For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రపంచ మలేరియా దినోత్సవం: మలేరియా నివారణకు భారతీయ ఆహారప్రణాళిక

  |

  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ప్రపంచ మలేరియా దినోత్సవ థీమ్ "మలేరియాను ఓడించటానికి సిద్ధం" (Ready to beat Malaria). దోమకాటు వలన కలిగే ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. ఈ వ్యాసంలో మనం మలేరియాకు గల కారణాలు, లక్షణాలు మరియు నివారణ గురించి తెలుసుకుందాం.

  మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. మనుషుల్లో ఆడ అనోఫీలస్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పరాన్నజీవిని కలిగివున్న దోమ మనుషులను కరిచినపుడు అవి మనుషులతో చేరి వారి కాలేయంలో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తాయి.

  World Malaria Day: Indian Diet For Malaria

  ఎర్ర రక్తకణాలలో చేరిన 48 నుండి 72 గంటలలో ఈ పరాన్నజీవులు విభజన చెంది చిట్లిపోతాయి. దీనివలన ఫ్లూ, వణుకుతో కూడిన జ్వరం, అసాధారణ రక్తస్రావం, దీర్ఘ శ్వాస, రక్తలేమి చిహ్నాలు మరియు స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

  ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తన భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ థీమ్ ను ప్రచారం చేస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలేరియా నివారణ సంఘాలు ప్రజలందరినీ ఈ ప్రపంచం నుండి మలేరియాను పారద్రోలే నిమిత్తం ఒక తాటిపైకి తీసుకురావడానికి, చైతన్యవంతులను చేయడానికి చూపించాల్సిన సమిష్టి బాధ్యత మరియు నిబద్ధతల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

  మలేరియాకు సంబంధించిన కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం!

  మలేరియా ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ దీనిని నయం మరియు నివారణ చేయవచ్చు. 2016లో మలేరియా కారణంగా4,45,000మంది మరణించినట్లు లెక్కవేయబడింది. 2015లో ఈ సంఖ్య4,46,000గా ఉంది.

  World Malaria Day: Indian Diet For Malaria

  2016లో, 91 దేశాలలో 216 మిలియన్ మలేరియా కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ సంఖ్య ఇంకో 5మిలియన్లు ఎక్కువ.

  ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే WHO ఆఫ్రికా ప్రదేశంలో మలేరియా అసమాన్యమైన అధిక నిష్పత్తిలో ఉంది.

  2016లో ప్రపంచవ్యాప్త జనాభాలో సగం మందికి మలేరియా సోకే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

  5 ఏళ్ల లోపు బాలబాలికలు, HIV/AIDS రోగులు, గర్భిణి స్త్రీలు మరియు ప్రయాణికులలో మలేరియా అధికంగా సోకుతుంది.

  మలేరియా వ్యాధిగ్రస్తులకు భారతీయ ఆహారప్రణాళిక: మలేరియా నివారణకు ప్రత్యేకంగా తీసుకోవలసిన ఆహార ప్రణాళిక అంటూ లేదు. మలేరియా నివారణకు సరిపడినంత ఆహారం తీసుకోవడం కీలకం. రోగి యొక్క కాలేయం, మూత్రపిండాలు మరియు జీర్ణ వ్యవస్థలను దెబ్బ తీయకుండా రోగనిరోధక వ్యవస్థకు బలం చేకూర్చే మంచి ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక అవసరం.

  పండ్ల రసాలు

  పండ్ల రసాలు

  ఒక వ్యక్తి మలేరియా లక్షణంగా అధిక జ్వరంతో బాధ పడుతున్నపుడు, ఆకలి తగ్గడమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని కూడా సహించలేరు. ఇటువంటి సమయంలో కెలోరీలు చేకూరడమనేది పెద్ద సమస్య. ఈ సమయంలో తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు, చెరకు రసం, కొబ్బరి నీరు, ఎలెక్ట్రోలైట్ పానీయాలు సేవించాలి.

