IST]