TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : నెలసరి నొప్పి నుంచి ఉపశమనం అందించే జ్యూస్ లు
వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే 2018 సందర్భంగా, మహిళల్లో మెన్స్ట్రువేషన్ సమయంలో పాటించవలసిన హైజీన్ గురించి అవగాహనను కల్పించడం జరుగుతోంది. ఈ ఏడాది వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే 2018 థీమ్ అనేది "మెన్స్ట్రుయేషన్ విషయంలో ప్రతి చోటా అందరికీ అవగాహన అవసరం". ఈ ఆర్టికల్ లో నెలసరి నొప్పులను తగ్గుముఖం పట్టించే కొన్ని బెస్ట్ జ్యూస్ ల గురించి చర్చించుకుందాం.
చాలా మంది నెలసరి సమయంలో అసౌకర్యానికి అలాగే నొప్పికి గురికారు. నిజానికి వారిని అదృష్టవంతులుగా పేర్కొనాలి. అయితే, కొంతమంది మహిళలు మెన్స్ట్రువేషన్ సమయంలో విపరీతమైన ఇబ్బందులకు గురవుతారు. పొత్తికడుపు నొప్పి, వికారం వంటి సమస్యలతో సతమతమవుతారు.
ఎన్నో రకాల మెన్స్ట్రువల్ డిజార్డర్స్ తో ఇబ్బందులకు గురవుతారు. కొన్ని సందర్భాలలో మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ కి ముందు కొన్ని రకాల ఎమోషనల్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
మెన్స్ట్రువల్ డిజార్డర్లు నాలుగు రకాలు:
అసాధారణమైన యుటెరైన్ బ్లీడింగ్ (ఏయూబీ) లో మెన్స్ట్రువల్ బ్లీడింగ్ హెవీగా ఉండవచ్చు, బ్లీడింగ్ ఉండకపోవచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్స్ మధ్యలో బ్లీడింగ్ ఏర్పడవచ్చు.
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) లో అనేక రకాల శారీరక అలాగే మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులు మెన్స్ట్రువల్ సైకిల్ తో అనుసంధానమై ఉంటాయి. విపరీతమైన అలసట, బ్లోటింగ్, బ్రెస్ట్ లో వాపు మరియు నొప్పి వంటి కొన్ని ఫిజికల్ లక్షణాలతో పాటు ఏకాగ్రత కుదరకపోవడం, డిప్రెషన్, టెన్షన్, కోపం మరియు యాంగ్జైటీ వంటి కొన్ని మానసిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు.
పెయిన్ఫుల్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ లో మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ విపరీతంగా ఉంటాయి. అలాగే తలతిరగడంతో పాటు డయేరియా సమస్య కూడా వేధించవచ్చు.
ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిజార్డర్ అనేది మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్యలో యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.
ఇక్కడ పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం అందించే కొన్ని జ్యూస్ ల గురించి వివరించాము.
పైనాపిల్ మరియు క్యారట్ జ్యూస్:
పైనాపిల్ లో బ్రోమెలియన్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఈ ఎంజైమ్ కండరాల నొప్పిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. మరోవైపు, కేరట్స్ లో ఉన్న గుణాలు బ్లడ్ ఫ్లో ను రెగ్యూలరైజ్ చేయడానికి తోడ్పడతాయి. తద్వారా, మెన్స్ట్రువల్ పెయిన్ నుంచి ఉపశమనం అందుతుంది. తద్వారా, పెయిన్ఫుల్ డేస్ లో కూడా అలసట తక్కువగా ఉంటుంది.
తయారుచేసే విధానం :
బ్లెండర్ లో ఒకటి లేదా రెండు కప్పుల తాజా పైనాపిల్ ను అలాగే రెండు పెద్ద క్యారెట్స్ ను బ్లెండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని తీసుకోండి.