  అధిక ప్రొటీన్లు ఉన్న పాలు పెరుగు, మజ్జిగ

  అధిక ప్రొటీన్లు ఉన్న పాలు పెరుగు, మజ్జిగ

  మలేరియా వ్యాధి ఉన్నవారు కణజాలాన్ని అధికంగా కోల్పోవడం వలన మలేరియా ఉన్నవారు తమ ఆహార ప్రణాళికలో ప్రొటీన్లను చేర్చుకోవాలి. అధిక ప్రోటీన్ మరియు అధిక చెక్కెరలు ఉన్న ఆహారపదార్థాలు కణజాల నిర్మాణానికి దోహదపడతాయి. అధిక ప్రొటీన్లు ఉన్న పాలై, పెరుగు, మజ్జిగ, చేపలు, లస్సీ, చికెన్ సూప్, గుడ్లు మొదలైనవి తీసుకోవాలి.

   సూపులు, గంజి, కొబ్బరి నీరు,

  సూపులు, గంజి, కొబ్బరి నీరు,

  ఎలాక్ట్రోలైట్స్ మరియు నీటిని కోల్పోవడం మలేరియా వ్యాధి ఉన్నవారిలో సర్వ సామాన్యం. కనుక పండ్లరసాలు, సూపులు, గంజి, కొబ్బరి నీరు, పప్పు నీరు మొదలైనవి తీసుకోవడం శ్రేయస్కరం.

  కొవ్వులను కోడెఫి మోతాదులో తీసుకోవాలి.

  కొవ్వులను కోడెఫి మోతాదులో తీసుకోవాలి.

  డైరీ కొవ్వులైన క్రీమ్, బటర్, పాల పదార్ధాలో కొవ్వులు మొదలైనవాటిలో మీడియం చైన్ ట్రైగ్లిజెరైడ్స్ ఉన్నందున జీర్ణప్రక్రియకు ఉపకరిస్తాయి. అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు వికారం, అజీర్ణం మరియు వాంతులు కలుగజేస్తాయి.

   బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, నిమ్మ జాతి పండ్ల

  బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, నిమ్మ జాతి పండ్ల

  విటమిన్ ఎ మరియు విటమిన్ సి సమృద్ధిగా కలిగిన బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, నిమ్మ జాతి పండ్లయిన నారింజ, బత్తాయి, ద్రాక్ష, అనాసపనస, నిమ్మ మొదలైన ఆహార పదార్థాలతో పాటు బి- కాంప్లెక్స్ విటమిన్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

  తృణధాన్యాలను

  తృణధాన్యాలను

  అధిక పీచుపదార్థాలు కలిగిన తృణధాన్యాలను మలేరియా వ్యాధిగ్రస్తులు తీసుకొనరాదు. వీటికి బదులుగా పండ్లు మరియు పప్పుదినుసులు తీసుకోవడం వలన అవసరమైన పోషణ లభిస్తుంది.

  కాఫీ, టీ

  కాఫీ, టీ

  కాఫీ, టీల రూపంలో కెఫిన్ సేవించడానిని నివారించండి.

  వేపుడు పదార్థాలు

  వేపుడు పదార్థాలు

  వేపుడు పదార్థాలు మరియు ప్రాసెస్సింగ్ చేయబడిన ఆహార పదార్థాలు మరియు స్పైసి ఫుడ్ వలన వికారం మొదలై జీర్ణ ప్రక్రియ కుంటుపడుతుంది.

  English summary

  World Malaria Day: Indian Diet For Malaria

  Malaria is caused by the plasmodium parasite and it is transmitted to humans through the bite of the Anopheles mosquito. Once an infected mosquito bites a human being, the parasites multiply in the host's liver before infecting and destroying the red blood cells. High-protein diet, electrolyte drinks, vitamin A,
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more