బీట్ రూట్, సెలెరీ, ఆపిల్ మరియు కుకుంబర్ జ్యూస్:
పీరియడ్ సమయంలో, మీరు అలసటకు గురవడం సహజం. అందువలన, డైలీ టాస్క్స్ తో పాటు కొన్ని పనులు కూడా మీకు కష్టతరంగా ఉంటాయి. బీట్ రూట్, సెలెరీ, ఆపిల్ మరియు కుకుంబర్ వంటి పదార్థాలతో తయారైన ఈ హై ఎనర్జీ జ్యూస్ అనేది మీ ఎనర్జీ లెవల్స్ ని పెంపొందించి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
తయారుచేసే విధానం: బ్లెండర్ లో బీట్ రూట్, ఆరు సెలెరీ కట్టలు, ఒక గ్రీన్ ఆపిల్ మరియు అర కుకుంబర్ ను బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని తీసుకోండి.
క్యారట్, ఆపిల్ మరియు లెమన్ జ్యూస్:
క్యారట్, ఆపిల్ మరియు నిమ్మల ద్వారా శరీరానికి రోజుకు అవసరమైన పొటాషియమనే మినరల్ అందుతుంది. ఇది మూడ్ ను బూస్ట్ చేసేందుకు తోడ్పడుతుంది. కాబట్టి, మీరు PMS తో ఇబ్బందికి గురవుతున్నప్పుడూ, మనసు బాగోలేనప్పుడు ఈ ఆపిల్, కేరట్ మరియు లెమన్ జ్యూస్ మిశ్రమాన్ని తీసుకుంటే లాభం ఉంటుంది.
తయారుచేసే విధానం: బ్లెండర్ లో మూడు క్యారెట్స్, ఒక ఆపిల్, ఒక నిమ్మ, ఒక కప్పుడు తాజా పార్స్లీని తీసుకుని అందులో కాస్తంత అల్లాన్ని కూడా జోడించాలి. వీటిని బ్లెండ్ చేసి తీసుకోవాలి.
పీచ్ మరియు లెమన్ జ్యూస్:
బ్లోటింగ్ తో పాటు PMS ను ఎదుర్కొంటున్న మహిళలు పీచ్ మరియు లెమన్ జ్యూస్ తో తయారైన మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలోని పేరుకున్న అదనపు ఫ్లూయిడ్ తొలగిపోతుంది. వాటర్ రిటెన్షన్ సమస్య తగ్గుతుంది. అలాగే ఇండైజేషన్ మరియు కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. కండరాలు ఉపశమనం చెందుతాయి.
తయారుచేసే విధానం: బ్లెండర్ లో సగం చెక్క నుంచి సేకరించిన రసాన్ని, ఒక మీడియం సైజ్ పీచ్ ను అలాగే తాజా తులసి ఆకును జోడించండి. వీటిని బ్లెండ్ చేసి తీసుకోండి.
ఆపిల్ మరియు ఆరెంజ్ జ్యూస్:
ఆపిల్ మరియు ఆరెంజ్ జ్యూస్ ను మెన్స్ట్రువల్ సైకిల్ కు ముందు తీసుకుంటే బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. డైజెషన్ మెరుగవుతుంది. శక్తివంతంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వలన డిప్రెషన్ మరియు ఆందోళన దరిచేరదు. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ తో అనుసంధానమై ఉన్న యాక్నే సమస్య ఇబ్బంది పెట్టదు.
తయారుచేసే విధానం:
బ్లెండర్ లో మీడియం సైజ్ ఆరెంజ్ లను అలాగే మీడియం సైజ్ ఆపిల్స్ ను తీసుకుని బెండ్ చేసుకుని ఆ రసాన్ని తాగాలి.
బీట్ రూట్ మరియు ఆరెంజ్ జ్యూస్:
మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో విపరీతమైన అలసటకు గురయ్యే మహిళలు బీట్ రూట్ మరియు ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి. ఈ జ్యూస్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ వలన తలెత్తే ఇబ్బందులను అరికడుతుంది. అలాగే, మెన్స్ట్రువల్ సైకిల్ తో అనుసంధానమున్న సైకలాజికల్ డిజార్డర్స్ ను కూడా తగ్గిస్తుంది.
తయారుచేసే విధానం:
బ్లెండర్ లో మీడియం సైజ్ బీట్ రూట్ ను మీడియం సైజ్ ఆరెంజ్ మరియు అర చెక్క నిమ్మ నుంచి సేకరించిన రసాన్ని కలిపి బ్లెండ్ చేసుకుని ఈ జ్యూస్ ను తీసుకోవాలి.